Archery Championship
-
Paris Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్..
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్..ఆర్చరీ..– పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్ రౌండ్):ప్రవీణ్ జాధవ్ × వెన్‌చావో (చైనా) (మధ్యాహ్నం గం. 2:31 నుంచి).పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్ రౌండ్): (మధ్యాహ్నం గం. 3:10 నుంచి).షూటింగ్..– పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (ఫైనల్):స్వప్నిల్ కుసాలే (మధ్యాహ్నం గం. 1:00 నుంచి).మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫికేషన్ రౌండ్: సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).గోల్ఫ్..– పురుషుల వ్యక్తిగత ఫైనల్స్:గగన్‌జీత్ భుల్లర్, శుభాంకర్ శర్మ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).బాక్సింగ్..– మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్:నిఖత్ జరీన్ × యూ వూ (చైనా) (మధ్యాహ్నం గం. 2:30 నుంచి).సెయిలింగ్..– పురుషుల డింగీ తొలి రెండు రేసులు:విష్ణు శరవణన్ (మధ్యాహ్నం గం. 3:45 నుంచి).– మహిళల డింగీ తొలి రెండు రేసులు:నేత్రా కుమానన్ (రాత్రి గం. 7:05 నుంచి)హాకీ..భారత్ × బెల్జియం (గ్రూప్ మ్యాచ్) (మధ్యాహ్నం గం. 1:30 నుంచి).బ్యాడ్మింటన్..– పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్స్:(మధ్యాహ్నం గం. 12:00 నుంచి).– పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్:సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి × చియా ఆరోన్–సోహ్ వూయి యిక్ (మలేసియా) (సాయంత్రం గం. 4:30 నుంచి).మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ (సాయంత్రం గం. 4:30 నుంచి). -
అనాథలు కాదు.. ఆటగాళ్లు!
నవీన్ (పేరు, వివరాలు మార్చాం) అనాథ బాలుడు. బంధువులు పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బాల కారి్మకుడిగా మారాడు. కర్మాగారాల్లో, పరిశ్రమల్లో దుర్భర పరిస్థితుల్లో పనిచేశాడు. అధికారులు రెస్క్యూ చేయడంతో.. నాలుగేళ్ల కింద సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలల సదనానికి చేరాడు. ఇప్పుడతను విలు విద్య (ఆర్చరీ)లో జాతీయస్థాయి క్రీడాకారుడు. స్కూల్ లెవల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలు దాటి గత నవంబర్‌లో గుజరాత్లో నిర్వహించిన జాతీయ బాలల ఆర్చరీ పోటీల్లో పాల్గొన్నాడు. అందులో 800 మంది పోటీపడితే 158వ స్థానం దక్కించుకున్నాడు. ఇప్పుడు సదనంలోని ఆర్చరీ అకాడమీలో కోచ్ సాయంతో రాటుదేలుతున్నాడు. భవిష్యత్తులో చాంపియన్ అవుతానంటున్నాడు. - సైదాబాద్ఇది ఈ ఒక్క బాలుడి కథనంకాదు, అతడిలా దుర్భర పరిస్థితుల్లో జీవించి, రెస్క్యూ ఆపరేషన్లలో సదనానికి చేరుకున్న మరెందరో చిన్నారులు తమదైన ప్రతిభ చూపుతున్నారు. మరో ముగ్గురు బాలలూ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని, గుర్తింపు తెచ్చుకున్నారు.రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆర్చరీ అకాడమీ.. తల్లిదండ్రులు లేక రహదారులపై భిక్షమెత్తుతూనో, రైళ్లలో సంచరిస్తూ, బాలకారి్మకులుగానో పనిచేస్తున్న పిల్లలను అధికారులు రెస్క్యూ చేసినప్పుడు.. సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలల సదనానికి తరలిస్తారు. అలా వచ్చిన పిల్లలు పెద్దయ్యేదాకా ప్రభుత్వమే చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆ బాలల్లోని ప్రతిభను వెలికితీయడంపై అధికారులు దృష్టిపెట్టారు. స్వతహాగా క్రీడాకారుడైన జువెనైల్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మీర్జా అలీ బేగ్ పలువురు బాలల్లో చురుకుదనాన్ని పసిగట్టారు.చక్కటి తరీ్ఫదు ఇస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని గుర్తించారు. తన ఆలోచనను ఉన్నతాధికారులకు చెప్పి ఒప్పించారు. ఎక్కడా జువెనైల్ విభాగంలో లేనిరీతిలో.. హైదరాబాద్‌లోని సైదాబాద్ జువెనైల్ హోంలో 2022 నవంబర్‌లో జువైనల్ ఆర్చరీ అకాడమీ ఏర్పాటు చేయించారు. ఇక్కడ ఉదయం బాలికలకు, సాయంత్రం బాలురకు ఆర్చరీలో తరీ్ఫదు ఇస్తున్నారు.అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి కోచ్‌గా..అకాడమీలో కోచ్‌గా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి, యూత్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన, వరల్డ్ 7వ ర్యాంకర్ హేమలతా యాదవ్‌ను నియమించారు. ఆమె 15 రోజుల శిక్షణతోనే అకాడమీలోని ఒక బాలుడు జిల్లాస్థాయి పోటీల్లో రాణించి, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం.. ఆ పోటీల్లోనూ ఏడో స్థానంలో నిలవడం విశేషం. తర్వాత ఇక్కడి బాలలు నలుగురు రాష్ట్రస్థాయిలో, ఒకరు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాణించారు.చదువులోనూ రాణిస్తూ..ఒడిదుడుకుల బాల్యం నుంచి సదనానికి చేరిన తర్వాత బాలలు క్రమశిక్షణతో కూడిన జీవితానికి అలవాటుపడుతున్నారు. అధికారులు, సిబ్బంది సూచనలతో చదువులోనూ రాణిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు రాసి పాసవుతున్నారు. ఇద్దరు విద్యార్థులు సదనం నుంచి బయటికి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటరీ్మడియట్ చదువుతున్నారు. ఆ ఇద్దరూ ఆర్చరీ విభాగంలో రాష్ట్రస్థాయిలో చక్కగా రాణిస్తున్న వారే.చదువు, ఆర్చరీ రెండూ కొనసాగిస్తాం..కఠినమైన బాల్యాన్ని చూశాం. అప్పటి రోజులు గుర్తుకొస్తే ఇప్పటికీ బాధేస్తుంది. సదనానికి వచ్చిన తర్వాత క్రమపద్ధతిలో జీవిస్తున్నాం. చదువుతూనే ఆర్చరీలో శిక్షణ పొందుతున్నాం. ఉన్నత విద్య పూర్తి చేయాలని, ఆర్చరీ పోటీల్లో చక్కటి గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాం..’’ - ఆర్చరీలో ప్రతిభ చూపుతున్న బాలల మనోగతంఅంతర్జాతీయ ఖ్యాతి సాధించాలన్న..తెలంగాణ ప్రభుత్వ బాలల సదనంలోని పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణించి మంచి ఖ్యాతి గడించాలన్నదే మా ఆకాంక్ష. అందుకోసమే మరెక్కడా లేనట్టుగా సైదాబాద్‌లోని సదనంలో ఆర్చరీ అకాడమీ ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించడంతో అకాడమీ సాధ్యమైంది. ఆకాంక్షలకు అనుగుణంగా బాలలు రాణిస్తున్నారు. చదువులో, క్రీడల్లో వారు ఉన్నతులుగా ఎదిగేందుకు జువెనైల్ వెల్ఫేర్ అండ్ కరక్షనల్ సరీ్వసెస్ అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారు. - మీర్జా అలీ బేగ్, జువెనైల్ శాఖ డిప్యూటీ డైరెక్టర్నా విద్యార్థులు ఒలింపిక్స్‌లో ఆడాలి.. నేర్చుకోవాలనే తపన, గెలవాలనే ఆకాంక్ష ఉన్న నా విద్యార్థులు ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో ఆడుతారు. అకాడమీ ప్రారంభమైన నాటి నుంచి విద్యార్థులు ఎంతో ఇష్టంగా ఆర్చరీ నేర్చుకుంటున్నారు. ఏకాగ్రత, లక్ష్యంపై వారి గురి అబ్బురపరుస్తోంది. నేర్చుకున్న అనతి కాలంలోనే వారు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడమే దీనికి నిదర్శనం. – హేమలతా యాదవ్, ఆర్చరీ అకాడమీ కోచ్ -
నాలుగో ర్యాంక్‌లో జ్యోతి సురేఖ..
ఆర్చరీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ నాలుగో స్థానంలో నిలిచింది.గత ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లో ఉన్న జ్యోతి సురేఖ కొరియాలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–2 టోరీ్నలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడంతో ఆమె ర్యాంక్‌లో మార్పు వచ్చింది. భారత్‌కే చెందిన అదితి 10వ ర్యాంక్‌లో, పరీ్ణత్ కౌర్ 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. టీమ్ విభాగంలో సురేఖ, అదితి, పరీ్ణత్ బృందం నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. -
కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌లో.. జ్యోతి సురేఖ
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో మూడు స్వర్ణ పతకాలతో మెరిసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది.సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సురేఖ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో 299 పాయింట్లతో రెండో ర్యాంక్ లో నిలిచింది. గత ర్యాంకింగ్స్‌లో సురేఖ మూడో ర్యాంక్‌లో ఉంది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి 103 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల రికర్వ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ 18వ ర్యాంక్‌లో ఉన్నాడు.ఇవి చదవండి: Archery: 'టాప్స్'లోకి దీపికా కుమారి -
స్పోర్ట్స్: ఆ ఆర్చర్ పేరు 'బొమ్మదేవర ధీరజ్'!
అక్టోబర్ 2023.. హాంగ్జూలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఆర్చరీ రికర్వ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడొకడు పోటీ పడుతున్నాడు. వ్యక్తిగత విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. రెండో సెట్లో మొదటి బాణంతో సున్నా స్కోరు.. నాలుగో సెట్ రెండో బాణంతో సున్నా స్కోరు.. మొత్తం ఎనిమిది బాణాల వ్యవధిలో రెండు 0, 0 స్కోర్లు.. ఎవరూ ఊహించని రీతిలో అతి ఘోరమైన ప్రదర్శన.. ఆ కుర్రాడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. నవంబర్ 2023.. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఆర్చరీ కాంటినెంటల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్... ఈ కీలక పోరులో అదే కుర్రాడు తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.. ఈసారి ఒక్క బాణం కూడా గురి తప్పలేదు. తన ప్రతిభనంతా ప్రదర్శిస్తూ అతను చెలరేగిపోయాడు. ఫలితంగా ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పాల్గొనేందుకు అవసరమైన తొలి అర్హత (కోటా)ను అందించాడు. తనతో పాటు సహచరులందరిలోనూ సంతృప్తి. ఆసియా క్రీడల్లో వైఫల్యంతో చోకర్ అంటూ అన్నివైపుల నుంచి విమర్శలపాలై ఆపై ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం వరకు నెల రోజుల వ్యవధిలో అతను జీరో నుంచి హీరోగా మారాడు. ఆ ఆర్చర్ పేరు బొమ్మదేవర ధీరజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పించింగ్’.. దీరజ్ చేసిన పొరపాటుకు సాంకేతిక నామమిది. ఆర్చర్ లక్ష్యం దిశగా బాణాలు విసురుతున్న సమయంలో ఆటగాడి ప్రమేయం లేకుండా మూడో వేలు పొరపాటున బాణం చివరన తగిలితే అది దిశ లేకుండా ఎక్కడితో దూసుకెళ్లిపోతుంది. ఇది సాంకేతికంగా జరిగిన తప్పే కావచ్చు. కానీ ఫలితం చూస్తే ఆర్చర్‌దే పెద్ద వైఫల్యంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అతడిని మరీ పేలవమైన ఆటగాడిగా చూపిస్తుంది. ఇలాంటి అనుభవమే ధీరజ్‌కు ఎదురైంది. ఆర్చరీలో 9 పాయింట్లు సాధించిప్పుడు, ఆపై పర్ఫెక్ట్ 10 సాధించలేని సందర్భాల్లో కూడా ఆర్చర్లు తీవ్రంగా నిరాశ చెందుతారు. అలాంటి సున్నా పాయింట్లు అంటే పెద్ద వైఫల్యం కిందే లెక్క. ఈ స్థితిలో ధీరజ్ అసలు తన లోకంలో తాను లేనట్లుగా కుప్పకూలిపోయి పోటీ నుంచి ఓటమిపాలై నిష్క్రమించాడు. జట్టు సహచరులు ‘నీ తప్పేం లేద’ంటూ ఓదార్చే ప్రయత్నం చేసినా అతని బాధ తగ్గలేదు. ‘క్రికెట్లో అంటే సాధారణ అభిమానులకు ఎక్కడ తప్పు జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆర్చరీలో సాంకేతికాంశాలను నేను ఎలా వివరించగలను. ఇలాంటివి ఏమీ తెలియకుండా నన్ను ఆన్లైన్లో చాలామంది తీవ్ర పదజాలంతో దూషించారు. మాటల్లో చెప్పలేనంత వేదన అనుభవించాను’ అని ధీరజ్ నాటి ఘటనను గుర్తు చేసుకుంటాడు. బలంగా పైకి లేచి.. క్రీడల్లో కింద పడటం కొత్త కాదు కాని, పడ్డ ప్రతిసారి పైకి లేచేందుకు క్రీడలు అవకాశం కల్పిస్తాయి. ఘోర వైఫల్యం ఒకటి ఎదురైతే, ఆ తర్వాత మళ్లీ దానిని సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. ధీరజ్ విషయంలో కూడా ఇదే జరిగింది. కేవలం నాలుగు రోజుల్లోనే అతను తన తప్పును దిద్దుకొని సత్తా చాటేందుకు అదే ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్ వేదికగా మారింది. ‘నా వల్ల కాదు’ అంటూ ధీరజ్ సహచరులకు చెప్పినా, ‘నువ్వు బాణాలు సంధించు చాలు అంతా బాగుంటుంది’ అంటూ వారు ధైర్యం చెప్పారు. చివరకు భారత జట్టు టీమ్ విభాగంలో సగర్వంగా ఫైనల్ చేరి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. అతాను దాస్, తుషార్ షెల్కే, ధీరజ్‌లతో కూడిన జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఆర్చరీలో ఆల్‌టైమ్ గ్రేట్ టీమ్ కొరియాతో జరిగిన ఫైనల్లో ఓటమిపాలైనా, ఓవరాల్ ప్రదర్శన భారత్‌కు సంతృప్తినిచ్చింది. ధీరజ్ కూడా కీలక సమయాల్లో పర్ఫెక్ట్ స్కోర్లతో తన వంతు పాత్ర పోషించాడు. అలా మొదలై.. ధీరజ్ స్వస్థలం విజయవాడ. చాలామంది చిన్నపిల్లల్లాగే బాణాలతో ఆడుకునే సరదా ఆ తర్వాత అసలైన ఆట వైపు మళ్లించింది. ఐదేళ్ల వయసులో అతను ఈ ఆటవైపు బాగా ఆకర్షితుడై విల్లును అందుకున్నాడు. ఉపాధ్యాయుడైన తండ్రి తన కుమారుడిని నిరుత్సాహపరచకుండా ఆర్చరీలో ప్రాథమిక శిక్షణ వైపు తీసుకెళ్లాడు. నగరంలోని ప్రముఖ ఓల్గా ఆర్చరీ అకాడమీలో ధీరజ్ ఓనమాలు నేర్చుకున్నాడు. కోచ్‌లు చెరుకూరి లెనిన్, చెరుకూరి సత్యనారాయణ మార్గనిర్దేశనంలో అతని ఆట పదునెక్కింది. అకాడమీలో జార్ఖండ్ నుంచి వచ్చిన ఇతర కోచ్‌లు కూడా అతని ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దారు. దాంతో స్థానికంగా, చిన్న స్థాయి టోర్నీల్లో విజయాలు సాధిస్తూ ధీరజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే మలుపు.. వరుస విజయాలతో దిగువ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకుంటూ వచ్చిన ధీరజ్‌కు కెరీర్లో మరింత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. అయితే ఆర్థిక సమస్యలతో పాటు ఇతర ప్రతికూలతలు ఇబ్బందిగా మారాయి. ఇలాంటి సమయంలో క్రీడా ఎన్జీఓ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ) ధీరజ్ ఆటను గుర్తించడం అతని కెరీర్లో కీలకమైన మలుపు. 2017లో ప్రతిభాన్వేషణలో భాగంగా నిర్వహించిన సెలక్షన్స్‌లో ఓజీక్యూ ప్రతినిధి అనుకూల్ భరద్వాజ్ దృష్టిలో పడ్డాడు. తమ జూనియర్ ప్రోగ్రామ్‌లో ధీరజ్‌ను చేర్చుకొని వారు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యుత్తమ స్థాయిలో శిక్షణ, అంతర్జాతీయ స్థాయి ఎక్విప్మెంట్తో ధీరజ్ తన ఆటకు పదును పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు ఎదురైనా, అవి అతని కెరీర్‌కు ప్రతిబంధకం కాలేదు. 2018 యూత్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులో అతనికి స్థానం దక్కలేదు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ ట్రయల్స్‌లో కూడా నాలుగో స్థానంలో నిలవడంతో ఆ అవకాశమూ పోయింది. అయితే ఈ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకంటూ ధీరజ్ ఇతర టోర్నీల్లో సత్తా చాటుతూ వచ్చాడు. ఆర్మీ అండదండలతో.. 2017లో ఆసియా అవుట్డోర్ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత రజతం, 2018లో ఆసియా గ్రాండ్ ప్రి టీమ్ ఈవెంట్లో రజతంతో ధీరజ్‌కు తగిన గుర్తింపు దక్కింది. అయితే అతని కెరీర్ గత రెండేళ్లలో మరింతగా దూసుకుపోయింది. ఈ క్రమంలో పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ అతని ఆటకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు అవకాశం కల్పించింది. అక్కడ చేరిన అనంతరం కొరియా కోచ్ కిమ్హగ్యాంగ్ శిక్షణలో ధీరజ్ రాటుదేలాడు. ఇది అతని ప్రదర్శనలలో, ఫలితాల్లో కనిపించింది. వరుసగా పెద్ద విజయాలు ధీరజ్ ఖాతాలో చేరాయి. వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో టీమ్ స్వర్ణం, వరల్డ్ కప్‌లో 1 స్వర్ణం, 3 రజతాలు, ఆసియా గ్రాండ్ ప్రిలో 2 స్వర్ణాలతో పాటు గత ఆసియా క్రీడల్లో రజతంతో అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో భాగంగా అతను కొత్త ప్రపంచ రికార్డును సృష్టించడం విశేషం. కోల్‌కతాలో జరిగిన ఈవెంట్లో మొత్తం 1140 పాయింట్లతో అమెరికాకు చెందిన బ్రాడీ ఎలిసన్ గత రికార్డు (1386)ను అతను సవరించాడు. ఆర్మీలో సుబేదార్ హోదాలో ఉన్న ధీరజ్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం మరో పెద్ద అవకాశాన్ని కల్పించింది. ఆర్చరీలో అతి కష్టమైన, బాగా ఉండే ఈవెంట్ పురుషుల రికర్వ్ విభాగం. అయితే ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న ధీరజ్ చూపిస్తున్న ఫామ్, ఆత్మవిశ్వాసం భారత్‌కు ఒలింపిక్స్ చరిత్రలో తొలి ఆర్చరీ పతకాన్ని అందించవచ్చు. — మొహమ్మద్ అబ్దుల్ హాది -
జ్యోతి సురేఖకు స్వర్ణం, రజతం
బ్యాంకాక్: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రెండు పతకాలు గెలిచింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజతం, టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ 145–145 (8/9) ‘షూట్ ఆఫ్’లో భారత్‌కే చెందిన పర్ణీత్ కౌర్ చేతిలో ఓడిపోయింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరి స్కోర్లు సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందు ఇద్దరికి ఒక్కో షాట్ అవకాశం ఇచ్చారు. జ్యోతి సురేఖ బాణం 8 పాయింట్ల వృత్తంలోకి వెళ్లగా... పంజాబ్‌కు చెందిన 18 ఏళ్ల పర్ణీత్ కౌర్ 9 పాయింట్ల షాట్‌తో తొలి అంతర్జాతీయ వ్యక్తిగత స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత బృందం కాంపౌండ్ టీమ్ ఫైనల్లో 234–233తో చైనీస్ తైపీని ఓడించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇప్పటి వరకు ఏడుసార్లు ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న జ్యోతి సురేఖ ఓవరాల్‌గా 5 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో అదితి–ప్రియాంశ్ జోడీ 156–151తో కనోక్నాపుస్–నవాయుత్ (థాయ్‌లాండ్) జంటను ఓడించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో అభిషేక్ వర్మ 147–146తో జూ జేహూన్ (దక్షిణ కొరియా)ను ఓడించాడు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్యోతి సురేఖ
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, ధీరజ్ బొమ్మదేవర ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బ్యాంకాక్‌లో మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం రెండో రౌండ్లో సురేఖ 144–141తో ప్రతుమ్‌సువన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం రెండో రౌండ్లో ధీరజ్ 6–4తో తై యు సువాన్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. -
మహిళల రికార్డ్: వారి టార్గెట్ పక్షి కన్నే, గర్వంగా ఉంది: ఆనంద్ మహీంద్ర ప్రశంసలు
India wins historic gold medal జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఘన విజయంపై పారిశ్రామివేత్త ఆనంద్‌మహీంద్ర స్పందించారు. భారతీయ మహిళలు గొప్పగా రాణిస్తున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. ఎందుకంటే భారతంలో అర్జునిడిలా వారి టార్గెట్ పక్షి కన్ను మాత్రమే..బ్లూఐ కాదు .మీ విజయాన్ని చూసి దేశం గర్వపడుతోంది. అంటూ ప్రశంసలు కురిపించారు. త ద్వారా భారతీయ మూలాల్లో ఉన్న విలువిద్య ప్రాధాన్యతను, ప్రతిభను కొనియాడారు. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. ఈ బృందంలో జ్యోతి సురేఖ వెన్నం, పర్నీత్ కౌర్ మరియు అదితి గోపీచంద్ స్వామి ఉన్నారు. చివరి రౌండ్లో, డాఫ్నే క్వింటెరో, అనా సోఫియా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెకెరాలతో కూడిన మెక్సికన్ జట్టుపై అసాధారణమైన ప్రదర్శనను ప్రదర్శించారు. భారత త్రయం 235-229 స్కోరుతో విజయం సాధించారు. దీంతో నెటిజన్లు కూడా మహిళల విజయంపై స్పందిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ టాప్‌లో నిలుస్తున్నారు అంటూ భారత జట్టును పొగడ్తలు కురిపిస్తున్నారు. భారతీయ మహిళల ఘనత మరుగున పడిపోతోంది. ఇంట్లో కుటుంబం కోసం , పొలాల్లో పని చేయడం , కార్యాలయంలో పని ,ఇప్పుడు స్టార్టప్‌లను నడపడం, దేశం కోసం పతకాలు సాధించడంతోపాటు చాలాపనులను విజయవంతంగా చేయగలరు. కానీ కుటుంబ చాకిరీలాగానే చాలా మంది మహిళల పాత్ర వెలుగులోకి రావడం లేదంటూ ఆవేదన కూడా వ్యక్తం చేయడం గమనార్హం. Indian women on the Rise. No surprise. Because, like Arjuna, they only see the “eye of the bird” As opposed to the Bull’s eye. 😊👏🏽👏🏽👏🏽. Thank you for making us all so proud. pic.twitter.com/kwq97zwRiR — anand mahindra (@anandmahindra) August 5, 2023 -
పార్థ్ సాలుంకే ‘స్వర్ణ’ చరిత్ర
లిమెరిక్ (ఐర్లాండ్): భారత ఆర్చరీ ప్లేయర్ పార్థ్ సాలుంకే ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో పసిడి చరిత్ర లిఖించాడు. ఈ టోర్నమెంట్లో అతను పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో విజేతగా నిలిచాడు. మొత్తంమీద ఈ పోటీల్లో భారత బృందం మునుపెన్నడు లేని విధంగా ఈ టోర్నీలోనే అత్యధికంగా 11 పతకాలు సాధించిన జట్టుగా నిలిచింది. అండర్ –21 పురుషుల వ్యక్తిగత రికర్వ్ కేటగిరీలో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల సాలుంకే... ఆర్చరీలో ఘనాపాటిలైన కొరియన్‌ను కంగుతినిపించాడు. ఫైనల్లో పార్థ్ 7–3తో ఏడో సీడ్ సంగ్ ఇంజున్ను ఓడించాడు. ప్రత్యేకించి పురుషుల రికర్వ్‌లో బంగారు పతకం సాధించిన తొలి ఆర్చర్‌గా పార్థ్ సాలుంకే ఘనత వహించాడు. మహిళల రికర్వ్‌లో ఇదివరకే దీపిక కుమారి (2009, 2011), కొమలిక బారి (2019, 2021) బంగారు పతకాలు సాధించారు. మహిళల అండర్–21 వ్యక్తిగత రికర్వ్ కేటగిరీలో భారత్ ఖాతాలో కాంస్యం చేరింది. భజన్ కౌర్ 7–1తో చైనీస్ తైపీకి చెందిన సు సిన్ యూపై నెగ్గింది. Parth Salunkhe's PURE DETERMINATION. 👏 India has the new 2023 World Archery Youth Champion. 🇮🇳🇮🇳🇮🇳#WorldArchery pic.twitter.com/rTDPYDCDBA — World Archery (@worldarchery) July 9, 2023 చదవండి: #NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు! -
Archery: మెరిసిన సురేఖ, ధీరజ్.. టాప్‌లో నిలిచి.. సత్తా చాటి..
కోల్‌కతా: ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ టోర్నీలు, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ఎంపిక చేసేందుకు నిర్వహించిన ఓపెన్ సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు బొమ్మదేవర ధీరజ్, వెన్నం జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. మంగళవారం ముగిసిన ఈ ట్రయల్స్‌లో పురుషుల రికర్వ్ విభాగంలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ధీరజ్ ఓవరాల్‌గా 2767 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. పార్థ్ సాలుంకే (మహారాష్ట్ర), జయంత తాలుక్దార్ (జార్ఖండ్), అతాను దాస్ (పీఎస్‌పీబీ), సుఖ్‌చెయిన్ సింగ్ (సర్వీసెస్), తరుణ్‌దీప్ రాయ్ (సర్వీసెస్), సుఖ్మణి (మహారాష్ట్ర), నీరజ్ చౌహాన్ వరుసగా రెండు నుంచి ఎనిమిది ర్యాంక్‌ల్లో నిలిచారు. తద్వారా ఈ ఏడాది జరిగే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే భారత జట్టులో చోటు సంపాదించేందుకు అర్హత పొందారు. మరోవైపు మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ ఓవరాల్‌గా 2828 పాయింట్లు సాధించి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. సురేఖతోపాటు పర్ణీత్ కౌర్, అదితి, ప్రగతి, సాక్షి చౌదరీ, ముస్కాన్, ఐశ్వర్య శర్మ, సృష్టి సింగ్ కూడా ఈ ఏడాది జరిగే మెగా ఈవెంట్స్‌లో పాల్గొనే టీమిండియా సెలెక్షన్స్‌కు అర్హత పొందారు. మహిళల రికర్వ్ విభాగం ట్రయల్స్‌లో ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి ఏడో ర్యాంక్‌లో నిలిచి భారత జట్టులో పునరాగమనం చేయడానికి అర్హత సాధించింది. చదవండి: IND vs NZ 1st ODI: టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ WTC- Ind Vs Aus: పిచ్‌లు అలా ఉంటే టీమిండియాదే సిరీస్.. కనీసం ఈసారైనా.. -
కీహోల్ ద్వారా.. ఆర్చరీలో అరుదైన రికార్డు..
-
కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్లో భారత్
World Cup Archery Stage 1- ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలతో కూడిన భారత జట్టు కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. టర్కీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 236–235తో బ్రిటన్ జట్టును ఓడించింది. మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో ముస్కాన్, అవ్నీత్, ప్రియా గుర్జర్లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 233–235తో టర్కీ జట్టు చేతిలో ఓడింది. హర్‌ప్రీత్ సింగ్‌కు కాంస్య పతకం Asian Senior Wrestling Championship- Harpreet Singh And Sachin Wins Bronze: మంగోలియాలో జరుగుతున్న ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు హర్‌ప్రీత్ సింగ్ (82 కేజీలు), సచిన్ సెహ్రావత్ (67 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. కాంస్య పతక పోరులో హర్‌ప్రీత్‌తో తలపడాల్సిన ఖతర్ రెజ్లర్ జఫర్ ఖాన్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో హర్‌ప్రీత్‌ను విజేతగా ప్రకటించారు. ఆసియా పోటీల్లో హర్‌ప్రీత్‌కిది ఐదో పతకం. మరో కాంస్య పతక బౌట్లో మహమూద్ (ఉజ్బెకిస్తాన్)పై సచిన్ గెలిచాడు. చదవండి: SPL 2022 AP: హోరాహోరీ.. చివరి బంతికి విజయం.. బైరెడ్డి అభినందనలు -
ఆసియా ఆర్చరీలో గోల్డ్‌మెడల్ సాధించిన ఆంధ్రా అమ్మాయి..
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. మహిళల కాంపౌండ్ విభాగంలో గురువారం జరిగిన ఫైనల్లో సురేఖ 146–145తో కొరియా ఆర్చర్ యూహ్యూన్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకాన్ని అందుకుంది. తొలి నాలుగు సెట్లు పూర్తయ్యేసరికి సురేఖ 118–116తో యూహ్యూన్‌పై రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి సెట్లోని మూడు బాణాలకు సురేఖ వరుసగా 10, 9, 9 పాయింట్లు స్కోరు చేయగా... యూహ్యూన్ 10, 9, 10 స్కోరు చేసింది. ఫలితంగా సురేఖ పాయింట్ తేడాతో గెలుపొంది స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది. అయితే ఆఖర్లో కొరియా కోచ్ మ్యాచ్ జడ్జితో వాదనకు దిగాడు. యూహ్యూన్ వేసిన ఐదో సెట్ రెండో బాణం 10 పాయింట్ల సర్కిల్ గీతకు మిల్లీ మీటర్ తేడాతో బయటి వైపు గుచ్చుకుంది. దీనికి జడ్జి 9 పాయింట్లు కేటాయించగా... 10 పాయింట్లు ఇవ్వాల్సిందిగా కొరియా కోచ్ కాసేపు వాదించాడు. బాణాన్ని పలు మార్లు పరిశీలించిన జడ్జి... దానికి 9 పాయింట్లనే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో సురేఖకు గెలుపు ఖాయమైంది. పురుషుల కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ రజతాన్ని సాధించాడు. ఫైనల్లో అతడు 148–149తో కిమ్ జోంగ్‌హూ (కొరియా) చేతిలో ఓడాడు. కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో సురేఖ– రిషభ్ యాదవ్ (భారత్) జంట 154–155తో కిమ్ యున్హీ–చోయ్ యాంగ్‌హీ (కొరియా) ద్వయం చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందింది. చదవండి: IND vs NZ: రెండో టి20ని వాయిదా వేయండి.. హైకోర్టులో పిల్ దాఖలు -
భారత పురుషుల ఆర్చరీ జట్టుకు కాంస్యం
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఢాకాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల జట్టు కాంస్య పతకం నెగ్గగా... మహిళల జట్టు ఓడిపోయింది. అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రిషభ్ యాదవ్‌లతో కూడిన భారత జట్టు 235–223తో బంగ్లాదేశ్‌ను ఓడించి కాంస్యం నెగ్గింది. భారత మహిళల జట్టు కాంస్య పతక పోరులో 208–220తో కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడింది. -
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్ మిక్స్డ్ ఫైనల్లో సురేఖ జంట..
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కాంపౌడ్ మిక్స్డ్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ-రిషభ్ యాదవ్ (భారత్) జంట 156-154తో రొక్సానా-ఖిరిస్టిచ్ (కజకిస్తాన్) జోడీపై గెలిచింది. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగం సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, ప్రియాలతో కూడిన భారత జట్టు 220-227తో ఇరాన్ జట్టు చేతిలో ఓడిపోయింది. చదవండి: Indonesia Masters Open: సింధు శుభారంభం.. -
Vennam Jyothi Surekha: ఆసియా ఆర్చరీ పోటీలకు జ్యోతి సురేఖ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మేటి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఆరోసారి ఆసియా సీనియర్ ఆర్చరీ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీ నవంబర్ 11 నుంచి 19 వరకు ఢాకాలో జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత మహిళల కాంపౌండ్ విభాగం జట్టును జంషెడ్ పూర్లో నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్ ఆధారంగా ఎంపిక చేశారు. ఈ ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ ర్యాంకింగ్ రౌండ్లో 720 పాయింట్లకుగాను 709 పాయింట్లు స్కోరు చేసింది. రౌండ్ రాబిన్ ఈవెంట్లో ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో నెగ్గి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు తరఫున బరి లోకి దిగిన విజయవాడకు చెందిన జ్యోతి సురేఖకిది ఆరో ఆసియా చాంపియన్‌షిప్ కానుంది. గతంలో ఆమె ఐదుసార్లు ఈ ఈవెంట్లో పాల్గొని ఎనిమిది పతకాలను సాధించింది. చదవండి: Virat Kohli: కెప్టెన్‌గా ఇదే చివరిసారి.. అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం -
రెండు స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ జ్యోతి; హాకీలో అవార్డులన్నీ మనకే!
Jyothi Surekha Vennam Won 2 Gold Medals: జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రపదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. ఆమె కాంపౌండ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో, ఒలింపిక్ రౌండ్లో విజేతగా నిలిచింది. ర్యాంకింగ్ రౌండ్లో సురేఖ 704 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఒలింపిక్ రౌండ్ ఫైనల్లో సురేఖ 150–146తో ముస్కాన్ (మధ్యప్రదేశ్)పై గెలిచింది. హాకీలో అవార్డులన్నీ మనకే లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఓటింగ్ పద్ధతిలో భారత క్రీడాకారులే అన్ని అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. చిత్రంగా ఆటగాళ్లే కాదు కోచ్ అవార్డులు కూడా మన జట్ల కోచ్‌లకే రావడం మరో విశేషం. భారత పురుషులు, మహిళల జట్లకు చెందిన ఆరుగురు క్రీడాకారులు, హెడ్ కోచ్‌లు ఎఫ్ఐహెచ్ అత్యుత్తమ పురస్కారాలు దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళల విభాగంలో గుర్జీత్ కౌర్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులకు ఎంపికయ్యారు. పురుషుల విభాగంలో పీఆర్ శ్రీజేశ్... మహిళల విభాగంలో సవితా పూనియా ‘ఉత్తమ గోల్‌కీపర్’ ట్రోఫీలు గెలుచుకున్నారు. ‘బెస్ట్ రైజింగ్ స్టార్’లుగా పురుషుల విభాగంలో వివేక్ సాగర్... మహిళల విభాగంలో షర్మిలా దేవి విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో ఉత్తమ కోచ్‌గా రీడ్... మహిళల విభాగంలో ఉత్తమ కోచ్‌గా జోయెర్డ్ మరీన్ ఎంపికయ్యారు. ►79 దేశాలకు చెందిన హాకీ సమాఖ్యలు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. సుమారు మూడు లక్షల మంది అభిమానులు కూడా ఈ ఓటింగ్‌లో పాలుపంచుకున్నట్లు ఎఫ్ఐహెచ్ తెలిపింది. ►ఆగస్టు 23న మొదలైన ఓటింగ్ ప్రక్రియ గత నెల 15న ముగిసింది. మొత్తం 100 శాతంలో హాకీ జట్ల కోచ్‌లు, కెపె్టన్లకు 50 శాతం ఓటింగ్ కోటా ఉండగా... 25 శాతం ఆటగాళ్లు, అభిమానులు వేసుకోవచ్చు. మిగతా 25 శాతం మీడియాకు కేటాయించారు. ►అయితే ఓటింగ్ విధానంపై టోక్యో ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ చాంపియన్ బెల్జియం హాకీ జట్టు ఆక్షేపించింది. పారదర్శకంగాలేదని ఓటింగ్ పద్ధతిని తప్పుబట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. చదవండి: Anshu Malik: తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు కొత్త రికార్డు! -
స్వర్ణ సురేఖ
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): అంతర్జాతీయస్థాయిలో ఈ ఏడాది ఆద్యంతం నిలకడగా రాణించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన ఖాతాలో మరో గొప్ప ఘనత జమ చేసుకుంది. ప్రతిష్టాత్మక ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ విభాగం మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మతో కలిసి జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖఅభిషేక్ వర్మ (భారత్) జంట 158151 పాయింట్ల తేడాతో యి సువాన్ చెన్చియె లున్ చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. ఫైనల్లో ఒక్కో జోడీకి లక్ష్యంవైపు 16 బాణాల చొప్పున అవకాశం ఇచ్చారు. విజయవాడకు చెందిన 23 ఏళ్ల జ్యోతి సురేఖ తాను సంధించిన ఎనిమిది బాణాలకు గరిష్టంగా లభించే 80 పాయింట్లను సాధించడం విశేషం. ఆమె సంధించిన ఎనిమిది బాణాలూ 10 పాయింట్ల వృత్తంలోకి వెళ్లాయి. అభిషేక్ వర్మ 80 పాయింట్లకుగాను 78 పాయింట్లు స్కోరు చేశాడు. ‘ఆసియా చాంపియన్‌షిప్‌లో ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. గాలి బాగా వీస్తున్నా స్వర్ణం నెగ్గే ఆఖరి అవకాశాన్ని వదులుకోలేదు’ అని సురేఖ వ్యాఖ్యానించింది. అంతకుముందు జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్లతో కూడిన భారత బృందం రజత పతకాన్ని గెల్చుకుంది. ఫైనల్లో భారత జట్టు 215231తో చెవన్ సో, యున్ సూ సాంగ్, డేయోంగ్ సియోల్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, మోహన్ భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టుకు కూడా రజతం లభించింది. ఫైనల్లో భారత జట్టు 232233తో కేవలం పాయింట్ తేడాతో జేవన్ యాంగ్, యోంగ్హి చోయ్, యున్ క్యు చోయ్లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో పరాజయం పాలైంది. బుధ వారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో కలిపి భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు లభించాయి. గురువారం ఇదే వేదికపై టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. 2: కాంపౌండ్ విభాగంలో ఇప్పటివరకు పది ఆసియా చాంపియన్‌షిప్‌లు జరిగాయి. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ జంట స్వర్ణం నెగ్గడం ఇది రెండోసారి. 2013లో అభిషేక్ వర్మలిల్లీ చాను ద్వయం తొలి పసిడి పతకం గెలిచింది. 3: ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో జ్యోతి సురేఖ నెగ్గిన స్వర్ణాల సంఖ్య. సురేఖ 2015లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో, 2017లో మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో పసిడి పతకాలు సాధించింది. 30: తన ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో జ్యోతి సురేఖ సాధించిన పతకాలు. ఇందులో 4 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. -
మరో స్వర్ణంపై సురేఖ గురి
బ్యాంకాక్: మిక్స్డ్ టీమ్ విభాగంలో కనబరిచిన ప్రదర్శనను మహిళల టీమ్ విభాగంలోనూ పునరావృతం చేయడంతో... ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రెండో స్వర్ణ పతకం రేసులో నిలిచింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మతో కలిసి ఇప్పటికే ఫైనల్ చేరిన జ్యోతి సురేఖ... మంగళవారం జరిగిన మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్లతో కలిసి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ)పై నిషేధం ఉండటంతో... ఈ టోర్నీలో భారత క్రీడాకారులు ప్రపంచ ఆర్చరీ పతాకం కింద పోటీపడుతున్నారు. మహిళల టీమ్ కాంపౌండ్ సెమీఫైనల్లో సురేఖ, ముస్కాన్, ప్రియ బృందం 229–221తో సయ్యదా, ఫార్సి, అరెజులతో కూడిన ఇరాన్ జట్టును ఓడించింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 226–225తో కన్యవీ, కనోక్నాపుస్, నారెయుమోన్‌లతో కూడిన థాయ్‌లాండ్ జట్టుపై గెలిచింది. నేడు జరిగే టీమ్ ఫైనల్లో కొరియాతో భారత్ తలపడుతుంది. ఈ ఫైనల్ తర్వాత మిక్స్డ్ టీమ్ ఈవెంట్ తుది పోరులో సురేఖ–అభిõÙక్ వర్మ జంట చైనీస్ తైపీకి చెందిన యి సువాన్ చెన్–చియె లున్ చెన్ జోడీతో ఆడుతుంది. మూడు కాంస్యాలు... మంగళవారం భారత ఆర్చర్లు మూడు కాంస్య పతకాలు గెలిచారు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతక పోరులో అతాను దాస్ 6–5తో జిన్ హాయెక్ ఓ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. పురుషుల రికర్వ్ టీమ్ విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, జయంత తాలుక్దార్లతో కూడిన భారత జట్టు 6–2తో చైనాను ఓడించింది. మహిళల రికర్వ్ టీమ్ విభాగంకాంస్య పతక మ్యాచ్‌లో దీపిక కుమారి, బొంబేలా దేవి, అంకితలతో కూడిన భారత జట్టు 5–1తో జపాన్‌పై గెలిచింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిõÙక్ వర్మ, రజత్ చౌహాన్, మోహన్ భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో భారత్ 229–221తో ఇరాన్‌పై గెలిచి నేడు జరిగే ఫైనల్లో కొరియాతో పోరుకు సిద్ధమైంది. -
సురేఖకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కాంపౌండ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ మెరిసింది. పుణేలో గురువారం జరిగిన ఈ టోర్నీలో వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్లో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో సురేఖ 145–143తో త్రిషా దేబ్ (ఆర్ఎస్పీబీ)పై గెలుపొంది విజేతగా నిలిచింది. గత ఆరేళ్లలో జాతీయ చాంపియన్‌గా నిలవడం సురేఖకు ఇది నాలుగోసారి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాక్షి వేద్వాన్ కాంస్యాన్ని సాధించింది. మరోవైపు ర్యాంకింగ్ రౌండ్లో నిర్ణీత 720 పాయింట్లకు గానూ, 701 పాయింట్లు సాధించి సురేఖ రజతాన్ని గెలుచుకుంది. -
తెలంగాణ జట్టుకు స్వర్ణం
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ మినీ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు స్వర్ణ పతకం లభించింది. అమరావతిలో జరిగిన ఈ పోటీల్లో అండర్–9 కాంపౌండ్ టీమ్ విభాగంలో జయదేవ్, శారవ్ కుమార్, తనీష్, రిషికేశ్‌లతో కూడిన తెలంగాణ జట్టు 1623–1503తో ఢిల్లీ జట్టును ఓడించింది. వ్యక్తిగత విభాగంలోనూ జయదేవ్ (10 మీటర్లు, 15 మీటర్లు) రెండు స్వర్ణాలు గెలుపొందడం విశేషం. ఈ సందర్భంగా పతకాలు నెగ్గిన చిన్నారులను తెలంగాణ ఆర్చరీ సంఘం సెక్రటరీ ఇ.సంజీవ రెడ్డి, హైదరాబాద్ ఆర్చరీ సంఘం సెక్రటరీ అరవింద్ కుమార్, కోచ్ అరుణ్ కుమార్, మేనేజర్ నందకిశోర్ అభినందించారు. -
భారత జోడికి వరల్డ్ ఆర్చరీ టైటిల్
రోసారియో(అర్జెంటీనా): ప్రపంచ ఆర్చరీ యూత్ చాంపియన్ షిప్ లో భారత జోడి జెమ్సన్ నింగ్ తోజమ్-అంకితా భకత్ లు పసిడి పతకాన్ని సాధించారు. మిక్స్ డ్ టీమ్ విభాగంలో ఈ జోడి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దాంతో మొత్తం మూడు పతకాలు భారత ఖాతాలో చేరాయి. అంతకుముందు రజత, కాంస్య పతకాలను భారత్ సాధించగా, ఆపై నింగ్ తోజమ్-అంకితా భకత్ ల ద్వయం పసిడిని సాధించడం విశేషం. తద్వారా 2009, 2011 యూత్ చాంపియన్ షిప్ లలో దీపికా కుమారి వరల్డ్ టైటిల్ ను సాధించిన తరువాత ఆ ఘనతను భారత్ అందుకోవడం ఇదే ప్రథమం. పసిడి కోసం జరిగిన ఫైనల్లో భారత జోడి 6-2 తేడాతో రష్యా జోడిపై గెలిచి సత్తాచాటింది. అంతకుముందు పురుషుల ఈవెంట్ లో భాగంగా ఫైనల్లో నింగ్ తోజమ్ రన్నరప్ గా సరిపెట్టుకుని రజతకాన్ని సాధించాడు. దాంతో యూత్ చాంపియన్ షిప్ లో నింగ్ తోజమ్ సాధించిన పతకాలు రెండు కాగా, క్యాడెట్ మహిళల ఈవెంట్ ప్లే ఆఫ్ లో ఖుష్బే దయాల్, సంచితా తివారీలు కాంస్యాన్ని సాధించారు. ఇదిలా ఉంచితే, ఓవరాల్ గా వరల్డ్ ఆర్చరీ చాంపియన్ షిప్ లో భారత్ కు ఇది నాల్గో టైటిల్. గతంలో దీపికా కుమారి రెండు సార్లు విజేతగా నిలవగా, 2006లో పాల్టన్ హాన్‌సదా వరల్డ్ ఆర్చరీ టైటిల్ ను సాధించింది. కాంపౌడ్ జూనియర్ మహిళల ఈవెంట్ లో ఆమె స్వర్ణాన్ని సాధించింది. -
మంగళ్ ‘రియో’ ఆశలు సజీవం
ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ కొపెన్‌హగెన్ (డెన్మార్క్): వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత ఆర్చర్ మంగళ్ సింగ్ చంపియా ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం తొలి రౌండ్లో చంపియా 7-3తో రెజెండి జేవియర్ డానియల్ (బ్రెజిల్)పై, రెండో రౌండ్లో 7-3తో ముసయెవ్ సంజార్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. అల్వారినో గార్సియా (స్పెయిన్)తో జరిగే మూడో రౌండ్లో చంపియా విజయం సాధిస్తే వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. మరోవైపు భారత్‌కే చెందిన జయంత తాలుక్దార్, రాహుల్ బెనర్జీ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. జయంత 2-6తో జే లియోన్ (కెనడా) చేతిలో; రాహుల్ బెనర్జీ 0-6తో బోర్డ్‌మన్ (మెక్సికో) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో లక్ష్మీరాణి మాఝీ కూడా మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో థామస్ స్లోనీ (ఫ్రాన్స్)పై, రెండో రౌండ్లో వలీవా నటాలియా (ఇటలీ)పై లక్ష్మీరాణి ‘టైబ్రేక్’లో విజయం సాధించడం విశేషం. భారత్‌కే చెందిన దీపిక కుమారికి నేరుగా మూడో రౌండ్లోకి ‘బై’ లభించింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు నేరుగా మూడో రౌండ్లోకి ‘బై’ లభించింది. -
తెలంగాణ జట్టుకు రజతం
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు రికర్వ్ టీమ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. సర్వీసెస్ జట్టుకు స్వర్ణం, జార్ఖండ్ జట్టుకు కాంస్యం లభించాయి. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో ప్రణీత, ఆకుల రవళి, హేమలత, కవితలతో కూడిన తెలంగాణ జట్టు ‘టైబ్రేక్’లో 21-25 తేడాతో సర్వీసెస్ జట్టు చేతిలో ఓడింది. మినీ రికర్వ్ మిక్స్డ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో తెలంగాణ 2-6తో హర్యానా చేతిలో ఓడింది. జూనియర్ బాలుర వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఓల్గా అకాడమీ ఆర్చర్ రవి చంద్ర కాంస్య పతక పోరులో 1-7 తేడాతో తన్మయ్ (మహారాష్ట్ర) చేతిలో ఓడాడు. -
పూర్వాషాకు స్వర్ణం
జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పూర్వాషా షిండే జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటింది. విజయనగరం జిల్లాకు చెందిన ఈ క్రీడాకారిణి సబ్-జూనియర్ కాంపౌండ్ బాలికల విభాగంలో బంగారు పతకం గెలుపొందింది. గచ్చిబౌలీలోని ‘శాప్’ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బుధవారం జరిగిన బాలికల ఈవెంట్లో పూర్వాషా ఫైనల్లో వరుసగా 338 పాయింట్లు, 342 పాయింట్లు సాధించి మొత్తం 680 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకుంది. మేఘాలయాకు చెందిన పార్వతి నాయర్ 670 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. జార్ఖండ్ ఆర్చర్ మధుమిత కుమారి 665 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం చేజిక్కించుకుంది. ఈ విభాగంలో రాష్ట్రానికి చెందిన జోత్స్న (645) ఐదో స్థానంలో, గీతిక (627) ఏడో స్థానంలో నిలిచారు. కావ్య 14వ స్థానంతో నిరాశపరిచింది. అనంతరం జరిగిన సబ్-జూనియర్ రికర్వ్ బాలికల విభాగంలో ఏపీ అమ్మాయి బి. హేమలత రజతం గెలుపొందింది. ఫైనల్ రౌండ్లో ఆమె 315+311 పాయింట్లతో మొత్తం 626 స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఆరు పాయింట్ల తేడాతో కొల్లే భాగ్యశ్రీ (మహారాష్ట్ర) చేతిలో స్వర్ణ పతకం కోల్పోయింది. భాగ్యశ్రీ 318, 314 పాయింట్లతో మొత్తం 632 స్కోరుతో బంగారు పతకం గెలిచింది. జార్ఖండ్ ఆర్చర్ సులేఖ సింగ్ 615 స్కోరుతో కాంస్యం చేజిక్కించుకుంది. ఏపీ అమ్మాయి ఎన్.కవిత పాయింట్ తేడాతో కాంస్యం కోల్పోయింది. ఈమె 614 స్కోరుతో నాలుగో స్థానానికి పరిమితమైంది. మరో తెలుగమ్మాయి జి.ప్రణీత 573 స్కోరుతో 11వ స్థానంలో నిలిచింది. సబ్-జూనియర్ కాంపౌండ్, రికర్వ్ బాలుర ఈవెంట్లలో ఏపీ ఆర్చర్లు నిరాశపరిచారు. కాంపౌండ్ విభాగంలో చిరంజీవి రావు ఫైనల్ రౌండ్లో 653 స్కోరుతో ఎనిమిదో స్థానంలో, మోహన్‌కృష్ణ 626 స్కోరుతో 12వ స్థానంలో నిలిచారు. సబ్-జూనియర్ పోటీలు ముగియడంతో గురువారం జూనియర్ కాంపౌండ్, రికర్వ్ బాల బాలికల విభాగాల్లో క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. 30న ఇదే విభాగానికి సంబంధించి ఫైనల్ రౌండ్ పోటీలు నిర్వహిస్తారు.