
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కాంపౌండ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ మెరిసింది. పుణేలో గురువారం జరిగిన ఈ టోర్నీలో వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో సురేఖ 145–143తో త్రిషా దేబ్ (ఆర్‌ఎస్‌పీబీ)పై గెలుపొంది విజేతగా నిలిచింది.
గత ఆరేళ్లలో జాతీయ చాంపియన్‌గా నిలవడం సురేఖకు ఇది నాలుగోసారి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాక్షి వేద్వాన్ కాంస్యాన్ని సాధించింది. మరోవైపు ర్యాంకింగ్ రౌండ్‌లో నిర్ణీత 720 పాయింట్లకు గానూ, 701 పాయింట్లు సాధించి సురేఖ రజతాన్ని గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment