Athlete Jyothi Yarraji From Andhra Pradesh Win Gold At Kurpfalz Gala Event - Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ వేదికపై స్వర్ణంతో మెరిసిన ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి

Published Mon, May 29 2023 7:14 AM | Last Updated on Mon, May 29 2023 10:23 AM

Andhra Pradesh Athlete Jyothi Yarraji Win Gold At Kurpfalz Gala Event - Sakshi

కుర్ప్‌ఫాల్జ్‌ గాలా ఈవెంట్‌ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో మెరిసింది. జర్మనీలో జరిగిన ఈ మీట్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచింది.

జ్యోతి 12.84 సెకన్లలో గమ్యానికి చేరి తన కెరీర్‌లో రెండో అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో జ్యోతికిదే తొలి అంతర్జాతీయ పతకం. గత ఏడాది జ్యోతి 12.82 సెకన్లతో జాతీయ రికార్డు నెలకొల్పింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement