జ్యోతి యర్రాజీ (ఫైల్ ఫొటో)
బెంగళూరు: ఇండియన్ గ్రాండ్‌ప్రి మీట్‌లో ఆంధ్రప్రదేశ్ మహిళా అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం సాధించింది. బెంగళూరులో సోమవారం జరిగిన ఈ మీట్‌లో జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచింది.
వైజాగ్‌కు చెందిన జ్యోతి అందరికంటే వేగంగా 13.44 సెకన్లలో గమ్యానికి చేరింది. తెలంగాణకు చెందిన అగసార నందిని కాంస్య పతకం గెలిచింది. నందిని 13.85 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది.
ఇది కూడా చదవండి: బోపన్న జోడీ శుభారంభం
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. మొనాకోలో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 3–6, 6–3, 10–8తో రాఫెల్ మటోస్ (బ్రెజిల్)–డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జంటపై విజయం సాధించింది.
80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్ ఎనిమిది ఏస్‌లు సంధించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో కెవిన్ క్రావిట్జ్–టిమ్ ప్యూట్జ్ (జర్మనీ)లతో బోపన్న, ఎబ్డెన్ తలపడతారు.
చదవండి: IPL 2023: ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం! ‘ఆవేశ్’ ఖాన్‌కు ఊహించని షాక్!
IPL 2023: కాస్త హుందాగా ప్రవర్తించు గంభీర్! మీకు మా కోహ్లి చేతిలో ఉందిలే!
ఏంటి రాహుల్ భయ్యా ఇది..? ఓహో టెస్లుల్లా ఆడుతున్నందుకేనా.. 17 కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment