
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కాంపౌడ్ మిక్స్‌డ్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ-రిషభ్ యాదవ్ (భారత్) జంట 156-154తో రొక్సానా-ఖిరిస్టిచ్ (కజకిస్తాన్) జోడీపై గెలిచింది. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగం సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, ప్రియాలతో కూడిన భారత జట్టు 220-227తో ఇరాన్ జట్టు చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment