న్యూఢిల్లీ: ప్రపంచ కప్ ఆర్చరీ నాలుగో దశ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు స్థానం లభించింది. ఈనెల 19 నుంచి పోలండ్‌లోని వ్రాక్లా పట్టణంలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మహిళల కాంపౌండ్ టీమ్, వ్యక్తిగత ఈవెంట్స్‌లో జ్యోతి సురేఖ పోటీపడుతుంది.
రికర్వ్, కాంపౌండ్ విభాగాలతో కలిపి మొత్తం 21 మంది సభ్యుల భారత బృందం ఈ టోర్నీలో పాల్గొనేందుకు శనివారం బయలుదేరుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగే భారత జట్లను ఎంపిక చేసేందుకు సెప్టెంబరు 4 నుంచి 7 వరకు ఔరంగాబాద్‌లో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తామని భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా తెలిపారు. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 6 వరకు టర్కీలో జరుగుతుంది.
ప్రపంచ కప్ ఆర్చరీకి జ్యోతి సురేఖ
Published Sat, Aug 17 2013 1:39 AM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM
Advertisement
Advertisement