ఆర్చర్ అభిషేక్ వర్మ, రెజ్లర్ హర్‌ప్రీత్ సింగ్
World Cup Archery Stage 1- ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్‌లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలతో కూడిన భారత జట్టు కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. టర్కీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 236–235తో బ్రిటన్ జట్టును ఓడించింది. మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో ముస్కాన్, అవ్‌నీత్, ప్రియా గుర్జర్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 233–235తో టర్కీ జట్టు చేతిలో ఓడింది.
హర్‌ప్రీత్ సింగ్‌కు కాంస్య పతకం
Asian Senior Wrestling Championship- Harpreet Singh And Sachin Wins Bronze: మంగోలియాలో జరుగుతున్న ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు హర్‌ప్రీత్ సింగ్ (82 కేజీలు), సచిన్ సెహ్రావత్ (67 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు.
కాంస్య పతక పోరులో హర్‌ప్రీత్‌తో తలపడాల్సిన ఖతర్ రెజ్లర్ జఫర్ ఖాన్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో హర్‌ప్రీత్‌ను విజేతగా ప్రకటించారు. ఆసియా పోటీల్లో హర్‌ప్రీత్‌కిది ఐదో పతకం. మరో కాంస్య పతక బౌట్‌లో మహమూద్ (ఉజ్బెకిస్తాన్)పై సచిన్ గెలిచాడు.
చదవండి: SPL 2022 AP: హోరాహోరీ.. చివరి బంతికి విజయం.. బైరెడ్డి అభినందనలు
Comments
Please login to add a commentAdd a comment