liquid diet
-
శ్రావణమాస ఉపవాసాలు : నీరసం రాకుండా, శక్తి కోసం ఇలా చేయండి!
ఆగస్టు మాసం వచ్చిందంటే పండుగ వాతావరణం వచ్చినట్టే. ఒకవైపు శ్రావణమాస సందడి.మరోవైపు ఆగస్టు 15 స్వాత్రంత్ర్య దినోత్సవ సంబరాలతో దేశభక్తి వెల్లివిరుస్తుంది. అంతేనా ఈ ఆగస్టు మాసంలో రాఖీపండుగ, కృష్ణాష్టమి కూడా కూడా. అలాగే శివుడ్ని కూడా ఆరాధిస్తారు. ముఖ్యంగా పవిత్ర శ్రావణమాసంలో మహిళలు శుక్రవార లక్ష్మీవ్రతం, మంగళవార వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఉపవాసం ఉంటారు. పుజాదికాలు, వంటలు చేయాలంటే శరీరానికి శక్తి కావాలి కదా. ఉపవాస దీక్షకు భంగం కాకుండా, శరీరం బలహీన పడకుండా ఉత్సాహంగా పనిచేసుకునేలా కొన్ని పానీయాల గురించి తెలుసుకుందాం.ఉపవాసంలో శక్తినిచ్చే పానీయాలుఉపవాసం ఉన్నప్పు హైడ్రేషన్ చాలా ముఖ్యం. ఆకలిగా అనిపించినప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతాము. దీన్ని నివారించడానికి ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అయితే సాధారణంగా కాఫీ, టీలతొ ఉపవాసాన్ని ఆచరిస్తారు చాలామంది. తక్షణ శక్తికోసం ఇవి కొంతవరకు ఉపయోగ పడతాయి. కానీ ఖాళీ కడుపుతో కాఫీ, టీలకు బదులుగా మజ్జిగ ,కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు పనిచేస్తాయి. గ్యాస్ సమస్యలు రాకుండా కడుపులో చల్లగా ఉండేలా చేస్తాయి.మజ్జిగ: ఉపవాసాల సమయంలో మజ్జిగను మించింది మరొకటి ఉండదు. పల్చటి మజ్జిగ శరీరానికి శక్తిని ఇస్తుంది. ఉపవాస దీక్షకు భంగం అనుకుంటే ఉప్పును మానివేసి,చక్కెర కలుపుకొని తాగవచ్చు.రుచికోసం వేయించిన జీలకర్ర పొడి,పుదీనా, నిమ్మరసం కలిపి తాగొచ్చు. కడుపునకు చల్లదనాన్నిచ్చి, ఉత్సాహంగా ఉంటుంది.నిమ్మరసం: బాగా నీరసం అనిపించినపుడు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి నిమ్మరసం చాలా మంచిది. ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, తెనె కలుపుకొని తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. కొబ్బరి నీళ్లు: సహజసిద్ధంగా లభించే కొబ్బరి నీరు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. పొటాషియం, సోడియం, మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి. శక్తినిచ్చి, నీరసం రాకుండా కాపాడుతుంది.పండ్ల రసాలు: ఉపవాసం సమయంలో సీజన్లో దొరికే అన్ని రకాల పండ్లను తినవచ్చు. మరింత శక్తి కావాలనుకుంటే బత్తాయి, యాపిల్, పైనాపిల్,మామిడి పండ్ల రసాలు, మిల్క్ షేక్ తాగవచ్చు. దానిమ్మ, జామ తదితర పండ్లతో సలాడ్‌లా చేసుకొని తినవచ్చు.బాదం పాలు బాదం పాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శ్రావణ మాసంలో వాతావరణంలో బాదం పాలు తాగడం వల్ల తక్షణ శక్తిలభిస్తుంది. వేడి పాలల్లో కొద్దిగా జీడి పప్పు పలుకులు, పంచదార లేదా తేనె,బాదం పొడిని కలుపుకుని తాగాలి. దీంతో పొట్ట నిండుగా ఉండి, మనసుకు ఉత్సాహంగా అనిపిస్తుంది. -
షేన్ వార్న్ హఠాన్మరణం వెనుక విస్తుపోయే నిజాలు..!
Shane Warne Had Been On Extreme Liquid Diet Before Death: స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణంపై థాయ్ పోలీసులు జరిపిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. తొందరగా బరువు తగ్గాలనే ఆలోచనలో వార్న్ 14 రోజుల కఠినమైన లిక్విడ్ డైట్ (ద్రవ రూపంలో ఉన్న ఆహారం) ఫాలో అయ్యాడని, ఇదే అతని మరణానికి పరోక్షంగా కారణమైందని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు తెలుస్తోంది. మృతి చెందడానికి ఒక్క రోజు ముందే వార్న్ తన డైట్ షెడ్యూల్‌ను పూర్తి చేశాడని, గతంలో కూడా అతను ఇలాంటి అర్థం పర్థం లేని డైట్లు ఫాలో అయ్యేవాడని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ తెలిపాడు. థాయ్‌లాండ్ వెకేషన్‌కు బయల్దేరే ముందు ఛాతీలో నొప్పి వస్తుందని, విపరీతంగా చమటలు పడుతున్నాయని వార్న్ తనతో చెప్పాడని ఎర్స్కిన్ వెల్లడించాడు. ఇటీవలే హార్ట్ చెకప్ కోసం డాక్టర్‌ను కూడా కలిశాడని ఆయన పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, వార్న్ గుండెపోటుతోనే మరణించాడని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు థాయ్ పోలీసులు సోమవారం వెల్లడించారు. వార్న్ విల్లా గదిలో ఫ్లోర్‌తో పాటు టవల్స్‌పై రక్తపు మరకల్ని గుర్తించిన మాట వాస్తవమేనని, సీపీఆర్ చేసే క్రమంలో వార్న్ రక్తపు వాంతులు చేసుకున్నాడని వారు పేర్కొన్నారు. వార్న్ మరణానికి ముందు మద్యం తీసుకోలేదని, గత కొంతకాలంగా అతను మద్యం తీసుకున్నట్లు రుజువులు లేవని స్పష్టం చేశారు. Operation shred has started (10 days in) & the goal by July is to get back to this shape from a few years ago ! Let’s go 💪🏻👏🏻 #heathy #fitness #feelgoodfriday pic.twitter.com/EokgT2Hyhz — Shane Warne (@ShaneWarne) February 28, 2022 వార్న్‌కు గుండెపోటు రావడానికి కఠినమైన డైట్‌తో పాటు తీవ్రమైన వర్కౌట్స్ కారణమయ్యాయని, ఫిబ్రవరి 28 వార్న్ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తుందని వెల్లడించారు. వార్న్ చేసిన ట్వీట్లో తన ఫోటోను షేర్ చేసి మరికొద్ది రోజుల్లో ఇలా తయారవుతానని, ఆపరేషన్ ష్రెడ్ ప్రారంభమై 10 రోజులు అవుతుందని, జూలై కంతా ఫిట్‌గా తయారవ్వడమే లక్ష్యమని పేర్కొన్నాడు. కాగా, వెకేషన్ ఎంజాయ్ చేయడానికి థాయ్‌లాండ్‌కు వెళ్లిన వార్న్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వార్న్ అకాల మరణంపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది. చదవండి: షేన్ వార్న్ మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! -
లిక్విడ్స్‌తో వర్కవుట్స్
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా వ్యాయామాలు చేసేవారు.. పరగడుపున ఎలాంటి ఆహారం తీసుకోకుండా పరుగులు పెట్టి, తరువాత కఠిన వ్యాయామాలతో దేహదారుఢ్యానికి సానబెడతారు. కానీ, దీని వల్ల త్వరగా లక్ష్యాన్ని చేరలేరంటున్నారు జిమ్ ఎక్స్పర్టులు. ఖాళీకడుపుతో జిమ్ చేయడం కంటే.. వర్కవుట్ల మధ్యలో లిక్విడ్లు తీసుకుంటూ జిమ్ చేసే నయా ట్రెండ్‌ను నగర యువత ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపు వర్కవుట్.. కొంచెం ఎనర్జీ లిక్విడ్ తీసుకున్నాక తిరిగి వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు. ఇది వినేందుకే కాదు, చేసేందుకు కూడా కొత్తగా ఉండటంతో పలువురు యువత ఇలాంటి వర్కవుట్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రొటీన్లు దండిగా ఉండే ఈ లిక్విడ్ల వల్ల శరీరానికి ఎలాంటి అలసట రాకపోగా, మంచి శరీరాకృతి మీ సొంతమవుతుందంటున్నారు నిపుణులు. ఈ లిక్విడ్లు ఎందుకు? సాధారణంగా వ్యాయామం చేసేటపుడు శరీరం చాలా శక్తిని కోల్పోతుంది. ఫలితంగా బీపీ, జీవక్రియలు అనూహ్యంగా పెరుగుతా యి. పెరిగిన శరీర ఉష్ణోగ్రతను చల్లబరిచేందు కు శరీరంలోని నీటిని దేహం చెమట రూపం లో విడుదల చేస్తుంది. ఫలితంగా దేహంలోని ఎలక్ట్రోలైట్స్, సోడియం, మెగ్నీషియం, పొటాషియం చెమటతోపాటు బయటికి వచ్చేస్తాయి. ఇది ఎక్కువైతే డీ హైడ్రేషన్గురయ్యే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. అందుకే, అలాంటి ప్రమాదాలు జరక్కుండా శరీరంలో కోల్పోయిన ప్రొటీన్లు, శక్తి, నీటిని భర్తీ చేసేందుకు ఈ ఎనర్జీ డ్రింకులు ఉపయోగపడతాయ ని పలువురు బాడీ బిల్డర్లు చెబుతున్నారు. ఎన్ని రకాలుగా ఉంటాయి..? వర్కవుట్ల మధ్యలో ఎనర్జీ కోల్పోకుండా ఉండాలంటే.. బీసీఏఏ (బ్రాడ్ చెయిన్ అమైనో ఆసిడ్స్) తీసుకోవచ్చని సూచిస్తున్నారు. 20 నిమిషాలపాటు వర్కవుట్లు చేసిన తరువాత 4 నుంచి 6 ఔన్సుల ఎనర్జీ డ్రింకును కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు. లేదా కోకోనట్ వాటర్ లేదా గ్లూకోన్–డి, రెడ్‌బుల్ డ్రింకులను వర్కవుట్ల మధ్యలో తాగొచ్చని సూచిస్తున్నారు. కండరాల పునరుత్తేజం, బలహీనమైన కండరకణాలకు శక్తిని చేకూరుస్తాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి వ్యాయామం మధ్యలో తీసుకునే లిక్విడ్లను ఇంట్రా లిక్విడ్లు అంటారు. ఇవి తీసుకోవడం వల్ల శరీరం త్వరగా అలసిపోదు. పైగా కోల్పోయిన ప్రొటీన్లు ఈ డ్రింకులతో భర్తీ చేయవచ్చు. ఫలితంగా డీ హైడ్రేషన్‌ను నివారించవచ్చు. డీ హైడ్రేషన్ అంటే అంతా వేసవిలోనే జరుగుతుందనుకుంటారు. కానీ, అన్ని కాలాల్లోనూ శరీరం డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలున్నాయి. అందుకే, ఈ ఇంట్రా లిక్విడ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అమైనో ఆసిడ్స్, ప్రొటీన్లు శరీరానికి వేగంగా అందుతాయి. ఎక్కువ మోతాదులో కాకుండా 4 నుంచి 6 ఔన్సులు మాత్రమే ఉండాలి. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే వాంతులవుతాయి. నిపుణుల సమక్షంలో చేస్తే మరీ మంచిది. – జయసింహ, ఫిట్నెస్ ట్రెయినర్ -
వాయుసేన పైలెట్లకు ద్రవాహారం!
సాక్షి, బెంగళూరు: అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాల పైలట్లు ఎక్కువసేపు ఆకాశంలోనే విధులు నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు వారిని నిర్జలీకరణం (డీహైడ్రేషన్ ) తదితర సమస్యలు వేధిస్తుంటాయి. వాటిని అధిగమించేందుకు వారికి ద్రవరూపంలో ఉండే ఆహారాన్ని ఇవ్వడానికి మైసూరులోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ(డీఎఫ్ఆర్ఎల్) కృషి చేస్తోంది. ఇప్పటికే ద్రవరూప ఆహారాన్ని తయారు చేసిన సంస్థ.. దాన్ని పరీక్షిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి ఈ ఆహారం భారత వాయుసేనకు చెందిన విమానాల కాక్‌పీట్‌లలో చేరే అవకాశం ఉంది. డీఎఫ్ఆర్ఎల్ ప్రయోగాత్మకంగా తయారు చేసిన ద్రవరూప ఆహార పదార్థాలను బెంగళూరులో జరుగుతున్న ఏరోఇండియా–17లో ప్రదర్శనకు ఉంచారు. ద్రవరూప ఆహారం తీసుకున్న వారికి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఆకలి వేయదు. మూత్రం కూడా ఉత్పత్తి కాదు. ఈ పద్ధతిలో చపాతి, చిప్స్, వెజ్ పలావ్, దాల్ కిచిడీల వంటి 110 రకాల ఆహార పదార్థాలను ద్రవ రూపంలోకి మార్చి పైలట్లకు అందజేస్తారు. ద్రవరూపంలోకి మార్చి ప్యాకింగ్ చేశాక మూడేళ్ల పాటు ఇవి నిల్వ ఉంటాయి. పరీక్షలు తుదిదశలో ఉన్నందున సానుకూల ఫలితాలొచ్చాక, సాంకేతికతను కోరుతున్న 400 కంపెనీలకు అందించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. విపత్తుల సమయంలో సైనికులు తీసుకెళ్లే లగేజీ బరువును తగ్గించడంలో భాగంగా తినగలిగిన చెంచాలు, గరిటెలు, పళ్లేలను డీఎఫ్ఆర్ఎల్ తయారు చేసింది. వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించి వీటిని రూపొందించింది. ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన రక్షణ మంత్రి పరీకర్ వైమానిక రంగ నిపుణులకు ఈ తినే ప్లేట్లలోనే ఆహారాన్ని వడ్డించారు.