హర్‌ప్రీత్ సింగ్ డబుల్ సెంచరీ | harpreeth singh unbeaten double century to guide madhyapradesh big lead | Sakshi
Sakshi News home page

హర్‌ప్రీత్ సింగ్ డబుల్ సెంచరీ

Published Sat, Oct 8 2016 10:26 AM | Last Updated on Mon, Oct 8 2018 3:28 PM

హర్‌ప్రీత్ సింగ్ డబుల్ సెంచరీ - Sakshi

హర్‌ప్రీత్ సింగ్ డబుల్ సెంచరీ

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ భారీ స్కోరు సాధించింది. హర్‌ప్రీత్ సింగ్ (274 బంతుల్లో 216 నాటౌట్; 25 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ తో డబుల్ సెంచరీ సాధించగా..... మధ్యప్రదేశ్ 125.5 ఓవర్లలో 465 పరుగులు చేసి ఆలౌటైందిది. అంకిత్ శర్మ (61) రాణించాడు. యూపీ బౌలర్లలో ఇంతియాజ్ మూడు వికెట్లు తీయగా... కుల్‌దీప్, రాజ్‌పుత్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

 

అనంతరం ఉత్తరప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 47 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఏకలవ్య ద్వివేది 37 పరుగులతో, కుల్‌దీప్ యాదవ్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. సర్ఫరాజ్ ఖాన్ (17) నిరాశపరచగా... పీయూష్ చావ్లా 22 పరుగులు చేశాడు. కెప్టెన్ రైనా ఇంకా బ్యాటింగ్‌కు దిగకపోవడం విశేషం. ఎంపీ బౌలర్ గౌరవ్ యాదవ్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement