harpreeth singh
-
అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం.. రంజీ క్రికెటర్‌పై చీటింగ్ కేసు
ఛత్తీస్గడ్ రంజీ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న హర్‌ప్రీత్ సింగ్ భాటియాపై ఆ రాష్ట్ర పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. నకిలీ ధృవపత్రాలతో అతడు అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాడనే ఆరోపణలతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని బలోద్ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్ ప్రస్తుతం ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో ఆడిటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 2014లో భాటియా ఆకట్టుకునే ప్రదర్శనతో రంజీ జట్టులో రాణించి తద్వారా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. అయితే ఆ క్రమంలో తనకు డిగ్రీ ఉన్నదని, అందుకు సంబంధించిన మార్కుల మెమో, ఇతర ధ్రువపత్రాలను సమర్పించాడు. తాను బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ (ఝాన్సీ, మధ్యప్రదేశ్) లో బీకామ్ డిగ్రీ చదివానని, అందుకు సంబంధించిన మార్కుల షీట్ ను కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందేప్పుడు జతపరిచాడు. అయితే ప్రభుత్వ అధికారులు.. అతడి డిగ్రీ పై అనుమానాలు వచ్చి బుందేల్‌ఖండ్ యూనివర్సిటీని సంప్రదించగా అసలు బండారం బయటపడింది. భాటియా ఆ వర్సిటీలో చదవనేలేదని తేలింది. దీంతో నకిలీ పత్రాలను సమర్పించినందుకు గాను భాటియాపై ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), 467 (ఫోర్జరీ) ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పూర్తయ్యాక నేరం రుజువైతే అతడు ఉద్యోగాన్ని కోల్పోవడమే గాక జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. భారత్ తరఫున 2010లో అండర్-19 ప్రపంచకప్ ఆడిన భాటియా.. అదే ఏడాది కేకేఆర్ తరఫున ఐపీఎల్ లో ఆడాడు. 2011 లో పూణే వారియర్స్ లో, 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. కానీ పెద్దగా రాణించలేదు. ఇక ఈ ఏడాది రంజీ సీజన్ లో ఛత్తీస్గడ్ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. చదవండి: ఇలాంటి బౌలింగ్ అరుదు.. దిగ్గజ ఆటగాడు గుర్తురావడం పక్కా! -
కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్లో భారత్
World Cup Archery Stage 1- ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలతో కూడిన భారత జట్టు కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. టర్కీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 236–235తో బ్రిటన్ జట్టును ఓడించింది. మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో ముస్కాన్, అవ్నీత్, ప్రియా గుర్జర్లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 233–235తో టర్కీ జట్టు చేతిలో ఓడింది. హర్‌ప్రీత్ సింగ్‌కు కాంస్య పతకం Asian Senior Wrestling Championship- Harpreet Singh And Sachin Wins Bronze: మంగోలియాలో జరుగుతున్న ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు హర్‌ప్రీత్ సింగ్ (82 కేజీలు), సచిన్ సెహ్రావత్ (67 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. కాంస్య పతక పోరులో హర్‌ప్రీత్‌తో తలపడాల్సిన ఖతర్ రెజ్లర్ జఫర్ ఖాన్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో హర్‌ప్రీత్‌ను విజేతగా ప్రకటించారు. ఆసియా పోటీల్లో హర్‌ప్రీత్‌కిది ఐదో పతకం. మరో కాంస్య పతక బౌట్లో మహమూద్ (ఉజ్బెకిస్తాన్)పై సచిన్ గెలిచాడు. చదవండి: SPL 2022 AP: హోరాహోరీ.. చివరి బంతికి విజయం.. బైరెడ్డి అభినందనలు -
హర్‌ప్రీత్ సింగ్ డబుల్ సెంచరీ
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ భారీ స్కోరు సాధించింది. హర్‌ప్రీత్ సింగ్ (274 బంతుల్లో 216 నాటౌట్; 25 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ తో డబుల్ సెంచరీ సాధించగా..... మధ్యప్రదేశ్ 125.5 ఓవర్లలో 465 పరుగులు చేసి ఆలౌటైందిది. అంకిత్ శర్మ (61) రాణించాడు. యూపీ బౌలర్లలో ఇంతియాజ్ మూడు వికెట్లు తీయగా... కుల్దీప్, రాజ్‌పుత్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం ఉత్తరప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్సలో 47 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఏకలవ్య ద్వివేది 37 పరుగులతో, కుల్దీప్ యాదవ్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. సర్ఫరాజ్ ఖాన్ (17) నిరాశపరచగా... పీయూష్ చావ్లా 22 పరుగులు చేశాడు. కెప్టెన్ రైనా ఇంకా బ్యాటింగ్‌కు దిగకపోవడం విశేషం. ఎంపీ బౌలర్ గౌరవ్ యాదవ్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.