
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, ధీరజ్ బొమ్మదేవర ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బ్యాంకాక్‌లో మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం రెండో రౌండ్‌లో సురేఖ 144–141తో ప్రతుమ్‌సువన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం రెండో రౌండ్‌లో ధీరజ్ 6–4తో తై యు సువాన్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment