మూడు విభాగాల్లో మెరిసిన ఆర్చర్
భారత్ ఖాతాలో 4 స్వర్ణాలు, 1 రజతం
వరల్డ్ కప్ స్టేజ్ 1 టోర్నీ కాంపౌండ్
షాంఘై (చైనా): ప్రపంచ ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో భారత్‌కు చెందిన వెన్నం జ్యోతిసురేఖ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరల్ట్ కప్ స్టేజ్ 1 టోర్నీలో శనివారం జ్యోతి సురేఖ 3 స్వర్ణ పతకాలతో మెరిసింది. దీపికా కుమారి (2021) తర్వాత వరల్డ్ కప్‌లో 3 పసిడి పతకాలు గెలిచిన రెండో భారత ఆర్చర్‌గా సురేఖ నిలిచింది. మహిళల, మిక్స్‌డ్, టీమ్ ఈవెంట్లలో ఆమె అగ్రస్థానాన్ని సాధించడం విశేషం.
మహిళల ఈవెంట్ ఫైనల్లో టాప్ సీడ్ ఆండ్రియా బెకెరా (మెక్సికో)ను ఓడించింది. ఇద్దరి స్కోర్లు 146–146తో సమం కాగా...షూటాఫ్ ఫినిష్‌తో సురేఖ పైచేయి సాధించింది. మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో జ్యోతిసురేఖ – అభిషేక్ వర్మ ద్వయం 158–157 స్కోరుతో లిసెల్ జాత్మా – రాబిన్ జాత్మా (ఎస్తోనియా)పై విజయం సాధించింది. మహిళల టీమ్ ఈవెంట్ తుది పోరులోలో సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు 236–225 తేడాతో ఇటలీ జట్టుపై గెలుపొందింది.
పురుషుల విభాగంలో మరో 2 పతకాలు కూడా భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రియాన్‡్ష రజతం గెలుచుకున్నాడు. ఫైనల్లో అతను 147–150 తేడాతో నికో వీనర్ (ఆ్రస్టియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు బంగారం లభించింది. ఫైనల్ అభిõÙక్ వర్మ, ప్రియాన్‡్ష, ప్రథమేశ్‌లతో కూడిన భారత జట్టు 238–231తో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీ రికర్వ్ విభాగం ఫైనల్ మ్యాచ్‌లు ఆదివారం జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment