వీర్ తెలంగాణ కేసరి సాయికిరణ్ | sai kiran winner of telangana wrestling championshiop | Sakshi

వీర్ తెలంగాణ కేసరి సాయికిరణ్

Oct 30 2016 11:36 AM | Updated on Sep 4 2017 6:46 PM

తొలి వీర్ కేసరి తెలంగాణ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం నగరంలో ముగిశాయి. ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహించారు.

సాక్షి, హైదరాబాద్: తొలి వీర్ కేసరి తెలంగాణ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం నగరంలో ముగిశాయి. ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల పురుషుల 75-100 కేజీల విభాగంలో సాయి కిరణ్ విజేతగా నిలిచాడు. వీర్ తెలంగాణ కేసరి టైటిల్ అతనికి దక్కింది. 60-65 కేజీల విభాగం (జైరాం కేసరి)లో లాలా తాలిమ్‌కు చెందిన దేవీసింగ్ ఠాకూర్ విజేతగా నిలిచాడు. మహిళల 50-60 కేజీలో కేటగిరీలో ఆర్.శ్రీవాణి (కరీంనగర్) మొదటి స్థానంలో నిలిచింది.

 

బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా... ఒలింపిక్ పతక విజేత, స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement