
సాక్షి,విశాఖపట్నం: సినీ తరహాలో జరిగిన దారుణ హత్య విశాఖపట్నంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కాలికి బరువైన బండరాయి కట్టేసిన ఓ వ్యక్తిని సముద్రంలో పడేసి హత్య చేశారు. ఫిషింగ్ హార్బర్ జెట్టి నంబర్ 10 వద్ద మృతదేహం సముద్రంలో తేలుతూ కనిపించింది.
పోలీసులు మృతదేహాన్ని మంగళవారం(నవంబర్ 26) బయటికి తీశారు.మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది.ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అనారోగ్యంతో భార్యాభర్తల ఆత్మహత్య