
సాక్షి, అమరావతి: ప్రపంచ ఆర్చరీ విజేత వెన్నం జ్యోతి సురేఖను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఆమె బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్, పారిస్‌లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్‌లో సాధించిన పతకాలను సీఎంకు చూపించారు.
సీఎం జగన్ మాట్లాడుతూ..అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రదర్శనతో సురేఖ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిందని ప్రశంసించారు. ప్రభుత్వం తరఫున క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం సురేఖ తనకు డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తండ్రి వెన్నం సురేంద్ర కుమార్ పాల్గొన్నారు.