World Archery Championship Qualifications- బెర్లిన్ (జర్మనీ): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్ మెరిశారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ ర్యాంకింగ్ రౌండ్‌లో మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ 701 పాయింట్లు... పురుషుల రికర్వ్ విభాగంలో ధీరజ్ 683 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచారు. ఫలితంగా నాకౌట్ దశలో రెండో సీడింగ్ పొందిన జ్యోతి సురేఖ, ధీరజ్‌లకు నేరుగా మూడో రౌండ్‌కు ‘బై’ లభించింది.
ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ తొలి రౌండ్‌లో... సిక్కి రెడ్డి–ఆరతి సారా సునీల్ జంట క్వాలిఫయింగ్‌లో నిష్క్రమించాయి.
తొలి రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా జాలీ 21–16, 21–17తో కేథరీన్ చోయ్–జోసెఫిన్ వు (కెనడా)లపై గెలిచారు. అశి్వని–తనీషా 11–21, 21–14, 17–21తో ఫెబ్రియానా కుసుమ–అమాలియా ప్రతవి (ఇండోనేసియా) చేతిలో... సిక్కి రెడ్డి–ఆరతి 14–21, 17–21తో సు యిన్ హుయ్–లీ చి చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment