జర్మనీలోని శ్రీ గణేష్ ఆలయంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో దాదాపు 200 కుటుంబాలు దాక పాల్గొన్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జర్మనీ రాయబారి హెచ్‌ఈ పర్వతనేని హరీష్ విచ్చేశారు. ఈ ఉగాది కార్యక్రమాలు తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రఘు చలిగంటి సారథ్యంలో జరిగాయి.
ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యక్షులు వెంకట రమణ బోయినపల్లి, కార్యదర్శి అలేక్య బోగ, సాంస్కృతిక కార్యదర్శులు శరత్ రెడ్డి, యోగానంద్, కోశాధికారి బాలరాజ్ అందె, సోషల్ మీడియా కార్యదర్శులు నరేష్, నటేష్ గౌడ్, వాలంటీర్ టీమ్ సహాయ సహకారాలతో జయప్రదం చేశామని డాక్టర్ రఘు అన్నారు. ఈ సంప్రదాయ కార్యక్రమం, సాంస్కృతిక ప్రదర్శనలు సమాజా స్ఫూర్తికి అర్థానిచ్చేలా విజయవంతంగా జరిగాయని నిర్వాహకులు వెల్లడించారు.
అంతేగాదు ఈ ఉగాది కార్యక్రమాలు ఇంతలా గుర్తుండిపోయేలా విజయవంతం చేసినందుకు వాలంటీర్లకు, సహకరించిన వారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుక కొత్త ఏడాదిని మాత్రమే కాకుండా, బెర్లిన్‌లో తెలుగు ప్రవాసులలో బలమైన సమాజ బంధాలను, సాంస్కృతిక వారసత్వాన్ని హైలెట్ చేసిందని నిర్వాహకులు కొనియాడారు.
(చదవండి: సింగపూర్‌లో తమిళ భాష వైభవం.. ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి!)
Comments
Please login to add a commentAdd a comment