wrestling championshiop
-
వీసా తిరస్కరణ.. వరల్డ్ చాంపియన్‌షిప్‌కు భారత రెజ్లర్లు దూరం
స్పెయిన్‌లోని పొంటెవెడ్రాలో జరగనున్న అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియనషిప్‌కు 21 మంది భారతీయ రెజ్లర్లు దూరమయ్యారు. వీసా గడువు ముగియడంతో స్పెయిన్ ఎంబసీ 21 మందికి వీసాలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సోమవారం ప్రారంభమైన ఛాంపియన్షిప్ కోసం 30 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. అందులో కేవలం తొమ్మిది మందికి మాత్రమే వీసాలు మంజూరయ్యాయి. చాంపియన్‌షిప్‌కు మిస్ అయిన 21 మందిలో అండర్-20 మహిళా ప్రపంచ ఛాంపియన్ యాంటిమ్ పంఘల్ ఉండడం గమనార్హం. ''ఇంతకముందెన్నడూ ఇలా జరగలేదు. భారత ప్రభుత్వ క్లియరెన్స్‌తో పాటు ప్రపంచ పాలక సంస్థ (UWW) నుంచి ఆహ్వానం అందించినప్పటికి మా రెజ్లర్లకు వీసాలు నిరాకరించబడ్డాయి. సాధ్యమైనంత త్వరగా పాస్‌పోర్ట్‌లను విడుదల చేయమని అభ్యర్థన చేసిన తర్వాత లేఖలు తిరస్కరణకు గురయ్యాయి. ఇది నిజంగా విచిత్రం.'' అని భారత రెజ్లింగ్ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ పీటీఐకి తెలిపారు. -
కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్లో భారత్
World Cup Archery Stage 1- ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలతో కూడిన భారత జట్టు కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. టర్కీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 236–235తో బ్రిటన్ జట్టును ఓడించింది. మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో ముస్కాన్, అవ్నీత్, ప్రియా గుర్జర్లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 233–235తో టర్కీ జట్టు చేతిలో ఓడింది. హర్‌ప్రీత్ సింగ్‌కు కాంస్య పతకం Asian Senior Wrestling Championship- Harpreet Singh And Sachin Wins Bronze: మంగోలియాలో జరుగుతున్న ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు హర్‌ప్రీత్ సింగ్ (82 కేజీలు), సచిన్ సెహ్రావత్ (67 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. కాంస్య పతక పోరులో హర్‌ప్రీత్‌తో తలపడాల్సిన ఖతర్ రెజ్లర్ జఫర్ ఖాన్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో హర్‌ప్రీత్‌ను విజేతగా ప్రకటించారు. ఆసియా పోటీల్లో హర్‌ప్రీత్‌కిది ఐదో పతకం. మరో కాంస్య పతక బౌట్లో మహమూద్ (ఉజ్బెకిస్తాన్)పై సచిన్ గెలిచాడు. చదవండి: SPL 2022 AP: హోరాహోరీ.. చివరి బంతికి విజయం.. బైరెడ్డి అభినందనలు -
వీర్ తెలంగాణ కేసరి సాయికిరణ్
సాక్షి, హైదరాబాద్: తొలి వీర్ కేసరి తెలంగాణ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం నగరంలో ముగిశాయి. ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల పురుషుల 75-100 కేజీల విభాగంలో సాయి కిరణ్ విజేతగా నిలిచాడు. వీర్ తెలంగాణ కేసరి టైటిల్ అతనికి దక్కింది. 60-65 కేజీల విభాగం (జైరాం కేసరి)లో లాలా తాలిమ్కు చెందిన దేవీసింగ్ ఠాకూర్ విజేతగా నిలిచాడు. మహిళల 50-60 కేజీలో కేటగిరీలో ఆర్.శ్రీవాణి (కరీంనగర్) మొదటి స్థానంలో నిలిచింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా... ఒలింపిక్ పతక విజేత, స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.