
కొత్త ఏడాదిని భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో మొదలుపెట్టింది. ఫ్రాన్స్‌లో శనివారం జరిగిన నాంటెస్ మెట్రోపోల్ వరల్డ్ అథ్లెటిక్స్ కేటగిరీ ‘సి’ మీట్‌లో జ్యోతి యర్రాజీ 60 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచింది.
ఫైనల్ రేసును జ్యోతి 8.04 సెకన్లలో ముగించి తన అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసింది. హీట్స్‌లో 8.07 సమయం నమోదు చేసిన జ్యోతి ఫైనల్‌కు అర్హత సాధించింది. కాగా జ్యోతీ యార్రాజీని కేంద్రం ఇటీవలే అర్జున అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment