ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ
సాక్షి, విజయవాడ : కొంతమంది అధికారులు, స్పోర్ట్స్ అథారిటీలు, కోచ్‌ల వల్లే రాష్ట్రంలో క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అర్జున అవార్డు గ్రహీత, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు ప్రకటించిన కోటి రూపాయల నజరానా ఇప్పటి వరకు అందలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున అనేక టోర్నీలలో పాల్గొన్న జ్యోతి అద్భుత ప్రతిభ కనబర్చి పథకాలు సాధించారు. అయితే రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఆడనీయకుండా కొంతమంది అధికారులు, కోచ్ అని చెప్పుకుంటున్న సత్యనారయణ తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అసలు సత్యనారాయణ కోచ్ కాదని, ఆయన కేవలం హాస్టల్ వార్డెన్ మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాకాలలో వాటాలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారి వల్లే రాష్ట్ర కీడాకారులకు అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. అంతర్జాతీయ ర్యాకింగ్స్‌లో జ్యోతి సురేఖ 13వ స్థానంలో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment