17 Years Old Aditi Gopichand Swami Became Youngest Ever Archery World Champion - Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్‌.. వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా ప్రపంచ రికార్డు

Published Sat, Aug 5 2023 7:33 PM | Last Updated on Sat, Aug 5 2023 8:20 PM

Aditi Gopichand Swami Became Youngest Ever Archery World Champion - Sakshi

World Archery Championships-Berlin: భారత మహిళా ఆర్చర్‌ అదితి గోపీచంద్ స్వామి చరిత్ర సృష్టించింది. వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా (17) ప్రపంచ రికార్డు నెలక్పొంది. బెర్లిన్‌లో జరిగిన వరల్డ్‌ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ కాంపౌండ్ మహిళల విభాగంలో స్వర్ణం గెలవడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఆర్చరీలో భారత్‌ తరఫున మొదటి వ్యక్తిగత ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

ఇవాళ (ఆగస్ట్‌ 5) జరిగిన ఫైనల్లో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాను 149-47 ఓడించడం ద్వారా జగజ్జేతగా నిలిచి, విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఇదే పోటీల్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్‌ కౌర్‌లతో కలిసి మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం నెగ్గిన అదితి.. గంటల వ్యవధిలో భారత్‌కు మరో స్వర్ణం అందించింది.

ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న అదితి.. గత నెలలో జరిగిన వరల్డ్‌ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో స్వర్ణాలను సాధించింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్ షూట్-ఆఫ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన సన్నె డి లాట్‌ను ఓడించిన అదితి.. సెమీఫైనల్లో సహచరి, ఆంధ్ర అమ్మాయి జ్యోతి సురేఖపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement