కోల్‌కతా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. చైనీస్ తైపీలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం కాంపౌండ్ ఆర్చర్లు ఒక స్వర్ణం, రజతం, కాంస్యం సాధించారు. ఓవరాల్‌గా రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యంతో భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది.
మిక్స్‌డ్ డబుల్స్ టీమ్‌లో అభిషేక్ వర్మ, లిల్లీ చాను పౌనమ్ ఒక్క పాయింట్ తేడాతో ఇరాన్ జోడీని ఓడించి స్వర్ణాన్ని దక్కించుకున్నారు. వ్యక్తిగత విభాగంలో వర్మ 141-144 తేడాతో హమ్‌జే నెకోయి (ఇరాన్) చేతిలో ఓడి రజతంతో సంతృప్తి పడ్డాడు. సెమీస్‌లో ఓడిన సందీప్ కుమార్ 146-141తో చాన్‌చాయ్ వోంగ్ (థాయ్‌లాండ్)ను ఓడించి కాంస్యం సాధించాడు. నేటి (శనివారం)తో ముగిసే ఈ క్రీడల్లో రికర్వ్ విభాగంలో భారత్ బోణీ చేసే అవకాశాలున్నాయి.
భారత్‌కు మరో మూడు పతకాలు
Published Sat, Nov 2 2013 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement
Advertisement