world archery championship
-
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
షాంఘై (చైనా): ప్రపంచ ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో భారత్‌కు చెందిన వెన్నం జ్యోతిసురేఖ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరల్ట్ కప్ స్టేజ్ 1 టోర్నీలో శనివారం జ్యోతి సురేఖ 3 స్వర్ణ పతకాలతో మెరిసింది. దీపికా కుమారి (2021) తర్వాత వరల్డ్ కప్‌లో 3 పసిడి పతకాలు గెలిచిన రెండో భారత ఆర్చర్‌గా సురేఖ నిలిచింది. మహిళల, మిక్స్డ్, టీమ్ ఈవెంట్లలో ఆమె అగ్రస్థానాన్ని సాధించడం విశేషం. మహిళల ఈవెంట్ ఫైనల్లో టాప్ సీడ్ ఆండ్రియా బెకెరా (మెక్సికో)ను ఓడించింది. ఇద్దరి స్కోర్లు 146–146తో సమం కాగా...షూటాఫ్ ఫినిష్‌తో సురేఖ పైచేయి సాధించింది. మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో జ్యోతిసురేఖ – అభిషేక్ వర్మ ద్వయం 158–157 స్కోరుతో లిసెల్ జాత్మా – రాబిన్ జాత్మా (ఎస్తోనియా)పై విజయం సాధించింది. మహిళల టీమ్ ఈవెంట్ తుది పోరులోలో సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు 236–225 తేడాతో ఇటలీ జట్టుపై గెలుపొందింది.పురుషుల విభాగంలో మరో 2 పతకాలు కూడా భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రియాన్‡్ష రజతం గెలుచుకున్నాడు. ఫైనల్లో అతను 147–150 తేడాతో నికో వీనర్ (ఆ్రస్టియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్‌కు బంగారం లభించింది. ఫైనల్ అభిõÙక్ వర్మ, ప్రియాన్‡్ష, ప్రథమేశ్‌లతో కూడిన భారత జట్టు 238–231తో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీ రికర్వ్ విభాగం ఫైనల్ మ్యాచ్‌లు ఆదివారం జరుగుతాయి. -
జ్యోతి సురేఖకు సీఎం అభినందన
సాక్షి, అమరావతి: ప్రపంచ ఆర్చరీ విజేత వెన్నం జ్యోతి సురేఖను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఆమె బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్, పారిస్‌లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్‌లో సాధించిన పతకాలను సీఎంకు చూపించారు. సీఎం జగన్ మాట్లాడుతూ..అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రదర్శనతో సురేఖ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిందని ప్రశంసించారు. ప్రభుత్వం తరఫున క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం సురేఖ తనకు డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తండ్రి వెన్నం సురేంద్ర కుమార్ పాల్గొన్నారు. -
అదరహో అదితి... ఓహో ఓజస్
అంతర్జాతీయ వేదికపై భారత ఆర్చర్లు అద్భుతం చేశారు...గతంలో ఎన్నడూ చూపించని ప్రదర్శనతో కొత్త చరిత్రను సృష్టించారు... గురి తప్పకుండా లక్ష్యం చేరిన బాణాలతో మన ఆర్చర్లు ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు...అటు మహిళల విభాగంలో అదితి స్వామి, ఇటు పురుషుల విభాగంలో ప్రవీణ్ ఓజస్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించి శిఖరాన నిలిచారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించి అదితి ఆనందం పంచిన కొద్ది సేపటికే ప్రవీణ్ కూడా పసిడి గెలవడంతో ‘డబుల్ ధమాకా’ మోగింది! చాలా గర్వంగా ఉంది. 17 ఏళ్లకే ఈ ఘనత సాధించడం సంతోషంగా అనిపిస్తోంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 52 సెకన్ల మన జాతీయ గీతం వినపడాలని కోరుకున్నాను. పూర్తి ఏకాగ్రతతో షాట్‌పై దృష్టి పెట్టడంతో లక్ష్యం తప్పలేదు. ఇది ఆరంభం మాత్రమే. దేశం తరఫున మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా – అదితి స్వామి బెర్లిన్: వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఒకే రోజు భారత్ తరఫున ఇద్దరు చాంపియన్లుగా నిలిచారు. శనివారం జరిగిన ఈ పోటీల కాంపౌండ్ విభాగంలో ముందుగా మహారాష్ట్రకు చెందిన అదితి గోపీచంద్ స్వామి అగ్రస్థానం సాధించింది. ఫైనల్లో 17 ఏళ్ల అదితి 149–147 స్కోరుతో మెక్సికోకు చెందిన ఆండ్రీయా బెసెరాపై విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ ఫైనల్లో ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే 150–147 తేడాతో ల్యూకాజ్ జిల్స్కీ (పోలాండ్)ను ఓడించాడు. వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన నెల రోజుల్లోపే సీనియర్ విభాగంలోనూ అదితి విశ్వ విజేత కావడం విశేషం కాగా...టోర్నీ చరిత్రలో పురుషుల విభాగంలోనూ భార త్‌కు ప్రవీణ్ సాధించిందే తొలి స్వర్ణం. వీరిద్దరూ మహారాష్ట్ర సతారాలోని అకా డమీలో ఒకే చోట శిక్షణ పొందుతున్నారు. ఓవరాల్‌గా 3 స్వర్ణాలు, ఒక కాంస్యంతో (మొత్తం 4 పతకాలు) సాధించి భారత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. శుక్రవారం భారత్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. పూర్తి ఆధిపత్యం... డిఫెండింగ్ చాంపియన్ సారా లోపెజ్‌ను ప్రిక్వార్టర్స్‌లో ఓడించిన బెసెరా, అదితి మధ్య ఫైనల్ పోటాపోటీగా సాగింది. తొలి మూడు బాణాలను సమర్థంగా సంధించిన అదితి మొదటి రౌండ్లోనే 30–29తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి 12 బాణాలను లక్ష్యం వద్దకు చేర్చిన అదితి మూడు పాయింట్లు ముందంజలో ఉంది. చివరి రౌండ్లో మాత్రం ఒక బాణంతో ‘9’ మాత్రమే స్కోర్ చేసినా...అప్పటికే ఆమె విజేత కావడం ఖాయమైంది. శనివారం సెమీస్, ఫైనల్లోనూ 149 పాయింట్లు సాధించిన అదితి మొత్తం నాలుగు పాయింట్లు మాత్రమే కోల్పోయింది. ఫైనల్లో చివరి నాలుగు అవకాశాల్లోనూ ఆమె 30 పాయింట్లు సాధించడం విశేషం. పురుషుల విభాగంలో కూడా ప్రవీణ్ ‘పర్ఫెక్ట్ స్కోర్’తో పసిడి గెలుచుకున్నాడు. ప్రవీణ్ ఎక్కడా ఎలాంటి పొరపాటు చేయకపోగా, ఒత్తిడిలో పడిన ల్యూకాజ్ చివర్లో ఒక పాయింట్ పోగొట్టుకొని రజతంతో సంతృప్తి చెందాడు. జ్యోతి సురేఖకు కాంస్యం ప్రపంచ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగంలో 2019లో కాంస్యం, 2021లో రజతం సాధించి∙ఈ సారి స్వర్ణంపై గురి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖకు నిరాశ ఎదురైంది. కాంపౌండ్ విభాగంలో సురేఖ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. సెమీ ఫైనల్లో సురేఖ 145 – 149 స్కోరుతో అదితి స్వామి చేతిలో ఓటమి పాలైంది. అయితే మూడో స్థానం కోసం జరిగిన పోరులో సురేఖ చక్కటి ప్రదర్శనతో 150 స్కోరు నమోదు చేసింది. ఆమె 150 – 146 స్కోరుతో తుర్కియేకు చెందిన ఐపెక్ తోమ్రుక్ను ఓడించింది. ఓవరాల్‌గా ఆర్చరీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సురేఖకు ఇది ఎనిమిదో పతకం. టీమ్, వ్యక్తిగత విభాగాల్లో కలిపి ఆమె ఒక స్వర్ణం, 4 రజతాలు, 3 కాంస్యాలు గెలుచుకుంది. -
చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం
World Archery Championships-Berlin: భారత మహిళా ఆర్చర్ అదితి గోపీచంద్ స్వామి చరిత్ర సృష్టించింది. వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా (17) ప్రపంచ రికార్డు నెలక్పొంది. బెర్లిన్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ కాంపౌండ్ మహిళల విభాగంలో స్వర్ణం గెలవడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఆర్చరీలో భారత్ తరఫున మొదటి వ్యక్తిగత ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. Aditi Swami gets the FIRST individual WORLD TITLE for India. The 17-year-old prodigy is now the world champion. 🏆#WorldArchery pic.twitter.com/oBbtgxyzq3 — World Archery (@worldarchery) August 5, 2023 ఇవాళ (ఆగస్ట్ 5) జరిగిన ఫైనల్లో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాను 149-47 ఓడించడం ద్వారా జగజ్జేతగా నిలిచి, విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఇదే పోటీల్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్ కౌర్‌లతో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన అదితి.. గంటల వ్యవధిలో భారత్‌కు మరో స్వర్ణం అందించింది. Kudos to #KheloIndia Athlete Aditi Gopichand Swami on being crowned World Champion in the Women's Individual Compound Final at the #ArcheryWorldChampionships🇩🇪🏹 and bagging the🥇 for 🇮🇳 with a near perfect score of 149 points💪👏 With this victory she has become the first… pic.twitter.com/m6kd0Y9ifK — Anurag Thakur (@ianuragthakur) August 5, 2023 ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న అదితి.. గత నెలలో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో స్వర్ణాలను సాధించింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్ షూట్-ఆఫ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన సన్నె డి లాట్‌ను ఓడించిన అదితి.. సెమీఫైనల్లో సహచరి, ఆంధ్ర అమ్మాయి జ్యోతి సురేఖపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. -
భారత్ బాణం బంగారం.. ఈ పతకం ఎంతో ప్రత్యేకం
బెర్లిన్‌లో భారత మహిళల బృందం అద్భుతం చేసింది. గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణిత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తొలిసారి దేశానికి స్వర్ణ పతకాన్ని అందించి కొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీలు 1931లో మొదలుకాగా భారత ఆటగాళ్లు మాత్రం 1981 నుంచి ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్నారు. తాజా పసిడి పతక ప్రదర్శనకంటే ముందు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 11 పతకాలురాగా అందులో తొమ్మిది రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. ఈ పతకాల సరసన తొలిసారి పసిడి పతకం వచ్చి చేరింది. బెర్లిన్ (జర్మనీ): ఎట్టకేలకు భారత ఆర్చరీ పసిడి కల నెరవేరింది. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఎంతోకాలంగా ఊరిస్తున్న స్వర్ణ పతకం మన దరి చేరింది. తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ, మహారాష్ట్ర అమ్మాయి అదితి స్వామి, పంజాబ్ క్రీడాకారిణి పర్ణీత్ కౌర్ బాణాల గురికి భారత్ ఖాతాలో బంగారు పతకం వచ్చింది. శుక్రవారం జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి, పర్ణిత్‌లతో కూడిన భారత జట్టు 235–229 పాయింట్ల తేడాతో డాఫ్ని క్వింటెరో, అనా సోఫియా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెసెరాలతో కూడిన మెక్సికో జట్టుపై గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. 2017, 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఫైనల్ చేరిన భారత జట్టు రజత పతకాలతో సరిపెట్టుకోగా... మూడో ప్రయత్నంలో మాత్రం పసిడి స్వప్నాన్ని సాకారం చేసుకుంది. భారత బృందం స్వర్ణం నెగ్గడంలో సీనియర్ జ్యోతి సురేఖ కీలకపాత్ర పోషించింది. తొమ్మిదోసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తోంది. మెక్సికోతో జరిగిన ఫైనల్లో భారత జట్టు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నాలుగు సిరీస్‌లలోనూ పైచేయి సాధించింది. ఒక్కో సిరీస్‌లో జట్టులోని ముగ్గురు సభ్యులు రెండు బాణాల చొప్పున మొత్తం ఆరు బాణాలు సంధిస్తారు. తొలి సిరీస్‌లో భారత్ 59–57తో, రెండో సిరీస్‌లో 59–58తో... మూడో సిరీస్‌లో 59–57తో.. నాలుగో సిరీస్‌లో 58–57తో ఆధిక్యం సంపాదించి చివరకు 235–229తో విజయం సాధించింది. నేడు జరిగే వ్యక్తిగత విభాగం నాకౌట్ దశ మ్యాచ్‌ల్లో జ్యోతి సురేఖ, పర్ణిత్, అదితి పోటీపడనున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో పర్ణిత్‌తో జ్యోతి సురేఖ, సాన్ డి లాట్ (నెదర్లాండ్స్)తో అదితి ఆడతారు. గెలిస్తే జ్యోతి, అదితి సెమీఫైనల్లో తలపడతారు. 12 ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్ నెగ్గిన మొత్తం పతకాలు. ఇందులో ఒక స్వర్ణం, తొమ్మిది రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. 7 ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో జ్యోతి సురేఖ గెలిచిన మొత్తం పతకాలు. 2021లో మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో 3 రజత పతకాలు. 2017లో మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో ఒక రజతం. 2019లో మహిళల టీమ్ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో 2 కాంస్య పతకాలు... 2023లో మహిళల టీమ్ విభాగంలో ఒక స్వర్ణం. ఈ పతకం ఎంతో ప్రత్యేకం ఈసారి ఎలాగైనా స్వర్ణ పతకం సాధించాలనే లక్ష్యంతో వచ్చాం. గతంలో రజత, కాంస్య పతకాలు గెలిచా. ఇది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్‌లో మరిన్ని పసిడి పతకాలు సాధిస్తాం. తొలి స్వర్ణం కావడంతో ఈ పతకం నాతోపాటు నా సహచరులకు ఎంతో ప్రత్యేకం. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో టీమ్, వ్యక్తిగత విభాగాల్లో పలు పతకాలు నెగ్గినా స్వర్ణం మాత్రం దక్కలేదు. ఈసారి బంగారు పతకం సాధించడంతో ఎంతో ఆనందంగా ఉన్నాను. నేడు వ్యక్తిగత విభాగంలో పోటీపడుతున్నాను. ఇందులోనూ స్వర్ణం గెలవడమే నా లక్ష్యం. నేనీస్థాయికి చేరుకోవడానికి ఎల్లవేళలా మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. –జ్యోతి సురేఖ -
చరిత్ర సృష్టించిన భారత మహిళా ఆర్చర్లు.. జ్యోతి సురేఖకు హ్యాట్సాఫ్!
World Archery Championships 2023- Berlin: భారత మహిళా ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్ కౌర్, అదితి గోపీచంద్ చరిత్ర సృష్టించారు. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. తద్వారా.. వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో దేశానికి తొలి పసిడి పతకం అందించిన ఆర్చర్లుగా రికార్డులకెక్కారు. కాగా జర్మనీలోని బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు మెక్సికన్ టీమ్‌పై 235-229తో గెలిచింది. డఫ్నే క్వింటెరో, అనా సోఫా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెసెర్రాలపై పైచేయి సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత్ పతకాల సంఖ్య 11కు చేరింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక బుధవారం నాటి ఈవెంట్లో రెండో సీడ్‌గా నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన జ్యోతి సురేఖ బృందం 230–228తో తుర్కియే జట్టుపై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో 228–226తో చైనీస్ తైపీపై గెలిచి సెమీస్ చేరింది. సెమీఫైనల్లో 220–216తో కొలంబియాపై నెగ్గి ఫైనల్లోకి అడుగు పెట్టి.. మెక్సికోను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. మన అమ్మాయి బంగారం కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన జ్యోతి సురేఖకు ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఇది ఆరో పతకం కావడం విశేషం. 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఇప్పటి వరకు టీమ్ విభాగంలో రెండు రజతాలు (2021, 2017), ఒక కాంస్యం (2019)... వ్యక్తిగత విభాగంలో ఒక రజతం (2021), ఒక కాంస్యం (2019) తన ఖాతాలో జమచేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా జ్యోతి పసిడి పతకం గెలవడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. HISTORIC win for India 🇮🇳🥇 New world champions at the Hyundai @worldarchery Championships.#WorldArchery pic.twitter.com/8dNHLZJkCR — World Archery (@worldarchery) August 4, 2023 -
క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన జ్యోతి సురేఖ
బెర్లిన్ (జర్మనీ): గురి తప్పని ప్రదర్శనతో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. క్వాలిఫయింగ్‌లో రెండో ర్యాంక్‌లో నిలిచిన జ్యోతి సురేఖకు నేరుగా మూడో రౌండ్‌కు ‘బై’ కేటాయించారు. మూడో రౌండ్ మ్యాచ్‌లో జ్యోతి సురేఖ 139–136తో లికోఅరెలో (అమెరికా)పై, నాలుగో రౌండ్లో 148–145తో ఓ యూహున్ (దక్షిణ కొరియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ధీరజ్ పరాజయం పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6తో రికార్డో సాటో (చిలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. -
ఫైనల్లో జ్యోతి సురేఖ బృందం.. విజయవాడ అమ్మాయికి ఆరో పతకం ఖరారు
బెర్లిన్ (జర్మనీ): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ, అదితి, పరిణీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన టీమ్ ఈవెంట్లో రెండో సీడ్‌గా నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన భారత జట్టు 230–228తో తుర్కియే జట్టుపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 228–226తో చైనీస్ తైపీపై, సెమీఫైనల్లో 220–216తో కొలంబియాపై నెగ్గి ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగే ఫైనల్లో మెక్సికోతో భారత్ ఆడుతుంది. తాజా ప్రదర్శనతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖకు ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఆరో పతకం ఖరారైంది. -
రెండో సీడ్‌గా జ్యోతి సురేఖ, ధీరజ్
World Archery Championship Qualifications- బెర్లిన్ (జర్మనీ): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్ మెరిశారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ ర్యాంకింగ్ రౌండ్లో మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ 701 పాయింట్లు... పురుషుల రికర్వ్ విభాగంలో ధీరజ్ 683 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచారు. ఫలితంగా నాకౌట్ దశలో రెండో సీడింగ్ పొందిన జ్యోతి సురేఖ, ధీరజ్లకు నేరుగా మూడో రౌండ్‌కు ‘బై’ లభించింది. ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ తొలి రౌండ్లో... సిక్కి రెడ్డి–ఆరతి సారా సునీల్ జంట క్వాలిఫయింగ్‌లో నిష్క్రమించాయి. తొలి రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా జాలీ 21–16, 21–17తో కేథరీన్ చోయ్–జోసెఫిన్ వు (కెనడా)లపై గెలిచారు. అశి్వని–తనీషా 11–21, 21–14, 17–21తో ఫెబ్రియానా కుసుమ–అమాలియా ప్రతవి (ఇండోనేసియా) చేతిలో... సిక్కి రెడ్డి–ఆరతి 14–21, 17–21తో సు యిన్ హుయ్–లీ చి చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. -
Vennam Jyothi Surekha: 3 రజతాలతో మెరిసి.. కెరీర్ బెస్ట్ ర్యాంకులో
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ విభాగంలో మూడు రజత పతకాలు సాధించిన భారత అగ్రశ్రేణి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ మెరిసింది. సోమవారం విడుదల చేసిన ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ ఏకంగా ఎనిమిది స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ 5వ ర్యాంక్‌లో నిలిచింది. కాంపౌండ్ విభాగంలో ఇప్పటివరకు భారత ఆర్చర్ సాధించిన అత్యుత్తమ ర్యాంక్ ఇదే కావడం విశేషం. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్స్‌లో సురేఖ క్రితంసారి 13వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ అభి షేక్ వర్మ మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌ను అందుకున్నాడు. మరోవైపు రికర్వ్ విభాగం మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో దీపిక కుమారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోయింది. దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సాన్ నాలుగు స్థానాలు ఎగబాకి కొత్త వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించింది. దీపిక రెండో ర్యాంక్‌కు పడిపోయింది. చదవండి: సానియా మీర్జా ఖాతాలో 43వ డబుల్స్ టైటిల్ -
Jyothi Surekha: సూపర్ సురేఖ
అమెరికా వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్íÙప్లో తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ గురి అదిరింది. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ భారత్‌కు మూడు రజత పతకాలను అందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ విభాగంలో, మహిళల టీమ్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. యాంక్టన్ (అమెరికా): అంతర్జాతీయ వేదికపై మరోసారి తన సత్తా చాటుకున్న తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ చాంపియన్íÙప్లో మెరిసింది. మూడు స్వర్ణ పతకాలపై గురి పెట్టిన సురేఖ కీలకదశలో తడబడి చివరకు మూడు రజత పతకాలతో సంతృప్తి పడింది. శనివారం జరిగిన కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో సురేఖ రజతం సొంతం చేసుకుంది. సారా లోపెజ్ (కొలంబియా)తో జరిగిన ఫైనల్లో సురేఖ 144–146 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. ఇద్దరూ ఐదుసార్లు మూడు బాణాల చొప్పున మొత్తం 15 బాణాలను లక్ష్యంవైపు గురి పెట్టి సంధించారు. తొలి సిరీస్‌లో సారా లోపెజ్ 29, సురేఖ 28... రెండో సిరీస్‌లో సారా 29, సురేఖ 29... మూడో సిరీస్‌లో సారా 30, సురేఖ 29... నాలుగో సిరీస్‌లో సారా 29, సురేఖ 28... ఐదో సిరీస్‌లో సారా 29, సురేఖ 30 పాయింట్లు స్కోరు చేశారు. చివరకు రెండు పాయింట్ల తేడాతో సారా లోపెజ్ గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. అంతకుముందు సెమీఫైనల్లో సురేఖ 148–146తో ఆండ్రియా బెసెరా (మెక్సికో)పై, క్వార్టర్ ఫైనల్లో 150–144తో అమందా మ్లినారిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించింది. మ్లినారిచ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సురేఖ 150కి 150 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో లిండా అండర్సన్ (అమెరికా; 2018లో), సారా లోపెజ్ (కొలంబియా; 2013, 2021లో) మాత్రమే 150కి 150 పాయింట్లు స్కోరు చేశారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంపౌండ్ మహిళల టీమ్ విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్లతో కూడిన భారత జట్టు 224–229 పాయింట్ల తేడాతో సారా లోపెజ్, అలెజాంద్రా ఉస్కియానో, నోరా వాల్దెజ్‌లతో కూడిన కొలంబియా జట్టు చేతిలో ఓటమి చవిచూసింది. మరోవైపు మిక్స్డ్ ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిõÙక్ వర్మ (భారత్) జంట ఫైనల్లో 150–154 పాయింట్ల తేడాతో సారా లోపెజ్–డానియల్ మునోజ్ (కొలంబియా) జోడీ చేతిలో పరాజయంపాలైంది. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో సురేఖ గెలిచిన పతకాలు. 2017లో టీమ్ విభాగంలో రజతం, 2019లో టీమ్ విభాగంలో కాంస్యం, వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించింది. 2021లో మూడు రజతాలు గెలిచింది. తన పదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో జ్యోతి సురేఖ 41 అంతర్జాతీయ టోర్నీలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి మొత్తం 36 పతకాలు సాధించింది. ఇందులో 9 స్వర్ణాలు, 16 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. -
World Archery championship 2021: క్వార్టర్ ఫైనల్లో అంకిత
యాంక్టన్ (అమెరికా): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ అంకిత భకత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కోల్‌కతాకు చెందిన 23 ఏళ్ల అంకిత ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కాంగ్ చె యంగ్ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన కొరియా జట్టులో కాంగ్ చె యంగ్ సభ్యురాలిగా ఉంది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అంకిత రెండో రౌండ్లో 7–3తో జిండ్రిస్కా వనెస్కోవా (చెక్ రిపబ్లిక్)పై, మూడో రౌండ్లో 7–1తో అలెగ్జాండ్రా మిర్కా (మాల్డోవా)పై విజయం సాధించింది. భారత్‌కే చెందిన కోమలికా బారి మూడో రౌండ్లో 2–6తో కాంగ్ చె యంగ్ చేతిలో, రిధి 4–6తో సుగిమోటో తొమోమి (జపాన్) చేతిలో ఓడిపోయారు. చదవండి: Ostrava Open: సెమీఫైనల్లో సానియా మీర్జా జోడీ -
రెండో పసిడి పతక వేటలో వెన్నం జ్యోతి సురేఖ
యాంక్టన్ (అమెరికా): ఇప్పటికే మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం రేసులో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ రెండో పసిడి పతకం కోసం పోటీపడనుంది. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 159–156తో కిమ్ యున్హీ–కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సురేఖ 146–142తొ సో చేవన్ (దక్షిణ కొరియా) పై, మూడో రౌండ్లో 147–144తో ఇంగె వాన్ డెర్ వాన్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. చదవండి: IPL 2021 2nd Phase MI Vs KKR: ముంబైపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం -
ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌నకు మన అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో అమెరికాలో జరిగే ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత కాంపౌండ్ జట్టులోకి ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఎంపికైంది. సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం పాటియాలాలో రెండు రోజులపాటు సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో బరిలోకి దిగిన సురేఖ 360 పాయింట్లకుగాను 357 పాయింట్లు స్కోరు చేసింది. ఈ క్రమంలో 356 పాయింట్లతో గతంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. మహిళల విభాగంలో జ్యోతి సురేఖతోపాటు ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్ జట్టులోకి ఎంపికయ్యారు. పురుషుల విభాగంలో అభిషేక్ వర్మ, సంగమ్‌ప్రీత్ సింగ్ బిస్లా, రిషభ్ యాదవ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. -
జ్యోతి సురేఖను అభినందించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నెదర్లాండ్‌లో జరిగిన 50వ ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో కాంస్య పతకం సాధించిన వెన్నం జ్యోతిసురేఖను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ ఆర్చరీ పోటీల్లో జ్యోతీ సురేఖ కాంస్య పతకం సాధించడం అభినందనీయమని ఏపీ సీఎం అన్నారు. మునుముందు మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి , దేశానికి మంచి పేరు తీసుకరావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
మళ్లీ రజతమే
డెన్ బాస్చ్ (నెదర్లాండ్స్): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్ ‘బంగారు’ స్వప్నం సాకారమవలేదు. 14 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌కు చేరిన భారత పురుషుల రికర్వ్ జట్టు మళ్లీ రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన భారత్ 2–6 పాయింట్ల తేడాతో చైనా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో భారత్ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది. -
జ్యోతి సురేఖ డబుల్ ధమాకా
ఎస్–హెర్టోజెన్‌బాష్ (నెదర్లాండ్స్): కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ అదరగొట్టింది. విజయవాడకు చెందిన 22 ఏళ్ల జ్యోతి సురేఖ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో రెండు కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. తొలుత ముస్కాన్ కిరార్, రాజ్ కౌర్‌లతో కలిసి జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో కాంస్యం దక్కించుకోగా... ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో మరో కాంస్యం గెల్చుకుంది. కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ, ముస్కాన్, రాజ్ కౌర్ బృందం 229–226తో యెసిమ్ బోస్టాన్, గిజెమ్ ఎల్మాగాక్లి, ఇపెక్ టామ్రుక్లతో కూడిన టర్కీ జట్టుపై గెలిచింది. భారత జట్టు విజయంలో జ్యోతి సురేఖ కీలకపాత్ర పోషించింది. ఆమె సంధించిన ఎనిమిది బాణాల్లో ఆరు ‘10’ షాట్లు ఉండటం విశేషం. యెసిమ్ బోస్టాన్ (టర్కీ)తో జరిగిన వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో జ్యోతి సురేఖ ‘షూట్ ఆఫ్’లో పైచేయి సాధించింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 145–145 పాయింట్లతో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ ఒక్కో బాణం అవకాశం ఇచ్చారు. ఇందులో జ్యోతి సురేఖ గురికి 10 పాయింట్లు రాగా... యెసిమ్ బాణానికి తొమ్మి ది పాయింట్లే వచ్చాయి. నేడు పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో తరుణ్‌దీప్ రాయ్, రమేశ్ ప్రవీణ్ జాదవ్, అతాను దాస్లతో కూడిన భారత జట్టు స్వర్ణం కోసం తలపడనుంది. చైనా జట్టుతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. 24: తన ఎనిమిదేళ్ల కెరీర్లో జ్యోతి సురేఖ సాధించిన అంతర్జాతీయ పతకాల సంఖ్య. ఇందులో మూడు స్వర్ణాలు, 11 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. ‘రెండేళ్ల క్రితం టీమ్ విభాగంలో మేం రజత పతకం సాధించాం. ఈసారి కాంస్యం దక్కినా ఎలాంటి నిరాశ లేదు. ఎందుకంటే వరుసగా రెండో ప్రపంచ చాంపియన్ షిప్‌లోనూ టాప్–3లో నిలిచాం. ఈ పతకం మా అందరికీ ఎంతో ప్రత్యేకం. ఇక వ్యక్తిగత విభాగంలో నాకిది తొలి ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం. ఒకదశలో కొంచెం నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రయత్నించాను. నా ప్రత్యర్థి నుంచి కూడా గట్టిపోటీ ఎదురుకావడంతో కాస్త ఒత్తిడికి లోనయ్యాను. షూట్ ఆఫ్‌లో మాత్రం కంగారు పడకుండా గురి చూసి కొట్టాను. ’’ –జ్యోతి సురేఖ -
భారత పురుషుల ఆర్చరీ జట్టుకు ‘టోక్యో’ బెర్త్
ఎస్–హెర్టోగెన్బాష్ (నెదర్లాండ్స్): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడం ద్వారా భారత పురుషుల రికర్వ్ జట్టు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్‌లతో కూడిన భారత బృందం ప్రిక్వార్టర్ ఫైనల్లో 5–3తో కెనడా జట్టును ఓడించింది. మరోవైపు దీపిక, బొంబేలా దేవి, కోమలికలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో 2–6తో బెలారస్ చేతిలో ఓడింది. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో మూడో రౌండ్లోకి ప్రవేశించింది. -
ఐదోసారీ రజతమే...
మెక్సికో సిటీ: తొలి, చివరి రౌండ్లో తడబాటు కారణంగా... ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకంతో సంతృప్తి పడింది. శనివారం జరిగిన టీమ్ విభాగం ఫైనల్లో వెన్నం జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, లిలీ చాను పోనమ్లతో కూడిన భారత జట్టు 228–234 (55–58, 58–59, 60–59, 55–58) పాయింట్ల తేడాతో కొలంబియా జట్టు చేతిలో ఓడిపోయింది. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కిది ఐదో రజత పతకం. గతంలో భారత పురుషుల జట్టు రికర్వ్ ఈవెంట్లో (2005లో మాడ్రిడ్, స్పెయిన్), భారత మహిళల జట్టు రికర్వ్ టీమ్ ఈవెంట్లో (2011లో ట్యూరిన్, ఇటలీ; 2015లో కొపెన్‌హగెన్, డెన్మార్క్) రజత పతకాలు సాధించింది. 2015లోనే పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజత్ చౌహాన్ రజత పతకాన్ని గెలుపొందాడు. -
చరిత్రకు చేరువలో...
మెక్సికో సిటీ: ఎనిమిదిన్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఏనాడూ భారత్‌కు స్వర్ణ పతకం రాలేదు. అంతా అనుకున్నట్లు జరిగితే నేడు ఆ లోటు తీరే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, త్రిషా దేబ్ (బెంగాల్), లిలీ చాను పోనమ్ (మణిపూర్)లతో కూడిన భారత బృందం ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో టీమిండియా 232–227తో జర్మనీని ఓడించగా... క్వార్టర్ ఫైనల్లో 233–228తో డెన్మార్క్‌పై, తొలి రౌండ్లో 232–229తో రష్యాపై గెలిచింది. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ టీమ్ విభాగంలో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన భారత్ ఈసారి మాత్రం నిలకడగా ఆడుతూ పసిడి పతక పోరుకు అర్హత పొందడం విశేషం. కొలంబియా జట్టుతో శనివారం జరిగే ఫైనల్లో భారత్ గెలిస్తే కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు నాలుగు రజత పతకాలు లభించాయి. వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ, లిలీ చాను ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా... త్రిషా మూడో రౌండ్లో పరాజయం పాలైంది.మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురేఖ–అభిషేక్ జంట తొలి రౌండ్లో 151–154తో సాన్ డి లాట్–మైక్ ష్కాల్సర్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో ఓడింది. -
భారత్... ‘సెంచరీ’ దాటింది
► రియో ఒలింపిక్స్‌కు భారీ బృందం ► మరో నలుగురు అథ్లెట్స్‌కు ‘బెర్త్’ ► ఇప్పటివరకు 103 మంది అర్హత న్యూఢిల్లీ: పతకాలు ఎన్ని వస్తాయో కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నా... ఈసారి మాత్రం భారత్ నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒలింపిక్స్ క్రీడలకు భారీ బృందం బరిలోకి దిగనుంది. మరో 39 రోజుల్లో ప్రారంభంకానున్న ఈ విశ్వ క్రీడా సంరంభానికి ఇప్పటివరకు భారత్ నుంచి 103 మంది క్రీడాకారులు అర్హత సాధించారు. ఒకే ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ నుంచి వందకుపైగా క్రీడాకారులు పాల్గొనడం ఇదే ప్రథమం. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అత్యధికంగా భారత్ నుంచి 83 మంది క్రీడాకారులు పాల్గొనగా... రెండు రజతాలు (సుశీల్ కుమార్, విజయ్ కుమార్), నాలుగు కాంస్య పతకాలు (సైనా నెహ్వాల్, మేరీకోమ్, గగన్ నారంగ్, యోగేశ్వర్ దత్) లభించాయి. అనస్, అంకిత్ జాతీయ రికార్డులు ఆదివారం భారత్ నుంచి నలుగురు క్రీడాకారులు ‘రియో’ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. పోలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో 21 ఏళ్ల మొహమ్మద్ అనస్ పురుషుల 400 మీటర్ల విభాగంలో 45.40 సెకన్లలో గమ్యానికి చేరుకొని ‘రియో’ అర్హత ప్రమాణాన్ని అందుకున్నాడు. అదే క్రమంలో కేరళకు చెందిన అనస్ 45.44 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తిరగరాశాడు. పురుషుల లాంగ్‌జంప్‌లో హరియాణాకు చెందిన అంకిత్ సింగ్ కజకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ మీట్లో 8.19 మీటర్ల దూరం దూకి ‘రియో’ బెర్త్‌ను దక్కించుకున్నాడు. లాంగ్‌జంప్‌లో రియో అర్హత ప్రమాణం 8.15 మీటర్లుగా ఉంది. 23 ఏళ్ల అంకిత్ ధాటికి 2013లో ప్రేమ్‌కుమార్ 8.09 మీటర్లతో నెలకొల్పిన జాతీయ రికార్డు బద్దలైంది. అంకిత్ ఇటీవల దక్షిణాసియా క్రీడ ల్లో, జాతీయ క్రీడల్లో స్వర్ణాలు సాధించాడు. మరోవైపు కజకిస్తాన్‌లోనే జరిగిన మీట్లో ఒడిషాకు చెంది న 24 ఏళ్ల శ్రాబణి నందా 200 మీటర్ల మహిళల విభాగంలో ‘రియో’ బెర్త్‌ను దక్కించుకుంది. ఆమె 200 మీటర్ల రేసును 23.07 సెకన్లలో పూర్తి చేసి ‘రియో’ అర్హత ప్రమాణాన్ని(23.20 సెకన్లు) అధిగమించింది. ఆర్చర్ అతాను దాస్ ఎంపిక మరోవైపు పురుషుల ఆర్చరీలో భారత్‌కు లభించిన ఏకైక స్థానాన్ని కోల్‌కతాకు చెందిన 24 ఏళ్ల అతాను దాస్ దక్కించుకున్నాడు. బెంగళూరులో ఆదివారం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో అతాను దాస్ తనకంటే అనుభవజ్ఞులైన జయంత తాలుక్దార్, మంగళ్‌సింగ్ చాంపియాలను ఓడించాడు. గతేడాది డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మంగళ్ సింగ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని భారత్‌కు ఏకైక ‘కోటా’ను అందించాడు. అయితే భారత ఆర్చరీ సంఘం మంగళ్ సింగ్‌కు ఎంట్రీ ఖాయం చేయకుం డా... సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించి ఫామ్‌లో ఉన్న అతాను దాస్‌కు ‘రియో’ బెర్త్ ఖాయం చేసింది. -
‘రజత’ కాంతలు...
- ఫైనల్లో ఓడిన భారత మహిళల జట్టు - ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ కొపెన్‌హగెన్ (డెన్మార్క్): ఆరంభం అద్భుతంగా ఉన్నా... ఆ తర్వాత తడబాటుకు లోనై భారత ఆర్చరీ మహిళల జట్టు కొత్త చరిత్రను సృష్టించే అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రెండోసారీ రజత పతకంతో సంతృప్తి పడింది. ఆదివారం జరిగిన మహిళల రికర్వ్ టీమ్ ఫైనల్లో దీపిక కుమారి, లక్ష్మీరాణి మాఘీ, రిమిల్ బురిలీలతో కూడిన భారత జట్టు 4-5 స్కోరుతో ఇనా స్టెపనోవా, తుయానా దషిదోర్జియెవ్, సెనియా పెరోవాలతో కూడిన రష్యా జట్టు చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్‌ను 56-54తో నెగ్గి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లిన టీమిండియా... రెండో సెట్‌ను 54-53తో సొంతం చేసుకొని 4-0తో మందంజ వేసింది. అయితే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను బోల్తా కొట్టించిన రష్యా వెంటనే తేరుకుంది. మూడో సెట్‌ను 56-52తో, నాలుగో సెట్‌ను 54-50తో దక్కించుకొని స్కోరును 4-4తో సమం చేసింది. ఇరు జట్ల స్కోరు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. షూట్ ఆఫ్‌లో భారత్ 27 పాయింట్లు స్కోరు చేయగా... రష్యా 28 పాయింట్లు సాధించి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. తొలి రెండు సెట్లలో అద్భుత గురితో ఆకట్టుకున్న భారత క్రీడాకారిణులు మూడో, నాలుగో సెట్లలో పేలవ ప్రదర్శన కనబరిచారు. దీపిక నిలకడగా రాణించినా... లక్ష్మీరాణి, రిమిల్ కీలకదశలో గురి తప్పి బాణాలను ఆరు, ఏడు పాయింట్ల వలయంలోకి కొట్టారు. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మహిళల జట్టుకు రజతం లభించడం ఇది రెండోసారి. 2011లోనూ దీపిక కుమారి, బొంబేలా దేవి, చక్రవోలు స్వురోలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 207-210తో ఇటలీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో లక్ష్మీరాణి మాఝీకి కాంస్య పతకం చేజారింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో లక్ష్మీరాణి 4-6 (28-26, 24-29, 27-28, 29-27, 27-29) స్కోరుతో చౌ మిసున్ (దక్షిణ కొరియా) చేతిలో పరాజయం పాలైంది. ఓవరాల్‌గా ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్ భారత్‌కు మంచి ఫలితాలనే ఇచ్చింది. మహిళల రికర్వ్ జట్టు రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందడమే కాకుండా రజత పతకం సాధించగా... పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో మంగళ్‌సింగ్ చాంపియా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజత్ చౌహాన్ రజత పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆర్చర్‌గా గుర్తింపు పొందాడు. -
క్వాలిఫయింగ్‌లో భారత్‌కు రెండో స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు క్వాలిఫయింగ్‌లో రాణించింది. టర్కీలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో జయంత తాలుక్దార్, తరుణ్‌దీప్ రాయ్, కపిల్‌లతో కూడిన భారత బృందానికి రెండో స్థానం దక్కింది. మంగళవారం జరిగిన అర్హత రౌండ్లో తాలుక్దార్ 1331 పాయింట్లు, తరుణ్‌దీప్ 1330 పాయింట్లు, కపిల్ 1322 పాయింట్లు స్కోరు చేశారు. ఓవరాల్‌గా భారత జట్టు 3983 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 4057 పాయింట్లతో దక్షిణ కొరియా జట్టు తొలి స్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో తాలుక్దార్, తరుణ్‌దీప్, కపిల్ వరుసగా 15వ, 16వ, 22వ స్థానాలను పొందారు. రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో ఎలిమినేషన్ రౌండ్స్ బుధవారం ప్రారంభమవుతాయి. -
క్వాలిఫయింగ్‌లో జ్యోతికి ఆరో స్థానం
న్యూఢిల్లీ: జూనియర్ స్థాయిలో నిలకడగా రాణిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ సీనియర్ స్థాయిలోనూ సత్తా చాటుకుంది. టర్కీలో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగం క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ ఆరో స్థానంలో నిలిచింది. 72 బాణాలు సంధించిన జ్యోతి మొత్తం 684 పాయింట్లు స్కోరు చేసింది. భారత్‌కే చెందిన త్రిషా దేవ్ 680 పాయింట్లతో 15వ స్థానంలో, జానూ హన్స్దా 645 పాయింట్లతో 69వ స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురి స్కోర్లు పరిగణనలోకి తీసుకున్నాక కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు 10వ సీడింగ్ లభించింది. -
ప్రపంచ కప్ ఆర్చరీకి జ్యోతి సురేఖ
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ ఆర్చరీ నాలుగో దశ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు స్థానం లభించింది. ఈనెల 19 నుంచి పోలండ్‌లోని వ్రాక్లా పట్టణంలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మహిళల కాంపౌండ్ టీమ్, వ్యక్తిగత ఈవెంట్స్‌లో జ్యోతి సురేఖ పోటీపడుతుంది. రికర్వ్, కాంపౌండ్ విభాగాలతో కలిపి మొత్తం 21 మంది సభ్యుల భారత బృందం ఈ టోర్నీలో పాల్గొనేందుకు శనివారం బయలుదేరుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగే భారత జట్లను ఎంపిక చేసేందుకు సెప్టెంబరు 4 నుంచి 7 వరకు ఔరంగాబాద్‌లో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తామని భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా తెలిపారు. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 6 వరకు టర్కీలో జరుగుతుంది.