సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ విభాగంలో మూడు రజత పతకాలు సాధించిన భారత అగ్రశ్రేణి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ మెరిసింది. సోమవారం విడుదల చేసిన ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ ఏకంగా ఎనిమిది స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ 5వ ర్యాంక్‌లో నిలిచింది. కాంపౌండ్ విభాగంలో ఇప్పటివరకు భారత ఆర్చర్ సాధించిన అత్యుత్తమ ర్యాంక్ ఇదే కావడం విశేషం.
మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్స్‌లో సురేఖ క్రితంసారి 13వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ అభి షేక్ వర్మ మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌ను అందుకున్నాడు. మరోవైపు రికర్వ్ విభాగం మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో దీపిక కుమారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోయింది. దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సాన్ నాలుగు స్థానాలు ఎగబాకి కొత్త వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించింది. దీపిక రెండో ర్యాంక్‌కు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment