రెండో పసిడి పతక వేటలో వెన్నం జ్యోతి సురేఖ | World Archery Championship Jyothi Surekha Abhishek Compound Mixed Team Final | Sakshi
Sakshi News home page

World Archery Championship: ‘పసిడి’ రేసులో సురేఖ–అభిషేక్‌ జంట 

Published Fri, Sep 24 2021 8:35 AM | Last Updated on Fri, Sep 24 2021 8:37 AM

World Archery Championship Jyothi Surekha Abhishek Compound Mixed Team Final - Sakshi

యాంక్టన్‌ (అమెరికా): ఇప్పటికే మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకం రేసులో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ రెండో పసిడి పతకం కోసం పోటీపడనుంది. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో జ్యోతి సురేఖ–అభిషేక్‌ వర్మ (భారత్‌) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

గురువారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్‌ వర్మ ద్వయం 159–156తో కిమ్‌ యున్‌హీ–కిమ్‌ జాంగ్‌హో (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సురేఖ 146–142తొ సో చేవన్‌ (దక్షిణ కొరియా) పై, మూడో రౌండ్‌లో 147–144తో ఇంగె వాన్‌ డెర్‌ వాన్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించింది.

చదవండి: IPL 2021 2nd Phase MI Vs KKR: ముంబైపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్‌ ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement