కోల్‌కతా: ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ టోర్నీలు, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ఎంపిక చేసేందుకు నిర్వహించిన ఓపెన్ సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు బొమ్మదేవర ధీరజ్, వెన్నం జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు.
మంగళవారం ముగిసిన ఈ ట్రయల్స్‌లో పురుషుల రికర్వ్ విభాగంలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ధీరజ్ ఓవరాల్‌గా 2767 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు.
పార్థ్ సాలుంకే (మహారాష్ట్ర), జయంత తాలుక్‌దార్ (జార్ఖండ్), అతాను దాస్ (పీఎస్‌పీబీ), సుఖ్‌చెయిన్ సింగ్ (సర్వీసెస్), తరుణ్‌దీప్ రాయ్ (సర్వీసెస్), సుఖ్‌మణి (మహారాష్ట్ర), నీరజ్ చౌహాన్ వరుసగా రెండు నుంచి ఎనిమిది ర్యాంక్‌ల్లో నిలిచారు. తద్వారా ఈ ఏడాది జరిగే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే భారత జట్టులో చోటు సంపాదించేందుకు అర్హత పొందారు.
మరోవైపు మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ ఓవరాల్‌గా 2828 పాయింట్లు సాధించి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. సురేఖతోపాటు పర్ణీత్ కౌర్, అదితి, ప్రగతి, సాక్షి చౌదరీ, ముస్కాన్, ఐశ్వర్య శర్మ, సృష్టి సింగ్ కూడా ఈ ఏడాది జరిగే మెగా ఈవెంట్స్‌లో పాల్గొనే టీమిండియా సెలెక్షన్స్‌కు అర్హత పొందారు. మహిళల రికర్వ్ విభాగం ట్రయల్స్‌లో ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి ఏడో ర్యాంక్‌లో నిలిచి భారత జట్టులో పునరాగమనం చేయడానికి అర్హత సాధించింది.
చదవండి: IND vs NZ 1st ODI: టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్
WTC- Ind Vs Aus: పిచ్‌లు అలా ఉంటే టీమిండియాదే సిరీస్.. కనీసం ఈసారైనా..
Comments
Please login to add a commentAdd a comment