
కలకత్తా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా మహిళా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సీబీఐ కస్టడీ ముగియడంతో నిందితునికి కట్టుదిట్టమైన భద్రత నడుమ కలకత్తాలోని సెల్డా క్రిమినల్ కోర్టు జడ్జి ముందు శుక్రవారం(ఆగస్టు23) హాజరుపరిచారు.
దీంతో కోర్టు నిందితునికి 14 రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు నిందితుడిని జైలుకు తరలించారు. ఇటీవల కలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యంత దారుణంగా లైంగికదాడి జరిపి హత్య చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment