Fishing Harbour
-
ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం.. 30 బోట్లు దగ్ధం
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పారాదీప్ ఫిషింగ్ హార్బర్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 30 ఫిషింగ్ బోట్లు దగ్థం.. కోట్లలో ఆస్తి నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
సినీ ఫక్కీలో హత్య.. ఫిషింగ్ హార్బర్లో మృతదేహం
సాక్షి,విశాఖపట్నం: సినీ తరహాలో జరిగిన దారుణ హత్య విశాఖపట్నంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కాలికి బరువైన బండరాయి కట్టేసిన ఓ వ్యక్తిని సముద్రంలో పడేసి హత్య చేశారు. ఫిషింగ్ హార్బర్ జెట్టి నంబర్ 10 వద్ద మృతదేహం సముద్రంలో తేలుతూ కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని మంగళవారం(నవంబర్ 26) బయటికి తీశారు.మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది.ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: అనారోగ్యంతో భార్యాభర్తల ఆత్మహత్య -
‘జువ్వలదిన్నె’ ప్రారంభం.. జగన్ కల సాకారం
సాక్షి, అమరావతి/నెల్లూరు (దర్గామిట్ట)/తుమ్మపాల(అనకాపల్లి) : రాష్ట్రవ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.8 లక్షల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సుమారు రూ.3,500 కోట్లతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ హ్యాండ్లింగ్ సెంటర్లలోని మొట్టమొదటిదైన జువ్వలదిన్నె హార్బర్ మత్స్యకారులకు అందుబాటులోకి వచ్చిం ది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో రూ.288.8 కోట్ల వ్యయంతో 76.89 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర పాలఘర్ నుంచి శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో.. ఇప్పటివరకూ పొట్టకూటి కోసం కూలీలుగా పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఇప్పుడు ఇక్కడే అధునాతన మెకనైజ్డ్ బోట్లతో చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఈ హార్బర్ ప్రారంభంతోపాటు అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద రూ.392.58 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఫిషింగ్ హార్బరుకూ ప్రధాని వర్చువల్‌గానే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ నెల్లూరు కలెక్టరేట్ నుంచి.. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులూ అనకాపల్లి నుంచి పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌తో వాయిదా..రాష్ట్రంలో మొత్తం పది ఫిషింగ్ హార్బర్లలో తొలిదశలో రూ.1,204.56 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల నిర్మాణాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. ఇందులో తొలుత జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తికాగా గత ప్రభుత్వ హయాంలో దీన్ని వర్చువల్‌గా అప్పటి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు ప్రయత్నించారు. కానీ, ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును నేరుగా మత్స్యకారులతో కలిసి ప్రారంభిస్తానంటూ ఆయన వాయిదా వేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు ప్రధాని 13 రాష్ట్రాలకు చెందిన రూ.1,200 కోట్ల విలువైన 217 మత్స్యకార ప్రాజెక్టులను శుక్రవారం ప్రారంభించగా ఇందులో ‘జువ్వలదిన్నె’ ఒకటి. 25వేల కుటుంబాలకు లబ్ది.. ప్రధాని ప్రారంభించిన జువ్వలదిన్నె ప్రాజెక్టు ద్వారా 25,000మత్స్యకార కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేలా ఈ హార్బరును అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ హర్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి రానుంది. హార్బర్‌లోనే కోల్డ్‌చైన్, ఐస్‌ప్లాంటు, చిల్రూం వంటి మౌలిక వసతులతో పాటు బోట్ రిపేర్ వర్క్‌షాపులు, గేర్òÙడ్లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే, నిర్మాణ పనులు ప్రారంభించిన పూడిమడక హార్బరు ద్వారా 980 బోట్లు నిలుపుకునే వెసులుబాటుతో పాటు 4,870 మంది మత్స్యకార కుటుంబాలు లబ్దిపొందనున్నాయి. మరోవైపు.. రాష్ట్రంలో తలపెట్టిన పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్‌ల్యాండ్ సెంటర్లు పూర్తిగా అందుబాటులోకి వస్తే మొత్తం 6.8 లక్షల మంది మత్స్యకారులు లబి్ధపొందనున్నారు. వీటి ద్వారా 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునే సామర్థ్యంతో పాటు 4.5 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపద సమకూరనుంది. తద్వారా రాష్ట్ర జీడీపీకి రూ.9,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.ఎక్కడ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నెపనులు ప్రారంభం : 2021 మార్చి 19నఖర్చు : 288.8 కోట్లుపనులు పూర్తి : 2024 ఎన్నికలకు ముందు.. ఎన్నికల కోడ్‌తో ప్రారంభం వాయిదాఈ హార్బర్‌తో ఉపయోగం : ఏటా 41,250 టన్నుల మత్స్య సంపదతో పాటు 25,000మత్స్యకార కుటుంబాలకు లబ్ధిప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగామత్స్యకారుల కష్టాలు స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తీరంపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రణాళిక రూపొందించారు.మొత్తంప్రణాళిక లక్ష్యం 10 ఫిషింగ్ హార్బర్లు , 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుఎంత మందికి లబ్ధి : 555 తీరప్రాంత మత్య్సకార గ్రామాల్లో దాదాపు 6.8 లక్షల మంది మత్స్యకారులకు మేలు మొత్తం అంచనా వ్యయం రూ.3,500 కోట్లుతొలివిడతలో పనులుప్రారంభమైనవి: జువ్వలదిన్నె, నిజాంపట్నం,మచిలీపట్నం, ఉప్పాడవీటి అంచనా విలువరూ.1,204.56 కోట్లు -
ఇదిగో ఉప్పాడ హార్బర్.. ఎల్లో మీడియా తల ఎక్కడ పెట్టుకుంటుంది ?
-
తీరంలో లంగరు... భవిష్యత్తు బంగరు
సాగరమంటేనే జలనిధి...అపార మత్స్య సంపదకు పెన్నిధి... సాగర తీరాన వెలసిన రాజధానులు ఆయా రాష్ట్రాలకు ఆర్థిక సుసంపన్నతను సమకూర్చాయి..మత్స్యకారుల జీవనప్రమాణాలను పెంచాయి...వారి జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపాయి..పరిశ్రమల స్థాపనకు పునాదులు వేశాయి...ఆయా రాష్ట్రాల ఆర్థిక రూపురేఖలను మార్చేశాయి...ఈ ఆలోచనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నాన్ని పాలనారాజధానిగా చేయాలన్న గొప్ప సంకల్పానికి ప్రేరేపించింది...ఇప్పటిదాకా మనం గొప్పగా చెప్పడానికి విశాఖపట్నంలోని పోర్టు ఒక్కటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగంలో కనిపిస్తోంది... దేశంలోనే సుదీర్ఘ తీరమున్న రెండో రాష్ట్రంగా గుర్తింపు పొందీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు చాలా అవకాశమున్నా ...పాలించడం చేతకాని పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలన వల్ల వాటి ఏర్పాటు సాధ్యం కాలేదు...సీఎంగా జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఆలోచించడం వల్లే ఈ రోజు నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు్ల రాష్ట్రానికి అపార సంపదనివ్వబోతున్నాయి...మత్స్యకారుల ఆర్థిక స్తోమతను పెంచబోతున్నాయి...మరెన్నో పరిశ్రమల స్థాపనకు ఈ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వేదికలు కాబోతున్నాయి... రాష్ట్ర పురోగమనానికి ఇలాంటి ఆలోచన ఉన్న నేతలు ఉంటేనే నలుచెరగులా ప్రగతి లంగరు వేస్తుంది... సీఎం జగన్ రూపంలో రాష్ట్రానికి బంగరు భవిష్యత్తు అద్దుకుంటోంది. – చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి, అమరావతి పది ఫిషింగ్ హార్బర్లు...రాష్ట్రంలోని మత్స్యకారుల సుదీర్ఘ కల సాకారమవుతోంది. ఇంతకాలం వలస కూలీలుగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లే మత్స్యకారులు ఇప్పుడు అధునాతన మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకుని చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మత్స్యకారులకు ప్రయోజనం కలి్పంచే విధంగా పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేవన్న విషయాన్ని మత్స్యకారులు ఆయన దృష్టికి తెచ్చారు.రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందంటూ మత్స్యకారులు వాపోయారు. తాను ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలోని వీరికి స్థానికంగానే ఉపాధి కల్పించే విధంగా ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హమీ మేరకు రూ.3,66.07 కోట్లతో రెండు దశల్లో పది ఫిషింగ్ హార్బర్లను, రూ.126.91 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దేశాన్ని సుసంపన్నం చేయడంలో జలధి ప్రాధాన్యం ఎనలేనిదని చైనా, సింగపూర్ వంటి దేశాలు ఏనాడో గుర్తించాయి. ఈ సత్యాన్ని గుర్తించే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టించడంలో పోర్టులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అత్యంత రద్డీ ఉండే ఓడరేవుగా సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా , టాప్ 15 పోర్టుల్లో 8కి పైగా పోర్టులు ఒక్క చైనాలోనే ఉన్నాయి. మన దేశంలో చెన్నై, కోల్‌కతా, ముంబైలు మెట్రోపాలిటన్ నగరాలుగా మారడంలో పోర్టులు కీలకపాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.దేశంలోనే రెండో అత్యంత పొడవైన 974 కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త మహానగరాలుగా సృష్టించుకునే అవకాశమున్నప్పటికీ, ఆ దిశగా 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏరోజూ పట్టించుకోలేదు. అసలు ఆ ఆలోచనే ఆయనకు లేదు. 2019లో ఎన్నికల ముందు ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం ప్రచారం కోసం టెంకాయలు కొట్టి చేతులు దులిపేసుకున్నాడాయన. దీనికి భిన్నంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు... ప్రతీ 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు (మినీ పోర్టు)లు, ఫిష్‌ల్యాండ్ సెంటర్లను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులతో పాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టి రికార్డు సృష్టించింది. వీటికోసం సుమారు రూ.25,000 కోట్ల వ్యయం చేస్తుండటం అద్భుతం. రూ.3,736.14 కోట్ల వ్యయంతో రామాయపట్నం, రూ.5,155.73 కోట్లతో మచిలీపట్నం, రూ.4,361.91 కోట్లతో మూలపేట పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా, పీపీపీ విధానంలో కాకినాడ సెజ్‌లో గేట్‌వే పోర్టును రూ.2,123.43 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు.రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కేంద్ర కస్టమ్స్ శాఖ నుంచి అనుమతులు రాగానే తొలి నౌకను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ, రవ్వ క్యాప్టివ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులు ఉండగా, 2025 నాటికి రాష్ట్రంలో పోర్టుల సంఖ్యను 10కి పెంచాలని జగన్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.వాణిజ్య ఎగుమతుల్లో 5వ స్థానంలో రాష్ట్రం... వాణిజ్య ఎగుమతులను పెంచడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. 2019లో దేశ వాణిజ్య ఎగుమతుల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఐదేళ్లలో తీసుకున్న చర్యలతో ఐదో స్థానానికి చేరింది. 2019లో కేవలం రూ.90,000 కోట్లుగా ఉన్న వాణిజ్య ఎగుమతుల విలువ 2023–24 నాటికి రూ.1.60 లక్షల కోట్లకు పెరిగిందిపోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు... పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. కేవలం పోర్టులను నిర్మించడమే కాకుండా పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని వేశారు.ఈ క్రమంలో తొలుత అందుబాటులోకి వస్తున్న పోర్టుకు సమీపంలో సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కుతో పాటు తెట్టు వద్ద కార్గో ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. తొలి దశలో 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయనుండగా, దీనికోసం గుడ్లూరు మండలం చేవూరులో 1312.58 ఎకరాలు, రావూరులో 951.77 ఎకరాల భూ సేకరణకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిషింగ్ హార్బర్ల వద్ద ప్రాసెసింగ్ యూనిట్లు... ఫిషింగ్ హార్బర్ల సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రగతి ఫలితంగా ప్రస్తుతం 150 మిలియన్ టన్నులుగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల సామర్థ్యం 300 మిలియన్ టన్నులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పోర్టుల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి లభించనుండటంతో పాటు వ్యాట్, జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది. రామాయపట్నం సమీపానే ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు.... రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండోసోల్ రూ.25,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న భారీ సోలార్ ఉపకరణాల తయారీ యూనిట్ తొలి దశ పనులను పూర్తి చేసుకుని ఈ మధ్యే ఉత్పత్తిని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని సీఎం జగన్ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2030 నాటికి 10 శాతం మార్కెట్ వాటాతో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఫిషింగ్ హార్బరు లేకపోవడం వల్ల బోట్లను ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమయ్యేది. అమావాస్య, పౌర్ణమి సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ సమయంలో ఈ ఇబ్బంది మరింత అధికంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బోట్లు తీరానికి తగలడం వల్ల పగిలిపోయేవి. ఇప్పుడు మచిలీపట్నంలో అత్యాధునిక వసతులతో హార్బర్ నిర్మిస్తుండటంతో బోట్లను సురక్షితంగా నిలబెట్టుకోవచ్చు. –పైకం ఆంజనేయులు, ఫైబర్ బోట్ల యజమానుల సంఘం, మచిలీపట్నంనిన్నటిదాకా కూలీలం... ఇకపై యజమానులవుతాం.రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో నెల్లూ రు, ప్రకాశం జిల్లా తీరప్రాంత మత్స్యకారులు ఇన్నాళ్లూ చెన్నై, మంగళూరు ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా పనిచేసుకునేవాళ్లం. ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తుండటంతో అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకుని యజమానులుగా మారే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలి్పంచింది. ఫిషింగ్ హార్బరు, దీనికి అనుబంధంగా వచ్చే పరిశ్రమల వల్ల ఒక్క జువ్వలదిన్నెలోనే 15,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. తుపాన్లు వచ్చినా తట్టుకునే విధంగా జువ్వలదిన్నె హార్బర్‌ను నిర్మిస్తున్నారు. – కొండూరు అనిల్ బాబు, చైర్మన్, ఏపీ ఫిషరీస్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) మినీపోర్టు స్థాయిలో నిర్మాణం ఇప్పటి వరకు బోట్లు నిలపడానికే సరైన సదుపాయాల్లేక ఐదారుచోట్ల ఆపేలా నానా అవస్థలు పడుతుండేవాళ్లం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తే మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలపడం నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు...ఇలా అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి.దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50,000 మత్స్యకార ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. –ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్, ఉప్పాడ రామాయపట్నం► ప్రాజెక్టు వ్యయంరూ.3,736.14 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం 34.04 ఎంఎంటీపీఏ ►పూర్తిస్థాయి సామర్థ్యం138.54 టన్నులు ►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీపనులు ప్రారంభించిన తేదీ జూన్ 24, 2022 కార్యకలాపాల ప్రారంభం జనవరి, 2024 మచిలీపట్నం ►ప్రాజెక్టు వ్యయం రూ.5,156 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం 35 ఎంఎంటీపీఏ►పూర్తిస్థాయి సామర్థ్యం 116 టన్నులు ►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 21, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 మూలపేట ►ప్రాజెక్టు వ్యయం : రూ.4,361.91 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం23.50 ఎంఎంటీపీఏ ►పూర్తిస్థాయి సామర్థ్యం: 83.30 టన్నులు ► తొలి దశలో బెర్తులు: నాలుగు రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం1,20,000డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 18, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 కాకినాడ గేట్ వే►ప్రాజెక్టు వ్యయం : రూ.2,123.43 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం16 ఎంఎంటీపీఏ► తొలి దశలో బెర్తులు: నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి క్రాఫ్ట్ బెర్త్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 1,20,000 డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ నవంబర్ 20, 2021 కార్యకలాపాల ప్రారంభం నవంబర్, 2024 -
ప్రగతి గోదావరి
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం: పైరు పచ్చని సీమ ఉమ్మడి పశ్చిమగోదావరి ప్రగతి బాటన పరవళ్లు తొక్కుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అద్భుత అభివృద్ధి సాధించింది. ఆక్వా వర్సిటీ, మెడికల్ కళాశాలలు, ఫిషింగ్ హార్బర్, వాటర్‌గ్రిడ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులెన్నో పశ్చిమ ముంగిట వాలాయి. పోలవరం ప్రాజెక్టు పనులు గాడిన పడ్డాయి. జిల్లా పునర్వి భజనతో ఏలూరు జిల్లా కొత్తగా ఆవిర్భవించింది. ఫలితంగా పాలన పల్లె ముంగిటకు చేరింది. ఆణి‘మత్స్యం’.. ఆక్వా వర్సిటీ తీరంలో మత్స్య ఎగుమతులు, మత్స్యసాగులో శాస్త్రీయ పద్ధతులు పెంచేందుకు నరసాపురం మండలం సరిపల్లి వద్ద మత్స్య యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.332 కోట్లతో 40 ఎకరాల స్థలంలో యూనివర్సిటీ పరిపాలన భవనం, హాస్టళ్లు, వీసీ చాంబర్ పనులు చేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో మరో రూ.400 కోట్లు యూనివర్సిటీకి ఖర్చు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి లక్ష్మణేశ్వరం గ్రామంలో తుఫాన్ రక్షిత భవనంలో ఆక్వా కోర్సులు ప్రారంభించారు. బియ్యపుతిప్ప వద్ద రూ. 430 కోట్లతో ఫిషింగ్ హార్బర్, రూ.490 కోట్లతో వశిష్టగోదావరి వంతెన, అంబేడ్కర్ కోనసీమ జిల్లా విజ్జేశ్వరం నుంచి నరసాపురం వరకు రూ. 1400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు పట్టాలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. సహజసిద్ధ ప్రవాహం మళ్లింపు పోలవరం ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా గాడిలో పెట్టి కరోనా కష్టకాలంలోనూ పనులు వేగంగా సాగేలా చేశారు. ప్రధా నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 48 స్పిల్ వే గేట్ల నిర్మాణం, స్పిల్ చానల్ ఎగువ, దిగువ డ్యాంలు, 2021 జనవరి 11 నాటికి పూర్తి చేసి 6.1 కిలోమీటర్ల గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. సహజసిద్ధ గోదావరి నది ప్రవాహాన్ని ఇంత భారీ ఎత్తున మళ్లించడం చరిత్రలో ఇదే ప్రథమం. తాడువాయిలో 3095 పునరావాస ఇళ్ళను ఒకేచోట మెగా టౌన్షిప్ మాదిరి రూ.488 కోట్లతో నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. ఏలూరు వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరుతోపాటు, పాలకొల్లు మండలంలో వైద్యకళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏలూరులోని వైద్య కళాశాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రూ.60 కోట్లతో అధునాతన భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆమోదంతో 2022–23 విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.525 కోట్లు. ► పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్లతో 61 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమ్మిలేరుకు ‘వాల్’జడ ఏలూరు నగరాన్ని తమ్మిలేరు ముంపు నుంచి రక్షించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. 2006లో తమ్మిలేరు ముంపుతో ఏలూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల నాని రిటైనింగ్‌వాల్ నిర్మించాలని విన్నవించారు. వెంటనే ప్రతిపాదనలు తయారు చేయించి వైఎస్సార్ అనుమతులు మంజూరు చేశారు. ఆయన మరణానంతరం పనులు నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 2019లో అంచనాలు సవరించి రూ.80 కోట్లతో ఆరు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. రెండో దశలో 2.5 కిలోమీటర్ల మేర రూ.55.50 కోట్లతో నిర్మాణం ప్రారంభించి 90 శాతానికిపైగా పూర్తి చేశారు. ఇతర అభివృద్ధి పనులు ► రూ.220 కోట్లతో నరసాపురంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, భీమవరం, యలమంచిలి, మండలాలకు ఉపయోగకరంగా రూ.113 కోట్లతో నిరి్మంచనున్న భారీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు టెండర్ దశకు చేరుకున్నాయి. ► భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో రూ.100 కోట్లతో పట్టణంలో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ► యనమదుర్రు డ్రెయిన్‌పై నిరి్మంచిన మూడు వంతెనలకు రూ.36 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా త్వరలో పనులు మొదలుకానున్నాయి. ► ఏలూరు జిల్లా చింతలపూడి– జంగారెడ్డిగూడెం మీదుగా రాజమండ్రికి అనుసంధానం చేస్తూ 72 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. జీలుగుమిల్లి– కొవ్వూరు మధ్య ఎన్‌హెచ్ 365 (బీబీ) రూ.605 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. రూ.124 కోట్ల వ్యయంతో 516 (డీ) జాతీయ రహదారిని కొయ్యలగూడెం– జీలుగుమిల్లి మధ్య అభివృద్ధి చేశారు. -
మత్స్యకారుల 20 ఏళ్ల కల సాకారం..
-
మన తీరం.. మత్స్య హారం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుడు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో సముద్ర తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు కానీ ఫిషింగ్ హార్బర్ లేదా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులను వాయువేగంతో నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. తీరం వెంట మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచామన్నారు. మనకున్న 974 కి.మీ. పొడవైన సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ బ్లూ ఎకానమీ (నీలి విప్లవం) పెంచేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వీటన్నిటివల్ల మత్స్యకారులు ఎక్కడెక్కడికో వలస వెళ్లి ఉపాధి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా సొంత రాష్ట్రంలోనే మెరుగైన జీవనోపాధి లభిస్తుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపు లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు ఐదో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున ఆర్నెళ్లకు రూ.69,000 మేర పరిహారం చెల్లిస్తూ మొత్తం రూ.161.86 కోట్లను మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటివరకు ఐదు విడతల్లో రూ.647.44 కోట్ల మేర లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూర్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. రూ.20 వేల కోట్లతో తీరంలో సదుపాయాలు మొత్తంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లతో పాటు నాలుగు పోర్టుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నాలుగు పోర్టులను దాదాపు రూ.16 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. పది ఫిషింగ్ హార్బర్లను రూ.4 వేల కోట్లతో నిర్మిస్తుండగా మరో రూ.200 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. మొత్తంగా రూ.20 వేల కోట్ల పైచిలుకు సముద్రతీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల మీద పెట్టుబడిగా పెడుతున్నాం. ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. వీటివల్ల అత్యధికంగా మత్స్యకార కుటుంబాలు బాగుపడతాయి. క్రమం తప్పకుండా ప్రతి ఆర్నెల్లకు.. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ మంచి మనసుతో ముందుకొచ్చింది. మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఎక్కడా ఆలస్యం లేకుండా ప్రతి ఆర్నెల్లకు ఒకసారి సాయం అందిస్తూ ఆదుకుంటున్నాం. క్రమం తప్పకుండా డబ్బుల విడుదల కోసం గుర్తు చేస్తున్న ఎమ్మెల్యే సతీష్ ను అభినందించాలి. ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు ఇచ్చాం. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 16,408, కాకినాడ జిల్లాలో 7,050 కుటుంబాలకు మంచి చేస్తున్నాం. బాబు సర్కారు ఆలకించలేదు.. 2012కు సంబంధించి జీఎస్పీసీ రూ.78 కోట్లు పరిహారంగా 16,554 కుటుంబాలకు చెల్లించాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. మనం అధికారంలోకి వచ్చిన మొదటి ఆర్నెళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున మత్స్యకారులకు మేలు చేస్తూ ఆ రూ.78 కోట్లను 16 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు అందచేశాం. ఆ కుటుంబాల అవసరాలను మన అవసరాలుగా భావించి వారికి తోడుగా నిలుస్తూ గొప్ప అడుగులు పడ్డాయి. ఆ తర్వాత జీఎస్పీసీని ఓఎన్జీసీ టేకోవర్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు దీని గురించి ఓఎన్జీసీ దృష్టికి తేవడంతో రెండు మూడేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బులు వచ్చాయి. అయితే ఈలోగా మత్స్యకారులకు మంచి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయలేదు. మత్స్యకారులకు రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కల్పిస్తున్నాం. 1.07 లక్షల కుటుంబాలకు వైఎస్సార్ మత్స్యకార భరోసా చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం తాపత్రయ పడుతూ అడుగులు వేశాం. 1.07 లక్షల కుటుంబాలకు ఐదేళ్లలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా రూ.538 కోట్లు సాయంగా అందించాం. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్యలో వేట నిషేధ సమయంలో వారికీ సాయాన్ని ఏటా అందించాం. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో మత్స్యకార సోదరులకు కేవలం రూ.104 కోట్లు మాత్రమే ఇచ్చారు. మనం ప్రతి ఒక్కరినీ ఈ పథకంలోకి తీసుకొచ్చి పారదర్శకంగా అందిస్తూ వచ్చాం. గతంలో రూ.4 వేలుగా ఉన్న సాయాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడం లేదు. రూ.130 కోట్లకు పైగా డీజిల్ సబ్సిడీ గతంలో డీజిల్‌పై లీటరుకు రూ.6 మాత్రమే సబ్సిడీ ఇవ్వగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.9కి పెంచాం. నాడు ఆ సబ్సిడీ ఎప్పుడిస్తారో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు డీజిల్ పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా బంకులను ఎంపిక చేసి ప్రతి మత్స్యకారుడికి గుర్తింపు కార్డు ఇచ్చాం. డీజిల్ పోయించుకున్నప్పుడే రూ.9 సబ్సిడీ ఇచ్చేలా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. డీజిల్ సబ్సిడీని వర్తింపజేసే బోట్లను కూడా పెంచాం. దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోట్లకు పైగా డీజిల్ సబ్సిడీ ఇచ్చాం. రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా వేటకు వెళ్లే మత్స్యకారులు దురదృష్టవశాత్తూ మరణిస్తే చెల్లించే ఎక్స్Šగ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం. ఘటన జరిగిన వెంటనే రూ.5 లక్షలు పరిహారంగా చెల్లిస్తూ మిగిలిన అమౌంట్‌ను ఆర్నెళ్లలోగా అందజేసే కొత్త ఒరవడి తీసుకొచ్చాం. ఇలా దాదాపు 175 కుటుంబాలకు మంచి చేస్తూ మరో రూ.17 కోట్లు అందించాం. గతంలో ఎక్స్‌గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. ఈ మూడు కార్యక్రమాలే కాకుండా డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నాం. జీఎస్పీతో మొదట రూ.78 కోట్లు, ఓఎన్జీసీతో ఐదు దఫాల్లో రూ.647 కోట్లు అందచేశాం. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నాం. 40,850 మంది లబ్ధిదారులకు మంచి చేస్తూ దాదాపు రూ.3,500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం. ఆరు కార్యక్రమాలతో రూ.4,913 కోట్లు అందించాం. ఇవికాకుండా నవరత్నాల ద్వారా అదనంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి సాయం అందిస్తున్నాం. కార్యక్రమంలో ఇంధన, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జువ్వలదిన్నెకు స్వయంగా వస్తా ‘‘ఇవాళే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రారంభించాలని తొలుత అనుకున్నా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేనే నేరుగా అక్కడకు వెళ్లి ప్రారంభించాలని నిర్ణయించా. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా మత్స్యకారులు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో తెలియచేసేందుకు నేనే స్వయంగా వెళ్లి ఆ హార్బర్‌ను ప్రారంభిస్తా. ఫిషింగ్ హార్బర్ వల్ల మత్స్యకారుల జీవితాలు మారతాయి. ఒక్కో ఫిషింగ్ హార్బర్లో ఎన్ని బోట్లు ఉంటాయి? కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలతో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందనే విషయాలు అందరికీ తెలియాలి. అందుకే అక్కడ ఇవాళ తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేశాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. మీ చేతి నుంచే ఆరో విడత కూడా.. రాష్ట్రంలో మత్స్యకార సోదరులంతా చాలా సంతోషంగా ఉన్నారు. మత్స్యకారుల బతుకుదెరువు, ఆర్ధిక ఎదుగుదలకు తోడ్పడుతూ మనసున్న ముఖ్యమంత్రిగా మీరు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వం నుంచి నేరుగా సాయం అందడం మీ వల్లే సాధ్యమైంది. మళ్లీ మీ చేతుల మీదుగా ఆరో విడత కూడా తీసుకుంటాం. మీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరువలేనిది. – పొన్నాడ సతీష్ కుమార్, ఎమ్మెల్యే, ముమ్మిడివరం ఆశ వదిలేసుకున్న డబ్బులు అందుకుంటున్నాం.. గత ప్రభుత్వంలో రావనుకున్న డబ్బులు మీ చేతుల మీదుగా తీసుకుంటున్నాం. ఇప్పటివరకు ఒక్కొక్కరూ రూ.2,07,000 తీసుకున్నాం. ఇప్పుడు ఐదో విడతలో రూ. 69,000 అందుకుంటున్నాం. వేట నిషేధం సమయంలో గత ప్రభుత్వంలో అప్పులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మత్స్యకార భరోసా, సబ్సిడీపై డీజిల్ అందిస్తున్నారు. గతంలో మాకు బీమా వచ్చేది కాదు. ఇప్పుడు మీరు ఇస్తున్నారు. నాకు అమ్మ ఒడి సాయం అందింది. మా అబ్బాయికి ట్యాబ్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా మంచి వైద్య సేవలు అందుతున్నాయి. మా కుటుంబానికి రూ.5,32,000 మేర లబ్ధి చేకూరింది. ఆసరా సాయం కింద అందిన రూ.42 వేలతో కుట్టుమిషన్లు కొనుక్కున్నా. మా అమ్మకు చేయూత సాయం అందింది. –నారాయణమ్మ, లబ్ధిదారు, కోనసీమ జిల్లా అన్నీ ఇస్తున్నారు.. గతంలో మా గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. మా మత్స్యకారులందరికీ మీరు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. వేట నిషేధ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఏటా రూ.10 వేలు ఇస్తున్నారు. ఆయిల్ సబ్సిడీ గతంలో కొందరికే అందగా ఇప్పుడు అర్హత ఉంటే చాలు అందరికీ ఇస్తున్నారు. గతంలో బీమా సాయం అందేది కాదు. ఇప్పుడు అన్నీ ఇస్తున్నారు. గతంలో ఫిషింగ్ హార్బర్లు లేవు. ఇప్పుడు మీరు ఏర్పాటు చేస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామన్నా. – భైరవమూర్తి, వెంకటాయపాలెం, కోరంగి పంచాయతీ, కాకినాడ జిల్లా -
Watch Live: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం
-
AP: తీరం మనదే.. వేటా మనదే
జువ్వలదిన్నె సిద్ధం మన మత్స్యకారుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తోంది. ఇన్నాళ్లూ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన మత్స్యకారులు ఇప్పుడు ఇక్కడే అధునాతన మెకనైజ్డ్ బోట్లతో చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తూ 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తుది మెరుగులు దిద్దుకుంటున్న నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభానికి ముస్తాబవుతోంది. సాక్షి, అమరావతి: మత్స్యకారులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పనులు శరవేగంగా పూర్తి చేస్తోంది. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వలస వెళ్లాల్సి వస్తోంది. పాదయాత్ర సమయంలో వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వారికి స్థానికంగానే ఉపాధి కల్పించేలా ఫిషింగ్ హార్బర్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. ఈమేరకు రూ.3,520.56 కోట్లతో రెండు దశల్లో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, రూ.126.91 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జువ్వలదిన్నె హార్బర్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి కావడంతో త్వరలో ప్రారంభించనున్నారు. మరో మూడు హార్బర్ల పనులు 60 నుంచి 70 శాతం పూర్తి కాగా సెప్టెంబర్ నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇక రెండో దశలో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం, మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటికి అదనంగా మత్స్యకారులు బోట్లను నిలుపుకొని చేపలు దింపుకునే విధంగా చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక, రాయదరువు వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ హార్బర్లు అందుబాటులోకి వస్తే అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద సమకూరుతుందని, వీటి ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9 వేల కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జువ్వలదిన్నె హార్బర్లో ఏర్పాటు చేసిన షెడ్లు హార్బర్ ఆధారిత పరిశ్రమలు.. హార్బర్ల ద్వారా మత్స్యకారులు అధికాదాయం పొందే మార్గాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద రూ.288.81 కోట్లతో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తి కావడంతో ఇక్కడ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డులను ఏపీ మారిటైమ్ బోర్డు నెలకొల్పుతోంది. ఒక్క జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారానే ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద సమకూరనుంది. వచ్చే 30 ఏళ్లలో ఈ హార్బర్ ద్వారా మిలియన్ టన్నుల మత్స్య సంపద లభిస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా హార్బర్ వెలుపల 20 ఎకరాల విస్తీర్ణంలో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, 5 ఎకరాల విస్తీర్ణంలో బోట్ల తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. కొత్త బోట్లకు డిమాండ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్లల్లో 10,521 బోట్లను నిలుపుకునే సామర్థ్యం ఉండటంతో కొత్త బోట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడనుంది. 9ఎం ఎఫ్ఆర్పీ రకం, 12 ఎం గిల్ నెట్టర్, 15ఎం ట్రావలెర్, 24ఎం టూనా లాంగ్ లైనర్ లాంటి అత్యాధునిక బోట్లు అవసరం కానున్నాయి. అన్ని హార్బర్ల వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. కూలీల నుంచి యజమానులుగా.. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో ఇన్నాళ్లూ పని కోసం చెన్నై, మంగళూరు వలస కూలీలుగా వెళ్లాం.ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తుండటంతో అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకొని యజమానులుగా మారే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. ఫిషింగ్ హార్బర్, దీనికి అనుబంధంగా వచ్చే పరిశ్రమల వల్ల ఒక్క జువ్వలదిన్నెలోనే 15 వేల మందికిపైగా ఉపాధి లభించనుంది. తుపాన్లు వచ్చినా తట్టుకునే విధంగా హార్బర్‌ను నిర్మిస్తున్నారు. – కొండూరు అనిల్ బాబు, చైర్మన్, ఏపీ ఫిషరీస్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) సురక్షితంగా ఒడ్డుకు బోట్లు ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల బోట్లను ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమయ్యేది. అమావాస్య, పౌర్ణమి సమయంలో ఆటు పోట్లు వల్ల ఈ ఇబ్బంది అధికంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బోట్లు తీరానికి తగలడం వల్ల పగిలిపోయేవి. ఇప్పుడు మచిలీపట్నంలో అత్యాధునిక వసతులతో హార్బర్ నిర్మిస్తుండటంతో బోట్లను సురక్షితంగా నిలుపుకోవచ్చు. – పైకం ఆంజనేయులు, ఫైబర్ బోట్ల యజమానుల సంఘం, మచిలీపట్నం. పర్యాటక ఏర్పాట్లు పరిశీలిస్తున్నాం మత్స్యకారులు చేపల వేట కోసం కుటుంబాలకు దూరంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవసరం లేకుండా ముఖ్యమంత్రి జగన్ ఏక కాలంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. కేవలం ఫిషింగ్ హార్బర్లు కట్టి వదిలేయడమే కాకుండా చేపలకు మంచి విలువతో పాటు స్థానిక మత్స్యకారులకు ఉపాధి లభించేలా హార్బర్ ఆధారిత పరిశ్రమలను పెద్దఎత్తున నెలకొల్పుతున్నాం. ప్రతి ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డులతో పాటు ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. ప్రయోగాత్మకంగా జువ్వలదిన్నె వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు బోట్ బిల్డింగ్ యార్డ్ ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. హార్బర్ల వద్ద పర్యాటక ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో ఏపీ మారిటైమ్‌బోర్డు, వీసీఎండీ ఏపీఐసీసీ. మినీ పోర్టు స్థాయిలో ఇప్పటి వరకు బోట్లు నిలుపుకోవడానికే సరైన సదుపాయాల్లేక అవస్థలు ఎదుర్కొన్నాం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తేవడంతో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలపడం నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి. దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50 వేల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్, ఉప్పాడ -
శ్రీకాకుళం భాగ్యరేఖ.. మూలపేట పోర్టు
సాక్షి, అమరావతి: వెనుకబడ్డ ఉత్తరాంధ్ర తలరాతను మార్చే మరో పోర్టు వేగంగా రూపుదిద్దుకుంటోంది. వలస జిల్లా పేరు నుంచి ఉపాధి కల్పించే జిల్లాగా శ్రీకాకుళం పేరును మార్చే మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జిల్లాకు రెండు వేల కోట్ల రూపాయలకు మించి పెట్టుబడులు రాలేదు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకంగా మూలపేట పోర్టు, మంచినీళ్లపేట, బుడగల్లపాలెం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ. 5,000 కోట్లు పైనే వ్యయం చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల్లో ఒకటైన మూలపేట మన రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాల నుంచి ఎగుమతులు దిగుమతులకు అనువుగా ఉంటుందని.. ఇలాంటి కీలకమైన ప్రదేశంలో మూలపేట ఉందని ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పోర్టు ద్వారా ఐదు రాష్ట్రాల్లోని పరిశ్రమలు తమకు అవసరమైన ముడి సరుకులు దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే ఇక్కడ నుంచి మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్, ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మూలపేట పోర్టు పనులను ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని అనుమతుల తర్వాత అన్ని అనుమతుల తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించడంతో పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. పోర్టులో కీలకమైన సౌత్ బ్రేక్ వాటర్ నిర్మాణానికి 19.40 లక్షల టన్నులు, నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణానికి 2.71 లక్షల టన్నుల బండరాళ్లు అవసరమవుతాయని అంచనా వేయగా ఇప్పటికే 8.3 లక్షల టన్నుల బండరాళ్లను తరలించారు. ఇదే సమయంలో జనరల్ బెర్త్ నిర్మాణ పనులు, తీర ప్రాంతం పటిష్టం చేయడం, ఎన్‌హెచ్ 16ను అనుసంధానం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి దశలో నాలుగు బెర్తులు పోర్టు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,361.91 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ పోర్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును విశ్వసముద్ర కన్సార్టియం చేపట్టింది. రూ. 2,949.70 కోట్ల వ్యయంతో తొలిదశలో నాలుగు బెర్తుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనను విశ్వసముద్ర అభివృద్ధి చేయనుంది. మొత్తం పోర్టు వార్షిక సామర్థ్యం 83.3 మిలియన్ టన్నులు కాగా తొలిదశలో నాలుగు బెర్తుల నిర్మాణంతో 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టును అభివృద్ధి చేయనున్నారు. మొత్తం నాలుగు బెర్తుల్లో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గు, ఇంకొకటి కంటైనర్‌తోపాటు ఇతర ఎగుమతి దిగుమతులకు వినియోగించనున్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూలపేట పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణరూపంలో సమీకరిస్తున్నారు. 596 కుటుంబాల తరలింపు పోర్టు నిర్మాణం కోసం విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 596 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరిని ఒక కుటుంబంగా పరిగణించి వారికి కస్త నౌపాడ వద్ద పునరావాస గ్రామం అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ. 149 కోట్లు్ల వ్యయం చేస్తోంది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద అక్కడ 13 రకాల మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పటికే స్థలాన్ని చదును చేసి విద్యుత్, తాగునీరు కనెక్షన్లను ఏర్పాటు చేయడం పూర్తయింది. త్వరలోనే లాటరీ విధానంలో ప్లాట్‌ను కేటాయించి ఇంటి నిర్మాణాలను ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మూలపేట పోర్టు స్వరూపం ప్రాజెక్టు వ్యయంరూ.4,361.91 కోట్లు తొలి దశ పోర్టు:23.5 ఎంటీపీఏ తుది దశ పోర్టు:83.3 ఎంటీపీఏ తొలి దశలో బెర్తుల సంఖ్య 4 నౌక పరిమాణం:1,20,000 డీడబ్ల్యూటీ అవసరమైన భూమి:1,254.72 ఎకరాలు దక్షిణ బ్రేక్ వాటర్:2,455 మీటర్లు ఉత్తర బ్రేక్ వాటర్: 580 మీటర్లు తీరం రక్షణ:1,000 మీటర్లు డ్రెడ్జింగ్: 15.85 మిలియన్ క్యూబిక్ మీటర్లు అప్రోచ్ చానల్:3.3 కి.మీ నీరు: గొట్టా బ్యారేజీ నుంచి 0.5 ఎంఎల్డీ నీటి సరఫరా రైల్: 10.6 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం రహదారి: ఎన్‌హెచ్16ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ. నాలుగులేన్ల రహదారి నిర్మాణం కార్యకలాపాలు ప్రారంభం: అక్టోబర్, 2025 శ్రీకాకుళం ఇక సిరుల జిల్లా ఇంతకాలం శ్రీకాకుళం అంటే వలసలు గుర్తుకు వచ్చేవి. కానీ మూలపేట పోర్టు రాకతో స్థానికులు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతేగాక వేరే ప్రాంతం వారికి కూడా ఇక్కడ ఉపాధి కల్పించే సిరుల జిల్లాగా రూపాంతరం చెందుతుంది. కేవలం పోర్టులే కాకుండా వాటిపక్కనే పోర్టు ఆధారిత పరిశ్రమలను ప్రమోట్ చేస్తున్నాం. కొత్తగా వస్తున్న నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లతో రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్రలతో పోటీ పడుతుంది. రెండు లక్షల టన్నుల బరువు ఉండే భారీ ఓడలను తీసుకువచ్చే విధంగా ఈపోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. – కాయల వెంకటరెడ్డి, చైర్మన్ ఏపీ మారిటైమ్ బోర్డు 6 నెలలు ముందుగానే అందుబాటులోకి పోర్టు శంకుస్థాపన జరిగిన 8 నెలల్లో రికార్డు స్థాయిలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే నార్త్ బ్రేక్ వాటర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సౌత్ బ్రేక్ వాటర్ పనులు 50 శాతంపైగా పూర్తయ్యాయి. వాస్తవంగా ఈ ప్రాజెక్టును అక్టోబర్ 2025 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా సీఎం ఆదేశాలు మేరకు ఆరు నెలలు ముందుగానే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఆ మేరకు ప్రణాళికలను సిద్ధం చేశాం. డ్రెడ్జింగ్ పనుల కోసం ప్రత్యేకంగా రూ. 350 కోట్లతో చైనా నుంచి డ్రెడ్జింగ్ మిషన్ కొనుగోలు చేశాం. త్వరలోనే డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించనున్నాం. –చావల బాబురావు, ఎండీ, మూలపేట పోర్టు భావితరాలకు మేలు చేకూరుతుంది భావితరాలకు మేలు చేకూరుతుందని మూలపేట పోర్టుకు మాభూములు, ఇళ్లు, గ్రామాన్ని ఇచ్చాము. జిల్లా అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యంగా ఉన్నందుకు గర్వంగా ఉంది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే పని దొరుకుతుంది. – గిన్ని భైరాగి, విష్ణుచక్రం గ్రామం పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది మూలపేట పోర్టు రావడం వల్ల మరికొన్ని అనుబంధ పరిశ్రమలు ఈ ప్రాంతానికి వస్తాయి. దీంతో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. యువకులకు ఉద్యోగ, ఉపాధి కలిగి వలసనివారణ జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మా భూములను ప్రభుత్వానికి ఇచ్చాము. – కనిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నౌపడ పోర్టుతో భూముల ధరలు పెరిగాయి మూలపేట పోర్టుతో ఈ ప్రాంత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. సెంటు భూమి రూ. 1.50లక్షల నుంచి రూ. 2లక్షలు వరకు పెరిగింది. పోర్టు పూర్తి అయితే ఈ ప్రాంతం అంతా పారిశ్రామిక వాడగా మారుతుంది. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. – కర్రి కాంతారావు, రైతు, నౌపడ -
రామాయపట్నం 'రెడీ'
ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర దశ, దిశలను మార్చవచ్చని సీఎం వైఎస్ జగన్ నిరూపించారు. సముద్ర తీరం ఉండాలే కానీ సంపద సృష్టించడం కష్టం కాదనే దిశగా అడుగులు ముందుకు వేశారు. కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో లాజిస్టిక్స్, ఎగుమతులు, దిగుమతుల ద్వారా అద్భుతాలు సృష్టించడానికి మార్గం సుగమం చేస్తున్నారు. ఒక్కో పోర్టు, ఒక్కో ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రావడం ద్వారా తీర ప్రాంత అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం. మన రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ, దానిని సరైన రీతిలో ఉపయోగించుకోవచ్చన్న ఆలోచనే చంద్రబాబు ప్రభుత్వానికి రాలేదు. సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.20,000 కోట్లతో కోస్తా తీరాన్ని అభివృద్ధి చేస్తోంది. ఒకేసారి నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులతో పాటు 10 మినీ పోర్టుల తరహాలో ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించనుంది. రాష్ట్రంలోని 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండేలా ఏపీ మారిటైమ్ బోర్డు అడుగులు ముందుకు వేస్తోంది. ప్రస్తుతం విశాఖలో మేజర్ పోర్టుతో పాటు మరో ఐదు నాన్ మేజర్ పోర్టులు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ డీప్‌వాటర్, కాకినాడ యాంకరేజ్, రవ్వ కాపిటివ్పోర్టులున్నాయి. ఇవి కాకుండా ఇంకో నాలుగు పోర్టులను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను రాష్ట్ర ల్యాండ్ లార్డ్ మోడల్లో అభివృద్ధి చేస్తుండగా, కాకినాడ గేట్‌వే పోర్టును పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. రూ.91.18 కోట్లతో చేపట్టిన కాకినాడ యాంకరేజ్ పోర్టు ఆధునికీకరణ పనులు పూర్తి కానుండటంతో పోర్టు సామర్థ్యం పెరగనుంది. రామాయపట్నంలో బల్క్ బెర్త్ పనులు దాదాపు పూర్తి కావడంతో ఈనెలాఖరు లేదా ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు మారిటైమ్ బోర్డు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2025 నాటికి రాష్ట్రంలో మొత్తం పది పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతం 150 మిలియన్ టన్నులుగా ఉన్న రాష్ట్ర ఎగుమతులు 300 మిలియన్ టన్నులకు చేరుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు లక్షలాది మందికి ఉపాధి లభించడంతో పాటు వ్యాట్, జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది. త్వరలోనే తొలి నౌక ఆగమనం మొదలు పెట్టిన 18 నెలల్లోనే రామాయపట్నం పోర్టు వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యిందంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో అభివృద్ధి చేస్తున్న రామాయపట్నం పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2022 జూన్‌లో భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. తొలి దశలో 34.04 ఎంఎంటీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఆనమ్) సామర్థ్యంతో నాలుగు బెర్తులు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీ పర్పస్) అభివృద్ధి చేయనుండగా, అందులో ఇప్పటికే బల్క్ బెర్త్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ బిల్డింగ్‌ల నిర్మాణ పనులు కూడా పూర్తి కావడంతో త్వరలో తొలి నౌకను తీసుకొచ్చి లంగరు వేయడం ద్వారా వాణిజ్య పరంగా పోర్టును ప్రారంభించడానికి ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలను సిద్ధం చేసింది. వచ్చే ఆరు నెలల్లో మిగిలిన మూడు బెర్తులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. 23 ఎకరాల్లో పునరావాస గ్రామ నిర్మాణం రామాయపట్నం పోర్టుకు సమీపంలోని తెంటు గ్రామం వద్ద 23 ఎకరాల్లో పునరావాస గ్రామాన్ని అభివృద్ధి చేసింది. పోర్టు కోసం భూమిని ఇచ్చిన ప్రతి కుటుంబానికి 5 సెంట్ల భూమి చొప్పున 675 మందికి పునరావాసం కల్పించారు. పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం సుమారు రూ.160 కోట్లు వ్యయం చేసింది. ఈ గ్రామంలో రహదారులు, విద్యుత్, తాగునీరు, మురుగు నీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలను కల్పించారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, పాఠశాల, వైద్యశాల, కమ్యూనిటీ భవనాలు వంటి అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పించింది. పునరావాస గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.20 కోట్ల వరకు వ్యయం చేసింది. ఇప్పటి వరకు పనులు ఇలా.. ♦ పోర్టు నిర్మాణంలో కీలకమైన బ్రేక్ వాటర్ నిర్మాణం కోసం ఏకంగా ఇప్పటి వరకు 59 లక్షల టన్నుల రాళ్ల వినియోగం. ♦ భారీ ఓడలను సురక్షితంగాతీరానికి తీసుకు వచ్చేలా 7.87 మిలియన్ క్యూబిక్ మీటర్లడ్రెడ్జింగ్, టర్నింగ్ సర్కిల్స్, అప్రోచ్ చానల్ నిర్మాణం. ♦ అప్రోచ్ టెస్టిల్, బల్క్ బెర్త్, కస్టమ్స్ బిల్డింగ్, సెక్యూరిటీ కమ్ రిసెప్షన్ బిల్డింగ్ నిర్మాణం పూర్తి. ♦ శరవేగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు.. పోర్టును జాతీయ రహదారి ఎన్‌హెచ్ 16కు అనుసంధానం చేస్తూ రహదారి పనులు వేగవంతం. ♦ సముద్రంలో చేయాల్సిన పనులు దాదాపు పూర్తి. తీరంలో నిర్మించే భవనాలు, ఇతర నిర్మాణాలు 45 శాతం వరకు పూర్తి. స్వరూపం ఇదీ.. ప్రాజెక్టు వ్యయం : రూ.4,902 కోట్లు తొలి దశలో పోర్టు సామర్థ్యం: 34.04ఎంఎంటీపీఏ పూర్తి స్థాయి సామర్థ్యం: 138.54 ఎంఎంటీపీఏ తొలి దశలో బెర్తులు: 4 (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీ పర్పస్) తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం : 80,000 డీడబ్ల్యూటీ (డెడ్ వెయిట్ టన్నేజ్) పనులు ప్రారంభించినది : 2022 జూన్ 24 కార్యకలాపాలు ప్రారంభం : 2024 జనవరి ప్రారంభించేందుకు చర్యలు సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా హార్బర్ ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు అనుగుణంగా కొత్తగా నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే రామాయపట్నం పోర్టులో ఒక బెర్తు పనులు పూర్తి కావడంతో త్వరలో వాణిజ్య పరంగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో ఏపీమారిటైమ్ బోర్డు, వీసీఎండీ ఏపీఐఐసీ రికార్డు సమయంలో .. నిర్మాణ పనులు ప్రారంభమైన 18 నెలల రికార్డు సమయంలోనే రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. బల్క్ బెర్త్ నిర్మాణం, డ్రెడ్జింగ్, బ్రేక్‌వాటర్ పనులు పూర్తి కావడంతో ఓడలను తీసుకురావడానికి అనుమతి కోసం కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్ శాఖకు లేఖ రాశాం. కేంద్రం నుంచి అనుమతి రాగానే రామాయపట్నం పోర్టులో వాణిజ్య కార్యక్రమాలను ప్రారంభింస్తాం. – పి. ప్రతాప్, ఎండీ రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మా ప్రాంతం మారుతోంది.. దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న రామాయపట్నం పోర్టు నిర్మాణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో వేగంగా సాగుతోంది. ఎన్నో సంవత్సరాలుగా కలగా ఉన్న పోర్టు నిర్మాణం మా కళ్ల ముందటే పూర్తవుతుంటే సంతోషంగా ఉంది. పోర్టు నిర్మాణంతో మా ప్రాంతం వేగంగా అభివృద్ధి అవుతుంది. ఇప్పటికే భూముల వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పోర్టు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాం. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. – రాయిని రామకృష్ణ, చేవూరు గ్రామం సొంత ఊళ్లోనే ఉద్యోగం మా ప్రాంతంలో పోర్టు నిర్మాణం వల్ల యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. నేను ఉళ్లోనే ఉండి ప్రస్తుతం రామాయపట్నం పోర్టులో సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తున్నా. నాలాంటి వందల మంది యువకులు స్థానికంగానే ఉద్యోగం చేస్తున్నారు. దీని వల్ల ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు పోయే ఇబ్బందులు తప్పాయి. అనుకున్న సమయం కంటే పోర్టు నిర్మాణం వేగంగా జరుగుతోంది. పోర్టులో కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు స్థానికంగానే దొరుకుతాయి. – అట్ల సురేష్, రావూరు గ్రామం -
ఆంధ్రా తీరం.. ఆర్థికంగా ఊతం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి 50 కి.మీకు ఒక్క పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు (మినీ పోర్టు)లను నిర్మిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులతో పాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టి రికార్డు సృష్టించింది. ఇందుకోసం సుమారు రూ.20,000 కోట్లు వ్యయం చేస్తుండటం గమనార్హం. తొలి దశలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు దాదాపు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధం కానున్నాయి. ఎగుమతులను ప్రోత్స హించే విధంగా తీర ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. 2022 సంవత్సరానికి నీతి ఆయోగ్ ప్రకటించిన ఎగుమతి సన్నద్ధత రాష్ట్రాల్లో రాష్ట్రం 59.27 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. మరో వైపు పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని వెదజల్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కుతో పాటు తెట్టు వద్ద కార్గొ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ల సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎగుమతుల్లో 10 శాతం వాటా లక్ష్యం దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2030 నాటికి 10 శాతం మార్కెట్ వాటాతో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆరు నెలల కాలంలో రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల విలువ రూ. 82,732.65 కోట్ల నుంచి రూ.85,021.74 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఎగుమతుల విలువ రూ. 18,17,640.99 కోట్ల నుంచి రూ. 17,42,429.99 కోట్లకు పడిపోవడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రాష్ట్రం రూ.1,59,368.02 కోట్ల ఎగుమతులు చేయడం ద్వారా 4.40 శాతం వాటాతో ఆరో స్థానంలో నిలవగా, ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో రూ. 85,021.74 కోట్ల ఎగుమతులతో దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను 4.88 శాతంకు పెంచుకొని ఐదో స్థానానికి ఎగబాకింది. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ♦ విశాఖపట్నం జిల్లా భీమిలి ♦ అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక ♦ విజయనగరం జిల్లా చింతపల్లి ♦ తిరుపతి జిల్లా రాయదరువు ♦ కాకినాడ జిల్లా ఉప్పలంక -
ఒక తండ్రిలా ఆదుకున్నాడు వైఎస్ జగన్
-
విశాఖలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
-
మంచింగ్ కోసం బోటులో ఉప్పు చేప ఫ్రై చేయడం కారణంగానే మంటలు
-
సాక్షి టీవీ చేతిలో ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం సీసీ ఫుటేజ్
-
ఆగమేఘాలపై ఆదుకున్న ప్రభుత్వం
-
ఫిషింగ్ హార్బర్ ప్రమాద భాదితులను సీఎం గొప్ప మనసుతో ఆదుకున్నారు
-
మనసున్న ప్రభుత్వం మనది
సాక్షి, విశాఖపట్నం: మనసున్న ప్రభుత్వం మనదని, బాధితులను తక్షణమే ఆదుకునే స్వభావం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ నెల 19 అర్ధరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన 49 బోట్ల యజమానులకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.7 కోట్ల 11 లక్షల 76 వేల నష్ట పరిహారాన్ని గురువారం జిల్లా పరిషత్ హాల్లో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోనే నష్టంలో 80 శాతం సొమ్మును పరిహారంగా అందజేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. ప్రమాదంలో కాలిపోయిన బోట్లలో పనిచేస్తున్న సుమారు 400 కలాసీ కుటుంబాలకు రూ.10 వేల చొప్పున చెల్లిస్తున్నట్టు తెలిపారు. బాధిత మత్స్యకారుల్లో సీఎం జగన్ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారని, ఇలాంటి నేత దేశంలోనే లేరని ప్రశంసించారు. రూ.80 లక్షల నుంచి కోటి వరకు వ్యయం అయ్యే లాంగ్‌లైనర్(పెద్ద) బోటు కొనుగోలుకు ఇప్పుడున్న 60 శాతం సబ్సిడీని 75కి పెంచుతూ త్వరలో జీవో జారీ చేస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారులు ఈ పరిహారం సొమ్మును లాంగ్‌లైనర్ బోట్ల పెట్టుబడి సొమ్ముగా వినియోగించాలని సూచించారు. ఇచ్చిన మాట తప్పడం చంద్రబాబు నైజమన్నారు. గతంలో హుద్‌హుద్, తిత్లీ తుపానులకు దెబ్బతిన్న బోట్లకు ఏళ్ల తరబడి పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేశారని, దీంతో ఆయన హామీలన్నీ నీటిమీద రాతలేనన్న భావనలో మత్స్యకారులున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు పాత డీజిల్ సబ్సిడీ బకాయి సుమారు రూ.5.50 కోట్లను రెండు వారాల్లో చెల్లిస్తామని ప్రకటించారు. మత్స్యకారుల కోరిక మేరకు బయో డీగ్రేడబుల్ ఆయిల్‌కు కూడా సబ్సిడీ ఇస్తామని, సంబంధిత బంకుల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. సీఎం జగన్ చలించిపోయారు: వైవీ సుబ్బారెడ్డి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదంపై సీఎం జగన్ చలించిపోయారని, దగ్ధమైన బోట్లకు బీమా ఉందా లేదా అన్నది చూడకుండా మత్స్యకారులు నిలదొక్కుకునేలా ఆదుకోవడం మన బాధ్యత అని, అందుకు 80 శాతం పరిహారం ఇవ్వాలని చెప్పారని తెలిపారు. ఈ సాయంతో వారు కొత్త బోట్లు కొనుగోలుకు వీలవుతుందన్నారు. చిన్న బోట్లతో పాటు పెద్ద బోట్ల యజమానులు బోట్ల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి సాయం అందించాలని మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ తన దృష్టికి తెచ్చారని, ఆ మేరకు తాను కృషి చేస్తానని, బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. గత తుపాన్లకు దెబ్బతిన్న బోట్ల మరమ్మతులకు రూ.6 లక్షలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదని, వారికీ న్యాయం జరిగేలా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. 2019 మే నుంచి సెప్టెంబర్ వరకు డీజిల్ సబ్సిడీ చెల్లించేలా చూస్తామని చెప్పారు. ఇంతలా స్పందించిన ముఖ్యమంత్రి మరెవరూ లేరు..: మోపిదేవి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ బాధిత మత్స్యకారులు ఊహించిన దానికంటే ఎక్కువ పరిహారాన్ని అందించిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. ఇంతలా పెద్ద మనసుతో స్పందించిన ముఖ్యమంత్రి మరెవరూ లేరన్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న 34 బోట్లకు పరిహారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు చుట్టూ తాను ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకోలేదన్నారు. అనంతరం మంత్రి అప్పలరాజు, రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డిలు బోట్ల యజమానులకు చెక్కులను అందజేశారు. సభలో మత్స్యకారులు జై జగన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బి.అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పేర్ల విజయచందర్, మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ బోటు ప్రమాద బాధితులకు పరిహారం చెల్లింపు
సాక్షి, విశాఖపట్నం: ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారులను ఏపీ ప్రభుత్వం సత్వరమే ఆదుకుంది. ప్రమాదం జరిగిన రెండు రోజుల్లోనే బాధితులకు పరిహారం చెక్కులను అందజేసింది. ఈ నెల 19వ తేదీ రాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధమవగా, మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసి మత్స్యకారులకు నేనున్నానంటూ... భరోసానిచ్చారు. బాధిత మత్స్యకారులకు 80శాతం పరిహారం ఇస్తామని ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ చెప్పినట్లుగానే ప్రమాదం జరిగిన 48గంటలు గడవక ముందే జిల్లా కలెక్టర్ డాక్టర్ అకౌంట్‌కు పరిహారం డబ్బులను సీఎం కార్యాలయం జమ చేసింది. పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు 80 శాతం పరిహారంలో భాగంగా రూ.6,44,80,000, పాక్షికంగా దగ్ధమైన 18 బోట్లు, ఒక వలకు రూ.66.96 లక్షలు పరిహారాన్ని అందించింది. బోట్లు దగ్ధమవడంతో వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న హమాలీలు, చిరువ్యాపారులను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో బోటుకు 10మంది చొప్పున పరిగణనలోకి తీసుకుని మొత్తం 490 మందికి ఒక్కొక్కరికీ వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద రూ.10వేలు చొప్పున అందించారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, మత్స్యకారులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటోందని ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా సాయం అందిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన మత్సకారుల డీజిల్ బకాయిలు కూడా చెల్లిస్తామని, త్వరలో ఆ బకాయిలు రూ.4 కోట్లు 15 రోజుల్లో విడుదల చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ‘‘విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదాన్ని కొందరు రాజకీయం చేయడానికి ప్రయత్నించారు. పరిహారం ఇస్తున్న దశలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. సీఎం ఇవేం పట్టించుకోకుండా అర్హులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా విలువలో 80 శాతం చెల్లింపు చేయాలని చెప్పారు కలాసీలకు పరిహారం ఇవ్వాలని చెబితే వెంటనే పది వేలు చొప్పున ఇవ్వాలని సీఎం చెప్పారు. ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసింది. స్టీల్ బోట్లు తయారీకి ఇప్పుడు 60 శాతం సబ్సిడీ ఇస్తోంది.ఇప్పుడు దరఖాస్తు చేస్తే లాంగ్ లైనర్ల కోసం 75 శాతం వరకు ఇస్తామని’’ మంత్రి పేర్కొన్నారు. సీఎం గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు: ఎంపీ మోపిదేవి విశాఖ హార్బర్ ప్రమాదం మానవ తప్పిదం.. కానీ సీఎం జగన్ తన ఉదారత చాటుకున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. పరిహారం ఇవ్వడంలో సీఎం గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. 150 కోట్లతో హార్బర్ ఆధునీకరణ గొప్ప నిర్ణయం. ఇన్ని జట్టీలు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో జరగలేదు. ఫిషింగ్ జట్టీల ఏర్పాటు తో ఆర్థిక ప్రగతి వుంటుంది. ఈ రోజు ఇచ్చిన పరిహారం అంచనాలకు తగ్గట్టు అధికారులు ఇచ్చారు. ఈ పరిహారం వృధా చేయకుండా లాంగ్ లైనర్ బోట్లను కొనుగోలు చేయాలన్నారు. బోట్ల కొనుగోలుకు బ్యాంకులు సహకరించేలా ప్రభుత్వం చొరవ చూపిస్తుందని, రాజకీయ పబ్బం గడుపుకునే నాయకులు వస్తారు.. వారికి నమ్మకండి’’ అంటూ మోపిదేవి సూచించారు. మత్స్యకారులకు అండగా ఉంటాం: వైవీ సుబ్బారెడ్డి మత్స్యకారులకు సీఎం అండగా నిలిచారని, విపత్తుల సహాయం చేయడం సహజం.. కానీ ఇది విపత్తు కాదు.. ప్రమాదంలో బోట్లు తగలబడినా ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన గంటల్లోనే విలువలో 80 శాతం పరిహారం సీఎం ఇవ్వడం గొప్ప విషయం. కలాసీలకు 10 వేలు పరిహారం ఇవ్వడం చారిత్రక నిర్ణయం. ఈ పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు.. బోట్లు తిరిగి నడిపే వరకు అండగా వుంటాం. గత ప్రభుత్వం బోట్ల మరమ్మత్తులకు 6 లక్షలు ఇస్తామన్నారు.. కానీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం హామీ అమలు జరిగేలా ప్రయత్నిస్తాం’’ అని సుబ్బారెడ్డి అన్నారు. -
విశాఖ అగ్ని ప్రమాద బాధితులకు సీఎం వైఎస్ జగన్ ఎక్స్ గ్రేషియా
-
మత్స్యకారులకు అండగా నిలుస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా.. 23,458 మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం పంపిణీ.. ఇంకా ఇతర అప్డేట్స్
మత్స్యకారులకు అండగా నిలుస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా.. 23,458 మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం పంపిణీ
-
ఫిషింగ్ హార్బర్ ప్రమాదం.. బాధితులను ఆదుకుంటాం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బాధితులు వేటకు వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగుతోందని తెలిపారు. ఘటనలో కుట్రకోణం ఉంటే తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. . ప్రభుత్వం, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించడంతో హార్బర్లో ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు వైవీ సుబ్బారెడ్డి. పోర్టు, స్టీల్ ప్లాంట్ పోలీసులు వేగంగా స్పందిచారని, లేదంటే ఆయిల్ ట్యాంకర్ల నుంచి ముప్పు ఉండేదని తెలిపారు. సీఎం జగన్ మానవతా దృక్పథంతో స్పందించారని చెప్పారు. బోటు ఖరీదు 30 నుంచి 50 లక్షల వరకు ఉన్నప్పటికీ అందులో 80 శాతం ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. పరిహారం గతం మాదిరిగా ఆలస్యం కాకుండా త్వరలోనే అందిస్తామని చెప్పారు. ‘మునిగిపోయిన బోట్లను తొలగించాలని పోర్టు అధికారులను కోరాం. ఇతర బొట్లకు అడ్డం లేకుండా మునిగిన బోట్లను త్వరలో బయటకు తీస్తాం. మత్స్యకారుల కష్టాలను తెలుసుకోవాలని సీఎం పంపించారు. అందుకే వచ్చాను. కేవలం పరిహారం మాత్రమే కాదు, ఇతర సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రమాద కారకులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఏడుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుగుతోంది. సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదన్న విషయంపై విచారణ చేపట్టాలని సీపీకి కోరాం’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన అనుమానితుడిగా ఉన్న యుట్యూబర్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 10 మంది అనుమానితులని అదుపులోకి తీసుకోగా.. వారిని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో డీసీపీ ఆనంద్ రెడ్డి విచారిస్తున్నారు. యుట్యూబర్ సెల్‌ఫోన్ డేటా, హార్బర్లో అతని కదలికలపై విచారణ కొనసాగుతోంది. కాగా వారం రోజులగా హార్బర్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు గుర్తించారు. -
బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు: వైవీ సుబ్బారెడ్డి
-
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం.. 36 మత్స్యకార బోట్లు దగ్ధం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 45 బోట్లు కాలిపోయాయి. ఉద్దేశపూర్వకంగానే కొందరు మద్యం మత్తులో ఈ బోట్లకు నిప్పు పెట్టినట్టు పోలీసులు ప్రాథమికంగా అనుమానించినప్పటికీ అది నిర్ధారణ కాలేదు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఆయన చాలా ఉదారంగా స్పందించారు. దగ్థమైన బోట్ల విలువలో 80 శాతం మేర పరిహారంగా అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ ఘటనపై లోతై న దర్యాప్తు జరిపి కారణాలు వెలికితీయాలన్నారు. ప్రమాదవశాత్తూ దుర్ఘటన.. తొలుత.. ఆదివారం అర్ధరాత్రి కొంతమందితో కలిసి ఓ యూట్యూబర్ హార్బర్లోని జీరో నెంబర్ జెట్టీలో లంగరు వేసి ఉన్న బోటులో మందు పార్టీ చేసుకున్నాడని, వారిలో వారికి గొడవ మొదలై నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అనుమానించారు. అలాగే, యూట్యూబర్‌కు చెందిన బోటును మరొకరికి అమ్మారని, కొనుగోలు చేసిన వ్యక్తి ఆ సొమ్మును సకాలంలో ఇవ్వకపోవడంతో బోటును తగులబెడ్తానని కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నాడని, అలా ఆదివారం అర్థరాత్రి అన్నంత పనీ చేశాడన్న ప్రచారం కూడా జరిగింది. సంఘటన స్థలంలో ఉండి తగలబడిపోతున్న బోట్లను తన సెల్ఫోన్లో యూట్యూబర్ చిత్రీకరించి తన యూట్యూబ్‌లో ఉంచడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరింది. దీంతో పోలీసులు ఆ యూట్యూబర్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అది నిర్ధారణ కాకపోవడంతో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు కేసు నమోదు చేశారు. 45 మెకనైజ్డ్ బోట్లు అగ్నికి ఆహుతి.. ఈ ప్రమాదంలో మొత్తం 45 మెకనైజ్డ్ బోట్లు దగ్థమైనట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 36 బోట్లు పూర్తిగాను, తొమ్మిది బోట్లు పాక్షికంగాను దగ్థమయ్యాయి. కొన్ని బోట్లు పూర్తిగా నీటిలో మునిగిపోగా మరికొన్ని వాటి ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక సోమవారం తెల్లవారుజామున వేటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న బోట్లు, వేటకు వెళ్లి హార్బర్‌కు వచ్చిన బోట్లు కూడా ప్రమాదానికి గురయ్యాయి. ఈ బోట్లలో ఉన్న వేల లీటర్ల డీజిల్, టన్నుల కొద్దీ వేటాడి తెచ్చిన చేపలు, రొయ్యలు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కో బోటు విలువ దాని స్థితిని బట్టి రూ.25 నుంచి 60 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ లెక్కన అగ్నిప్రమాదంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు భావిస్తున్నారు. తప్పిన పెనుముప్పు.. హార్బర్లో అగ్నిప్రమాదం సంభవించిన ప్రాంతానికి కొద్దిమీటర్ల దూరంలోనే హిందుస్తాన్ పెట్రోలియంకు చెందిన డీజిల్ బంకరింగ్ ఇన్స్టాలేషన్ ఉంది. అక్కడ 365 కిలోలీటర్ల డీజిల్ నిల్వలున్నాయి. అలాగే, హార్బర్ సమీపంలోనే విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేటు లిమిటెడ్ (వీసీటీపీఎల్) కూడా ఉంది. దీంతో ఏదైనా పేలుడు సంభవించి ఆ శకలాలు వచ్చి పడితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. అయితే, అలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
చేపల రేవు చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం తీవ్ర అలజడిని రేపింది. మునుపెన్నడూ లేనివిధంగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంతో విశాఖ ఉలిక్కి పడింది. ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ చేపలరేవులో అతి పెద్ద అగ్ని ప్రమాదం ఇదే. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే నగరంలోని మత్స్యకారులు పిల్లా పాపలతో హార్బర్‌కు పరుగులు తీశారు. అలా సోమవారం మధ్యాహ్నం వరకు వీరు చేపలరేవుకు వస్తూనే ఉన్నారు. మంటల్లో కాలిపోయిన బోట్లను చూసి బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తాము రూ.లక్షల్లో అప్పు చేసి బోట్లు కొనుగోలు చేశామని, ఇప్పుడు మంటల్లో కాలిపోయాయంటూ రోదించారు. ఇలా పెద్ద సంఖ్యలో వచ్చిన మత్స్యకారులతో పాటు అధికారులు, మీడియా ప్రతినిధులతో హార్బర్ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. తొమ్మిదేళ్ల క్రితం సంభవించిన హుద్‌హుద్ తుపానుకు 60 బోట్లు మునిగిపోగా మరో 200కి పైగా బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో 36 బోట్లు పూర్తిగా, తొమ్మిది బోట్లు పాక్షికంగా కాలిపోయాయి. దాదాపు పది బోట్లలో దించకుండా ఉంచిన టన్నుల కొద్దీ చేపలూ దగ్ధమయ్యాయి. అగ్నికి ఆజ్యం ఇలా.. హార్బర్లో అగ్ని ప్రమాదం తీవ్రతరం కావడానికి మరిన్ని ఆజ్యం పోశాయి. లంగరు వేసి ఉన్న అన్ని బోట్లలో వందల నుంచి వేల లీటర్ల డీజిల్ ఉంది. బోట్లను ఫైబర్‌తో తయారు చేస్తారు. బోట్లలో నైలాన్ వలలు ఉంటాయి. అలాగే బోట్లు రాపిడికి గురి కాకుండా ఇరుపక్కల పాత టైర్లను అమరుస్తారు. చేపలవేటకు వెళ్లినప్పుడు బోటులో కలాసీలు వంట చేసుకోవడానికి రెండేసి గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్తుంటారు. ఇవి బోట్లలోనే ఉంచుతారు. అగ్ని ప్రమాదం తీవ్రత పెంచడానికి ఇవన్నీ దోహదపడ్డాయి. అంతేకాదు.. ప్రమాదం ఇతర బోట్లకు వేగంగా విస్తరించడానికి గాలులు కూడా తోడయ్యాయి. ప్రస్తుతం ఈశాన్య గాలులు బలంగా వీస్తున్నాయి. హార్బర్లోని జీరో జెట్టీ ఆరో నంబర్ షాపు ఎదురుగా లంగరేసిన బాలాజీ బోటులో మొదట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ నుంచి నిమిషాల్లోనే పక్కనున్న బోట్లకు మంటలు వ్యాపించాయి. ఈశాన్య గాలుల దాటికి పశ్చిమ, వాయవ్య దిక్కుల్లో లంగరేసిన బోట్లు కొన్ని ఒకటో నంబర్ జెట్టీలో ఉన్న బోట్ల వైపు వెళ్లిపోయాయి. దీంతో అక్కడున్న పలు బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. యువకుల సాహసం అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న కొందరు మత్స్యకార యువకులు పరుగున హార్బర్‌కు చేరుకున్నారు. జెట్టీలకు కట్టిన తాళ్లను కోసివేసి బోట్లకు తాళ్లు కట్టి హార్బర్‌కు దూరంగా తీసుకెళ్లిపోయారు. దీంతో చాలా బోట్లను అగ్ని ప్రమాదం నుంచి కాపాడగలిగారు. లేదంటే మరిన్ని బోట్లు కాలిపోయి ఉండేవి. ఇన్సూరెన్స్ లేదాయే.. మరోవైపు బోట్లకు ఏళ్ల తరబడి బీమా సదుపాయం లేదు. దీంతో ప్రమాదవశాత్తూ ఈ బోట్లు కాలిపోయినా, మునిగిపోయినా యజమానికి బీమా సొమ్ము రాదు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం వరకు వీటికి ఇన్స్యూరెన్స్‌కు వీలుండేది. అయితే దేశంలో కొంతమంది తప్పుడు క్లెయిమ్‌లకు పాల్పడుతున్నారని తేలడంతో కేంద్రం బోట్లకు బీమా సదుపాయాన్ని ఎత్తివేసింది. అప్పట్నుంచి బోట్లు ఇన్సూరెన్స్‌కు నోచుకోవడం లేదు. బీమా సదుపాయం ఉండి ఉంటే ఈ ప్రమాదంలో కాలిపోయిన బోట్లకు పరిహారం అందేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఊపిరి పీల్చుకున్నా.. బోటు మీద వచ్చే ఆదాయంతోనే నా కుటుంబం జీవిస్తోంది. బోటు కాలిపోవడంతో రాత్రంతా నిద్ర లేదు. ఎలా జీవిస్తామన్న భయం కూడా వెంటాడింది. కాలిపోయిన బోటుకు 80 శాతం పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రకటించడం చాలా ఆనందం వేసింది. ఈ విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. – పోలయ్య, బోటు యాజమాని, సీఎంకి ధన్యవాదాలు గత 20 ఏళ్ల నుంచి ఫిషింగ్ హార్బర్లో బోటు నడుపుతున్నాను. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. హార్బర్లో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఎవరో ఆకతాయులు చేసిన పనికి ప్రభుత్వం స్పందించి సహాయం అందించింది. ఊహించిన దాని కన్నా ప్రభుత్వం ఎక్కువగానే సహాయం చేస్తోంది. సీఎం జగన్మోహన్రెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజుకు ధన్యవాదాలు. – యాగ శ్రీనివాసరావు, బోటు యాజమాని, -
మత్స్యకారుల పట్ల సీఎం జగన్ ఉదారత
సాక్షి, తాడేపల్లి: విశాఖ ఫిషింగ్ హార్బర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారత చాటుకున్నారు. వారికి కనీవినీ ఎరుగని రీతిలో సహాయం ప్రకటించారు సీఎం జగన్. బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారుల జీవితాలను నిలబెట్టేలా సహాయం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదస్తలికి మంత్రి అప్పలరాజు, జిల్లా కలెక్టర్‌ను పంపి మత్స్యకారులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ‘ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం మత్స్యకారుల జీవితాలకే పెద్ద దెబ్బ. వారి జీవితాను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. మత్స్యకారుల జీవితాలను తిరిగి నిలబెట్టేలా సాయం ఉండాలి. బోట్లకు బీమా లేదనో.. మరో సాంకేతిక కారణాలను చూపి మత్స్యకారుల జీవితాలను గాలికి వదిలేయడం సరికాదు. కష్టకాలంలో ఉన్న మత్స్యకారులకు పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రమాద సమయాల్లో ఇబ్బంది లేకుండా ఇన్సురెన్స్ చేయించుకునేలా అధికారులు తగిన తోడ్పాటు అందించాలి. జరిగిన ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలను వెలికితీయాలి.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖ ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. యూట్యూబర్ ఎక్కడ? -
హార్బర్ లో 700 బొట్లు ఉన్నాయి...
-
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద ఘటనలో కొత్తకోణం
-
విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
30 పడవలు దగ్ధం..ఒక్కో పడవ 70 లక్షలు
-
విశాఖపట్నం : ఫిషింగ్ హర్బర్‌లో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన బోట్లు (ఫొటోలు)
-
విశాఖ ప్రమాదంపై సీఎం జగన్ ఆరా
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కాగా విశాఖ ఫిషింగ్ హర్టబర్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. దీంతో మత్స్యకారుల కుటుంబాలలో విషాదం నెలకొంది. అగ్ని ప్రమాదం ఘటనలో ఓ యూట్యూబర్‌పై కేసు నమోదు చేయాలని పోలసులు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్లో యూట్యూబర్ పార్టీ ఇచ్చినట్లు, మద్యం మత్తులో గొడవ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం యూట్యూబర్ పరారీలోఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక అగ్ని ప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలంలో ఎస్పీ వివరాలు సేకరిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగా ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఐదు గంటలు పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. చదవండి: విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. యూట్యూబర్ ఎక్కడ? -
ప్రాణాలకు తెగించి మా బోటుని కాపాడుకున్నాం కానీ..
-
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదానికి కారణం!?
-
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం
-
మత్స్యకారులకు మరింత మేలు
సాక్షి, అమరావతి: మత్స్య ఉత్పత్తుల పెంపు, మత్స్యకారులు చేపల వేటకు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను తప్పించడం, వారికి అధిక ఆదాయ మార్గాలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది. ఇందుకు సుమారు రూ.3,500 కోట్లు వ్యయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు హార్బర్ల ఆధారంగా పనిచేసే పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా తొలి దశలో రూ.1,522.80 కోట్లతో నిర్మిస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు పూర్తి కావస్తున్నాయి. దీంతో ఈ హార్బర్ల నుంచి వచ్చే మత్స్య సంపద ద్వారా మత్స్యకారులు అధికాదాయం పొందే మార్గాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద రూ.288.81 కోట్లతో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తికావడంతో ఇక్కడ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డ్‌లను ఏపీ మారిటైమ్ బోర్డు ఏర్పాటు చేస్తోంది. ఒక్క జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారానే ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద లభిస్తుందని అంచనా. ఇలా వచ్చే 30 ఏళ్లలో ఈ హార్బర్ ద్వారా మిలియన్ టన్నుల మత్స్య సంపద లభిస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు అంచనా వేసింది. దీనికి అనుగుణంగా హార్బర్‌కు వెలుపల 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. వార్షిక ఆదాయంలో వాటా లేదా వార్షిక ప్రీమియం రూపంలో ఆదాయం పొందే పద్ధతిలో ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతిపాదించింది. 30 ఏళ్ల కాలపరిమితి, ఆపైన పొడిగించుకునే విధంగా బిడ్లను ఆహ్వానించింది. బోట్ తయారీ, మరమ్మతులు కూడా.. 1,250 బోట్లు నిలుపుకునే విధంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 9ఎం ఎఫ్ఆర్పీ రకం బోట్లు 1,000, 12 ఎం గిల్ నెట్టర్ బోట్లు 100, 15ఎం ట్రావెలర్ 100 బోట్లు, 24ఎం టూనా లాంగ్ లైనర్ బోట్లు 50 నిలుపుకునేలా హార్బర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడే బోట్లు తయారీ, మరమ్మతుల యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతిపాదించింది. ఇందుకోసం 5 ఎకరాల్లో బోట్ బిల్డింగ్ యార్డ్‌ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది. దీన్ని కూడా 30 ఏళ్ల కాలపరిమితికి లీజు రూపంలో ఇవ్వనుంది. 555 గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి రాష్ట్రంలో మత్స్యకారులు చేపల వేట కోసం కుటుంబాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే అవసరం లేకుండా సీఎం వైఎస్ జగన్ ఏకకాలంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. వీటి ద్వారా రాష్ట్రంలో 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. కేవలం ఫిషింగ్ హార్బర్లు కట్టి వదిలేయడమే కాకుండా పట్టిన చేపలకు మంచి విలువతో పాటు స్థానిక మత్స్యకారులకు ఉపాధి లభించే విధంగా హార్బర్ ఆధారిత పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డ్‌లతో పాటు ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా జువ్వలదిన్నె వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు బోట్ బిల్డింగ్ యార్డ్ ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. ఈ హార్బర్‌ను నవంబర్‌లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే హార్బర్ల వద్ద పర్యాటకంగా ఉండే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు, వీసీ–ఎండీ, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ -
తీరంలో మెగా ప్రాజెక్ట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ సముద్ర తీరంలో మెగా ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. నరసాపురం తీర ప్రాంతంలో దశాబ్దాల కలగా ఉన్న ఫిషింగ్ హార్బర్ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. హార్బర్ నిర్మాణానికి అనువైన స్థలం, పూర్తి అవసరాలు తీర్చేలా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో హార్బర్ ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు ఖరారు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. పర్యావరణ అనుమతులతో సహా అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని రూ.429.43 కోట్లతో హార్బర్ నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. ఇప్పటికే హార్బర్ నిర్మాణ పనులను విశ్వసముద్ర సంస్థ దక్కించుకుంది. త్వరితగతిన ప్రక్రియ నరసాపురం నియోజకవర్గంలోని పీఎం లంక–బియ్యపుతిప్ప గ్రామాల మధ్య స్థలాన్ని ప్రభుత్వ భూమిని గుర్తించి హార్బర్‌కు కేటాయించారు. పనులకు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన కూడా పూర్తి చేశారు. హార్బర్ నిర్మాణానికి ఈ ఏడాది మే నెలలో ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలవగా విశ్వ సముద్ర సంస్థ పనులు దక్కంచుకుంది. వెంటనే ప్రాథమిక సర్వే ఆ సంస్థ చేపట్టింది. నిర్మాణానికి సంబంధించి సరుకుల రవాణా కోసం రోడ్డు మార్గాలు చూసుకోవడం, ప్రాజెక్ట్ స్వరూపంపై సర్వే చేయడం లాంటి పనులు పూర్తి చేసుకుని పనులను కొద్దిరోజుల్లో ప్రారంభించనుంది. దశాబ్దాల కల : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం నియోజకవర్గంలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఈ ప్రాంతంలో బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ ప్రాంతంలో 10 వేల మత్స్యకార కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే మత్స్యకారుల సంక్షేమంపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. దీంతో బియ్యపుతిప్ప హార్బర్ డిమాండ్ అలాగే ఉండిపోయింది. మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో ఉమ్మడి పశ్చిమకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఇక కొత్తగా ఏర్పడ్డ డెల్టా ప్రాంతంతో కూడిన పశ్చిమగోదావరి జిల్లా నుంచి దేశ, విదేశాలకు భారీగా ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. రొయ్యలు, చేపల సాగు పెరగడంతో ఆక్వా రంగం పుంజుకుంది. ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆక్వా రంగం నుంచి జిల్లాకు వస్తోంది. ఇటు తీర ప్రాంతంలో సముద్ర మత్స్యసంపద ద్వారా కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. ఏటా నరసాపురం తీరంలో రూ.300 కోట్ల విలువ చేసే మత్స్య ఎగుమతులు సాగుతాయి. హార్బర్ లాంటి మౌలిక వసతులు ఉంటే మరో 40 శాతం ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. వేగంగా పనులు పూర్తిచేసేలా.. బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని దశాబ్దాలుగా మత్స్యకారులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కలను సాకారం చేశారు. హార్బర్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు, సాంకేతిక అనుమతులు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో పనులు మొదలు పెడతారు. పనుల్లో తాత్సారం లేకుండా నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేసేలా టెండర్‌దారుడితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. –ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ -
మరో ఫిషింగ్ హార్బర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే రెండు దశల్లో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 10వ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట వద్ద దీనిని ఏపీ మారిటైమ్ బోర్డు నిర్మించనుంది. రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతం 974 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 555 మత్స్యకార గ్రామాలకు చెందిన 6.3 లక్షల మంది మత్స్యకార కుటుంబాలకు స్థానికంగానే ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,520 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తొలి దశలో రూ.1,522.8 కోట్లతో నిర్మిస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నాలుగు హార్బర్లను వచ్చే డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రెండో దశలో రూ.1,997.77 కోట్లతో నిర్మిస్తున్న బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపుతిప్ప, వోడరేవు ఫిషింగ్ హార్బర్ల పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఫిషింగ్ హార్బర్‌గా మార్పు 2019 సెప్టెంబర్ 6న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచినీళ్లపేటవద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులు సీఎంను కలిసి ఇక్కడ కూడా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి కోరిక మేరకు అక్కడ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏపీ మారిటైమ్ బోర్డును ఆదేశించారు. ఈ మేరకు పీఎం మత్స్య సంపద యోజన పథకం కింద మంచినీళ్లపేట వద్ద హార్బర్ నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన కేంద్రం సమగ్ర ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది. దీంతో డీపీఆర్ తయారీకి టెక్నికల్ కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయడం కోసం ఏపీ మారిటైమ్ బోర్డు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను పిలిచింది. ఆగస్టు 23 మధ్యాహ్నం మూడు గంటలలోపు ఆసక్తి గల సంస్థలు బిడ్లు దాఖలు చేయాలని కోరింది. మొత్తంగా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పది ఫిషింగ్ హార్బర్ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీటికి అదనంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేలటూరు వద్ద అదానీ గ్రూపు సుమారు రూ.25.84 కోట్లతో ఫిషింగ్ జెట్టీని నిర్మిస్తోంది. ఈ జెట్టీ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ 2022 అక్టోబర్ 27న భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫిష్ ల్యాండ్ సెంటర్ : చిన్న పడవలు, ఇంజిన్ బోట్లు నిలుపుకోవడానికి, చేపలు ఆరబెట్టుకునేందుకు అవకాశం. రూ.10 కోట్ల ఖర్చుతో నిర్మాణం. ఫిషింగ్ హార్బర్ : పెద్ద బోట్లు నిలుపుకునేందుకు బెర్త్‌లు, జెట్టీల నిర్మాణం. చేపల స్టోరేజ్‌కు అవకాశం. నిర్మాణ ఖర్చు రూ.150 కోట్ల వరకు ఉంటుంది. ఇక్కడ ఆగే బోట్లు సముద్రంలో చాలా దూరం వెళ్లగలవు. ఒక్క మాటలో చెప్పాలంటే మినీ పోర్ట్. -
శరవేంగంగా సాగుతున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు
-
Andhra Pradesh: మినీ పోర్టులా ఉప్పాడ!
(ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నుంచి సాక్షి ప్రతినిధి చంద్రశేఖర్ మైలవరపు): ఉప్పాడ వద్ద రాష్ట్ర ప్రభుత్వం రూ.361 కోట్లతో భారీ ఫిషింగ్ హార్బర్‌ను వేగవంతంగా నిర్మిస్తుండటం పట్ల స్థానిక మత్స్యకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న మంచి రోజులు కనుల ముందు కనిపిస్తున్నాయి. అన్ని పనులూ పూర్తి చేసుకుని డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుండటంతో మత్స్యకార కుటుంబాల్లో సంతోషం అంతా ఇంతా కాదు. ఇకపై తమ కష్టం వృథా కాదన్న ధీమా ఏర్పడిందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో కాకినాడ వద్ద అత్యంత విలువైన ట్యూనా, సొర వంటి చేపలు ఉన్నా.. సరైన వసతులు లేకపోవడంతో మత్స్యకారులు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. నడి సముద్రంలోకి వెళ్లి పది రోజుల వరకు ఉండి చేపలు పట్టుకునే భారీ స్థాయి బోట్లను నిలుపుకునే చోటు లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం చక్కటి పరిష్కారాన్ని చూపిస్తూ రాష్ట్రంలోనే భారీ ఫిషింగ్ హర్బర్‌ను ఉప్పాడ వద్ద నిర్మిస్తోంది. మిగిలిన హార్బర్లలో సముద్రం నుంచి లోతైన కాలువను తవ్వి అక్కడ బోట్లు నిలుపుకోవడానికి జెట్టీలను నిర్మిస్తుంటే.. ఉప్పాడ వద్ద మాత్రం పోర్టు మాదిరిగానే సముద్ర ఒడ్డుకు ఆనుకునే బోట్లను నిలుపుకునే విధంగా హార్బర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 55 శాతం పనులు పూర్తి చేసుకున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌ను ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఉత్తర, దక్షిణ బ్రేక్ వాటర్ పనులు పూర్తి స్థాయిలో పూర్తవగా.. డ్రెడ్జింగ్ పనులు, ఒడ్డున బిల్డింగ్‌ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2,500 బోట్లు నిలుపుకునేలా.. ♦ రెండ్రోజుల నుంచి 10 రోజుల వరకు ఏకబిగిన వేట కొనసాగించే విధంగా వివిధ పరిమాణాల బోట్లను నిలుపుకునేందుకు అనువుగా ఈ హార్బర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ♦ సుమారు 2,500 బోట్లను నిలుపుకునేలా జెట్టీని నిర్మిస్తున్నారు. ♦ దాదాపు 58 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ హార్బర్లో ఫిషింగ్ హ్యాండ్లింగ్, వేలం కేంద్రం, పది టన్నుల ఐస్ ప్లాంట్, 20 టన్నుల శీతల గిడ్డంగి, పరిపాలన కార్యాలయాలతో పాటు ట్యూనా చేపల కోసం ప్రత్యేకంగా ట్యూనా ఫిష్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ♦ ట్యూనా చేపలు పట్టుకునేందుకు వీలుగా తొమ్మిది మీటర్ల నుంచి 24 మీటర్ల వరకు ఉండే లాంగ్‌లైన్ బోట్లను ఇక్కడ నిలుపుకునే అవకాశముంది. ♦ ఈ ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏటా రూ.859 కోట్ల విలువైన 1,10,600 టన్నుల మత్స్య సంపద వస్తుందని అధికారుల అంచనా. 17,700 మందికి ఉపాధి లభించనుంది. పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం రాష్ట్రంలోని మత్యకారులు వేట కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలు వలస వెళ్లకుండా స్థానికంగానే చేపలు పట్టుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏక కాలంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. తొలి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లయిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలు ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సుమారు రూ.3,500 కోట్లకు పైగా నిధులతో 60,858 మత్యకార కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా వీటిని నిర్మిస్తున్నాం. మినీ పోర్టు తరహాలో వీటి నిర్మాణం చేపట్టడమే కాక వీటిపక్కనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – ప్రవీణ్‌కుమార్, సీఈఓ, ఏపీ మారిటైమ్ బోర్డు త్వరలో మంచి రోజులు ఇప్పటి వరకు బోట్లు నిలుపుకోవడానికే సరైన సదుపాయాల్లేక ఐదారుచోట్ల నిలుపుకునేందుకు నానా అవస్థలు పడుతుండేవాళ్లం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తే మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. కానీ, ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలుపుకోవడం దగ్గర నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి. దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50,000 మత్యకార ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవ్వరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్ గతంలో ఎంతటి భారీ చేప తీసుకొచ్చినా పొద్దున రూ.1,000 ధర ఉంటే సాయంత్రం రూ.500కు పడిపోయేది. దీంతో బాగా నష్టపోయే వాళ్లం. ఇప్పుడు ఈ హార్బర్ రావడం.. ఇక్కడ శీతల గిడ్డంగులు ఉండటంతో ఆ భయం ఉండదిక. నచ్చిన ధర వచ్చినప్పుడే అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. గతంలో హార్బర్ లేకపోవడం వల్ల పోటు సమయంలో బోటు నిలుపుకోవడానికి కష్టంగా ఉండేది. సరుకు దింపే సమయంలో ప్రమాదాలు జరిగేవి. మనుషులు గల్లంతైన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడా భయాలు మాకు ఉండవు. సునామీ వచ్చినా మా పడవలు భద్రంగా నిలుపుకోవచ్చు. – ఉమ్మడి యోహాను, మత్స్యకారుడు, ఉప్పాడ -
దేవతల్లా యజ్ఞం చేస్తున్నాం.. రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు
చంద్రబాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే... అందులో పేదవర్గాలు కేవలం పాచి పనులు మాత్రమే చేయాలి. రోజువారీ పనులు చేసే కార్మికులుగానే ఉండాలి. వాళ్లెవరికీ అక్కడ ఇళ్లు ఉండకూడదు! వాళ్లు అమరావతిలో పొద్దున్నే ఎంటరై పనులు చేసి తిరిగి వెనక్కి పోవాలి!! రాజధాని పేరుతో పేదలకు ఏమాత్రం ప్రవేశం లేని ఓ గేటెడ్ కమ్యూనిటీని చంద్రబాబు ప్రభుత్వ ధనంతో కట్టుకోవాలనుకున్నారు. ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా?. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో నాలుగేళ్లుగా పేదలకు మంచి జరగకూడదన్న లక్ష్యంతో చంద్రబాబు బృందం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. పేదలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోయి పాచి పనులు చేసుకుంటూ బతకాలనే దుర్బుద్ధి కలిగిన రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామన్నారు. అమరావతిలో కేవలం చంద్రబాబు, ఆయన బినామీలే ఉండాలని, పేదలకు అక్కడ స్థానమే లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లటి దీవెనలతో ఆ అడ్డంకులను అధిగమించి అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 26వతేదీన అమరావతిలో 50 వేల మందికి పైగా పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.5,156 కోట్ల వ్యయంతో చేపట్టిన బందరు పోర్టు నిర్మాణానికి సోమవారం కృష్ణా జిల్లా మంగినపూడి సమీపంలోని తపసిపూడి వద్ద సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. సభలో ప్రసంగిస్తున్న సీఎం జగన్, బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం సముద్ర వాణిజ్యంతో శతాబ్దాల చరిత్ర బందరుకు సముద్ర వాణిజ్యంతో శతాబ్దాల చరిత్ర ఉంది. చిరకాల స్వప్నం బందరు పోర్టును సాకారం చేస్తూ మనందరి ప్రభుత్వం అన్ని కోర్టు కేసులను అధిగమించి భూసేకరణ కూడా పూర్తి చేసింది. అన్ని అనుమతులు సాధించి ఫైనాన్షియల్ క్లోజర్‌ను పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ముగించి పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించాం. దాదాపు 35 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో పోర్టు ప్రారంభమవుతుంది. నాలుగు బెర్తులు ఇక్కడ రానున్నాయి. ట్రాఫిక్ పెరిగే కొద్దీ బెర్తుల సంఖ్యను పెంచుకుంటూ 116 మిలియన్ టన్నుల కెపాసిటీ వరకు విస్తరించుకోవచ్చు. పోర్టుతో రోడ్లు, రైల్వే లైన్ అనుసంధానం బందరు పోర్టు నిర్మాణంతో పాటు అనుబంధంగా మౌలిక వసతుల పనులు కూడా చేపడుతున్నాం. కేవలం 6.5 కి.మీ. దూరంలో ఉన్న 216వ నెంబర్ జాతీయ రహదారిని పోర్టు వరకు అనుసంధానించేలా చర్యలు చేపట్టాం. దీంతోపాటు 7.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడివాడ, మచిలీపట్నం రైల్వే లైనును కూడా పోర్టు వరకు తీసుకొచ్చి అనుసంధానిస్తున్నాం. బందరు కాలువ నుంచి 0.5 ఎం.ఎల్.డీ నీటిని 11 కిలోమీటర్ల మేర పైపులైన్ ద్వారా తరలించి పోర్టుతో అనుసంధానం చేస్తున్నాం. దీనివల్ల సరుకుల ఎగుమతి, దిగుమతికి అత్యంత మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది. మన పోర్టు రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రంగా అందుబాటులోకి వస్తుంది. పోర్టును అడ్డుకున్న బాబు.. బందరు పోర్టు రాకూడదని చంద్రబాబు అడుగులు వేశారు. 22 గ్రామాలు, 33 వేల ఎకరాలను తీసుకునేందుకు భూములన్నీ నోటిఫై చేసి రైతులెవరూ వాటిని అమ్ముకునే పరిస్థితి లేకుండా అందరినీ ఇబ్బందులకు గురి చేశారు. మచిలీపట్నంలో పోర్టు రాకపోతే అమరావతిలో తన బినామీల భూముల రేట్లు విపరీతంగా పెంచుకోవచ్చనే దుర్బుద్ధితో మచిలీపట్నానికి తీరని ద్రోహం చేశాడు. సంతోషంగా ఇచ్చిన భూములతో.. ఈరోజు పోర్టు నిర్మాణానికి 1,700 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాం. రైలు, రోడ్డు మార్గానికి కేవలం మరో 240 ఎకరాలు మాత్రమే భూసేకరణ జరిగింది. రైతులందరూ మనస్ఫూర్తిగా ఇచ్చిన 240 ఎకరాలు తీసుకుని పోర్టు నిర్మాణంలోకి వస్తుంది. ఇక్కడ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. వాటిలో 4 వేల ఎకరాలను పోర్టుతో అనుసంధానించి పరిశ్రమలు వచ్చేలా చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగాలకు ఊతం పడినట్లు అవుతుంది. మారిన బందరు రూపురేఖలు మరో 24 నెలల వ్యవధిలో ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయి. మచిలీపట్నంలో పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయి. మచిలీపట్నం రూపురేఖలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా మారుతున్నాయో చూడండి. జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉండేలా మచిలీపట్నం జిల్లా కేంద్రం ఏర్పాటైంది. బందరులో దాదాపు రూ.550 కోట్లతో చేపట్టిన కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కావస్తోంది. ఈ సంవత్సరమే ఆగస్టు, సెప్టెంబరులో అడ్మిషన్లు జరగనున్నాయి. దీనివల్ల అవనిగడ్డ, పెడన, పామర్రు, గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. మా నమ్మకం నువ్వే జగనన్నా.. అంటూ ఫ్లకార్డులు చేబూనిన జనం మరో నాలుగు నెలల్లో ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులు ఆరాధించే నాగుల్‌మీరా సాహెబ్ ఆశీస్సులతో ఏ సమయంలోనైనా మత్స్య సంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు వీలుగా ఇక్కడే మరో రూ.420 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఈ ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి వస్తుంది. ఇక్కడే ఇమిటేషన్ జ్యూయలరీ తయారీకి మద్దతుగా కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని నా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రూ.7.65 నుంచి మనం అధికారంలోకి రాగానే రూ.3.75లకు తగ్గించాం. ఫిషింగ్ హార్బర్లు.. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే ఐదింటిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో 4–5 నెలల్లో పనులు పూర్తవుతాయి. మిగిలినవి త్వరితగతిన పూర్తయ్యేలా అడుగులు వేస్తున్నాం. ఆరు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల పనులూ వేగంగా జరుగుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల కోసం రూ.3,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేద కుటుంబాల్లో వెలుగులు పేదరికాన్ని సమూలంగా తొలగించి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు రూ.2.10 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశాం. ఇక నాన్ డీబీటీ కూడా కలిపితే, అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన 30 లక్షలకుపైగా ఇంటి స్ధలాలను కూడా కలిపితే.. ఒక్కో ఇంటి స్ధలం విలువ కనీసం రూ.2.50 లక్షలు వేసుకున్నా వాటి విలువ రూ.75 వేల కోట్లు ఉంటుంది. నాన్ డీబీటీ కూడా కలిపితే రూ.3 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. మరోవైపు 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా ఇళ్ల పట్టాలు, ఇళ్లతో అక్కచెల్లెమ్మలకు రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల ఆస్తి వారి చేతిలో పెట్టినట్లవుతుంది. ఆర్వోబీ.. కమ్యూనిటీ హాళ్లకు ఓకే ఎమ్మెల్యే పేర్ని నాని నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి అడిగారు. మెడికల్ కాలేజీ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి కోసం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాం. 6 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేస్తున్నాం. అంబేడ్కర్ భవన్ మరమ్మతులకు రూ.5 కోట్లు కేటాయిస్తున్నాం. మరో 12 గ్రామాలకు సంబంధించి ఎంజాయ్మెంట్ సర్వే పూర్తైన 12,615 ఎకరాలకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించాలని కలెక్టర్‌కు ఇక్కడి నుంచే ఆదేశాలు ఇస్తున్నాం. త్వరలో ఇవ్వబోయే అసైన్డ్ భూములు, లంక భూములకు సంబంధించిన పట్టాలతో పాటు వీరికి కూడా పట్టాలిస్తాం. రాక్షసులు.. వికృత ఆలోచనలు! అమరావతి ప్రాంతంలో 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని రెండేళ్ల క్రితమే ప్రారంభించాం. కానీ దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టుగా టీడీపీ, గజదొంగల ముఠా అడ్డుపడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీరికి ఒక దత్తపుత్రుడు కలిశాడు. వీళ్ల పని దోచుకోవడం పంచుకోవడం.. తినుకోవడమే. రాజధాని పేరుతో పేదవాళ్లకు ఏమాత్రం ప్రవేశం లేని ఓ గేటెడ్ కమ్యూనిటీని ప్రభుత్వ ధనంతో కట్టుకోవాలనుకున్నారు. అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల స్ధలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించే కార్యక్రమానికి ఈనెల 26న శ్రీకారం చుడుతున్నాం. పేదల ఇళ్ల కష్టాలు తెలుసా పెద్దమనిషి? అమరావతి పరిధిలో మీ బిడ్డ ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమిని ఉచితంగా ఇచ్చి ఇల్లు కూడా ఉచితంగా కట్టిస్తూ 50 వేల మంది కలలను నిజం చేస్తుంటే ఆ పవిత్ర స్థలాన్ని చంద్రబాబు స్మశానంతో పోలుస్తాడు. పేదలకు ఆయన ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఇస్తుంటే శ్మశానంతో పోలుస్తాడు. ఇలాంటి మనిషికి మానవత్వం ఉందా ? ఆ పెద్దమనిషికి పేదల కష్టాల గురించి అవగాహన ఉందా? సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివసించే పేదలు ఎలా జీవిస్తున్నారో కనీసం అవగాహన ఉందా? ఆ కుటుంబాలలో ఎవరైనా ఒక మనిషి చనిపోతే శవాన్ని ఆసుపత్రి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలో దిక్కు తోచని దుస్థితిలో అద్దె ఇళ్లలో ఎలా బతుకీడుస్తున్నారో కనీస స్పృహ ఉందా? కడసారి కూడా చూసుకునే భాగ్యం లేని పరిస్థితుల్లో, గుండెల నిండా బాధ ఉన్నా ఎక్కడకు వెళ్లి ఏడవాలో తెలియక శ్మశానాల వద్ద తల్లడిల్లుతున్న పరిస్థితుల్లో ఎలా ఉంటున్నారో ఆలోచన చేయమని అడుగుతున్నాం. చివరకు ఒక పక్షి సైతం ఒక గూడు కట్టుకోవాలని అనుకుంటుంది. తన పిల్లలతో పాటు ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా సొంత ఇళ్లు కట్టుకోలేని పరిస్థితుల్లో లక్షల మంది పేదలున్నారు. ఇది మానవత్వం లేని మనుషుల్లో కూడా పరివర్తన తెచ్చే విషయం. కానీ చంద్రబాబుకు మానవత్వం లేదు. పేదలకు మేలు చేసే కార్యక్రమాలను దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు. ఆలోచన చేయండి. మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. పేదల దగ్గరకు వచ్చి మేం ఫలానా మంచి చేశామని చెప్పుకోలేని పరిస్థితి వాళ్లది. వారి ఆలోచనలన్నీ కుళ్లు, కుతంత్రాలే. దత్తపుత్రుడ్ని, మీడియాను నమ్ముకుంటారట! వీళ్లంతా ఏకమైతే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించగలుగుతార? వారంతా ఏకమైతే మంచి చేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ ఎన్నికల్లో గెలవడమే కష్టమట! మీ గుండెలపై చేతులు వేసుకుని ఒక్కసారి ఆలోచన చేయండి. మీ బిడ్డ పాలనలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికులుగా నిలవండి. 4 పోర్టులు.. లక్ష ఉద్యోగాలు ఇప్పటివరకు రాష్ట్ర పోర్టుల వార్షిక సామర్ధ్యం 320 మిలియన్ టన్నులు కాగా 2025–26 నాటికి అదనంగా మరో 110 మిలియన్ టన్నులు పెంచేలా అడుగులు వేస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో నాలుగు చోట్ల 6 పోర్టులు మాత్రమే ఉండగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలోనే రూ.16 వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్టుల పనులు వేగంగా జరిగేలా అడుగులు వేశాం. కాకినాడ వద్ద గేట్‌వే పోర్టు నిర్మాణం జరుగుతోంది. ఒక్కో పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం 25 వేల ఉద్యోగాలు వస్తాయి. నాలుగు పోర్టులు అందుబాటులోకి రాగానే లక్ష ఉద్యోగాలు దక్కుతాయి. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపనతో కల సాకారం: సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు కలగా మిగిలిన మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి మన ప్రభుత్వంలో సోమవారం శంకుస్థాపన చేశాం.. అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘నాలుగు బెర్తులతో దాదాపు 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్ట్‌ను నిర్మిస్తున్నాం. అలాగే కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా ఈ పోర్ట్‌ను జాతీయ రహదారి–216కి, గుడివాడ–మచిలీపట్నం రైల్వేలైన్‌కు అనుసంధానం చేస్తున్నాం’ అంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. సముద్ర తీరంలో సీఎం పూజలు సముద్రుడికి పట్టువస్త్రాలు సమర్పించి హారతి సాక్షి ప్రతినిధి, విజయవాడ: బందరు పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సముద్ర తీరంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. హెలీప్యాడ్ నుంచి పోర్టు నిర్మాణ పనులు జరిగే తపసిపూడి గ్రామ తీరానికి ఉదయం చేరుకున్నారు. ముందుగా దుర్గమ్మ చిత్రపటం వద్ద పూజలు చేసి వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సాగరుడికి హారతి ఇచ్చారు. అనంతరం సముద్రుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం జెండా ఊపి కొండరాళ్లను సముద్రంలో వేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో మత్స్యకారులు సముద్రంలో బోట్లపై పార్టీ జెండాలను రెపరెపలాడిస్తూ శుభాభినందనలు తెలిపారు. అనంతరం పోర్టు పనుల ఫైలాన్‌ను సీఎం జగన్ ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ప్రారంభించారు. -
ఉత్తరాంధ్రలో కొత్త చరిత్ర.. నౌపడ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
మనం అధికారంలోకి రాక ముందు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా కూడా ఈ రాష్ట్రం మొత్తం మీద నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులు మాత్రమే ఉన్నాయి. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక, ఈ 46 నెలల కాలంలో మరో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. మరో మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇవి కాకుండా మరో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు అప్రూవల్ తీసుకున్నాం. వేగవంతంగా నిర్మాణంలోకి తీసుకువస్తాం. తద్వారా పారిశ్రామికాభివృద్ధికి తీర ప్రాంతం వేదిక అవుతుంది. లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నౌపడ నుంచి సాక్షి ప్రతినిధి: మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, గొట్టా బ్యారేజీ ఎత్తిపోతల పథకం, మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టుల ద్వారా రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. విశాఖ నుంచి 170 కిలోమీటర్లు, చెన్నై– కోల్‌కతా నేషనల్ హైవేకు కేవలం 14 కిలోమీటర్లు, ప్రధాన రైల్వే మార్గానికి 11 కిలోమీటర్ల దూరంలో 1,250 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమవుతున్న మూలపేట పోర్టు.. రానున్న రోజుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇక్కడే 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని చెప్పారు. పోర్టు ఆధారిత, అనుబంధ పరిశ్రమలు, ఇతరత్రా లక్షల్లో మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందివచ్చే కార్యక్రమం చేపడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని మూలపేట తీరంలో పోర్టు నిర్మాణానికి, ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్, గొట్టా బ్యారేజ్ నుంచి హిరమండలం రిజర్వాయర్ ఎత్తిపోతల పథకానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా సంతబొమ్మాళి మండలంలోని నౌపడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సముద్రతీరం ఉంటే, అందులో ఏకంగా 193 కిలోమీటర్లు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఉందన్నారు. అయినా ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, కనీసం ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఉండి ఉంటే ఈ జిల్లా చెన్నై, ముంబయిగా అభివృద్ధి చెంది ఉండేదని చెప్పారు. ఈ విషయం తెలిసీ కూడా దశాబ్దాలుగా ఎవ్వరూ ఈ దిశగా అడుగులు వేసి, చిత్తశుద్ధి చూపలేదన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. ఇంకా ఏమన్నారంటే.. అభివృద్ధికి మూల స్తంభం ► మూలపేట ఇక మూలనున్న గ్రామం కాదు. ఇది అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తుంది. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలు రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మరో చెన్నై, ముంబయి కాబోతున్నాయి.మూలపేటలో మనం కట్టబోతున్న పోర్టు సామర్థ్యం ఏకంగా ఏడాదికి 24 మిలియన్ టన్నులు. ఈ పోర్టులో 4 బెర్తులు నిర్మిస్తున్నాం. ► ఈ రోజు నుంచి 24 నెలల్లో ఈ పోర్టు నిర్మాణం పూర్తవుతుంది. దాదాపు రూ.2,950 కోట్ల ఖర్చుతో పోర్టు నిర్మాణం చేపడుతున్నాం. ఇక్కడ ట్రాఫిక్ పెరిగి ఈ పోర్టు సామర్థ్యం వంద మిలియన్ టన్నులకు పెరిగే రోజు సమీపంలోనే ఉంది. దీన్ని ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడానికి 14 కిలోమీటర్ల పొడవున రోడ్డు, 11 కిలోమీటర్ల పొడవున రైలుమార్గం నిర్మిస్తున్నాం. ► ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టా బ్యారేజీ నుంచి పైపులైన్ వేసి 0.5 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటి సరఫరా చేయడానికీ శ్రీకారం చుడుతున్నాం. ఇలా మౌలిక వసతులకు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తదితర వ్యయాలను కలిపితే మూలపేట పోర్టు నిర్మాణానికి మనందరి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొమ్ము రూ.4,362 కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా. గంగపుత్రుల కళ్లల్లో మరింత కాంతి గంగపుత్రుల కళ్లల్లో మరిన్ని కాంతులు నింపడానికి, మత్స్యకార సోదరులకు మరింత అండగా ఉండేందుకు మూలపేట పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. రూ.365.81 కోట్లతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. మంచినీళ్లపేటలో రూ.12 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి 2019 సెప్టెంబర్‌లో శ్రీకారం చుట్టాం. దాన్ని మరో రూ.85 కోట్ల ఖర్చుతో ఫిషింగ్ హార్బర్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. రైతుల శ్రేయస్సే లక్ష్యం ► వంశధార, నాగావళి నదులు ఉన్నప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల శ్రీకాకుళం జిల్లా ఇప్పటికీ సస్యశ్యామలం కాని పరిస్థితి. అప్పట్లో దివంగత నేత, నాన్న గారు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వంశధార ఫేజ్ 2, స్టేజ్ 2 కింద 33 కిలోమీటర్ల పొడవున కాలువల తవ్వకం, హిరమండలం రిజర్వాయర్‌ను 19 టీఎంసీల కెపాసిటీతో నిర్మాణ పనులకు అడుగులు వేగంగా వేయించారు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయాక ఆ అడుగులు ముందుకు పడలేదు. ► నేరడి బ్యారేజ్ పూర్తయితే తప్ప హిరమండలం రిజర్వాయర్‌లో 19 టీఎంసీల కెపాసిటీతో నీరు పెట్టడం సాధ్యం కాదు. మీ బిడ్డ గతంలో ఏ ముఖ్యమంత్రి చూపని చొరవ చూపించారు. ఒడిశాకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిని కలిసి నేరడి బ్యారేజ్ గురించి మాట్లాడారు. దాని పరిస్థితి అలానే ఉన్నా మధ్యేమార్గంగా మన రైతన్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి జరగాలన్న ఉద్దేశంతో రూ.176.35 కోట్లతో గొట్టా బ్యారేజ్‌పై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా తీసుకొస్తున్నాం. ► మరోవైపు వంశధార, నాగావళి నదుల అనుసంధానం కూడా ఆగçస్టు నెలలోనే పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తాం. మహానేత రాజశేఖరరెడ్డి మొదలు పెట్టిన మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేసేందుకు, మూడు నియోజకవర్గాల రూపురేఖలను మార్చేందుకు మరో రూ.400 కోట్లు ఖర్చయ్యే పనులకు ఈ రోజు శ్రీకారం చుట్టాం. ఉద్దానంలో కిడ్నీ బాధితులకు ఊరట ► ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక మొదలు పెట్టిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. జూన్‌లో ప్రారంభోత్సవం చేస్తాను. ► హిరమండలం రిజర్వాయర్ నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమానికి రూ.700 కోట్లతో నాంది పలికాం. దీన్ని జూన్ మాసంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను. అదే రోజున పాతపట్నం నియోజకవర్గంలో మరో రూ.265 కోట్లతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తూ శంకుస్థాపన చేస్తాను. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బేరీజు వేయండి ► ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధికి సంబంధించిన పరిస్థితులను ఒక్కసారి బేరీజు వేయండి. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, పార్వతీపురం, నర్సీపట్నం, విజయనగరంలో మెడికల్ కాలేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ► ఈ ప్రాంతంలో ఈ 46 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం నాలుగు కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్న విషయం గమనించాలి. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీకి జూన్‌లో శంకుస్థాపన చేస్తాం. మే 3వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడానికి వీలుగా రూ.6,200 కోట్లతో ఆరు లైన్ల రహదారిని నిర్మించబోతున్నాం. తీర ప్రాంతంలో ఇలాంటి అభివృద్ధి గతంలో ఎందుకు జరగలేదో ఆలోచించండి. సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం ► ఏపీలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్నం. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి మీ బిడ్డ విశాఖలో కాపురం పెడతాడని తెలియజేస్తున్నా. ► ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా, ఏ గ్రామం తీసుకున్నా గతంలో ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి కనిపిస్తోంది. స్కూళ్లు మారుతున్నాయి. కొత్తగా మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి. ఉన్న ఆస్పత్రులన్నీ రూపురేఖలు మారుతున్నాయి. ► ప్రతి ఇల్లూ అభివృద్ధి కావాలి. నా అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనపడాలి. 46 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పైగా సొమ్మును నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసింది. ► మీ బిడ్డ జగన్ డీబీటీ బటన్ నొక్కటం మాత్రమే కాదు... కులాలు, కుటుంబ చరిత్రలను మార్చాలన్న తపన, తాపత్రయంతో పని చేస్తున్నాడని గుర్తించాలి. నవరత్నాల పాలనతో ఇంటింటి చరిత్రను, సామాజిక వర్గాల చరిత్రను తిరగ రాస్తున్న ప్రభుత్వంగా, ప్రాంతాల చరిత్రలను, పారిశ్రామిక వాణిజ్య చరిత్రను కూడా మారుస్తున్నాం. -
మత్స్యకారుల సంక్షేమానికి సీఎం జగన్ కృషి: ఎమ్మెల్యే దొరబాబు
-
Srikakulam: జెట్టీలు, ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మాణంతో సరికొత్త వెలుగులు
అటు నీళ్లు.. ఇటు కన్నీళ్లు.. దశాబ్దాలుగా సిక్కోలు మత్స్యకారుల బతుకు చిత్రమిది. కంటి ముందు అనంతమైన సముద్ర సంపద ఉన్నా పొట్ట చేత పట్టుకుని పారాదీప్ నుంచి వీరావల్ వరకు వలస వెళ్లేవారు. ఉన్న చోట బతుకు లేక, కుటుంబంతో బతకలేక కాసింత అదనపు సంపాదన కోసం అయిన వారందరినీ వదిలి ఎక్కడో అజ్ఞాతవాసం చేసేవారు. పండక్కో పబ్బానికో ఇంటికి వచ్చి కన్నవారిని, కట్టుకున్న వారిని చూసుకునేవారు. పొరపాటున అక్కడేదైనా జరిగితే ఆఖరి చూపు కూడా ఉండదు. జిల్లాలో ఒక్క పోర్టు ఉన్నా, ఒక్క ఫిషింగ్ జెట్టీ నిర్మించి ఉన్నా ఇలాంటి యాతన ఉండేది కాదు. ఇంతకాలానికి సిక్కోలు తీరానికి మణిహారంలా ఓ పోర్టు రాబోతోంది. ఇన్నాళ్లకు గంగపుత్రుల బెంగ తీరేలా జెట్టీలు కట్టబోతున్నారు. ఈ ఆలోచన వెనుక ఉన్న పేరు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కడలి బిడ్డల బతుకులు మార్చేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దశాబ్దాలుగా ఉపన్యాసాలు మాత్రమే వింటున్న సిక్కోలు మత్స్యకారులకు ఇప్పుడు పని కనిపిస్తోంది. హామీలు మాత్రమే తెలిసిన గంగపుత్రులకు నాయకుడి పనితనం అర్థమవుతోంది. భావనపాడు పోర్టు, మంచినీళ్ల పేటలో ఫిషింగ్ జెట్టీ, జిల్లాలో ఫిషింగ్ హార్బర్ వంటి ప్రాజెక్టులు ఇన్నాళ్లూ హామీలుగానే ఉండేవి. సీఎం వైఎస్ జగన్ చొరవతో వీటి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇవి పూర్తయితే మన గంగపుత్రులు వలస వెళ్లి బతకాల్సిన అగత్యం ఇక ఉండదు. జాతీయ స్థాయిలో 40 శాతం విదేశీ మారక ద్రవ్యం మెరైన్ సెక్టార్ నుంచే వస్తోంది. అందులో సిక్కోలు మత్స్యకారుల వాటా ఎక్కువే. కానీ మౌలిక వసతులు లేకపోవడంతో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం అభివృద్ధి చెందలేదు. జిల్లాలో 11 మండలాల పరిధిలో 145మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. స్థానికంగా వేటకు అనుకూలత లేక పొట్ట చేత పట్టుకుని వేరే రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఈ పరిస్థితి లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. జెట్టీలు, ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మాణంతో మత్స్యకారుల బతుకుల్లో సరికొత్త వెలుగులు తీసుకురావాలని భావిస్తోంది. పోర్టుకు ఫుల్ సపోర్టు జిల్లా ప్రజల దశాబ్దాల కల భావనపాడు పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. పోర్టుకు అవసరమైన భూములను మూలపేట గ్రామంలో ఎకరాకు రూ. 25లక్షలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాటి ద్వారా నిర్వాసితులకు ప్రత్యేకంగా పునరావాస కాలనీ కోసం కె.నౌపడలో ఎకరా రూ.26లక్షలు వెచ్చించి అవసరమైన భూమిని కొనుగోలు చేసి సిద్ధం చేసింది. మొత్తంగా భావనపాడు పోర్టు కోసం 675.60ఎకరాలను సేకరించింది. ఇందులో ప్రైవేటు భూములు 433.71ఎకరాలు కాగా, ప్రభుత్వ భూమి, కోస్టల్ తీరం కలిపి 241.89ఎకరాలు ఉన్నాయి. రూ.3200కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్న భావనపాడుకు త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. తూర్పు తీరంలో ఉత్తరాంధ్రలో ప్రస్తుతం విశాఖపట్టణం పోర్టు ఒక్కటి మాత్రమే జల మార్గంలో వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంది. టెక్కలిలో ప్రపంచ ప్రఖ్యాత నీలి గ్రానైట్ తదితర ఖనిజాలు లభ్యమవుతున్నాయి. ఈ గ్రానైట్‌ను అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసేందుకు భావనపాడు పోర్టు ఉపయోగపడుతుంది. అదే విధంగా జిల్లాలో విస్తారమైన 193 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సరాసరి లక్షా 95వేల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద లభిస్తోంది. ఈ విధంగా ఒకవైపు మత్స్య సంపదకు మంచి మార్కెట్ కల్పించేందుకు పోర్టు ఉపయోగపడుతుంది. ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు భావనపాడు ఓడరేవు వినియోగమవుతోంది. అడుగడుగునా అడ్డంకులు.. భావనపాడు పోర్టుకు మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులు అనుకూలంగా ఉన్నారు. భూ సర్వేకు, ఇళ్ల కొలతలన్నీ గ్రామస్తుల అభిప్రాయం మేరకే జరిగాయి. పోర్టుకు అందరు అనుకూలమని చెప్పినప్పటికీ అచ్చెన్నాయుడు డైరెక్షన్లో కొందరు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. జిల్లాకు మేలు జరిగి, అభివృద్ధికి దోహదపడే భావనపాడు పోర్టు పూర్తయితే తమకెక్కడ పుట్టగతులుండవని కుట్రపూరితంగా వ్యవహరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారి కుట్రలను చేధించి, పన్నాగాలను తిప్పికొట్టి భూసేకరణ పూర్తి చేసింది. మంచినీళ్లపేట జెట్టీకి శ్రీకారం.. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకార సమస్యలతో పాటు వలసలపై ప్రత్యేక దృష్టిసారించారు. అందులో భాగంగా స్థానికంగా వనరులు, ఉపాధి పరిస్థితులు సమకూర్చాలని ప్రణాళిక రూపొందించారు. దానిలో భాగంగానే వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేటలో రూ.11.95కోట్లతో జెట్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మిస్తుండగా.. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో కూడా రూ. 365 కోట్లతో హార్బర్ నిర్మించనున్నారు. దీని కోసం 42 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మరికొంత భూమిని కూడా సేకరిస్తోంది. త్వరలోనే దీనికి కూడా శంకుస్థాపన చేయనుంది. జరిగిన మేలు.. 2018 నవంబర్ 27న పాకిస్తాన్ భద్రతా దళాలకు వీరావల్‌లో సముద్ర వేటలో ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు పట్టుబడ్డారు. వీరు 13 నెలలు పాకిస్తాన్ కరాచీ జైలులో గడిపారు. పాక్ జైల్లో ఉన్న 20మంది మత్స్యకారుల విడుదల కోసం గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక మార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. ఈ మంతనాలు ఫలించి 2020 జనవరి 6న 20మంది విడుదలయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం కేంద్రం లాక్డౌన్ అమలు చేసినప్పుడు జిల్లాకు చెందిన మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకున్నారు. రూ.3కోట్లు ఖర్చు పెట్టి జిల్లాకు చెందిన 3064 మంది మత్స్యకారులను 46 బస్సుల ద్వారా తీసుకొచ్చారు. (క్లిక్ చేయండి: కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు..) -
ఆక్వా వర్సిటీ... ఫిషింగ్ హార్బర్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయానికి, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌కు, రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళలో మాత్రమే ఈ వర్సిటీలు ఉన్నాయి. ఆక్వా వర్సిటీ కోసం నరసాపురం పరిసర ప్రాంతాల్లోని సరిపల్లి, లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించారు. భవన నిర్మాణ పనుల కోసం రూ.332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ ఆమోదించారు. మొదటి దశలో పరిపాలన భవనంతో పాటు విద్యార్థులకు వసతి గృహాలు, విశ్వవిద్యాలయం నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. 2022–23 బడ్జెట్లో విశ్వవిద్యాలయ నిర్మాణ పనులకు రూ.40 కోట్లు కేటాయించారు. రెండవ దశ పనుల్లో భాగంగా నరసాపురం మండలం బియ్యపుతిప్ప గ్రామంలో 350 ఎకరాలలో రూ.222 కోట్ల అంచనా వ్యయంతో విశ్వవిద్యాలయ సముద్రతీర ప్రాంగణం, పరిశోధన కేంద్రం నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా మత్స్యకారులు, ఆక్వా రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు. వృత్తిపరంగా అర్హత కలిగిన మానవ వనరుల లభ్యత కారణంగా ఆక్వా రంగంలో నష్టాలను చాలా వరకు తగ్గించవచ్చు. తద్వారా దాదాపు సంవత్సరానికి రూ.4,000 నుంచి 5,000 కోట్ల ఆర్థిక ప్రయోజనం ఆక్వా రైతులకు చేకూరుతుంది. అవసరమైన సంఖ్యలో ఫిషరీస్ డిప్లొమా, బీఎఫ్ఎస్సీ, ఎంఎఫ్ఎస్సీ, పీహెచ్డీ అర్హత గల అభ్యర్థులను తయారు చేయడానికి ఆక్వా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మరిన్ని కొత్త మత్స్య కళాశాలలు, మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రారంభానికి సిద్దంగా ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి 6,000 మంది మత్స్యకారులకు లబ్ధి బియ్యపుతిప్ప వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.429.43 కోట్ల అంచనాతో ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఈ హార్బర్ నిర్మాణం ద్వారా మత్స్యకారులు అత్యంత సామర్థ్యం గల మోటారు బోట్లలో సముద్రంలో ఎక్కువ దూరం వేటకు వెళ్లేందుకు వీలుంటుంది. మార్కెటింగ్ సౌకర్యాలను పెంపొందించడం ద్వారా మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ హార్బర్ నిర్మించే ప్రదేశం నరసాపురం పట్టణానికి 14 కి.మీ. దూరంలో ఉంది. దీనివల్ల నరసాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన 6,000 మంది మత్స్యకారులు లబ్ధి పొందనున్నారు. కొల్లేటికి సముద్రపు నీటి నుంచి రక్ష సముద్రపు నీరు కొల్లేరు సరస్సులోకి చొరబడకుండా నిరోధించడానికి, కొల్లేరులో 5వ కాంటూర్ వరకు మంచి నీరు నిలువ ఉండే విధంగా ఉప్పుటేరు నదిపై కిలోమీటరు 57.950 వద్ద మొల్లపర్రు విలేజ్ లిమిట్స్‌లో రూ. 188.40 కోట్ల అంచనా వ్యయంతో రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జ్ కమ్ లాక్ నిర్మాణం కొరకు రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ నేడు దీనికి శంకుస్థాపన చేయనున్నారు. సురక్షిత తాగునీరివ్వడమే లక్ష్యంగా.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వాకల్చర్ వల్ల, తీర ప్రాంతంలో ఉప్పు నీటి సాంద్రత వల్ల ఏర్పడిన తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రూ.1,400 కోట్లతో రక్షిత నీటిసరఫరా ప్రాజెక్ట్‌ను మంజూరు చేసింది. విజ్జేశ్వరం జలాశయం నుండి గోదావరి నీటిని రాపిడ్ శాండ్ ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి, పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తుంది. ఈ పథకం ద్వారా నూతన జిల్లాలు పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరిలోని నిడుదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, ఏలూరు (పార్ట్), తాడేపల్లిగూడెం(పార్ట్) నియోజకవర్గాల ప్రజలకు, కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గుడ్లవల్లేరు మండలాల ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా చేయొచ్చు. ఈ పథకానికి నేడు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అగ్రికల్చర్ కంపెనీ భూ అనుభవదారులకు హక్కులు నరసాపురం మండలం నందలి వేములదీవి ఉప గ్రామమైన దర్బరేవు గ్రామంలో నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1921లో 1,754 ఎకరాల భూమిని నరసాపురం అగ్రికల్చర్ కంపెనీ లిమిటెడ్‌కు 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చింది. ఆ రోజు నుంచి 1,623 మంది రైతులు ఆ భూమి స్వాధీన అనుభవంలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ రైతులకు ఎటువంటి భూ యాజమాన్య హక్కులు కానీ, రెవెన్యూ రికార్డు పరమైన హక్కులు కానీ లేవు. అందువల్ల ఆ భూమిని అమ్మడానికి లేదా బ్యాంకులలో తనఖా పెట్టి రుణం పొందడానికి అర్హత లేదు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసి, ఎకరాకు రూ.100 ధర నిర్ణయించి, ఆ 1,623 మంది రైతులకు భూ యాజమాన్య, రెవెన్యూ రికార్డు పరమైన సర్వహక్కులు కల్పించింది. దీంతో రైతులు వారి వారసులు నిరభ్యంతరంగా స్వాధీనములో ఉండి ఆ భూములను అనుభవించుకోవచ్చు. అవసరాల నిమిత్తం అమ్ముకోవచ్చు. తనఖా పెట్టి ఋణాలు కూడా పొందవచ్చు. ఇందుకు సంబంధించిన హక్కు పత్రాలను సీఎం జగన్ నేడు రైతులకు అందజేయనున్నారు. ఇవీ ప్రారంభోత్సవాలు ► నరసాపురం పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతీయ వైద్యశాల ఇటీవలే 100 పడకల స్థాయికి అప్‌గ్రేడ్ అయింది. అందువల్ల చుట్టుపక్కల గ్రామాలలో నివసించే 2 లక్షల మందికి వైద్య సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇప్పుడు అదే ఆస్పత్రిలో నూతనంగా మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. రూ.13 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. ► నరసాపురం పట్టణంలో మంచి నీటి ఎద్దడి నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పథకం చేపట్టి పూర్తి చేశారు. ఈ పథకం వల్ల రాబోయే 30 ఏళ్ల వరకు నరసాపురం పట్టణానికి మంచి నీటి సరఫరాకు ఎటువంటి సమస్యా ఉండదు. ఇంకా శంకుస్థాపనలు ఇలా.. ► రూ.4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్‌స్టేషన్ పునరుద్ధరణ పనులు. ► రూ.1.08 కోట్ల అంచనాతో నరసాపురం డివిజినల్ ఉప ఖజానా కార్యాలయం కొత్త భవన నిర్మాణం. ► రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 220/ 132/ 33 కె.వి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు. ► నరసాపురం పురపాలక సంఘం పరిధిలో రూ.237 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం. రూ.87 కోట్లతో మొదటి ఫేజ్ పనులు. ► రూ.26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం. ► రూ.7.83 కోట్ల అంచనా వ్యయంతో చివరి గ్రామాలకు సాగు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు శేషావతారం పంట కాలువ అభివృద్ధిలో భాగంగా ఛానల్ డీ సిల్టింగ్, టెయిల్ డ్యామ్ నిర్మాణం, సీసీ లైనింగ్ పనులు. ► రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం. ► రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్‌ఫాల్ నాలుగు స్లూయీస్‌ల పునః నిర్మాణం. -
ఫిషింగ్ హార్బర్‌పై పచ్చ కుట్ర
పచ్చకుట్రలకు హద్దూపద్దూ లేకుండాపోతోంది. లక్షలాది మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై కుట్రలకు తెగబడింది. చివరి దశకు చేరుకున్న హార్బర్ నిర్మాణం పూర్తయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, టీడీపీకి పుట్టగతులు లేకుండా పోతాయనే ఆక్రోశంతో అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. మత్స్యకారులకు వర ప్రసాదినిగా మారుతున్న హార్బర్ నిర్మాణాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే విద్వేషాలు రెచ్చగొట్టేలా రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. బిట్రగుంట(పీఎస్ఆర్ నెల్లూరు): టీడీపీ నేతలా మజకా. ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించారు. రొయ్యల గుంతలుగా మార్చుకుని ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారు. ఆ భూమిని లక్షలాది మత్స్యకారుల జీవితాలను మార్చే ఫిషింగ్ హార్బర్‌కు కేటాయించడంతో స్వాధీనం చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు టీడీపీ నేతల ఆక్రమణలు కనిపించాయి. వీటిని తొలగించేందుకు ప్రయత్నించిన అధికారులకు రొయ్యలు సాగులో ఉన్నాయి... రెండు నెలలు గడువిస్తే స్వాధీనం చేస్తామని లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. సరే కదా అని గడువిస్తే.. ఇప్పుడు రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో పాటు నిర్ధాక్షిణ్యంగా రొయ్యల గుంతలు తొలగిస్తున్నారంటూ పచ్చ మీడియా, సోషల్ మీడియా వేదికగా అసత్య, విష ప్రచారాలు సాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు వాస్తవాలు ఇవీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేలా, గంగపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేలా రాష్ట్ర ప్రభుత్వం జువ్వలదిన్నె వద్ద సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఫిషింగ్ హార్బర్‌ను మంజూరు చేసింది. ఇందుకోసం సర్వే నంబర్లు 1197, 1198, 1196, 1194, 1199, 1200, 1201,1202, 1203, 1204, 1205, 1206లో 76.87 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీటిలో 1205, 1206 సర్వే నంబర్లతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలోని సుమారు 45 ఎకరాల భూమి చుక్కల భూమిగా నమోదై ఉండడంతో ప్రభుత్వ పోరంబోకు భూమిగా మార్పు చేస్తూ కలెక్టర్‌కు స్థానిక రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ఫారం–5 ద్వారా స్థానికుల నుంచి కూడా అభ్యంతరాలు స్వీకరించారు. స్థానికులు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో చుక్కల భూమిగా నమోదైన 45 ఎకరాల భూమిని ప్రభుత్వ పోరంబోకు భూమిగా మారుస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శాఖాపరంగా అన్ని ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాత మొత్తం 76.89 ఎకరాల భూమిని హార్బర్ నిర్మాణం కోసం మత్స్యశాఖకు అందజేశారు. ప్రభుత్వం కూడా త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిధులు విడుదల చేయడంతో హార్బర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి నాటికి పనులు పూర్తి చేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తి చేసిన ప్రస్తుతం హార్బర్ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేస్తున్నారు. ఆక్రమణలతో అడ్డుకునే కుట్ర ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ ప్రహరీ 1205, 1206 సర్వే నంబర్ల మీదుగా నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ సర్వే నంబర్లలో మొత్తం 12.04 ఎకరాల భూమి ఉండగా కావలిరూరల్ మండలం తుమ్మలపెంటకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకుని రొయ్యల గుంతలు సాగు చేసుకుంటున్నారు. దీంతో ఆక్రమణలు తొలగించి హార్బర్ నిర్మాణానికి సహకరించాల్సిందిగా మత్స్యశాఖ రెవెన్యూ అధికారులకు సూచనలు చేసింది. రొయ్యల గుంతలు ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు సూచించగా ప్రస్తుతం రొయ్యలు సాగులో ఉన్నాయని 60 రోజులు గడువు కావాలని కోరారు. ఈ మేరకు ఆక్రమణదారులు సెప్టెంబర్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడంతో రొయ్యలు పట్టుబడి అయ్యేంత వరకు రెవెన్యూ అధికారులు ఆగారు. ఇందుకు సంబంధించిన ఎండార్స్‌మెంట్‌ను కూడా ఆక్రమణదారులకు అందించారు. ప్రస్తుతం రొయ్యల పట్టుబడి పూర్తవడంతో రెండు రోజుల క్రితం అధికారులు గుంతలు తొలగించేందుకు వెళ్లగా తుమ్మలపెంటకు చెందిన టీడీపీ నాయకులు అడ్డుతగిలి నానా హంగామా చేశారు. ఈ భూములను 2012లో అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేశామని, ప్రస్తుతం తమకు రూ.3 కోట్లు పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోవాలని వాదనకు దిగారు. రెవెన్యూ అధికారులు నిబంధనల మేరకు గ్రామస్తులు, స్థానిక సంస్థల ప్రతినిధుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఖాళీగా ఉన్న రెండు గుంతలను తొలగించారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం రొయ్యల గుంతలు ధ్వంసం చేసి రూ.1.5 కోట్ల మేర నష్టం కలిగించారంటూ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తూ గొడవలు సృష్టించేలా పోస్టులు పెడుతున్నారు. కోర్టుకెళ్లి హార్బర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని శపథాలు చేస్తుండడంతో మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఆ 12.04 ఎకరాలు ప్రభుత్వ భూములే ఫిషింగ్ హార్బర్‌కు కేటాయించిన భూముల్లో సర్వే నంబర్లు 1205, 1206లో ఉన్న 12.04 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందిందే. చుక్కల భూమిగా ఉన్న ఈ భూమిని ప్రభుత్వ పోరంబోకు భూమిగా మార్చే సమయంలో కూడా స్థానికుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాం. ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో నిబంధనల మేరకు చుక్కల భూమి నుంచి ప్రభుత్వ పోరంబోకు భూమిగా మార్చి హార్బర్‌కు కేటాయించడం జరిగింది. ప్రభుత్వ భూమిని అగ్రిమెంట్ల ద్వారా విక్రయించడం, కొనుగోలు చేయడం చెల్లదు. రొయ్యల గుంతలు ఖాళీ చేసేందుకు ఆక్రమణదారులకు 60 రోజులకు పైగా గడువు కూడా ఇవ్వడం జరిగింది. రొయ్యలు పట్టుబడి చేసిన తర్వాత గ్రామస్తులు, సర్పంచ్, ఎంపీటీసీల సమక్షంలో పంచనామ నిర్వహించి ఖాళీగా ఉన్న రెండు గుంతలు మాత్రమే తొలగించాం. – లక్ష్మీనారాయణ, తహసీల్దార్, బోగోలు -
Visakhapatnam: నగర అందాలను చూస్తూ షిప్లో విహారం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సముద్రాన్ని చూస్తే.. ఎవరైనా చిన్న పిల్లాడిలా మారిపోవాల్సిందే. ఎగసిపడే కెరటాల్లా మనసు కేరింతలు కొట్టించే.. సాగరతీరంలో పడవ ప్రయాణమంటే..? గుండె ఆనందంతో గంతులేస్తుంది. పిల్లగాలి అల్లరి చేస్తుంటే.. నీలి కెరటాలతో పోటీ పడుతూ అలలపై ఆహ్లాదకరమైన విహారయాత్ర.. విశాఖ వాసుల్ని రా.. రమ్మని ఆహ్వానిస్తోంది. నగర అందాల్ని చూస్తూ.. ఆనంద ‘సాగరం’లో మునిగిపోతూ.. ఫిషింగ్ హార్బర్ నుంచి రుషికొండ వరకూ షిప్లో సుమారు 2 గంటల పాటు విహరించే అవకాశం అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. పర్యాటకులకు మర్చిపోలేని మధుర స్మృతులు మిగిల్చేలా సాగరంలో విహారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎంతో కాలంగా లాంచీల ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న ప్రకృతి ప్రేమికులు.. పర్యాటకులకు ఆనందంతో పాటు మానసిక ఉల్లాసం అందించేందుకు ఎంఎస్ఎస్ క్లాస్–6 షిప్ అందుబాటులోకి రానుంది. ఒకేసారి 54 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ షిప్‌ని గుజరాత నుంచి తీసుకురానున్నారు. నగర అందాల్ని చూస్తూ.. ఫిషింగ్ హార్బర్ నుంచి రుషికొండ వరకూ జల విహారం చేసేలా చర్యలు చేపడుతున్నారు. 2 గంటల పాటు సముద్రంలో.. ఇటీవల క్రూయిజ్ షిప్ కనువిందు చేసింది. కానీ.. ఇందులో సామాన్యులు మాత్రం ప్రయాణం చేయలేని పరిస్థితి. ఒక్కసారైనా సాగరతీరంలో షిప్లో విహరించాలన్న కోరిక.. ఈ ప్రయాణంతో తీరిపోనుంది. సుమారు 2 గంటల పాటు సముద్రంలో ప్రయాణించవచ్చు. షిప్లో డెక్ మీదకు వచ్చి నగరాన్ని చూసేందుకు కూడా వీలు కలి్పంచనున్నారు. సముద్ర తీరం నుంచి అరకిలోమీటరు నుంచి కిలోమీటరు దూరం వరకూ లోపల నౌకాయానానికి అవకాశం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే డ్రై డాక్ అనుమతి షిప్ ప్రయాణానికి సంబంధించి.. పోర్టు చైర్మన్ కె.రామ్మోహన్‌రావుతో జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇటీవలే సంప్రదింపులు చేశారు. బోటు విహారానికి పోర్టులో అవకాశం కలి్పంచేందుకు అనుమతులివ్వాలన్న ప్రతిపాదనలు పంపించారు. దీనికి విశాఖపట్నం పోర్టు అథారిటీ అంగీకరిస్తూ.. డ్రైడాక్‌లో రాకపోకలకు అనుమతులు మంజూరు చేసింది. త్వరలోనే.. అతి త్వరలోనే అలలపై షికారు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ మల్లికార్జున చెప్పారు. విశాఖ పర్యాటకానికి ఎంఎస్ఎస్ క్లాస్–6 షిప్ మరో ఆభరణంగా మారనుందన్నారు. లగ్జరీ ప్రయాణంలా.. బోటు ఎక్కామా... రుషికొండ వరకూ ప్రయాణించామా అన్నట్లుగా కాకుండా.. పర్యాటకులకు మధురానుభూతుల్ని అందించేందుకు కూడా ప్రణాళికలు చేస్తున్నారు. షిప్లో ప్రయాణిస్తున్న సమయంలో స్నాక్స్, టీ అందించనున్నారు. కొన్ని గదులు కూడా షిప్లో ఉండటంతో అందులో ఏసీ, టీవీ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓపెన్ ఎయిర్ ప్రయాణంతో పాటు.. ఏసీ గదిలో ప్రయాణం.. అనేరీతిలో రెండు భాగాలుగా టికెట్ ధరని నిర్ణయించనున్నారు. బోట్ ఆపరేటింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో 8 శాతం ఇవ్వాలని కోరనున్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వశాఖల నుంచి నిరంభ్యంతర పత్రాలన్నీ (ఎన్వోసీ) ప్రభుత్వమే జారీ చేసి ఇస్తుంది. అన్నీ సక్రమంగా పూర్తయితే.. ఈ ఏడాది చివర్లోనే విశాఖ వాసులతో పాటు.. వైజాగ్‌ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు బోటులో షికారు చేసే అవకాశం కలుగుతుంది. -
విశాఖ ఫిషింగ్ హార్బర్లో మెగాస్టార్.. ఫ్యాన్స్‌కు పండగ
కొమ్మాది(భీమిలి): విశాఖపట్నం నగరంలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న మెగాస్టార్ 154వ సినిమా (ప్రచారంలో వాల్తేరు వీరయ్య) షూటింగ్లో పాల్గొనేందుకు ఆయన నగరానికి చేరుకున్నారు. ఫిషింగ్ హార్బర్ వద్ద మంగళవారం ఆయనతో పాటు హీరో రవితేజపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. బుధవారం కూడా ఈ ప్రాంతంలో సినిమా చిత్రీకరణ ఉంటుందని సినీ వర్గాల సమాచారం. హీరోలను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు. కాగా, చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. (క్లిక్: అలా అయితే నాకు మరో 20 ఏళ్లు పట్టేది.. అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్) -
సంపన్న తీర హారం!
బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి మళ్లీ మీ జిల్లాకు (కృష్ణా) వస్తా. దశాబ్దాల కలలు త్వరలోనే సాకారం కానున్నాయి. కాసేపటి క్రితమే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న శుభవార్త వచ్చింది. – ఇటీవల నేతన్న నేస్తం నిధుల విడుదల సందర్భంగా పెడన సభలో సీఎం జగన్ నాగా వెంకటరెడ్డి – సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కోస్తా తీరం శాశ్వత ఆదాయ మార్గంగా రూపుదిద్దుకుంటోంది. బందరు పోర్టు పూర్తైతే రూ.పది వేల కోట్లకుపైగా పెట్టుబడులతోపాటు 15 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రాథమిక అంచనా. ఏటా కనీసం 18–20 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.300 కోట్లకు మించి ఆదాయం సమకూరనుంది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దాదాపు రూ.25 వేల కోట్లను వ్యయం చేస్తోంది. ఒకవైపు ఆక్వా రంగాన్ని బలోపేతం చేస్తూ మరోవైపు పోర్టులు, హార్బర్లు, జెట్టీల నిర్మాణాలను వేగంగా చేపడుతోంది. 974 కి.మీ. పొడవైన కోస్తా తీరంలో సగటున ప్రతి 50 కి.మీ.కి పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుతో స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేశీయ ఎగుమతుల్లో ఐదు శాతంగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల వాటాను 2030 నాటికి పది శాతానికి పెంచడమే ధ్యేయంగా కృషి చేస్తున్నారు. విస్తార అవకాశాలు... అపార అవకాశాలతో కోస్తా తీరం ప్రగతికి చిరునామాగా నిలువనుంది. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీ మెరుగుపడుతోంది. కోస్తా కారిడార్, జాతీయ రహదారులు, చెన్నై– కోల్‌కతా మూడో రైలు మార్గం, నూతన విమానాశ్రయాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఉన్న పోర్టులతో పాటు కొత్తవీ రాబోతున్నాయి. ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, పేరెన్నికగన్న పులికాట్, కొల్లేరు సరస్సులు, హంసలదీవి, సూర్యలంక, మైపాడు బీచ్‌లు.. ప్రముఖ ఆలయాలతో పర్యాటక రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగశాల, గుల్లలమోద (నాగాయలంక)లో అందుబాటులోకి రానున్న మిస్సైల్ లాంచింగ్ సెంటర్, విశాఖలో నేవీ కేంద్రం... ఇలా కోస్తా తీరాన ప్రతిదీ ప్రత్యేకమే. పారిశ్రామిక కెరటాలు.. ఇప్పటికే ఉన్న పోర్టులకు అదనంగా మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు. కాకినాడ గేట్‌వే పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్ హర్బర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ జూలై 20న శంకుస్థాపన చేయగా త్వరలోనే భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఫిషింగ్ హార్బర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలిదశలో రూ.1,204 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతుండగా తాజాగా రూ.1,496.85 కోట్లతో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం హార్బర్ల నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న విశ్వసముద్ర సంస్థ పనులను ప్రారంభించనుంది. పెద్ద ఎత్తున పోర్టులు, ఫిషింగ్ హర్బర్లు ఏర్పాటవుతుండటంతో 35 భారీ యూనిట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. వీటి ద్వారా రూ.34,532 కోట్ల పెట్టుబడులతోపాటు 72 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ తూర్పు గోదావరి జిల్లాలోనే రూ.78 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను కొనసాగిస్తోంది. పొరుగు రాష్ట్రాలకు రవాణా మార్గం.. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు ఉన్న తీర ప్రాంతం తూర్పు ఆసియా దేశాలకు ముఖద్వారం లాంటిది. ఇక్కడి పోర్టులు తెలంగాణ, కర్నాటక, ఛతీస్ఘడ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు సరకు రవాణాకు ఎంతో అనుకూలం. నాగ్‌పూర్‌కు సరుకు రవాణా చేయాలంటే ముంబై కంటే బందరు పోర్టు దగ్గరి దారి అవుతుంది. నాగ్‌పూర్‌కు చెందిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ బందరు నుంచి నాగ్‌పూర్ మీదుగా వెళ్లే జాతీయ రహదారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తీరప్రాంతం అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పోర్టులు, హార్బర్లను అనుసంధానించేలా ఏపీ మారిటైమ్ బోర్డు పలు ప్రతిపాదనలను రూపొందించింది. పోర్టులను రైల్వేలు, జాతీయ రహదారులతో అనుసంధానించడం, తీరప్రాంతంలో జీవనోపాధులను మెరుగుపరచడం ద్వారా కోస్టల్ కమ్యూనిటి అభివృద్ధి చెందేలా ప్రతిపాదనలు పంపింది. ఆక్వాలోనూ కింగే.. గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాలతో అన్నపూర్ణగా విరాజిల్లిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తుల్లోనూ మేటిగా గుర్తింపు పొందుతోంది. సీఎం జగన్ ఆక్వా రంగాన్ని ఆదుకుంటూ సాగుదారులపై విద్యుత్తు భారాన్ని తగ్గించారు. పదెకరాల లోపున్న ఆక్వా రైతులు యూనిట్ విద్యుత్తుకు రూ.1.50 మాత్రమే చెల్లించేలా ఊరట కల్పించారు. అదే టీడీపీ హయాంలో ఏకంగా రూ.3.80 చొప్పున వసూలు చేయడం గమనార్హం. చార్జీల భారాన్ని తగ్గించడం ద్వారా మూడేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు రూ.2,400 కోట్లు మేర సబ్సిడీ కల్పించింది. అంతేకాకుండా సీడ్ యాక్ట్, ఫీడ్ యాక్ట్, ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అ«థారిటీ–20202ని తీసుకొచ్చారు. 5.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్న రైతులకు ఈ చట్టాలు భరోసా కల్పిస్తున్నాయి. చేపల వేటపై ఆధారపడి 8.50 లక్షల మంది మత్స్యకారులు ఉండగా ఈ రంగం ద్వారా దాదాపు 16 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆక్వా హబ్‌ల ద్వారా పౌష్టికాహారాన్ని అందించే సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ కమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. రామాయపట్నం పోర్టు ఏర్పాటుతో ప్రత్యక్షంగా 7,500 మందికి, పరోక్షంగా మరో 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంచనా. రూ.10,640 కోట్లతో దశలవారీగా 19 బెర్తులకు విస్తరించడంతో 25 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయవచ్చు. 3,773 ఎకరాలను సేకరించి భారీ పారిశ్రామికవాడ నెలకొల్పనున్నారు. పలు కంపెనీలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. ► నిర్మాణంలోని ఫిషింగ్ హార్బర్లు: జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ► పనులు ప్రారంభంకానున్న హార్బర్లు: బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం ► నిర్మాణం కానున్న పోర్టులు: మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ గేట్‌వే, భావనపాడు. ► ఉన్న పోర్టులు: విశాఖపట్నం, గంగవరం, కాకినాడ (3), కృష్ణపట్నం సీమకూ సముద్ర తీరం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాయలసీమకూ సముద్రతీరం దక్కింది. తిరుపతి కేంద్రంగా ఏర్పాటైన జిల్లా పరిధిలోకి తీర ప్రాంతాలైన కోట, వాకాడు, చిల్లకూరు, చిట్టమూరు, సూళ్లూరుపేట మండలాలు చేరాయి. పులికాట్ సరస్సు కూడా కలిసొచ్చింది. బెస్ట్ వయబుల్ ప్రాజెక్టు బందరు పోర్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. సీఎం జగన్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ద్వారా నిధులు అందనున్నాయి. బందరు పోర్టు బెస్ట్ వయబుల్ ప్రాజెక్టు అవుతుంది. – వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ -
Vodarevu Fishing Harbour: హార్బర్ తీరానికే దర్బార్..
అలలపై ఆరాటం.. బతుకు నిత్యపోరాటం.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఒడ్డుకు తెచ్చిన మత్స్యసంపద అమ్మకానికీ జంఝాటం.. ఇదీ తరతరాలుగా బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గంగపుత్రుల దైన్యం. వీరి తలరాతలు మార్చేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. త్వరలో పనులు ప్రారంభం కానుండడంతో ఊరూవాడ సంబరపడుతున్నాయి. సాక్షి, బాపట్ల/చీరాల: మత్స్యకారులు ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో మైళ్ల దూరం వెళ్లి వేటాడిన మత్స్యసంపద దళారుల పరమవుతోంది. నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు, ఎండబెట్టుకునేందుకు అవసరమైన ఫ్లాట్‌ఫాంలు లేకపోవడంతో మద్రాసు ఏజెంట్లు చెప్పిన ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. దీనికితోడు ఏటా వచ్చే ప్రకృతి విపత్తులకు రూ.లక్షలు పెట్టి కొన్న పడవలు, వలలు సముద్రంలో కొట్టుకుపోతున్నాయి. ఈ దయనీయ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని చీరాల మండలం వాడరేవు వాసులు ఎంతోకాలంగా కోరుతున్నారు. ఎట్టకేలకు వీరి కలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఇప్పటికే హార్బర్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. కొద్దిరోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయి. పదేళ్ల క్రితమే సర్వే జరిగినా.. వాడరేవు హార్బర్ నిర్మాణానికి 2012లోనే సర్వే నిర్వహించారు. అప్పట్లోనే మినీ హార్బర్, ఫ్లోటింగ్ జెట్టి నిర్మించాలని నిర్ణయించినా.. ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాడరేవులో హార్బర్ నిర్మాణంపై దృష్టి సారించింది. దీనికోసం ఏపీ మారిటైమ్ బోర్డు రూ.532 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు ఆహ్వానించింది. ఆ పక్రియలో విశ్వసముద్ర ఇంజినీరింగ్ లిమిటెడ్ ఏజెన్సీ రూ.408.42 కోట్లతో టెండర్లను దక్కించుకుంది. ప్రస్తుతం 20 ఎకరాలు అవసరం ఉండగా 13 ఎకరాల వరకు రెవెన్యూ శాఖ అప్పగించింది. మిగిలినది భూసేకరణ ద్వారా తీసుకోనున్నారు. హార్బర్ నిర్మాణానికి 20 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం, 80 శాతం నిధులు కేంద్ర మత్స్యమౌలిక అభివృద్ధి సంస్థ, నాబార్డు మంజూరు చేస్తాయి. నిజాంపట్నం హార్బర్ ఉన్నా.. ప్రస్తుతం వాడరేవులో హార్బర్ లేకపోవడంతో సముద్రంలో వేటాడిన మత్స్యసందపను ఒడ్డుకు తెచ్చుకునే అవకాశం లేదు. దీంతో కాకినాడ, చెన్నై ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. నిజాంపట్నంలో హార్బర్ ఉన్నా సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో చీరాల వాడరేవు నుంచి కాకినాడ గానీ చెన్నై గానీ వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఫలితంగా మత్స్యసంపద దళారుల పాలవుతోంది. దళారులు మత్స్యసంపదను తక్కువ ధరకు కొని చెన్నై, బెంగళూరు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. (క్లిక్: పల్నాడు రైతుల వినూత్న పంథా.. ‘ఫల’ప్రదం) ప్రయోజనాలివీ.. ► హార్బర్ నిర్మాణం పూర్తయితే 890 ఇంజిన్ బోట్లు, 350 మెకనైజ్డ్ బోట్లు, 75 చిన్న ఓడలు సురక్షితంగా నిలుపుకునే అవకాశం ఉంటుంది. ► స్థానికంగానే మత్స్య సంపదను మార్కెటింగ్ చేసుకోవచ్చు. ► ఒంగోలు, నెల్లూరు, నిజాంపట్నం నుంచి బోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ► స్థానిక మత్స్యకార మహిళలకు సమృద్ధిగా జీవనోపాధి లభిస్తుంది. ► జిల్లాలోని తీరప్రాంతం అభివృద్ధి చెందుతుంది. జిల్లాకే తలమానికం హార్బర్ నిర్మాణం పూర్తయితే వాడరేవు జిల్లాకే తలమానికంగా మారుతుంది. మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నా హయాంలో హార్బర్ నిర్మాణ పనులు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నా. మరోనెలలో శంకుస్థాపన చేసి పనులు మొదలుపెడతాం. దీనికితోడు వాడరేవు నుంచి పిడుగురాళ్ళ వరకు నేషనల్ హైవే మంజూరైంది. త్వరలో ఆ పనులూ ప్రారంభం కానున్నాయి. – కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే, చీరాల మరో నెలలో పనులు హార్బర్ నిర్మాణం ఎంతో మేలు చేస్తోంది. మత్స్యసంపదకు గిట్టుబాటు ధర లభిస్తుంది. సరుకు ఎండబెట్టుకునేందుకు ఫ్లాట్‌ఫాంలు, నిల్వ ఉంచుకునేందుకు ఏసీ స్టోరేజ్‌లు, డీజీల్ బంకులు, రవాణాకు రోడ్లు అందుబాటులోకి వస్తాయి. మరో నెలలో హార్బర్ పనులు ప్రారంభమవుతాయి. – డాక్టర్ పి.సురేష్, మత్య్సశాఖ జాయింట్ డైరెక్టర్ -
Kommu Konam Fish: చిన్న పడవకు చిక్కిన పెద్ద చేప
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ప్రస్తుతం సముద్రంలో వేట నిషేధం అమలులో ఉంది. వచ్చే నెల వరకు సముద్రం చేప దొరకాలంటే కష్టం. ఈ పరిస్థితుల్లో ఆదివారం మత్స్యకారులకు కొమ్ముకోనం చేప కొమ్ము కాసింది. అదేంటి.. వేట విరామంలో ఇంత పెద్ద చేప ఎలా వలకు చిక్కిందని ఆలోచిస్తున్నారా? తెర పడవలపై పలువురు జాలర్లు రోజంతా కష్టపడితే కొమ్ముకోనం చేపలు విరివిగా పడతున్నాయి. వేట విరామంలో ఇంజిన్ బోట్ల (మరపడవలు)తో వేట నిషేధం. కానీ తెర పడవల మీద వేటకు వెళ్లవచ్చు. వీరి కష్టానికి ఎంతో కొంత ప్రతిఫలం దొరుకుతుంది. అలా ఆదివారం భారీ సంఖ్యలో చేపలు వలకు చిక్కాయి. 80 కిలోల నుంచి 100 కిలోల బరువు ఉండే ఈ కొమ్ముకోనం చేపకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. 100 కిలోల చేప రూ.20 వేల పైబడి ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. 6 అడుగుల నుంచి 12 అడుగుల వరకు ఉండే ఈ చేపను కేరళవాసులు ఎంతో ఇష్టపడి తింటారు. ఒక్క వేటలో భారీగా చేపలు చిక్కడంతో మత్య్సకారులు సంతోషం వ్యక్తం చేశారు. -
మత్స్యకారుల వెలుగులదిన్నె
అదంతా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం.. అపార మత్స్య సంపదకు నిలయం.. కానీ వేటకు అనువుగా లేని వైనం.. ఈ లోపాన్ని సరిదిద్దితే గంగపుత్రుల జీవితాల్లో కొత్త వెలుగు నింపడం ఖాయం.. ఉపాధి వలసలకు చెక్ పెట్టడం తథ్యం.. గత పాలకులు ఈ విషయాన్ని నిర్లక్ష్యంతో విస్మరిస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ బాధ్యతగా, ప్రతిష్టగా తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన హార్బర్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఒకటి. ఇది పూర్తయితే మత్స్యకారుల పాలిట ఇది వెలుగులదిన్నెగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయో ‘సాక్షి’ అటు వైపు తొంగి చూసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సముద్ర తీరాన విలువైన మత్స్య సంపద ఉన్నప్పటికీ, అది గంగపుత్రుల దరి చేరడం లేదని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ సంపదను వారి దరికి చేర్చే దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వివిధ పథకాల ద్వారా వారిని ఓ వైపు ఆదుకుంటూనే, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా తొలి దశలో నాలుగింటిని నిర్మిస్తున్నారు. ఇందులో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే నిర్దేశిత గడువుకంటే ముందే ఇది అందుబాటులోకి వచ్చేలా ఉంది. గత ఏడాది మార్చి 19వ తేదీన దీని నిర్మాణం ప్రారంభమైంది. రెండేళ్లలో అంటే 2023 మార్చికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇందుకోసం 250 మంది రేయింబవళ్లు పని చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. పెద్ద పడవలు సముద్రంలో నుంచి హార్బర్‌కు వచ్చేందుకు ఉపయోగపడే కీలకమైన బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. బ్రేక్ వాటర్ ప్రాంతం పూడిపోకుండా నిర్మించే బ్రేక్ వాటర్ వాల్స్‌ను సుమారు 3 లక్షల టన్నుల రాతితో పటిష్టం చేశారు. ఈ గోడలను సిమెంట్‌తో నిర్మించిన ట్రైపాడ్స్‌తో నింపుతున్నారు. అలల ఉధృతిని తట్టుకోవడానికి నిర్మించే 7 వేల ట్రైపాడ్స్ (త్రికోణాకారంలో ఉన్న సిమెంట్ దిమ్మెలు)లో 5 వేల ట్రైపాడ్స్ నిర్మాణం పూర్తయ్యింది. పెద్ద బోట్లు రావడానికి 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 7 లక్షల క్యూబిక్ మీటర్లను వెలికి తీశారు. 1,250 బోట్లు నిలిపే 919 మీటర్ల జెట్టీ పునాదుల ప్రక్రియ పూర్తయింది. సెప్టెంబర్ నాటికి జెట్టీ కాంక్రీట్ పనులు పూర్తి చేసి, బోట్లను అనుమతించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అడ్మినిస్ట్రేషన్, మెరైన్ పోలీస్ స్టేషన్, కోల్డ్ స్టోరేజ్, చేపల వేలం కేంద్రం వంటి 30 శాశ్వత భవనాల పనులు మార్చిలోగా పూర్తి చేయనున్నారు. ఏటా అదనంగా 41,000 టన్నుల మత్స్య సంపద 72 ఎకరాల్లో రూ.260 కోట్లతో నిర్మిస్తున్న ఈ హార్బర్ ద్వారా ఏటా అదనంగా 41,000 టన్నుల మత్స్య సంపద లభిస్తుందని అంచనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా 6,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇంతకాలం పెద్ద బోట్లు నిలిచే అవకాశం లేక 25 నాటికల్ మైళ్ల దూరం దాటి, వేట చేపట్టలేకపోయేవాళ్లమని.. ఈ హార్బర్ వస్తే ప్రభుత్వ సహకారంతో పెద్ద మెకనైజ్డ్ బోట్లు కొనవచ్చని స్థానిక మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా నష్టం ఇలా.. హార్బర్లు, ఇతర సౌకర్యాలు లేనందున రాష్ట్ర మత్స్యకారులు సాధారణ బోట్లతో తీరంలో కొద్ది దూరంలోనే వేట సాగిస్తున్నారు. దీంతో అనుకున్న రీతిలో మత్స్య సంపద లభించడం లేదు. దీంతో పలువురు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. పక్క రాష్ట్రాలకు చెందిన పెద్ద పెద్ద మెకనైజ్డ్ బోట్లు రాష్ట్ర తీరంలోని మత్స్య సంపదను తరలించుకుపోతున్నాయి. 60 వేల కుటుంబాలకు ఉపాధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా రూ.3,622.36 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. తొలిదశ కింద రూ.1,204.56 కోట్లతో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, బాపట్ల జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నం, కాకినాడ జిల్లా ఉప్పాడ హార్బర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో దశ కింద రూ.1,496.85 కోట్లతో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులు త్వరలో ప్రారంభించనున్నారు. తొలి దశలోని నాలుగు హార్బర్లను వచ్చే మార్చి నాటికి, రెండో దశలోని ఐదింటిని 2024లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొమ్మిదీ అందుబాటులోకి వస్తే 10,000కు పైగా మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 60 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మన సంపద మనకే ఇంతకాలం సౌకర్యాలు లేకపోవడంతో పెళ్లాం బిడ్డలను ఇక్కడే వదిలేసి కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలసపోయే వాళ్లం. తమిళనాడుకు చెందిన కడలూరు, నాగపట్నం, తూతుకూడిల మత్స్యకారులు వచ్చి మన తీరంలో చేపలు పట్టుకుపోతున్నారు. జువ్వల దిన్నె హార్బర్ వస్తే తమిళనాడు మత్స్యకారుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. మన తీరంలో మత్స్య సంపదను మనమే పొందొచ్చు. – శీనయ్య, మత్స్యకారుడు, జువ్వలదిన్నె ఇక్కడే ఉపాధి.. చేపల వేట కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లేవాడిని. ఇక్కడ ఫిషింగ్ çహార్బర్ వస్తే నాకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లతో పాటు వాటికి అవసరమైన మౌలిక వసతులు కూడా అభివృద్ధి చేస్తుండటం చాలా సంతోషం. – కుందూరు గోవిందయ్య, మత్స్యకారుడు, జువ్వలదిన్నె సెప్టెంబర్ నాటికి జెట్టీ నిర్మాణం పూర్తి రూ.260 కోట్లతో జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే బ్రేక్‌వాటర్, డ్రెడ్జింగ్, ట్రైపాడ్స్ నిర్మాణం, జెట్టీ పిల్లర్స్ వంటి కీలక పనులు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేషన్, శీతల గిడ్డంగి, వేలం కేంద్రం వంటి భవనాల నిర్మాణం మొదలుపెట్టాం. ఈ సెప్టెంబర్ నాటికి జెట్టీని అందుబాటులోకి తెస్తాం. – కృష్ణమూర్తి, పీఎంయూ, ఏపీ అర్బన్ దేశ చరిత్రలో ఇదే ప్రథమం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3,623 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలోని మత్స్యకారులు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ ఉపాధి పొందేలా చూడాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. దీనికి అనుగుణంగా హార్బర్ల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తున్నాం. – మురళీధరన్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు -
జాలర్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): వేట విరామం ప్రకటించారు. దాదాపు రెండునెలల పాటు మత్స్యసంపద అంతంత మాత్రమే. రొయ్యలు.. చేపలు.. పీతలు.. ఇలా అన్ని రకాల మత్స్యసంపద కరువైన రోజులివి. సముద్రం చేప దొరకాలంటే కష్టమైన రోజులివి. బుధవారం మాత్రం మత్స్యకారులకు కొమ్ముకోనం చేప కొమ్ము కాసింది. అదేంటి.. వేట విరామంలో చేపలు ఎలా వస్తున్నాయనుకుంటున్నారా.. తెరపడవలపై పలువురు జాలర్లు రోజంతా కష్టపడితే కొమ్ముకోనం చేపలు విరివిగా పడతున్నాయి. వాస్తవానికి వేట విరామంలో ఇంజన్ బోట్లు (మరపడవలు), ఇంజన్‌తో కూడిన వేట పడవలు సముద్రంలోకి వెళ్లడం నిషిద్ధం. కానీ తెర పడవల మీద వేటకు వెళ్లవచ్చు. వీరి కష్టానికి ఎంతో కొంత ప్రతిఫలం దొరుకుతుంది. బుధవారం విశాఖ ఫిషింగ్ హార్బర్లో కొమ్ముకోనం చేపలు సందడి చేశాయి. దాదాపు 400 చేపలు జాలర్లకు చిక్కాయి. వీటిలో ఒకచేప 350 కిలోలకుపైగా బరువుండగా 14 చేపలు వంద కిలోలకుపైన ఉన్నాయి. వీటికి రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ధర పలికింది. చేపల్ని దక్కించుకున్న పాటదారుడు వెంటనే ముక్కలు చేసుకుని తీసుకెళ్లారు. (క్లిక్: అంతరిక్షంలో అద్భుతం.. ఒకే వరుసలో నాలుగు గ్రహాలు) -
విశాఖపట్నం: భారీ సొర,కొమ్ము కోనాం చేపలు (ఫొటోలు)
-
జనాలకు చేరువగా జల పుష్పాలు.. ఇక ఈజీ!
ఆ వారానికి చేపల నుంచి పీతల మీదకు మనసు మళ్లింది. కానీ ఎలా..? అన్ని ఏరియాల్లో అవి దొరకవే. కొందరికి కంచంలో కారంగా రొయ్యలు కనిపిస్తే గానీ ఆ వీకెండ్ పూర్తవదు. ఏం లాభం..? ఉదయాన్నే మార్కెట్‌పై పడితే గానీ పని జరగదు. అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏవి కావాలంటే అవి దొరికేలా.. మన చెంతనే మీనాల జాతర జరిగితే..? కానాగార్తల నుంచి ఖరీదైన పీతల వరకు అన్నీ మనకు సమీపంలోనే విక్రయిస్తే..? సగటు మనిషి జిహ్వ‘చేప’ల్యం తీరుతుంది కదా. సర్కారు అదే పనిలో ఉంది. అటు మత్స్యకారులకు లాభం కలిగేలా.. ఇటు చేపల వినియోగం మరింత పెరిగేలా ప్రత్యేక యూనిట్లను మంజూరు చేసి రాయితీ నిధులు కూడా కేటాయించింది. సాక్షి, శ్రీకాకుళం: జనాలకు మత్స్య సంపదను మరింతగా చేరువ చేసేందుకు, మత్స్యకారుల విక్రయాలు ఇంకా పెరిగేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. తోపుడు బళ్లపై కూరగాయలు, పండ్లు విక్రయించినట్టు.. భవిష్యత్‌లో జల పుష్పాలను కూడా జనాలకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చేపలు, రొయ్యిలు, పీతలు కూడా స్వచ్ఛంగా నాణ్యతతో ప్రజల చెంత ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగాన్ని పెంచేందుకు సరికొత్త పథకాలను రూపొందించింది. నూతనంగా ఆక్వా హబ్‌లు, ఫిష్ కియోస్క్‌లు, రిటైల్ ఔట్ లెట్లు, లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్లు, ఫిష్ వెండింగ్ కం ఫుడ్ కార్ట్లు, ఈ–రిక్షాలు, వ్యాల్యూ యాడెడ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టింది. స్వయం ఉపాధిని కోరుకుంటున్న వారి కోసం ప్రత్యేక రాయితీలతో పథకాలను అమలు చేయనున్నారు. అందుకోసం సమీప గ్రామ/వార్డు సచివాలయాల్లో విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. చదవండి: అయ్యో పాపం.. టీవీ మీద పడటంతో చిన్నారి మృతి శ్రీకాకుళం జిల్లాలో రూ.7.34 కోట్లతో 300 యూనిట్లు.. ♦ అన్ని రంగాలపై పడినట్టే కోవిడ్ ప్రభావం మత్స్య సంపదపై కూడా పడింది. ♦దీంతో అటు గంగపుత్రులను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి, జనాలకు మత్స్య సంపదను చేరువ చేసేందుకు ప్రధాన మంత్రి సంపద యోజన పథకం (పీఎంఎంఎస్వై) కింద 300 యూనిట్లు మంజూరయ్యాయి. ♦ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో జిల్లాలో లబ్దిదారుల దరఖాస్తులను పరిశీలించి పథకాల అమలుకు చర్యలు చేపట్టింది. ♦ ఇందుకోసం సుమారు 13 విభాగాల యూనిట్లను సిద్ధం చేసి, బీసీ (జనరల్) కేటగిరీకి 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, మహిళా కేటగిరీలకు 60 శాతం రాయితీలను కల్పించేలా చర్యలు చేపడుతోంది. ♦జిల్లాలో రాయితీల కోసం రూ.7.34 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకాలతో జిల్లాలో ఉన్న 11 మండలాల తీర ప్రాంతాల నుంచి వస్తున్న మత్ప్య ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని భావించిన రాష్ట్ర మత్స్య శాఖ ఈ మేరకు జిల్లాలో దాదాపుగా అన్ని యూనిట్లను ఏర్పాటు చేసి లక్ష్యాన్ని సాధించాలని చర్యలు చేపట్టింది. ♦అలాగే జిల్లా కేంద్రంలో ఒక ఆక్వా హబ్‌ను కూడా రూ.1.85 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం స్థల సేకరణ పనులు జరుగుతున్నాయి. చదవండి: ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. భర్తను చూడగానే.. తలసరి వినియోగం పెంచేందుకే చేపల తలసరి వినియోగం పెంచేందుకు మత్స్యశాఖలో ఈ పథకాలను అమలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా జిల్లాలో 300 యూనిట్లు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే 50 శాతం నిధులు విడుదలయ్యాయి. సచివాలయాల్లో నవ శకంలో భాగంగా ఆసక్తి ఉన్న వారు ఈ పథకాల్లో లబ్దిదారులుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. వివరాలకు 9346007766 నంబర్‌ను సంప్రదించవచ్చును. – ఎం.షణ్ముఖరావు,జిల్లా ప్రోగ్రాం మేనేజర్, శ్రీకాకుళం -
రెండేళ్లలో గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి
మచిలీపట్నం: కృష్ణా జిల్లా గిలకలదిండి వద్ద రూ.348 కోట్లతో చేపడుతున్న ఫిషింగ్ హార్బర్ రెండో దశ పనులను రెండేళ్లలో పూర్తి చేసేలా కాంట్రాక్ట్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. హార్బర్ అభివృద్ధి పనులను ఆదివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిలకలదిండి వద్ద ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి చేయాలని మత్స్యకారులు 2009 నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పది చోట్ల ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి, జెట్టీల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. గిలకలదిండి హార్బర్ అభివృద్ధిలో భాగంగా 14 అడుగుల లోతున, 10.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి త్రవ్వటం జరుగుతుందని, తద్వారా రాబోయే యాభై ఏళ్ల వరకు మత్స్యకారులకు చేపలవేటకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. సముద్ర మొగకు దక్షిణం వైపునున్న కృష్ణానది సిల్ట్ కారణంగా త్వరగా ఇసుకమేట వేసేస్తోందని, దీన్ని నివారించేందుకు 1,150 మీటర్ల పొడవైన గోడ నిర్మిస్తామన్నారు. హార్బర్లో 500 బోట్లు నిలబెట్టేందుకు వీలుగా 790 మీటర్ల ‘కే’ వాల్ నిర్మిస్తామన్నారు. బందరు ప్రాంత మత్స్యకారుల అభివృద్ధి కోసం పెద్దమనసుతో నిధులు కేటాయించిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మచిలీపట్నం నగర పాలక సంస్థ చైర్పర్సన్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడ ఫిషింగ్ హార్బర్‌పై దృష్టి పెట్టండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులపై మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ మార్కెటింగ్, ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీడీడీసీఎఫ్), మత్స్యశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, పశు సంవర్థక విభాగాలలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించారు. సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల మధ్య అనుసంధానం సమర్థవంతంగా ఉండాలి. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి. అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు ఏర్పాటు కావాలి. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రతి 15 రోజులకోసారి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అధికారుల స్థాయిలో ప్రతి ఆదివారం సమీక్ష చేయాలి’’ అని అధికారులను ఆదేశించారు. కాకినాడ ఫిషింగ్ హార్బర్‌పై దృష్టి పెట్టండి: సీఎం జగన్ ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిష్‌ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు, కాకినాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ తయారు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అదే విధంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్భర్ అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన నిర్దేశించారు. కాగా, అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులకు సంబంధించి ఆయా రంగాలు, విభాగాలలో వివిధ ప్రాజెక్టుల, పనుల పురోగతిని సమావేశంలో అధికారులు వివరించారు. ఆ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.15,743 కోట్లు అని తెలిపారు. మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలు (ఎంపీఎఫ్సీ) రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్ద ఎంపీఎఫ్‌సీలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. డ్రై స్టోరేజీ–డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) గోదాములు, ఎస్సేయింగ్ ఎక్విప్మెంట్, జనతా బజార్లు మొదలు ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రా, పశు సంవర్థక మౌలిక సదుపాయాల వరకు దాదాపు 16 రకాల ప్రాజెక్టులు తీసుకురానున్నారు. ఆ మేరకు 4,277 డ్రై స్టోరేజీ , డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేయనున్నారు. పీడీఎస్ కోసం 60 గోదాములు, 1,483 సేకరణ కేంద్రాలు, కోల్డ్ రూమ్స్, టర్మరిక్ బాయిలర్లు, టర్మరిక్ పాలిషర్లు. ఇంకా 7,950 ప్రైమరీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, 10,678 ఎస్సేయింగ్ ఎక్విప్మెంట్, అలాగే 10,678 సేకరణ కేంద్రాల ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీడీడీసీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా 9,899 బల్క్ మిల్లింగ్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), 8,051 ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాల (ఏఎంసీయూ) నిర్మాణం చేపట్టనున్నారు. బీఎంసీయూల నిర్మాణానికి రూ.1,885.76 కోట్లు, ఏఎంసీయూల నిర్మాణానికి రూ.942.77 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 9,051 చోట్ల బీఎంసీయూల కోసం భూమి గుర్తించగా, 6,252 యూనిట్ల నిర్మాణం ఇప్పటికే మొదలైంది.ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి మొత్తం బీఎంసీయూల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమూల్ పాల సేకరణ గత ఏడాది నవంబరు 20వ తేదీన ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలలో పాల సేకరణ మొదలు పెట్టగా, ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 29న గుంటూరు జిల్లాలో, ఏప్రిల్ 3న చిత్తూరు జిల్లాలోనే మరి కొన్ని గ్రామాలకు పాల సేకరణ విస్తరించారు. ఈనెల 4వ తేదీ (శుక్రవారం) నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అమూల్ పాల సేకరణ మొదలు పెడుతోంది. నాలుగు జిల్లాలలో 12,342 మంది మహిళా రైతుల నుంచి 50.01 లక్షల లీటర్ల పాలు సేకరించిన అమూల్, వారికి రూ.23.42 కోట్లకు పైగా బిల్లులు చెల్లించింది. ఆ విధంగా రాష్ట్రంలో మహిళా రైతులకు రూ.3.91 కోట్లు అదనంగా ఆదాయం లభించింది. మత్స్యశాఖ–మత్స్యకారులు మత్యకారులు, ఆక్వా రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం 10 ప్రాసెసింగ్ యూనిట్లు, 23 ప్రిప్రాసెసింగ్ యూనిట్లతో పాటు, 100 ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. 100 ఆక్వా హబ్‌లలో ఇప్పటికే 25 హబ్‌లు మంజూరు కాగా, ఈనెలలోనే వాటి పనులు మొదలు పెట్టనున్నారు. మొత్తం 133 ప్రాసెసింగ్, ప్రిప్రాసెసింగ్ యూనిట్లు, ఆక్వాహబ్‌లకు దాదాపు రూ.646.90 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్లు తొలి దశలో 4 ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అవి ఉప్పాడ (తూ.గో), నిజాంపట్నం (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా), జువ్వలదిన్నె (నెల్లూరు) హార్బర్లను వచ్చే ఏడాది (2022) డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా ఓడరేవులో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం -
హార్బర్ల నిర్మాణంతో మారనున్న ముఖచిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ల ద్వారా తీర ప్రాంతం సంపదకు నెలవుగా, ఉపాధికి కల్పతరువుగా మారనుంది. ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం అనూహ్యంగా అభివృద్ది చెందనుంది. అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా సముద్రంలో చేపల వేటకు వెళ్లే పడవలు, వేట ముగించుకుని ఒడ్డుకు వచ్చే పడవలతో తీర ప్రాంతం సందడిగా మారనుంది. మత్స్య సంపదను నిల్వచేసే కోల్డు స్టోరేజి ప్లాంట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు అక్కడ ఏర్పాటు కానున్నాయి. అక్కడి నుంచే దేశ విదేశాలకు మత్స్య సంపదను ఎగుమతి చేసే సంస్థలు వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించనున్నాయి. రూ.1,510 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 4 హార్బర్ల వల్ల అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ అంచనాల మేరకు కొత్తగా 5,900 మర పడవలకు హార్బర్లలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో పడవలకు అవసరమైన డీజిల్, ఐస్‌ను హార్బరులోనే కొనుగోలు చేయవచ్చు. గత ప్రభుత్వం ఈ హార్బర్లను నిర్లక్ష్యం చేయడంతో మర పడవల నిర్వాహకులు తీరం నుంచి 10 – 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాల్లో డీజిల్, ఐస్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు హార్బర్లలోనే పెట్రోల్ బంకులు, ఐస్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో నిర్వాహకులకు ఆ సమస్యలు తప్పుతాయి. పెరిగిన మర పడవల కారణంగా సాలీనా 2,37,350 టన్నుల మత్స్య సంపద అదనంగా లభ్యమవుతుందని నిపుణుల అంచనా. దీని వల్ల సాలీనా రూ.500 కోట్లకు పైగా ఆదాయం పెరగనుంది. వీటిన్నింటిపై ఆధారపడి జీవించే 1,18,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. చేపల వేట, అమ్మకాలు, ప్రాసెసింగ్, క్రయ విక్రయాల్లో కార్మికులకు విస్తారంగా అవకాశం లభిస్తుంది. 20 నుంచి 40 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన ఐస్ ప్లాంట్ల నిర్మాణాలు జరిగే అవకాశం ఉండటంతో 2,240 టన్నుల ఐస్ అక్కడ అందుబాటులో ఉంటుంది. మీ మేలు మరవలేం నేను ఉన్నాను.. నేను విన్నాను’ అని మీరు పాదయాత్రలో అన్నారు. సీఎం కాగానే మీరు ఆ మాట నిలబెట్టుకున్నారు. తక్కువ టైంలో మా చేతికి రూ.10 వేల సాయం అందింది. మీరు చిన్న కర్ర తెప్పలను కూడా గుర్తించి వాళ్లకు కూడా రూ.10 వేలు ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాం. గతంలో ఇలాంటి సాయం ఎప్పుడూ అందలేదు. ఎవరైనా వేటకు వెళ్లి మరణిస్తే అందించే సాయాన్ని ఏకంగా రూ.10 లక్షలు చేశారు. పాకిస్తాన్, గుజరాత్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను రప్పించిన మీ మేలు మరవలేం. మంచినీళ్లు పేట దగ్గర జెట్టీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. మత్స్యకారుడికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వడంతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చారు. మత్స్యకారులం అందరం మీకు రుణపడి ఉంటాం. ఎల్లకాలం మీరే సీఎంగా ఉండాలి. – లక్ష్మయ్య, మత్స్యకారుడు, మంచినీళ్లపేట, శ్రీకాకుళం. ఏ ప్రభుత్వం ఇలా మేలు చేయలేదు మీరు ఆక్వా కల్చర్‌లో అన్ని అంశాలను ఒక గొడుగు కిందకు తెస్తూ.. ఆక్వాకల్చర్ అథారిటీ ఏర్పాటు చేయడం వల్ల మా సమస్యలన్నింటికి పరిష్కారం కనిపిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమూ చూడనంత తీవ్రంగా, తీక్షణంగా మీరు మా సమస్యను చూసి పరిష్కరిస్తున్నారు. గతంలో ఇంత మేలు ఎప్పుడూ జరగలేదు. యూనిట్ విద్యుత్ రూ.1.50 చొప్పున ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఒకరకంగా ఈ రోజు రైతులు ప్రాణాలతో ఉన్నారంటే అందుకు మీరే కారణం. కోవిడ్ సమయంలోనూ మద్దతు ధర కల్పించి ఆదుకుంటున్నారు. ఆక్వా హబ్‌లు, ప్రాసెసింగ్ యూనిట్లు, జనతా బజార్లు మా తల రాతలను మారుస్తాయనడంతో సందేహం లేదు. – కనుమూరి ప్రసాద్, గుడివాడ, కృష్ణా జిల్లా -
మత్స్యకార చరిత్రలో సరికొత్త అధ్యాయం
మత్స్యకారుల జీవితాలు ఎంత దయనీయమైన స్థితిలో వున్నాయనేది నా పాదయాత్రలో కళ్లారా చూశాను. మంచి చదువులు చదువుకోలేని, పక్కా ఇళ్లు లేని, సరైన ఆరోగ్య వసతి లేని, కష్టానికి తగ్గ ప్రతిఫలం లేని పరిస్థితి. పట్టిన చేపలకు తగిన ధర రాని దైన్యం. మన కళ్లెదుటే ఇవన్నీ కనిపించాయి. మత్స్యకారుల జీవితాలను మార్చడానికి మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేగంగా అడుగులు వేశాం. నవరత్నాలు, ఇతర కార్యక్రమాల ద్వారా అన్ని విధాలా ఆదుకుంటున్నాం. హామీలన్నీ అమలు చేశాం. వచ్చే ఏడాది రాష్ట్రంలో చేపలు, పీతలు, రొయ్యలను సాగు చేస్తున్న రైతుల జీవితాలను పూర్తిగా మార్చేందుకు కనీసం 30 శాతం ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే విక్రయించేలా జనతాబజార్లకు అనుసంధానం చేస్తున్నాం. సాక్షి, అమరావతి: మత్స్యకారుల జీవనోపాధిని మెరుగు పరచడం ద్వారా వారి జీవితాలను మార్చాలనే లక్ష్యంతో పాటు మత్స్య పరిశ్రమ రూపు రేఖలను మార్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లు, జనతా బజార్లలో మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్ సదుపాయం కోసం రూ.3,500 కోట్లు వ్యయం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రూ.1,510 కోట్లతో నిర్మించనున్న 4 ఫిషింగ్ హార్బర్లకు, తొలి దశలో 25 ఆక్వా హబ్‌లకు శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చ్యువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని మత్స్యకారులు, ఆక్వా రైతులను ఉద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. నవరత్నాల్లోని ప్రతిదాన్ని మత్స్యకారులకు అందిస్తూనే.. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెప్పారు. రాబోయే సంవత్సర కాలంలో చేపలు, రొయ్యలు, పీతలు సాగు చేసే రైతుల జీవితాలను మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ రోజు ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని మనం ఒక పండుగగా జరుపుకుంటున్నామని చెప్పారు. మన దేశానికి 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే, మన రాష్ట్రంలో 974 కిలోమీటర్లు ఉందన్నారు. దేశంలో సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రెండవ రాష్ట్రం మనదని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్రంలో మత్స్యకారుల జీవితాలు మాత్రం పెద్దగా ఎందుకు మారలేదని మనమంతా మనస్సాక్షితో గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించాలన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్, మంత్రులు, అధికారులు మత్స్యకారుల జీవితాలను చూసి చలించిపోయాను ► మన మత్స్యకారులు గుజరాత్ వంటి రాష్ట్రాలకు వెళ్లి బతుకు దెరవు కోసం పని చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ అంతర్జాతీయ జలాల్లో చేపల వేట సాగిస్తున్న వారిని పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోలీసులు పట్టుకుని జైళ్లకు పంపిన పరిస్థితి కనిపిస్తోంది. ► పాదయాత్రలో తీర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మత్స్యకార కుటుంబాలు చెప్పిన ఈ కన్నీటి గాథ నన్ను చలింపచేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వంపై మన ఎంపీలు తీవ్రమైన ఒత్తిడి తేవడంతో పాటు, నేను కూడా ప్రత్యేకంగా కేంద్రంతో మాట్లాడాను. ► ఆ జైళ్లలో మగ్గిపోతున్న మన వారిని తిరిగి ఇక్కడకు తీసుకు రావడానికి పెద్ద ప్రయత్నమే చేశాం. వారు తిరిగి వచ్చినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు నాలుగు.. త్వరలో మరో నాలుగు ► మత్స్య పరిశ్రమ పరంగా విస్తారంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఒక రాష్ట్రంగా మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల పరిపాలనలో ఇలా ఆలోచన చేశాం. వీరి జీవితాలు ఎలాగైనా మార్చాలని అడుగులు ముందుకు వేశాం. ► ఇందులో భాగంగా రూ.1,510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లకు ఇవాళ (శనివారం) శంకుస్థాపన చేస్తున్నాం. ► డిసెంబర్ 15 నాటికి ఈ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని, పనులు కూడా ప్రారంభమవుతాయి. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం కొత్తపట్నంలో మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేస్తున్నాం. మూడు జెట్టీలు కూడా నిర్మిస్తాం. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ నమూనా 25 ఆక్వా హబ్‌లకు శంకుస్థాపన ► రాష్ట్రంలో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో.. ఒక్కొక్కటి చొప్పున ఆక్వా హబ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీని కోసం రూ.225 కోట్లు ఖర్చు చేయనున్నాం. తొలి దశలో భాగంగా 25 ఆక్వా హబ్‌ల నిర్మాణానికి ఇప్పుడు శంకుస్థాపన చేశాం. ► 8 ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లు, జనతా బజార్లలో మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాల కోసం దాదాపు రూ.3,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నెన్నో.. ► మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో దాదాపు మరో రూ.10 వేల కోట్లతో మరో మూడు పోర్ట్‌లను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వీటికి సంబంధించి మరో రెండు, మూడు నెలల్లోనే టెండర్లను ఫైనలైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ► సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు తొలి ఏడాది రూ.10 వేల చొప్పున 1,02,332 కుటుంబాలకు రూ.102.33 కోట్లు సాయం చేశాం. రెండో ఏడాది కోవిడ్ నేపథ్యంలో ఆరు నెలలు ముందుగానే 1,09,2307 కుటుంబాలకు దాదాపు రూ.110 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశాం. ► దేశీయ, నాటు, తెడ్డు తెరచాప మత్స్యకారులకు కూడా సాయం చేశాం. డీజిల్ సబ్సిడీని లీటర్‌కు రూ.6 నుంచి రూ.9కి పెంచాం. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ► గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ బకాయి పెట్టిన రూ.78 కోట్లు 16,559 మత్స్యకారులకు చెల్లించాం. రూ.720 కోట్ల భారం భరిస్తూ 55 వేల మంది ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ రూ.1.50కే ఇస్తున్నాం. గ్రామ సచివాలయాల్లో 794 మంది మత్స్య సహాయకులను నియమించాం. ► ఆక్వా రైతులకు నాణ్యమైన మేత కోసం దేశంలోనే తొలిసారిగా ఏపీ ఫిష్ ఫీడ్ చట్టాన్ని చేశాం. నాణ్యమైన చేప, రొయ్య పిల్లల సరఫరాకు ఏపీ ఫిష్ సీడ్ కంట్రోల్ ఆర్డినెన్స్ కూడా జారీ చేశాం. ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.50 కోట్లతో 35 ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశాం. పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ఆర్డినెన్స్ జారీ చేశాం. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు మీరు ఈ రోజు నిజాంపట్నం పోర్టు అభివృద్ధికి రూ.451 కోట్లు కేటాయించి మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఈ పోర్టు అభివృద్ధి చెందితే అక్కడ శీతల గిడ్డంగిలు, ఐస్ ప్లాంట్స్, ఆక్షన్ హాల్స్, విశ్రాంతి భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మాకు ఎన్నెన్నో అవకాశాలు అందివస్తాయి. ఏటా రూ.10 వేలు సాయం చేస్తున్నారు. ఆయిల్ సబ్సిడీ రూ.6 నుంచి రూ.9కి పెంచారు. మత్స్యకారులం దరి తరఫున మీకు ధన్యవాదాలు. – ఎన్.శివయ్య, మత్స్యకారుడు, నిజాంపట్నం గ్రామం, గుంటూరు జిల్లా -
మత్స్యకారుల జీవితాల్లో వెలుగు
సాక్షి, అమరావతి : మత్స్యకారుల జీవనోపాధిని మెరుగు పరచడం ద్వారా వారి జీవితాలను మార్చాలనే లక్ష్యంతో పాటు మత్స్య పరిశ్రమ రూపు రేఖలను మార్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లు, జనతా బజార్లలో మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్ సదుపాయం కోసం రూ.3,500 కోట్లు వ్యయం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రూ.1,510 కోట్లతో నిర్మించనున్న 4 ఫిషింగ్ హార్బర్లకు, తొలి దశలో 25 ఆక్వా హబ్‌లకు శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చ్యువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని మత్స్యకారులు, ఆక్వా రైతులను ఉద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. నవరత్నాల్లోని ప్రతిదాన్ని మత్స్యకారులకు అందిస్తూనే.. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు. రాబోయే సంవత్సర కాలంలో చేపలు, రొయ్యలు, పీతలు సాగు చేసే రైతుల జీవితాలను మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో రూ.225 కోట్లతో ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపడతున్నామని వెల్లడించారు. రూ.10 వేల కోట్ల వ్యయంతో మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్ట్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పండుగగా ప్రపంచ మత్స్య దినోత్సవం ఈ రోజు ప్రపంచ మత్స్య దినోత్సవం. దీనిని మనం ఒక పండుగగా జరుపుకుంటున్నాం. మన దేశానికి 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే, మన రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. దేశంలో సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రెండవ రాష్ట్రం మనది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల జీవితాలు మాత్రం పెద్దగా ఎందుకు మారలేదని, మనమంతా మనస్సాక్షితో గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించాలి. మత్స్యకారుల జీవితాలు ఎంత దయనీయమైన స్థితిలో వున్నాయి అనేది నా పాదయాత్రలో నా కళ్లారా చూశాను. మంచి చదువులు చదువుకోలేని పరిస్థితి. పక్కా ఇళ్లు లేని దుస్థితి. సరైన ఆరోగ్య వసతి, కష్టానికి తగ్గ ప్రతిఫలం లేని పరిస్థితి. పట్టిన చేపలకు తగిన ధర రాని దైన్యం. మన కళ్లెదుటే ఇవన్నీ కనిపిస్తున్నాయి. మత్స్యకారుల జీవితాలను చూసి చలించిపోయాను మన మత్స్యకారులు అతి తక్కువ జీతానికి ఎక్కడో ఉన్న గుజరాత్ వంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడ బతుకు దెరవు కోసం ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ అంతర్జాతీయ జలాల్లో చేపల వేట సాగిస్తున్న వారిని పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోలీసులు పట్టుకుని జైళ్లకు పంపితే, అక్కడ మనవాళ్లు మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పాదయాత్రలో తీర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మత్స్యకార కుటుంబాలు చెప్పిన ఈ కన్నీటి గాథ నన్ను చలింపచేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వంపై మన ఎంపీలు తీవ్రమైన ఒత్తిడి తేవడంతో పాటు, నేను కూడా ప్రత్యేకంగా కేంద్రంతో మాట్లాడాను. ఆ జైళ్లలో మగ్గిపోతున్న మన వారిని తిరిగి ఇక్కడకు తీసుకు రావడానికి పెద్ద ప్రయత్నమే చేశాం. వారు తిరిగి వచ్చినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఎందుకు మన మత్య్సకారులకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆలోచిస్తే బాధ కలిగింది. మత్స్యకారుల జీవితాలను మార్చాలన్న లక్ష్యంతో అడుగులు పెద్ద సముద్రతీరం ఉన్నా.. మన రాష్ట్రానికి అవసరమైన పోర్ట్‌లను తెచ్చుకోలేక పోయాం. ఫిషింగ్ హార్బర్లను కట్టుకోలేక పోయాం. ఇన్ని సంవత్సరాల తరబడి మత్స్యకారులను పట్టించుకోవాలన్న ఆలోచన చేయలేదు. మత్స్యకారుల సమస్యలకు సమాధానాలు ఏమిటి? మొత్తంగా మత్స్య పరిశ్రమ పరంగా విస్తారంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఒక రాష్ట్రంగా మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల పరిపాలనలో ఇలా ఆలోచన చేశాం. వీరి జీవితాలు ఎలాగైనా మార్చాలని అడుగులు ముందుకు వేశాం. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని కూడా మత్స్యకారులకు అందించడంతో పాటు ప్రత్యేకించి వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మొట్ట మొదటి ఏడాదిలోనే మన ప్రభుత్వం ఆచరణలోకి తీసుకువచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి, చెప్పిన ప్రతి దానిని నెరవేరిస్తేనే, మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయని భావించి అడుగులు ముందుకు వేశాం. ఇప్పుడు నాలుగు.. త్వరలో మరో నాలుగు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి అటు మత్స్యకారుల జీవితాలు, ఇటు రాష్ట్రంలోని మత్స్యపరిశ్రమ రూపురేఖలను కూడా మార్చేందుకు దాదాపు రూ.1,510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లకు నేడు శంకుస్థాపన చేస్తున్నాం. డిసెంబర్ 15 నాటికి ఈ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని, పనులు కూడా ప్రారంభమవుతాయి. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం కొత్తపట్నంలో మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేస్తున్నాం. 25 ఆక్వా హబ్‌లకు శంకుస్థాపన రాష్ట్రంలో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో.. ఒక్కొక్కటి చొప్పున ఆక్వా హబ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీని కోసం రూ.225 కోట్లు ఖర్చు చేయనున్నాం. తొలి దశలో భాగంగా 25 ఆక్వా హబ్‌ల నిర్మాణానికి ఇప్పుడు శంకుస్థాపన చేశాం. వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు అందుబాటులోకి తీసుకువచ్చి, పౌష్టికాహార భద్రతను కల్పించడంతో పాటు, జనతాబజార్లకు అనుసంధానం చేసి, మత్స్య, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా 8 ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లు, జనతా బజార్లలో మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు.. వీటన్నింటికీ కలిపి దాదాపు రూ.3,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. రాబోయే ఏడాదిలో రాష్ట్రంలో చేపలు, పీతలు, రొయ్యలను సాగు చేస్తున్న రైతుల జీవితాలను పూర్తిగా మార్చే దిశగా.. కనీసం 30 శాతం మన రాష్ట్రంలోనే వాటి కొనుగోళ్లు జరిగేలా జనతాబజార్లకు అనుసంధానం చేస్తున్నాం. మున్సిపాలిటీ వార్డుల్లో, గ్రామ సచివాలయాల పక్కనే జనతా బజార్లు ఏర్పాటు చేసి, వాటిల్లో ఆక్వా ఉత్పత్తుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక ఏడాది కాలంలోనే వీటి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్ట్‌ల నిర్మాణం మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో దాదాపు మరో రూ.10 వేల కోట్లతో మరో మూడు పోర్ట్‌లను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వీటికి సంబంధించి మరో రెండు, మూడు నెలల్లోనే టెండర్లను ఫైనలైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. 2019 ఎన్నికల సమయంలో మత్స్యకారుల సంక్షేమం కోసం మేనిఫేస్టోలో చెప్పిన మూడు వాగ్దానాలు నెరవేర్చాం. మత్స్యకార అక్కచెల్లెమ్మల కోసం పలు కార్యక్రమాలు చేపట్టాం. మత్స్యకారుల సంక్షేమం కోసం ఇలా.. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిషేధ సమయం. ఈ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఎప్పుడూ సకాలంలో వారికి సాయం అందించలేదు. కొన్నిసార్లు ఇచ్చినా, అది కూడా అరకొరే. దానిని కూడా అందిరికీ ఇచ్చేవారు కాదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేట నిషేధ సమయంలో ఆదాయాన్ని కోల్పోయే ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.10 వేలు సాయంగా ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నాం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 2019-20లో మొత్తం1,02,332 కుటుంబాలకు రూ.102.33 కోట్లు అందించామని గర్వంగా చెబుతున్నాం. వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయం గత ఏడాది నవంబర్‌లో ఇచ్చాం. ఈ ఏడాది కూడా నవంబర్లోనే ఇవ్వాలనుకోకుండా మే నెలలోనే చెల్లించాం. గత ఏడాది ఇచ్చిన దానికన్నా ఎక్కువగా అంటే 1,09,2307 కుటుంబాలకు దాదాపు రూ.110 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశాం. దేశీయ, నాటు, తెడ్డు తెరచాప మత్స్యకారులకు సాయం గతంలో మర పడవల్లో చేపల వేటకు వెళ్లే వారికే ఈ సాయం అందించేవారు. అదికూడా రిజిస్ట్రేషన్ చేయకుండా అష్టకష్టాలు పెట్టే వారు. ఆ పరిస్థితులను పూర్తిగా మారుస్తూ.. దేశీయ, నాటు, తెడ్డు, తెరచాప సహాయంతో వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా వేట నిషేధ సమయంలో రూ.పది వేల సాయం అందిస్తున్న ప్రభుత్వం మనది. మనం అధికారంలోకి రాకముందు మత్స్యకారుల బోట్లకు డీజిల్ లీటర్‌కు ఆరు రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు. అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. ఈ రోజు మన ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని ఆరు నుంచి తొమ్మిది రూపాయలకు పెంచింది. ఆ రాయితీని బంకులో డీజిల్ కొట్టే సమయంలోనే తగ్గించి తీసుకునేలా చర్యలు తీసుకున్నాం. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకార సోదరులు మరణిస్తే, గతంలో వారి కుటుంబానికి అందించే రూ.5 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాం. మీ బిడ్డగా, మీమీద మమకారంతో ఈ కార్యక్రమాన్ని చేశాను. గుజరాత్ బకాయి పెట్టినా, రూ.78 కోట్లు చెల్లించాం గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ 2012లో మన రాష్ట్రంలోని సముద్ర తీరంలో డ్రిల్లింగ్ చేసిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది మండలాల్లో 68 మత్స్యకార గ్రామాల్లోని 16,559 మత్స్యకార కుటుంబాలు జీవన భృతి కోల్పోయాయి. 13 నెలల పాటు డ్రిల్లింగ్ జరిగింది. అయితే గుజరాత్ పెట్రోలియం సంస్థ ఆరు నెలల కాలానికి రూ.68 కోట్లు మాత్రమే చెల్లించింది. మిగిలిన ఏడు నెలలకు చెల్లించాల్సిన రూ.78 కోట్లు బకాయి పెట్టింది. దీనిని అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. నా పాదయాత్రలో బాధిత మత్స్యకార కుటుంబాలు చెప్పిన ఈ సమస్యను గుర్తు పెట్టుకుని, గత ఏడాది ఇదే మత్స్యకార దినోత్సవం రోజున రూ.78 కోట్ల బకాయిలను మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. కేంద్రం నుంచి ఈ మొత్తం ఎప్పుడు వస్తుందో తెలియదు.. అప్పటి వరకు మత్స్యకార కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సొమ్ము చెల్లించింది. ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ రూ.1.50కే ఇస్తున్నాం మొత్తంగా మత్స్యకార రంగానికి మద్దతుగా నిలుస్తున్నాం. ఆక్వా రైతులకు కరెంట్ యూనిట్ రూ.1.50కే అందిస్తున్నాం. ఇందుకోసం ఏకంగా రూ.720 కోట్ల సబ్సిడీని ఆక్వా రైతుల కోసం చిరునవ్వుతోనే ప్రభుత్వం భరిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు, మూడు నెలలు కూడా ఆగకుండా ఈ కార్యక్రమానిక శ్రీకారం చుట్టాం. దీనివల్ల సుమారు 55 వేల మంది ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతోంది. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు సంబంధిత గ్రామ సచివాలయాల్లో 794 మంది మత్స్య సహాయకులను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నియమించాం. ఆర్బీకేల్లో రైతులకే కాదు, మత్స్యకారులు, ఆక్వా రైతులకు కూడా తోడుగా వుండి, వారిని చేయిపట్టుకని మత్స్య సహాయకులు నడిపిస్తున్నారు. ఏపీ ఫిష్ ఫీడ్ యాక్ట్, ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ నాణ్యమైన చేపలు, రొయ్యల మేత అందుబాటులో లేక రైతులు ఎలా ఇబ్బంది పడ్డారో పాదయాత్రలో కళ్లారా చూశాను. క్వాలిటీ అనేది తెలియక, ఆ ఫీడ్‌లో ఫెస్టిసైడ్స్, కెమికల్స్ వుండటం వల్ల ఆక్వా ఉత్పత్తులు అమ్ముడు పోక రకరకాలుగా ఆక్వా రైతులు ఇబ్బంది పడ్డారు. ఆక్వా రైతులకు నాణ్యమైన మేత అందించాలనే ఉద్దేశంతో, నకిలీలను అడ్డుకునేందుకు దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీ ఫిష్ ఫీడ్ చట్టాన్ని చేశాం. ఇందుకోసం ఆక్వా రైతులకు నాణ్యమైన చేప, రొయ్య పిల్లల సరఫరాకు ఏపీ ఫీష్ సీడ్ కంట్రోల్ ఆర్డినెన్స్ కూడా జారీ చేశాం. ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.50 కోట్లతో 35 ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశాం. నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. నా పాదయాత్రలో ఆక్వా రైతుల కష్టాలను చూశాను. ఎక్కడా ల్యాబ్‌లు లేవు. కృష్ణా జిల్లాలో సమస్య వస్తే.. ఎక్కడికో కాకినాడ వరకు తీసుకుపోవాల్సి వచ్చేది. అంతదూరం పోలేక, ఎవరి దగ్గర దొరికితే.. వారి దగ్గర సీడ్ తీసుకునేవారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని, క్వాలిటీ అనేది ప్రతి ఆక్వా రైతుకు కూడా అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు మత్స్య, ఆక్వా రంగాల్లో నిపుణులను తయారు చేయడానికి, నైపుణ్యం పెంచడానికి, పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ఆర్డినెన్స్ జారీ చేశాం. మరో మూడు, నాలుగు నెలల్లో ఈ పనులు ప్రారంభమవుతాయి. ఇవ్వన్నీ కూడా మంచి మనసుతో చేశాం. దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం మరింతగా మీ అందరికీ మేలు చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీ మేలు మరవలేం ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అని మీరు పాదయాత్రలో అన్నారు. సీఎం కాగానే మీరు ఆ మాట నిలబెట్టుకున్నారు. తక్కువ టైంలో మా చేతికి రూ.10 వేల సాయం అందింది. మీరు చిన్న కర్ర తెప్పలను కూడా గుర్తించి వాళ్లకు కూడా రూ.10 వేలు ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాం. గతంలో ఇలాంటి సాయం ఎప్పుడూ అందలేదు. ఎవరైనా వేటకు వెళ్లి మరణిస్తే అందించే సాయాన్ని ఏకంగా రూ.10 లక్షలు చేశారు. పాకిస్తాన్, గుజరాత్‌తో చిక్కుకుపోయిన మత్స్యకారులను రప్పించిన మీ మేలు మరవలేం. మంచినీళ్లు పేట దగ్గర జెట్టీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. మత్స్యకారుడికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వడంతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చారు. మత్స్యకారులం అందరం మీకు రుణపడి ఉంటాం. ఎల్లకాలం మీరే సీఎంగా ఉండాలి. - లక్ష్మయ్య, మత్స్యకారుడు, మంచినీళ్లపేట, శ్రీకాకుళం. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు సముద్రంలో చేపల వేట నా వృత్తి. మీరు ఈ రోజు నిజాంపట్నం పోర్టు అభివృద్ధికి రూ.451 కోట్లు కేటాయించి మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఈ పోర్టు అభివృద్ధి చెందితే అక్కడ శీతల గిడ్డంగిలు, ఐస్ ప్లాంట్స్, ఆక్షన్ హాల్స్, విశ్రాంతి భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మాకు ఎన్నెన్నో అవకాశాలు అందివస్తాయి. ఏటా రూ.10 వేలు సాయం చేస్తున్నారు. ఆయిల్ సబ్సిడీ రూ.6 నుంచి రూ.9కి పెంచారు. ఆర్బీకేల పక్కన మత్స్య మార్కెటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మత్స్యకారులందరి తరఫున మీకు ధన్యవాదములు. - ఎన్.శివయ్య, మత్స్యకారుడు, నిజాంపట్నం గ్రామం, గుంటూరు జిల్లా ఏ ప్రభుత్వం ఇలా మేలు చేయలేదు మీరు ఆక్వా కల్చర్‌లో అన్ని అంశాలను ఒక గొడుగు కిందకు తెస్తూ.. ఆక్వాకల్చర్ అథారిటీ ఏర్పాటు చేయడం వల్ల మా సమస్యలన్నింటికి పరిష్కారం కనిపిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమూ చూడనంత తీవ్రంగా, తీక్షణంగా మీరు మా సమస్యను చూసి పరిష్కరిస్తున్నారు. గతంలో ఇంత మేలు ఎప్పుడూ జరగలేదు. యూనిట్ విద్యుత్ రూ.1.50 చొప్పున ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఒకరకంగా ఈ రోజు రైతులు ప్రాణాలతో ఉన్నారంటే అందుకు మీరే కారణం. కోవిడ్ సమయంలోనూ మద్దతు ధర కల్పించి ఆదుకుంటున్నారు. ఆక్వా హబ్‌లు, ప్రాసెసింగ్ యూనిట్లు, జనతా బజార్లు మా తల రాతలను మారుస్తాయనడంతో సందేహం లేదు. - కనుమూరి ప్రసాద్, గుడివాడ, కృష్ణా జిల్లా -
మత్స్య రైతులకు అండగా...
-
ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: మత్స్యకారుల అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో శనివారం శంకుస్థాపన చేశారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతోపాటు 25 ఆక్వాహబ్‌ల నిర్మాణ పనులకు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ఏపీలో 974 కి.మీ తీరప్రాంతం ఉంది. మత్స్యకారుల జీవితాలు దయనీయస్థితిలో ఉండటం పాదయాత్రలో చూశా. సరైన సౌకర్యాలు లేక గుజరాత్‌లాంటి ప్రాంతాలకు వలస పోవడం చూశాం. పెద్ద సముద్రతీరం ఉన్నా అవసరమైన ఫిషింగ్ హార్బర్లు లేవు. మత్స్యకారుల జీవితాలు మార్చేందుకు ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం. నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వాహబ్‌లకు శంకుస్థాపన చేశాం. మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె, ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ల నిర్మిస్తున్నాం. దీంతోపాటు నియోజకవర్గానికో ఆక్వాహబ్ నిర్మాణం చేపడుతున్నాం. జనతా బజార్లలో నాణ్యమైన రొయ్యలు, చేపలను అందుబాటులోకి తెస్తాం. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో మరో 3 పోర్టుల నిర్మాణాన్ని చేపడుతాం. వేట నిషేధ సమయంలో ఆదాయం కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.10వేలు చొప్పున లక్షా 2వేల 337 కుటుంబాలకు ఇచ్చాం. డీజిల్ సబ్సిడీని రూ.6 నుంచి రూ.9కి పెంచాం. వేట సమయంలో ప్రమాదవశాత్తు మత్స్యకారులు చనిపోతే అందించే రూ.5 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాం. ఆక్వా రైతులకు యూనిట్ కరెంట్‌ను రూపాయిన్నరకే అందిస్తున్నాం. క్వాలిటీ కోసం ఆక్వా ల్యాబ్స్‌ను కూడా ఏర్పాటు చేశాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆర్డినెన్స్ తెచ్చాం’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఏపీ: నాలుగు ఫిషింగ్ హార్బర్లకు నేడు శంకుస్థాపన
సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లకు ముఖ్యమంత్రి నేడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పాదయాత్ర హామీ మేరకు... తన సుదీర్ఘ పాదయాత్ర సమయంలో మత్స్యకారుల సమస్యలను స్వయంగా పరిశీలించిన సీఎం జగన్ వారి ఇబ్బందులను తొలగించేందుకు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలిదశలో రూ.1,510 కోట్లతో నాలుగు ఫిషింగ్ హార్బర్లను రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించగా డిసెంబర్ రెండో వారంలో ఖరారు కానున్నాయి. రెండోదశలో ప్రారంభమయ్యే మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లు శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఏర్పాటు కానున్నాయి. మొత్తం 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.3 వేల కోట్లు వెచ్చిస్తోంది. నియోజకవర్గానికో ఆక్వా హబ్ వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం, పౌష్టికాహార భద్రతలో భాగంగా రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఆక్వాహబ్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రూ.225 కోట్లు ఖర్చు చేయనున్నారు. తొలిదశలో భాగంగా 25 ఆక్వాహబ్‌ల నిర్మాణ పనులకు సీఎం జగన్ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. లైవ్ ఫిష్, తాజా చేపలు, డ్రై చేపలు, ప్రాసెస్ చేసిన చేపలు, రొయ్యలు, పీతలు ఇతర మత్స్య ఉత్పత్తులు వీటిల్లో లభిస్తాయి. మత్స్య, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ హబ్‌లను జనతా బజార్లతో అనుసంధానం చేయనున్నారు. ఆక్వా రైతుల సొసైటీలు ఈ హబ్‌లను నిర్వహిస్తాయి. -
సీఎం సంకల్పం.. వారి కల సాకారం
సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మత్స్యకారులకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు సమకూర్చే బృహత్తర ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (శనివారం) శంకుస్థాపన చేయనున్నారు. తీర ప్రాంతంలో తొలి దశలో నిర్మించనున్న 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారు. త్వరలో మిగిలిన నాలుగు చోట్ల కూడా పనులు మొదలుపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుదీర్ఘ పాదయాత్ర సమయంలో క్షేత్రస్థాయిలో మత్స్యకారుల ఇబ్బందులను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి, వారికి మెరుగైన మౌలిక వసతులను కల్పించడంకోసం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. (చదవండి: సీఎం జగన్‌కు ధన్యవాదాలు: మాబున్నీసా) తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వల దిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ గుంటూరు జిల్లా నిజాంపట్నం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్‌కు ముఖ్యమంత్రి రేపు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారు. ఈ 4 ఫిషింగ్ హార్బర్లకోసం సుమారు రూ. 1510 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే వీటికోసం టెండర్లను ఆహ్వానించారు. డిసెంబర్ రెండో వారంలో వీటిని ఖరారు చేస్తారు. (చదవండి: తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్) జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ. 289 కోట్లు, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ. 451 కోట్లు, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ. 348 కోట్లు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ. 422 కోట్ల రూపాయలు, మొత్తంగా రూ.1510 కోట్లు తొలిదశ ప్రాజెక్టు వ్యయంగా నిర్ణయించారు. దీని తర్వాత త్వరలో మరో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం చురుగ్గా అడుగులు వేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్ల పాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక పశ్చిమగోదావరి జిల్లా బియ్యపు తిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి సుమారు రూ.3వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక ఆక్వాహబ్ చొప్పున నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికోసం రూ. 225 కోట్లు ఖర్చు చేయనున్నారు. తొలిదశలో భాగంగా 25 ఆక్వాహబ్‌ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు వచ్చి దేశీయంగా వినియోగం పెంచడంకోసం, పౌష్టికాహార భద్రత కల్పించడంకోసం ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. లైవ్ ఫిష్, తాజా చేపలు, డ్రై చేసిన చేపలు, ప్రాసస్ చేసిన చేపలు, రొయ్యలు, పీతలు ఇతర మత్స్య ఉత్పత్తులు ఇందులో లభిస్తాయి. మత్స్య, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఈ హబ్‌లను జనతాబజార్లతో అనుసంధానం చేయనున్నారు. ఆక్వా రైతుల సొసైటీలు ఈ హబ్‌లను నిర్వహిస్తాయి. సమీప ప్రాంతంలో రైతులు, మత్స్యకారుల నుండి చేపలు, రొయ్యలు సేకరించి హబ్‌లకు, తద్వారా జనతాబజార్లకు సరఫరా చేస్తారు. -
వలేసి పట్టేద్దాం!
మానికొండ గణేశ్, సాక్షి, అమరావతి: పది గ్రాముల పిత్తపరిగి మొదలు 25 కేజీల ట్యూనా చేపలను వేటాడేందుకు, ఉప్పాడ వంటి మారుమూల గ్రామం నుంచి ఉత్తర అమెరికా వరకు సముద్ర మత్స్య సంపద ఎగుమతికి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తద్వారా రాష్ట్రంలోని మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడి సముద్ర జలాల సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు చిక్కి బాధలు పడిన మత్స్యకారుల పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వీటిని నిర్మించనుంది. హార్బర్ల ద్వారా ఇకపై కోస్తా తీరాన్ని సంపదలకు నెలవుగా, ఉపాధి అవకాశాలు కల్పించే కల్పతరువుగా రూపు మార్చనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మాణం కానున్నాయి. ► దాదాపు రూ.2,639 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయనుంది. వీటిలో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల నిర్మాణాలకు నాబార్డు రూ.450 కోట్లను ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద (ఎఫ్ఐడిఎఫ్) రుణం ఇవ్వనుంది. ► ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, నాబార్డుకు చెందిన ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, మచిలీపట్నం, నిజాంపట్నాల్లోని ఫిషింగ్ హార్బర్ల రెండో దశ నిర్మాణాలకు, ఉప్పాడ ఫిషింగ్ హార్బరు నిర్మాణాలకు రూ.1,015.219 కోట్లతో అంచనాలు తయారు చేసింది. ఇందులో నిజాంపట్నం హార్బరు నిర్మాణానికి రూ.379.17 కోట్లు, మచిలీపట్నం హార్బరు నిర్మాణానికి రూ.285.609 కోట్లు, ఉప్పాడ నిర్మాణానికి రూ.350.440 కోట్లు అవసరవవుతాయని అంచనా. ► వీటిల్లో ఒక్కోదానికి ఎఫ్ఐడీఎఫ్ కింద లభించే రూ.150 కోట్ల రుణం పోను మిగిలిన ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం 90% నిధులను ఎన్ఐడీఐ (నాబార్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్) రుణం ద్వారా సమకూర్చనుంది. మిగిలిన 10% నిధులను రాష్ట్రం ఖర్చు చేయనుంది. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ రూ.288.80 కోట్లతో జువ్వలదిన్నె హార్బర్ ► నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె హార్బరు నిర్మాణానికి రూ.288.80 కోట్లతో అంచనాలు తయారు చేయగా, సాగరమాలలో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్, బీఆర్) కింద కేంద్రం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులను భరించనున్నాయి. ► మొదటి విడతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.18 కోట్లు విడుదల చేశాయి. ఇటీవల అప్పటి మత్స్యశాఖ మంత్రి మోపిదేవి, ఆ జిల్లా శాసన సభ్యులు రేవు నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. ► శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం హార్బరుకు రూ.332.09 కోట్లు, విశాఖ జిల్లా పూడిమడక హార్బరుకు రూ.353.10 కోట్లు, ప్రకాశం జిల్లా కొత్తపట్నం హార్బరుకు రూ.325.16 కోట్లతో అంచనాలు తయారయ్యాయి. ► ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) పథకం కింద ఒక్కో హార్బరుకు రూ.120 కోట్ల రుణం విడుదల కావాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప హార్బరు నిర్మాణానికి అవసరమైన నివేదికను బెంగళూరుకు చెందిన సీఐసీఈఎఫ్ (సైసెఫ్) ఇవ్వాల్సింది. ► మొదట్లో దీనిని ఫిష్ ల్యాండింగ్ సెంటరుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, హార్బరుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.300 కోట్లతో అంచనాలు రూపొందించారు. హార్బర్ల నిర్మాణాలతో ఎన్నో ప్రయోజనాలు ► కొత్తగా నిర్మించనున్న హార్బర్ల వల్ల అదనంగా 11,280 ఫిషింగ్ బోట్లకు లంగరు వేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా ట్యునా చేపలు శుభ్రం చేయడానికి, నిల్వ చేయడానికి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ► వీటి ద్వారా 76,230 మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. వీటికి అనుబంధంగా ఏర్పాటయ్యే ఐస్ప్లాంట్లు, ప్రీప్రాసెసింగ్ సెంటర్లు, చేపల రవాణా, మార్కెటింగ్ ఇతర అనుబంధ సంస్థల్లో పనులు చేయడానికి మత్స్యకారులకు అవకాశం ఏర్పడుతుంది. ► అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హార్బర్లలోని పనుల నిర్వహణకు మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటవుతాయి. వీటి ద్వారా వినియోగ రుసుములను వసూలు చేసి హార్బర్ల నిర్వహణ ప్రభుత్వానికి భారం కాకుండా చూస్తాయి. ► రొయ్యలు, చేపలకు మంచి రేటు వచ్చే వరకు హార్బరులోనే నిర్మించే కోల్డు స్టోరేజి ప్లాంట్లలో నిల్వ చేసే అవకాశం ఏర్పడుతుంది. దీని వల్ల మత్స్యకారులు, మర పడవల నిర్వాహకులకు లబ్ధి చేకూరడమే కాకుండా విదేశీ ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది. ► సాలీనా 4.22 లక్షల టన్నుల చేపలు, రొయ్యల పట్టుబడి అదనంగా జరుగుతుంది. ► తుపానులు, ప్రకృతి వైపరీత్య సమయాల్లో మర పడవలు సురక్షితంగా హార్బర్లలో లంగరు వేసుకునే సౌకర్యం లభిస్తుంది. ► వేట విరామ సమయాల్లో మత్స్య కార్మికులు హార్బరులో నిర్మించే భవనాల్లో వలలు, ఇతర పరికరాల మరమ్మతులు చేసుకునే సౌకర్యం ఏర్పడుతుంది. మొగ వద్ద ఇసుక మేటలతో ఇక్కట్లు మొగ (సముద్ర ముఖ ద్వారం) దగ్గర ఇసుక మేటలు వేస్తోంది. సముద్ర అలల వేగం వల్ల మా ఊళ్లో అనేక బోట్లు దెబ్బ తిన్నాయి. వాటిని బాగు చేయించుకోవాలంటే ఓనర్లు లక్షలు పోయాల్సిందే. ఇక్కడి హార్బర్ నుంచి మొగ దగ్గరకు వెళ్లే కాల్వ లోతు పెంచక పోవడం వల్ల ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇందువల్లే చేపల వేట కోసం ఇతర రాష్ట్రాలకు పోతున్నాం. ఇన్నాళ్లూ మా బాధలు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం జగన్ మా సమస్యపై దృష్టి పెట్టారు. మొగ వద్ద ఇసుక మేటలు తొలగించాకే మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. – మల్లికార్జునరావు, గిలకలదిండి, కృష్ణా జిల్లా బోట్లు పెరుగుతుంటే లంగరుకు చోటేదీ? హార్బరులో బోట్లు పెరుగుతున్నాయి. మంచి సీజనులో గిలకలదిండి, నరసాపురం నుంచి బోట్లు వస్తాయి. అప్పుడు ఒడ్డుకు ఎవరు ముందు వస్తే వాళ్లు జట్టీలకు బోట్లు కట్టుకుంటున్నారు. మిగిలిన వాళ్లంతా తీరానికి దగ్గరలోని చెట్లకు తాళ్లతో కట్టుకుంటున్నారు. భారీ వర్షాలు, గాలులు వచ్చినప్పుడు చెట్లకు కట్టిన తాళ్లు తెగి బోట్లు గల్లంతవుతుంటాయి. అలలకు కొట్టుకుపోతాయి. కొన్నిసార్లు వలలు, ఇంజన్లను దొంగలెత్తుకెళ్తారు. వాటిని కొనుక్కుని వేటకు వెళ్లాలంటే నెల పడుతుంది. ఈ సమస్యలన్నీ తీరాలంటే జట్టీల సంఖ్య పెంచాలి. – ఆర్.రాము, నిజాంపట్నం, గుంటూరు జిల్లా విస్తారమైన అవకాశాలు హార్బర్ల ద్వారా తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి విస్తారమైన అవకాశాలున్నాయి. పెద్ద పెద్ద బోట్ల ద్వారా సముద్రలోతుల్లో మత్స్య సంపదను పట్టే అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశాలు లేక రాష్ట్రంలోని పెద్ద పడవల నిర్వాహకులు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. ఈ పడవలకు హార్బర్లలో అన్ని సౌకర్యాలు సమకూర్చితే రాష్ట్ర ప్రభుత్వానికి సముద్ర సంపద ద్వారా భారీ ఆదాయం లభిస్తుంది. పోషక విలువలు కలిగిన సముద్ర జాతి వాడకాన్ని పెంచడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోడానికి ప్రణాళికలు రూపొందిస్తాం. – కన్నబాబు, ఫిషరీస్ కమిషనర్ ఫిషింగ్ హార్బర్లు ► పెద్ద పెద్ద పడవలు మత్స్య సంపదను సముద్ర ఒడ్డుకు తేవడానికి వీలుగా వీటిని నిర్మిస్తారు. సముద్రపు ఒడ్డున లోతు ఎక్కువగా ఉండేలా వీటిని నిర్మించడం వల్ల మత్స్యకారులకు ఎన్నో ఉపయోగాలున్నాయి. ఎగుమతులకు వీలుంటుంది. ► జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్త పట్నం, బియ్యపుతిప్పలో ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ► వేటాడి తెచ్చిన చేపలను అన్లోడ్ చేయడానికి వీలుగా వీటిని నిర్మిస్తారు. విక్రయాలకూ అవకాశం ఉంటుంది. ► మంచినీళ్లపేట, బీమిలీ, నక్కపల్లి, చింత పల్లిలో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మంచి నీళ్లపేటలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.11.95 కోట్లు కేటాయించింది. పనులను చేపట్టేందుకు నిర్మాణ సంస్థను కూడా ఖరారు చేసింది. మాకు కష్టాలు తప్పుతాయి.. మా జువ్వలదిన్నెలో చేపలరేవు కడతామని చంద్రబాబు అనేకసార్లు చెప్పాడు. మాట నిలుపుకోలేదు. సీఎం జగన్ మా జిల్లాకు వచ్చినప్పుడు మా రేవు నిర్మాణం గురించి హామీ ఇచ్చారు. మొన్నీమధ్య మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా మా ఊరొచ్చి రేవు కట్టడానికి అనువైన ప్రాంతాన్ని చూశారు. వెంటనే రేవు కడతారంట. నిధులు కూడా వచ్చేశాయని మా ఓనర్లు చెబుతున్నారు. ఇక్కడ రేవు కడితే మద్రాసు, గుజరాత్ వెళ్లక్కర్లేదు. బాధలు తప్పుతాయి. ఇక్కడి నుంచే చేపల వేటకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. – కొమరిరాజు, తుమ్మలపెంట, కావలి మండలం, నెల్లూరు జిల్లా -
ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
-
వల నిండుగా... మత్స్యకారులు ఆనందంగా...
-
రాష్ట్రంలో కొత్తగా 8 ఫిషింగ్ హార్బర్స్
-
మరింత సక్సెస్‌పుల్‌గా టెలి మెడిసిన్..
సాక్షి, అమరావతి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బైకులను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఇందుకు అవసరమైన బైకులు కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. డాక్టర్లు ప్రిస్కిప్షన్ ఇవ్వగానే 24 గంటల్లోగా మందులు అందేలా చూడాలని, దీని కోసం సిబ్బందికి బైకు, థర్మో బ్యాగులు కూడా తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్-19 నివారణ చర్యలపై అధికారులతో చర్చించారు. (మాస్కులు లేకుండా రోడ్డెక్కితే అంతే! ) ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. టెలి మెడిసిన్‌ను మరింత విజయవంతంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారందరికీ పరీక్షలు పూర్తి చేశామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. దీనిపై మాట్లాడిన వైఎస్ జగన్ పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు కూడా దీంట్లో భాగమని తెలిపారు. కోవిడ్-19 కాకుండా ఇతర కేసులు ప్రతి రోజు ఎన్ని వస్తున్నాయన్న దానిపై వివారాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సహా పలువురు అధికారులు హాజరయ్యారు. (గ్యాస్ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) విదేశాల నుంచి వచ్చిన వారి క్వారంటైన్ లాక్డౌన్ సడలింపుల అనంతరం విదేశాల్లో చిక్కుకుపోయిన వారు దేశంలోకి వచ్చే కార్యక్రమం ప్రారంభమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గల్ఫ్ నుంచే కాకుండా యూకే, యూఎస్ నుంచి కూడా కొంత మంది వచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. అయితే రాష్ట్రానికి వచ్చే వారందరికీ క్వారంటైన్ సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న షెల్టర్లు, క్వారంటైన్ కేంద్రాలు బాగుండేలా చూడాలన్నారు. నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉన్న 75 వేలకు పైగా పడకలను ముందస్తుగా వినియోగించుకోవాలని, వాటి సంఖ్యను 1 లక్ష వరకు పెంచాలని అధికారులను ఆదేశించారు. 75 వేల క్వారంటైన్ పడకలు వినియోగించినా, మిగిలినవి స్పేర్‌లో ఉంచాలని, వాటన్నింటిలో ఏ లోటు లేకుండా సదుపాయాలు కల్పించాలని, క్వారంటైన్లలో సదుపాయాలను మెరుగుపర్చడంపై దృష్టి పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదేశించారు. వ్యవసాయంపై సమీక్ష బత్తాయి రిటైల్ అమ్మకాల్లో ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇవ్వాలన్న అధికారుల సూచనకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. పసుపు, మొక్కజొన్నకు కనీస మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుండగా, పక్క రాష్ట్రాలలో ధరలు అమలు చేయకపోవడంతో అక్కడి నుంచి రైతులు ఆ పంటలు తీసుకువస్తున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి పసుపు, మొక్కజొన్న తక్కువ ధరకే వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల నుంచి పసుపు, మొక్కజొన్న ఇక్కడికి వస్తే రాష్ట్రరైతులకు నష్టం వస్తుందని, దానిని నివారించాలని అధికారులు కోరారు. ఈనెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. (ఏం జరిగింది పెద్దాయనా?) రైతు భరోసా పథకంలో మిగిలిపోయిన వారెవరైనా ఉంటే 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, మరుసటి రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు మండల వ్యవసాయ అధికారులు ఇచ్చే పాస్‌లు అనుమతించాలని అధికారులకు ముఖ్యమంత్రికి సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తెరుచుకుంటున్న దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. మాస్కులు ధరించేలా అవగాహన కలిగించాలన్నారు. ఇప్పటికి 6 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం మాస్క్‌లు పంపిణీ చేసిందని, ప్రతిరోజూ 42 లక్షల మాస్క్‌ల తయారీ చేస్తుందని వివరించారు. (మహారాష్ర్టలో లాక్డౌన్ పొడిగింపు! ) ఫిషింగ్ హార్బర్లపై సమీక్ష రాష్ట్రంలో అదనంగా మరో ఫిషింగ్ హార్బర్, 2 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుమతిచ్చారు. విజయనగరం జిల్లాలో ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మించనున్నారు. దీంతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం 9కి చేరనుంది. వీటితో పాటు విశాఖపట్నం జిల్లాలోని భీమిలి, నక్కపల్లిలో మరో 2 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల సంఖ్య 3కు పెరిగింది. (విషాదం: ఛిద్రమైన వలస కార్మికుని కుటుంబం ) -
రాష్ట్రంలో ఎనిమిదిచోట్ల మేజర్ ఫిషింగ్ హార్బర్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు సముద్ర ఉత్పత్తులకు మరింత విలువ జోడించడమే లక్ష్యంగా భారీ ఎత్తున మేజర్ ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. రాష్ట్రానికి చెందిన మత్స్యకారులెవరూ ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకూడదన్న ప్రధాన లక్ష్యంతో రాష్ట్రంలో ఎనిమిదిచోట్ల ఈ మేజర్ ఫిషింగ్ హార్బర్లు, ఒకచోట ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఇందుకు సుమారు రూ.3 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ విషయమై సీఎం తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, సం బంధిత అధికారులతో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో నిర్ణయాలు ఇలా.. ►వీటి నిర్మాణాన్ని రెండున్నర నుంచి మూడేళ్లలో పూర్తిచేయాలి. ఈ ఎనిమిది చోట్లా చేపల వేటకు చక్కటి మౌలిక సదుపాయాలు కలి్పంచాలి. ►శ్రీకాకుళం జిల్లాలో రెండుచోట్ల, విశాఖపట్టణం, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఏర్పాటుచేయాలి. ►శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెంలో మేజర్ ఫిషింగ్ హార్బర్, ఇదే జిల్లా మంచినీళ్లపేటలో ఫిష్‌ల్యాండింగ్ కేంద్రాన్ని, అలాగే.. విశాఖ జిల్లా పూడిమడక, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, పశి్చమ గోదావరి జిల్లా ►నర్సాపురం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కూడా మేజర్ ఫిషింగ్ హార్బర్లను నిర్వహించాలి. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహక బకాయిల చెల్లింపు 4 2014–15 నుంచి పెండింగులో ఉన్న ఎంఎస్ఎంఈల ప్రోత్సాహకాల బకాయిలు రూ.905 కోట్లు పూర్తిగా చెల్లిస్తారు. ఈ బకాయిలను మే నెలలో సగం, జూన్ నెలలో మిగతా సగం చెల్లిస్తారు. 4 2014–15 నుంచి 2018–19 వరకు గత ప్రభుత్వ హయాంలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వాల్సిన మొత్తం రూ.828 కోట్లతో (2014–15లో రూ.43 కోట్లు, 2015–16లో రూ.70 కోట్లు, 2016–17లో రూ.195 కోట్లు, 2017–18లో రూ.207 కోట్లు, 2018–19లో రూ.313 కోట్లు) పాటు 2019–20లో (అప్లోడ్ చేసిన వివరాల ప్రకారం) రూ.77 కోట్లు.. మొత్తం రూ.905 కోట్లు చెల్లించాలని నిర్ణయం. తక్కువ వడ్డీతో వర్కింగ్ కేపిటల్ ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవడానికి వీలుగా, ఆర్థిక వనరుల సమీకరణలో తోడ్పాటు. ఇందులో భాగంగా ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇస్తూ సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. రూ.200 కోట్లు సమకూర్చుకుని, ఆ మొత్తాన్ని వర్కింగ్ కేపిటల్‌గా ఎంఎస్ఎంఈలకు అందించాలి. తక్కువ వడ్డీతో ఈ వర్కింగ్ కేపిటల్ సమకూర్చాలి. టీడీపీ హయాంలో మొక్కుబడిగా.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం మూడు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేశారని.. పైగా, వీటికి కేవలం రూ.40కోట్లు మాత్రమే ఖర్చుచేశారని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు సమావేశానంతరం మీడియాకు తెలిపారు. కానీ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని సర్కారు మాత్రం మత్స్యకారులకు పెద్దపీట వేసి 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్‌ల్యాండింగ్ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో మత్స్యకారుల జీవితాల్లో పెనుమార్పులు వస్తాయని.. భవిష్యత్తులో వలసలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. తద్వారా రాష్ట్రంలో చేపల వేట పెరగడమే కాకుండా మత్స్యకారులకు ఆదాయం పెరిగేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. కాగా, మే 6న చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని 1,15,000 కుటుంబాలకు ఇస్తున్నామన్నారు. -
మత్స్యకారులకి మహర్ధశ
సాక్షి, అమరావతి: రాష్ట్ర మత్స్యకారులెవరూ ఇతర రాష్ట్రాలకు వలస పోకూడదని.. రెండున్నర, మూడేళ్ల వ్యవధిలో ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ,అధికారులు హాజరయ్యారు. 8 చోట్ల ఫిషింగ్ హార్బర్లు, ఒక చోట ఫిష్ ల్యాండ్ నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.3 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయనుంది. మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం మూడు ఫిష్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ మాత్రమే ఇచ్చారని తెలిపారు. గుండాయిపాలెం(ప్రకాశం), అంతర్వేది,ఓడలరేవు (తూర్పుగోదావరి)కు కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని.. ఇప్పుడు దాదాపు రూ.3 వేల కోట్ల ఖర్చు చేసి 8 ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండ్ కట్టబోతున్నామని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ కల్పిస్తున్న అవకాశాలతో మత్స్యకారుల జీవితాల్లో మంచి మార్పులు తీసుకొస్తామని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెం – మేజర్ ఫిషింగ్ హార్బర్, శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటలో– ఫిష్ ల్యాండ్ నిర్మాణం. విశాఖపట్నం జిల్లా పూడిమడకలో∙– మేజర్ ఫిషింగ్ హార్బర్, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో – మేజర్ ఫిషింగ్ హార్బర్ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం – మేజర్ ఫిషింగ్ హార్బర్ కృష్ణాజిల్లా మచిలీపట్నం – మేజర్ ఫిషింగ్ హార్బర్ గుంటూరు జిల్లా నిజాంపట్నంల – మేజర్ ఫిషింగ్ హార్బర్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం – మేజర్ షిఫింగ్ హార్బర్ నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె – మేజర్ ఫిషింగ్ హార్బర్ -
ఆశల తీరాన.. గంగపుత్రులకు నజరానా!
మత్స్యకారులు కోరిన చోట జెట్టీలు నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో ఆ వర్గాల్లో సర్వత్రా ఆనందం వెల్లివిరుస్తోంది. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించలేదని, వైఎస్సార్ కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం తమకు ఎంతో మేలు చేస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మత్స్యకారులంతా స్వాగతిస్తూ.. సంతోషం వ్యక్తం చేశారు. సాక్షి, పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి చేపల వేట సాగక అత్యధికంగా మత్స్యకారులు గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఒక్క గుజరాత్‌కే 25 వేల మంది మత్స్యకారులు వలస వెళ్తున్నట్టు సమాచారం. తండేలు అని పిలవబడే నాయకుడు ఇక్కడి మత్స్యకారులను సమీకరించి ఆయా కుటుంబాలకు అడ్వాన్స్ ఇచ్చి తీసుకువెళ్తున్నాడు. అలా వలస వెళ్లిన వారు తిరిగి సొంత గ్రామానికి చేరుకుంటారో లేదో తెలియని పరిస్థితి. గుజరాత్‌కు వెళ్లిన వారు వేటను కొనసాగిస్తూ.. పాకిస్థాన్ సముద్ర జల్లాల్లో ప్రవేశిస్తూ.. అక్కడి తీరరక్షణ దళానికి చిక్కి జైలు పాలవుతున్నారు. రాత్రి సమయంలో వేటకు వెళ్లి.. బోటుపైనే నిద్రించి.. ఆ నిద్రలో జారి సముద్రంలో పడి మరణిస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌పై పెరుగుతున్న భారం విశాఖ జిల్లాకు సంబంధించి 13 మండలాల్లో 132 కిలోమీటర్లు విస్తరించిన తీర ప్రాంతంలో 63 మత్స్యకార గ్రామాలున్నాయి. ఇందులో 44 గ్రామాలకు చెందిన సుమారు 1,50,000 మంది మత్స్యకారులు చేపల వేట ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో çసుమారుగా 15 నుంచి 20 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా విశాఖ ఫిషింగ్ హార్బర్ మీద జీవిస్తున్నారు. వీరు కాకుండా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చిన మరో ఆరేడువేల మంది మత్స్యకారులు హార్బర్ మీద జీవిస్తున్నారు. జిల్లాలో చూసుకుంటే ముత్యాలమ్మపాలెం, పరవాడ, పూడిమడక, కొత్తజాలరిపేట, పెదజాలరిపేట, భీమిలి, చేపలుప్పాడ, బంగారమ్మపాలెం, రేవుపోలవరం, తీనార్ల, రాజయ్యపేట తదితర గ్రామాలకు సంబంధించిన మరబోట్లు 750, ఫైబర్ బోట్లు 1500, తెప్పలు 3000 ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్లో నిర్మించిన 11 జెట్టీలలో ఈ బోట్లు, ఫైబర్‌బోట్లు, తెప్పలు నిలిపి ఉంచుతున్నారు. 1973లో 100 మరబోట్లు నిలిపి ఉంచేందుకు అనువుగా నిర్మించిన హార్బర్ నేడు వేల బోట్లకు ఆశ్రయంగా మారింది. దీంతో ఇక్కడ రద్దీ ఎక్కువై బోట్ల యజమానులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భీమిలి సమీపంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో పాటు అనువైన ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో సమీక్షించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల మరపడవలు కూడా చేరుకోవడంతో విశాఖ హార్బర్‌పై భారం పెరుగుతోందని, దీన్ని నివారించేందుకు తీరంలో అనువైన జెట్టీలను నిర్మించాలని సూచించారు. పూడిమడక మొగ వద్ద జట్టీ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక్కడ జట్టీ నిర్మిస్తే వెయ్యి పడవలతో వేటకు అనుకూలంగా ఉంటుంది. సెజ్ పరిశ్రమలకు సముద్రమార్గంలో రవాణా సదుపాయం కలుగుతుంది. మొగ వద్ద జట్టీ నిర్మాణానికి వీలుగా ఉన్న ప్రదేశం ఇదే.. భీమునిపట్నంలో జెట్టీలు నిర్మిస్తే... భీమునిపట్నంలో కనీసం 5 జెట్టీల నిర్మాణం జరిగాలని మత్స్యకారులు కోరుతున్నారు. దీని వల్ల భీమునిపట్నం, నాగమయ్యపాలెం, చింతపల్లి, అన్నవరం, చేపలకంచేరు, ముక్కాం, ఉప్పాడ, మంగమారిపేట తదితర గ్రామాల నుంచి వచ్చే మరబోట్లు, ఫైబర్‌బోట్లను అక్కడే నిలిపి ఉంచవచ్చు. ఆయా గ్రామాల నుంచి బోట్లతో పాటు అందులో పనిచేసేందుకు కలాసీలు, డ్రైవర్లు, ప్యాకింగ్ చేసే యువకులు జీవనోపాధి నిమిత్తం విశాఖ చేరుకుని.. ఇక్కడ అద్దె ఇళ్లల్లో నివసిస్తున్నారు. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. భీమిలిలో జెట్టీల నిర్మాణం జరిగితే వీరంతా తమ సొంత గ్రామాల్లో నివసిస్తూ పనులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. భావనపాడు హార్బర్ కథ ఇదీ.. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి బోట్లు ఒడిశా సరిహద్దుల వరకు వేటకు వెళ్తాయి. మత్స్యకారుల సౌకర్యార్థం 2002లో భావనపాడు హార్బర్‌ను సుమారు 100 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇక్కడ భారీ జెట్టీని నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పటి వరకూ ఈ హార్బర్ ప్రారంభానికి నోచుకోలేదు. ముఖద్వారం వద్ద ఇసుక మేటలు వేయడంతో పడవలు హార్బర్లోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. 2003లో నిపుణుల బృందం భావనపాడు హార్బర్ పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో అప్పటి ప్రభుత్వం జపాన్ నుంచి డ్రెడ్జర్‌ను సమకూర్చి ఇసుకను తవ్విపోసేందుకు సిద్ధం అయిన సందర్భంలో.. అనుకోని అవాంతరాల కారణంగా డ్రెడ్జర్ మరమ్మతులకు గురైంది. డ్రెడ్జర్ మరమ్మతులకు అయ్యే ఖర్చు కేంద్రం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం.. పని మీదే కనుక రాష్ట్రమే భరించాలని కేంద్ర ప్రభుత్వం ఒకరిమీదకు ఒకరు నెట్టుకోవడంతో డ్రెడ్జర్ కాస్తా జపాన్ వెళ్లిపోయింది. రూ.కోట్లతో నిర్మించిన భావనపాడు హార్బర్ అలా నిరుపయోగంగా మిగిలిపోయింది. ఇసుక మేట సమస్యకు పరిష్కారం హార్బర్ ముఖద్వారం వద్ద పేరుకుపోతున్న ఇసుకను తొలగించడం కష్టం. అందుకే ఇసుక ముఖద్వారాన్ని కప్పేయకుండా హార్బర్లోకి ప్రవేశించే ముఖద్వారం వద్ద నిరుపయోగంగా ఉన్న భారీ పడవలను సముద్రంలో ముంచేయాలని మత్స్యకార పెద్దలు చెబుతున్నారు. విశాఖపట్నం ఇన్నర్ హార్బర్లోకి వెళ్లే చానల్ ముఖ ద్వారం వద్ద ఇదే తరహా సమస్య ఉండేదని, అప్పటి ఇంజినీర్లు భారీ నౌకలను సముద్రంలో ముంచేయడంతో సమస్య పరిష్కారం అయ్యిందంటున్నారు. తుపాన్ల నుంచి రక్షణ.. విశాఖ హార్బర్ నుంచి ప్రతి నిత్యం వెళ్తున్న మరపడవలు ఒడిశా తీరంలోని గోపాల్పూర్ వరకు వెళ్తుంటాయి. సముద్రంలో వేట చేసే సమయంలో తుపాన్లు సంభవిస్తే మత్స్యకారులు తమ పడవలను గోపాల్పూర్ వైపు తీసుకువెళ్లి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. వాతావరణం అనుకూలంగా లేని సమయంలో విశాఖ చేరుకోవాలంటే కనీసం 36 గంటల సమయం పడుతుంది. అదే భావనపాడు హార్బర్‌ను 15 గంటల్లో చేరుకుని ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా కాపాడుకునే అవకాశం ఉంది. భావనపాడు హార్బర్‌ను పునరుద్ధరిస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. పూడిమడకలో జెట్టీ నిర్మిస్తే.. పూడిమడకలో జెట్టీ నిర్మించాల్సిన అవసరం ఉందని పరిసరాల్లోని మత్స్యకార గ్రామ పెద్దలు చెబుతున్నారు. పూడిమడక పరిసరాల్లో తంతడి, ముత్యాలమ్మపాలెం, దిబ్బపాలెంజాలరిపేట, తిక్కవానిపాలెం, అప్పికొండ, గంగవరం తదితర గ్రామాల్లో సుమారు 30వేల పైగా మత్స్యకారులు నివసిస్తున్నారు. వీరంతా చేపలవేట జీవనాధారంగా బతుకుతున్నారు. ఈ ప్రాంతాల వారికి సంప్రదాయ పడవలతో పాటు ఫైబర్, మరపడవలు కూడా ఉన్నందున జెట్టీ నిర్మిస్తే విశాఖ ఫిషింగ్ హార్బర్‌తో పనిలేకుండా ఇక్కడి నుంచే వేటకు వెళ్లవచ్చు. ఈ జెట్డీ నిర్మాణానికి రూ.560 కోట్లు విడుదలయ్యాయని, కేంద్ర, టీడీపీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భావనపాడు హార్బర్ పునరుద్ధరించాలి కోట్ల రూపాయలతో నిర్మించిన భావనపాడు హార్బర్‌ను ప్రభుత్వం పునరుద్ధరిస్తే.. మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తుపాను సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా మ త్స్యకారులు తమ పడవలను అక్కడ లంగరు వేసుకుంటారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి. – సీహెచ్.సత్యనారాయణమూర్తి, అధ్యక్షుడు, డాల్ఫిన్ మరపడవల సంఘం పూడిమడకలో జెట్టీ నిర్మించాలి పూడిమడక పరిసర గ్రామాల్లో దాదాపు 30 వేల మంది మత్స్యకారులు నివసిస్తున్నారు. వీరంతా చేపల వేట జీవనాధారంగా బతుకుతున్నారు. వీరి బోట్లను, పడవలను విశాఖ ఫిషింగ్ హార్బర్లో నిలిపి ఉంచాల్సి వస్తోంది. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. పూడిమడకలో జెట్టీ నిర్మాణానికి అనుకూలంగా సీఎం జగన్మోహన్రెడ్డి స్పందించాలి. – చోడిపల్లి అప్పారావు, మత్స్యకార నాయకుడు, పూడిమడక మాజీ ఉపసర్పంచ్ నిధులు వెనక్కి వెళ్లిపోయాయి టీడీపీ, కేంద్ర ప్రభుత్వాల మధ్య విభేధాలతో పూడిమడక జెట్టీ నిర్మాణానికి మంజూరైన రూ.560 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ఈ ప్రాంతంలో జెట్టీ నిర్మాణం అవసరం ఉంది. మార్కెట్ సదుపాయం ఉన్న ఈ ప్రాంతంలో బోట్లను నిలిపి ఉంచే సౌకర్యం ఉంటే.. మత్స్యకారులు వేటను సులభంగా కొనసాగిస్తారు. – మేరుగు అప్పలనాయుడు, మత్స్యకార నాయకుడు, పూడిమడక మాజీ ఎంపీటీసీ బోటు మునిగిపోయింది భావనపాడులో హార్బర్ సదుపాయం లేకపోవడం వల్ల తిత్లీ తుపాను సమయంలో నా బోటు మునిగిపోయి రూ.50 లక్షల నష్టం వాటిల్లింది. తుపాను వస్తుందని తెలుసుకుని ఒడిశా తీరంలోని గోపాల్పూర్ హార్బర్‌కు చేరుకున్నా.. ఫలితం లేకపోయింది. భావనపాడులోని హార్బర్‌ను పునరుద్ధరిస్తే ఇటువంటి సమస్యలు తలెత్తవు. –మైలపల్లి రాము, బోటు యజమాని వలసలు పోకుండా చూడాలి బోటు నడపడం తప్ప మరో వృత్తి తెలియని కారణంగా.. 20 ఏళ్లుగా బోటు డ్రైవరు గానే పనిచేస్తున్నాను. స్వగ్రామం నుంచి విశాఖ వలస వచ్చాను. నగరంలో కుటుంబంతో బతకడం చాలా కష్టంగా ఉంది. భీమిలిలో జెట్టీలను నిర్మించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే వలసలు తగ్గుతాయి. – అల్లిపిల్లి రాము, భీమిలి మత్స్యకారులకు అనువుగా నిర్మిస్తేనే మేలు మత్స్యకారులకు అనుకూలంగా జెట్టీల నిర్మాణం చేస్తే బాగుంటుంది. ఇంతవరకూ ఏ సీఎం తీసుకోని నిర్ణయాన్ని.. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకోవడం ఆనందంగా ఉంది. విశాఖ ఫిషింగ్ హార్బర్లో పెరుగుతున్న బోట్ల ఒత్తిడి తగ్గాలంటే భీమిలిలో జెట్టీలు నిర్మించాల్సిన అవసరం ఉంది. –దూడ ధనరాజు, బోటు యజమాని, అధ్యక్షుడు, మహావిశాఖ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల సంక్షేమ సమాఖ్య -
విశాఖలో మత్స్యకారుల ఫిషింగ్ హార్బర్ బంద్
-
కలల హార్బర్!
అక్కడ నిత్యం రెండు వేలకు పైగా పడవల్లో మత్స్యకారులు జీవన పోరాటం సాగిస్తుంటారు. వింత చేపలు, అరుదైన జాతులకు అది ఆలవాలం. ‘తూర్పు’ తీరంలోని దాదాపు 20 వేల కుటుంబాలకు అక్కడ లభ్యమయ్యే జలచరాలే పెద్ద సంపద. అయితే వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చేందుకు, పడవలు లంగరు వేసేందుకు ఫిషింగ్ హార్బర్ లేకపోవటంతో మత్స్యకారుల కష్టం వృథాగా మారుతోంది. వారి కష్టాలను తీర్చేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తూర్పు గోదావరి జిల్లాలో మినీ హార్బర్ నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేయించినా ఆయన ఆకస్మిక మృతితో తరువాత ప్రభుత్వాలు ఆ విషయాన్ని గాలికి వదిలేశాయి. ప్రస్తుతం అంచనా వ్యయం రూ.300 కోట్లకు చేరుకున్న దశలో ఫిషింగ్ హార్బర్‌ను నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా మత్స్యకారులకు నమ్మకం కలగడం లేదు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో ఫిషింగ్ హార్బర్ కలగానే మిగిలిపోయింది. కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు తీరంలో ఎక్కడా జట్టీలు, హార్బర్లు లేవు. దీంతో కొత్తపల్లి, తొండంగి, తుని మండలాలకు చెందిన వేలాది మంది మత్స్యకారులు వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చేందుకు, బోట్లు లంగరు వేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్లుగా కొత్తపల్లి మండలం మత్స్యకారులు ఉప్పాడ సమీపంలోని ఉప్పుటేరుని జట్టీగా వినియోగించుకుంటున్నారు. అది అనువుగా లేకున్నా బోట్లను ఉప్పుటేరులోనే లంగరు వేసి చేపలను ఒడ్డుకు మోసుకొచ్చి నడి రోడ్డుపైనే విక్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తొండంగి, తుని మండలాల మత్స్యకారులకు ఆ అవకాశం కూడా లేక పడవలను సముద్రంలోనే లంగరు వేసి దేవుడిపైనే భారం మోపుతున్నారు. కెరటాల తాకిడికి మునుగుతున్న బోట్లు తుపాన్లు తదితర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బోట్లను ఒడ్డుకు తెచ్చే అవకాశం ఉండదు. సముద్రంలో లంగరు వేసిన బోట్లు కెరటాల ఉధృతికి నీట మునిగి మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి సమయాల్లో బోట్లు, వలలు లాంటి విలువైన ఉపకరణాలను అతి కష్టం మీద వ్యయప్రయాసల కోర్చి గ్రామాలకు దూరంగా ఎక్కడ వీలైతే అక్కడ ఎటువంటి రక్షణా లేకుండా ఒడ్డుకు తరలిస్తున్నారు. ఒక్కోసారి లంగరు వేసిన బోట్లలో సామాగ్రిలు చోరీలకు గురవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకొనేందుకు, బోట్లను ఒడ్డుకు చేర్చే మత్స్యకారులకు హార్బర్ సురక్షిత ప్రాంతం. కానీ తూర్పు గోదావరి తీరంలో మినీ హార్బర్ లేక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలించని డ్రెడ్జింగ్ పనులు.. సముద్రంలో చేపల వేట అనంతరం వాటిని ఒడ్డుకు చేర్చి హార్బర్లో విక్రయించేందుకు వీలుంటుంది. అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల చేపలు పాడయ్యే అవకాశం ఉండదు. ఇక్కడ లభ్యమయ్యే మత్స్య çసంపదను బెంగళూరు, కోల్కత్తా, చెన్నై, కేరళ తదితర చోట్లతోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడ దొరికే వింత చేపలు, అరుదైన జాతులకు మంచి గిరాకీ ఉన్నా హార్బర్ సదుపాయం లేదు. ఇక బోట్లు మరమ్మతులకు గురైనా, గుక్కెడు నీళ్లు కావాలన్నా కిలోమీటర్ల దూరం వెళ్లాలి. వేసవిలో సూర్యభగవానుడి భగభగలకు మాడిపోవాల్సిందే. ఇన్ని సమస్యలున్నా ఇక్కడ రోజూ లక్షల్లో వ్యాపారం జరగటం గమనార్హం. మత్స్యకారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బోట్లు ఒడ్డుకు చేరేలా తాత్కాలికంగా సుమారు రూ. 1.25 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు చేపట్టినా రెండో రోజే ఇసుక మేట వేయటంతో నిధులు నిరుపయోగంగా మారాయి. నిధులు మంజూరు చేయించిన వైఎస్సార్ మత్స్యకారుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో సుమారు రూ.50 కోట్లతో మినీ హార్బర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి నిధులు కూడా మంజూరు చేయించారు. వైఎస్సార్ మృతితో ఇక ఆ విషయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అనంతరం కొత్తపల్లి మండలం అమీనాబాద్ శివారు పెట్రోలు బంకు వద్ద సముద్రం పక్కనే ఉన్న సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమి మినీ హార్బర్ నిర్మాణానికి అనువుగా ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పుడు హార్బర్ నిర్మాణ అంచనా వ్యయం రూ. 300 కోట్లకు చేరింది. తాజాగా హార్బర్ ప్రతిపాదనను 28 ఎకరాలకు పరిమితం చేశారని తెలుస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ, పర్యావరణంపై ప్రభావం తదితర అంశాలను పరిశీలించకుండా నిర్మాణం ముందుకు సాగదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇది కూడా ప్రకటనకే పరిమితమని మత్స్యకారులు భావిస్తున్నారు. జెట్టీ లేక తీవ్ర ఇబ్బందులు హార్బర్ నిర్మాణానికి సంబంధించి వైఎస్సార్ హయాంలో జీవో విడుదలైనా తరువాత ప్రభుత్వాలు పట్టించుకోక కార్యరూపం దాల్చలేదు. వేటపై ఆధారపడిన మత్స్యకారులు జెట్టీ లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మత్స్య సంపదతో రూ. కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న ప్రభుత్వం మత్స్యకారుల సౌకర్యాలపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. – కర్రి నారాయణ , అఖిల భారత మత్స్యకార సమాఖ్య సభ్యుడు, కాకినాడ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మినీ హార్బర్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నాం. నిబంధనల మేరకు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. – కోటేశ్వరరావు (మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, తూర్పు గోదావరి జిల్లా) -
కృష్ణపట్నం వద్ద ఫిషింగ్ హార్బర్
రూ.300 కోట్లతో అంచనాలు 'సైసెఫ్' బృందం పర్యటన ముత్తుకూరు: మండలంలోని కృష్ణపట్నం తీరంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుపై అధ్యయనం చేసే నిమిత్తం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీ అధికారుల (సైసెఫ్–బెంగళూరు) బృందం శుక్రవారం పర్యటించింది. ఈ సందర్భంగా సైసెఫ్ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తి, ఇంజినీర్ మురళీధర్, ఫిషరీస్ ఏడీ హరికిరణ్, తదితరులు విలేకరులతో మాట్లాడారు. రూ.300 కోట్ల అంచనాలతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుపై ప్రాథమిక అధ్యయనం చేయనున్నామన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం 40, రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం నిధులను సమకూరుస్తుందన్నారు. సముద్రతీరంలో హార్బర్ నిర్మాణంలో బ్రేక్ వాటర్స్ నిర్మాణానికే రూ.200 కోట్ల వ్యయమవుతుందని వివరించారు. బకింగ్‌హామ్ కెనాల్ క్రీక్‌లో హార్బర్ నిర్మాణానికే రూ.30 కోట్లు సరిపోతుందన్నారు. హార్బర్ నిర్మాణానికి ముందు టోఫోగ్రపీ సర్వే, సాయిల్ టెస్టింగ్, తదితర పరీక్షలను నిర్వహించాల్సి ఉందని, అధ్యయనంలో వెల్లడయ్యే అంశాలను సైసెఫ్ డైరెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. 20 రోజుల తర్వాత రెండో సర్వే జరుగుతుందన్నారు. తహశీల్దార్ చెన్నయ్య, ఎఫ్డీఓ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. ‘పోర్టు నుంచి అభ్యంతరం?’ కృష్ణపట్నం తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి పోర్టు నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయేమోనని సైసెఫ్ డీడీ కృష్ణమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. ఆర్కాట్పాళెం వద్ద మత్స్యకారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనికి స్థానిక నాయకులు ఈదూరు రామ్మోహన్‌రెడ్డి, ఏకొల్లు కోదండయ్య, మత్స్యకార పెద్దలు యల్లంగారి రమణయ్య, తదితరులు స్పందిస్తూ.. 11 మత్స్యకార గ్రామాలకు అవసరమైన ఫిషింగ్ హార్బర్ కోసం కలెక్టర్, ఎమ్మెల్సీ, అవసరమైతే ముఖ్యమంత్రితోనైనా చర్చిస్తామన్నారు. హార్బర్ లేక చేపల వేట, అమ్మకాలు కోల్పోయి, ఆర్థికంగా దెబ్బతిన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు ఏర్పాటుకు ముందే ఇక్కడ హార్బర్ ఉందని, మినీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటైతే మహిళలకు ఉపాధి లభిస్తుందని, మత్స్యకార గ్రామాలకు పూర్వ వైభవం వస్తుందన్నారు. జువ్వలదిన్నెకు ఇటువైపు ఉన్న గ్రామాలకు ఇక్కడ నిర్మించే ఫిషింగ్ హార్బర్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఆవుల గోవిందు, అక్కయ్యగారి మొలకయ్య, మత్స్యకారులు పాల్గొన్నారు. -
జువ్వలదిన్నెలో ఢిల్లీ బృందం
మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై ఆరా బిట్రగుంట: బోగోలు మండలం జువ్వలదిన్నెలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మించే ప్రాంతాన్ని ఢిల్లీకి చెందిన వ్యాప్కోస్ అధికారులు మంగళవారం పరిశీలించారు. వ్యాప్కోస్ చీఫ్ ఇంజనీర్ రమణతో కూడిన అధికారుల బృందం మినీ ఫిషింగ్‌హార్బర్ నిర్మించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, తీరంలోని వృక్ష సంపద, పర్యావరణ పరిస్థితులపై ఆరా తీసింది. సుమారు రూ.300 కోట్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో 550 పడవల సామర్ధ్యంతో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి జువ్వలదిన్నెలో ఏడాదిన్నర నుంచి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మట్టి పరీక్షలతో పాటు హైడ్రోగ్రాఫికల్, ఆర్థిక, సామాజిక సర్వేలు కూడా పూర్తయ్యాయి. వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక పరికరాలు కూడా ఏర్పాటు చేసి విశ్లేషిస్తున్నారు. ఈక్రమంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కారణంగా పర్యావర ణ సంబంధిత అంశాలను అధికారులు పరిశీలించారు. మరో పది రోజుల్లో మరో బృందం పరిశీలించి తుది నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు ఈసందర్భంగా వ్యాప్కోస్ అధికారులు తెలిపారు. వారి వెంట కావలి మత్స్యశాఖ అధికారి ప్రసాద్ ఉన్నారు. -
లెక్కలే తప్ప.. గోడు పట్టదా
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర తుఫాన్ నష్టం పరిశీలన బృందం తమ గోడు వినలేదంటూ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకార మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గోడు చెప్పుకునేందుకు వచ్చిన వీరిని బృందం సభ్యులు పట్టించుకోలేదు. రోప్ పార్టీ సిబ్బంది వీరిని వెనక్కి నెట్టేసింది. మీఇంటికొస్తారు..అప్పుడు చెప్పుకోండనటంతో వారు మండిపడ్డారు. గంటకొక జీవో ఇస్తూ దెబ్బతిన్న బోట్లు,వలలకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మత్స్యకార సంఘాల ప్రతినిధులు విమర్శించారు. పెదగదిలి సింహగిరికాలనీలో కూడా బాధితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు చెబుతున్న లెక్కలు వినేందుకు ఇస్తున్న ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఎలాంటి పరిహారం ఇవ్వలేదని వారంతా మీడియావద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తొలిరోజు పర్యటనంతా జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూనే అధికారుల నుంచి లెక్కలు తెలుసుకునేందుకు బృందం ప్రాధాన్యమిచ్చింది. బృందం అడిగిన వివరాలు చెప్పలేక జిల్లా యంత్రాంగం అడగుడుగునా ఇబ్బందిపడింది. కేంద్ర బృందం బుధవారం విశాఖనగరంతో పాటు అనంతగిరి, అరకులోయ మండలాల్లో పర్యటించింది. కేంద్రహోంమంత్రిత్వ శాఖ సంయక్తకార్యదర్శి కేకే పాఠక్ నేతృత్వంలోని బృందం సభ్యులు ఎస్ఎం కొల్హాట్కర్,ఆర్పీ సింగ్, బ్రిజేష్ శ్రీవాత్సవలు తొలుత కోతకు గురైన గోకుల్ బీచ్‌ను పరిశీలించారు. అక్కడ ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. బృందం సభ్యులకు బీచ్‌రోడ్డుకు జరిగిన నష్టాన్నికలెక్టర్యువరాజ్, మున్సిపల్ కమిషనర్ జానకిలు వివరించారు. తర్వాత ఫిషింగ్ హార్బరులో దెబ్బతిన్న మెకనైజ్డ్ బోట్లు, హార్బర్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం విశాఖ-అనంతగిరి ఘాట్‌రోడ్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా తుఫాన్ వల్ల ఎన్ని కిలో మీటర్ల రహదారులు దెబ్బతిన్నాయో అడిగి తెలుసుకున్నారు.అక్కడ నుంచి అరకులోయ మండలం సుంకరమెట్ట బంగ్లావలస వెళ్లారు. గ్రామ సమీపంలో నేలకొరిగిన సిల్వర్ ఓక్, కాఫీ, మిరియాల చెట్లను పరిశీలించింది. పాడేరు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్, పాడేరు సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఏజేన్సీలో జరిగిన నష్టా న్ని వివరించారు. నష్టపోయిన హెక్టారు కాఫీ తోటకు రూ.25 వేలు వంతున ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని, కనీసం రూ.50 వేలు అందజేయాలని కేంద్ర బృందాన్ని ఐటీడీఏ పీఓ కోరారు. ఎకరాకు కాఫీ, మిరియాలు కలిపి సుమారు రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల ఆదాయం వచ్చేదని, తమకు పరిహారం పెంచాలని సుంకరమెట్టకు చెందిన పాంగి రాంబాబు, కె. విజయ్నంద్ దాస్, కుమార్ కోరారు. పోర్టుకు రూ.232కోట్ల నష్టం పోర్టుట్రస్ట్‌కు చేరుకుని దెబ్బతిన్న జెట్టీలను పరిశీలించారు. తుఫాన్ ఐ పోర్టు, పిషింగ్ హార్బర్ల మీదుగానే నగరంలోకి ప్రవేశించిందని అందువలనే ఈ రెండింటికితీవ్ర నష్టం వాటిల్లిందని పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు సభ్యులకు వివరించారు. నౌకలు ఆగే బెర్త్ పూర్తిగా దెబ్బతినడమే కాకుండా పోర్టుకు రూ.232కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. దెబ్బతిన్న జెట్టీలను, సాల్ట్ క్రీక్ ప్రాంతాన్ని బృందం బోట్లపై వెళ్లి పరిశీలించింది. పరిహారం కోసం వినతుల వెల్లువ ఫిషింగ్ హార్బర్లో ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిసి అప్పారావు,కార్యదర్శి వి.యల్లారావుల ఆధ్వర్యంలో ప్రతినిధులు కేంద్ర బృందానికి వినతిపత్రం సమర్పించారు. ఫిషర్మెన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెడ్డు శంకరరావు ఆధ్వర్యంలో తమకు జరిగిన నష్టంపై ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ తమ గోడును వివరించారు. తమ బోట్లు, వలలకు రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లితే కేవలం రూ.67కోట్లుమాత్రమే నష్టం వాటిల్లిందని లెక్కతేల్చారని, లక్షలు విలువ చేసేవలలు, తాళ్లు, పైబర్బోట్లు, మోటారు ఇంజన్లు కొట్టుకు పోగా చేపలమార్కెట్లుకు ధ్వంసమయ్యాయని,కానీఎక్కడా ఏఒక్కటి నష్టపరిహారం అంచనా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈపర్యటనలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ వి.శేషగిరిబాబు, ఏజేసీ డి.వెంకటరెడ్డి, డీఆర్వో నాగేశ్వరరావు, ఆర్డీవో జేవి మురళి పాల్గొన్నారు. -
విశాఖ పోర్టులో మత్స్యకారుల ఆందోళన
విశాఖ: జిల్లాలో ఫిషింగ్ హర్బర్‌లో బుధవారం మత్స్యకారులు ఆందోళనకు దిగారు. విశాఖ పోర్టులో చిరు దుకాణాలను తొలగించేందుకు అక్కడి యాజమాన్యం ప్రయత్నించడంతో వారు ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు పెద్దఎత్తునా ఆందోళన చేపట్టారు. చిరు దుకాణాలను అడ్డుకునేందుకు యత్నించిన యజమాన్యాన్ని అడ్డుకున్నారు. పోర్టు ఛైర్మన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు నినాదాలు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారిని శాంతపరచి అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. -
కలిసి నడుద్దాం..
కడలి కన్నెర్ర చేసి నెల కావొస్తున్నా.. తీరం ఇంకా వణుకుతూనే ఉంది. హుదూద్ ధాటికి విలవిల్లాడిన విశాఖను ఊరడించడానికి హీరో శ్రీకాంత్ ముందడుగు వేశారు. ఒక రోజంతా వైజాగ్ వీధుల్లో తిరిగారు. జడివానకు జడిసిన జనాలను ఆత్మీయంగా పలకరించి ధైర్యాన్నిచ్చారు. గురువారం ‘సిటీప్లస్’ తరఫున స్టార్ రిపోర్టర్‌గా విశాఖవాసులను పలకరించారు. ప్రకృతి ప్రకోపానికి దెబ్బతిన్న ఫిషింగ్ హార్బర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, పెదగదిలి, జూను సందర్శించారు. బాధితులతో, విపత్తు ప్రాంతాల్లో సేవలందించిన వారితో మాట్లాడారు. ‘హుదూద్ ఇంత బీభత్సం సృష్టించిందా? తలచుకుంటేనే భయమేస్తోంది. విశాఖ ప్రజల ధైర్యానికి శాల్యూట్.. విశాఖను పునర్నిర్మించుకొందాం. అందుకు అందరం కలిసి నడుద్దాం’ అంటున్న శ్రీకాంత్ రిపోర్టింగ్ విశేషాలు.. సమయం: ఉదయం 10:30 ప్రాంతం: ఫిషింగ్ హార్బర్ శ్రీకాంత్: మీకు (మత్స్యకారులకు) బోట్లే కదా జీవనాధారం. అవి బాగా దెబ్బతిన్నాయి. వీటిని బాగు చేసుకోవడం కష్టమే కదా! ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా? సత్తిబాబు: ఫిషింగ్ హార్బర్లో 65 బోట్లు తుపాను గాలులకు దెబ్బతిన్నాయి. వాటిలో 45 పూర్తిగా పాడైపోయాయి. వాటికి ప్రభుత్వం రూ.6 లక్షల సాయమైతే ప్రకటించింది గానీ ఇంతవరకూ పైసా అందలేదు. శ్రీకాంత్: మరి ఇన్సూరెన్స్ ఏమీ లేదా? సత్తిబాబు: ఉంది సార్! కానీ మా మత్స్యకారుల్లో చాలామంది పేదవారే. ఇక ప్రీమియం ఎలా కట్టుకోగలరు. అది కట్టకే ఇప్పుడే ఇన్సూరెన్స్ వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. ఒక్కో బోటు మీద నాలుగు కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఒకసారి వేటకు వెళ్లాలంటే రూ.2 లక్షలు ఖర్చవుతోంది. చేపల వేట సరిగా ఉంటే డబ్బులు. లేదంటే నష్టమే మిగులుతుంది. శ్రీకాంత్: మరి బోట్లకు మరమ్మతులకు ఖర్చు ఎక్కువే అవుతుంది కదా! మరి ఏం చేస్తున్నారు? ఎల్లయ్యమ్మ: బాబూ.. ఒక బోటు కొత్తగా తయారు చేసుకోవాలంటే రూ.20 లక్షలవుతుంది. పాడైపోయినవి బాగు చేసుకోవాలంటే రూ.10 లక్షలైనా అవుతుంది. ప్రభుత్వం రూ.6 లక్షలు ఇస్తామంది. అవి ఏ మూలకు సరిపోతాయి బాబూ? ఇప్పుడు బోటు బాగు చేసుకోవాలి. మళ్లీ సముద్రంపైకి వేటకెళ్లాలంటే పెట్టుబడి కావాలి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. శ్రీకాంత్: ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలి. మీలాంటి బాధితులను ఆదుకోవడానికి అన్ని జిల్లాల నుంచి ముందుకొస్తున్నారు. మా సినీ ఫీల్డ్ నుంచి సహాయం చేయడానికి చాలామంది స్పందించారు. ఫండ్ రైజింగ్ కోసం అంతా కృషి చేస్తున్నారు. సమయం: ఉదయం 11:30 గంటలు ప్రాంతం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీకాంత్: ఏయూని చూస్తే మనసు చలించిపోతోంది. ఒకప్పుడు కళకళలాడిన ఈ ప్రాంగణం ఇపుడు కళావిహీనంగా కనిపిస్తోంది. మళ్లీ పూర్వవైభవం తీసుకురావడానికి ఏం చేస్తున్నారు? జీఎస్ఎన్ రాజు (వీసీ): ఏయూ ఏర్పాటైన తర్వాత ఈ ఎనిమిది దశాబ్దాల్లో ఎప్పుడూ ఇలాంటి విపత్తును ఎదుర్కోలేదు. హుదూద్ ముందస్తు హెచ్చరికలతో జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ తుపాను దాటికి చెట్లు కూలిపోయాయి. ఇక్కడి భవనాలు, ఆడిటోరియాలు దెబ్బతిన్నాయి. ఉద్యోగుల క్వార్టర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. శ్రీకాంత్: ఇంత భారీ స్థాయిలో దెబ్బతిన్నా చాలా వేగంగా తేరుకోవడం గొప్ప విషయం. తుపాను తర్వాత సహాయక కార్యక్రమాలు ఎలా జరిగాయి? జీఎస్ఎన్ రాజు: తుపానుతో సిటీ మొత్తం విధ్వంసం కావడంతో ఇక్కడ పనులు కొద్దిగా ఆలస్యమయ్యాయి. కూలిపోయిన చెట్లు, డెబ్రిస్ తొలగింపు చర్యలు తుపాను మర్నాటి నుంచే ప్రారంభించాం. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, సిబ్బందితో పాటు ఎన్జీవోలు... ఇలా ప్రతి ఒక్కరూ సహకరించారు. శ్రీకాంత్: ఇలాంటి నష్టాలను నిధులతో పూడ్చుకోగలిగినా... పచ్చదనాన్ని మాత్రం ఎంత డబ్బు ఖర్చు చేసినా తెచ్చుకోలేం. పచ్చదనం పునరుద్ధరణకు ఏం చేస్తున్నారు? జీఎస్ఎన్ రాజు: ఏయూలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాం. మొక్కల సంరక్షణకూ తగిన చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థుల క్లాసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. సమయం: ఉదయం 12:20 గంటలు ప్రాంతం: పెదగదిలి శ్రీకాంత్: కొండవాలు ప్రాంతాల్లో ఉన్న మీరు తుపాన్ సమయంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు? సీతమ్మ: ఇక్కడున్నది అంతా పేదలమే. తుపానులొస్తే ఎక్కడికని పరిగెడతాం. తుపాను రోజు బిక్కుబిక్కుమని గడిపాం. పైనుంచి రేకులు ఎగిరిపడుతుంటే బతుకుతామనే ఆశ కూడా పోయింది. మూడు రోజులు నరకం అనుభవించాం. శ్రీకాంత్: ఇలాంటి కష్టకాలంలో కూడా మీరు ధైర్యంగా నిలబడ్డారు. మరి ఇల్లు ఎలా కట్టుకుంటున్నారు? రామ: ఏం కట్టుకుంటాం సార్! దేవస్థానం వాళ్లతో ఇబ్బంది వచ్చింది. గాలులకు రేకులు లేచిపోతున్నాయంటే మళ్లీ రేకులే వేసుకోమంటున్నారు. స్లాబు వేసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వమే దేవస్థానం అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలి. కొండమ్మ: పూరిళ్లలో ఉన్నవారికైతే మరిన్ని కష్టాలు బాబూ! ఇంటిపై వేసుకోవడానికి తాటికమ్మలూ దొరకడం లేదు. ఈ ఇరవై రోజులూ ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ అందలేదు. శ్రీకాంత్: మీ సమస్యలు కనిపిస్తున్నాయి. వీటిపై సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం దృష్టి పెడుతుందని భావిస్తున్నాను. సమయం: మధ్యాహ్నం 12.40 ప్రాంతం: జూ పార్కు శ్రీకాంత్: జూలో ఇంతటి నష్టాన్ని ఊహించలేం. మరి దీన్ని ఎలా రికవరీ చేస్తారు? రామలింగం (క్యూరేటర్): జూలో తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలు, తుపాను తర్వాత ఎన్‌క్లోజర్స్‌లో పరిశుభ్రత, ఆరోగ్యరక్షణకు తగిన చర్యలు తీసుకోవడం వల్ల జీవాలన్నీ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాయి. తుపాను రోజున చనిపోయిన జంతువులు, పక్షులు జూలో ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. శ్రీకాంత్: మరి జూలో పచ్చదనం కోసం ఏం చేస్తున్నారు? రామలింగం: డెబ్రిస్ తొలగింపు దాదాపు కొలిక్కి వస్తోంది. తర్వాత మొక్కలు నాటే కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తు మరింత పెద్ద తుపానులొచ్చినా తట్టుకొనే, లోతుగా వేళ్లు పెరిగే మొక్కలనే ఎంచుకుంటున్నాం. ఇక జంతువులను ఎక్కువ కాలం కేజ్‌ల్లో ఉంచడం వల్ల సమస్యలు వస్తాయి. వాటిని బయటకు తీసుకొచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 11న సందర్శకులకు అనుమతి ఇస్తున్నాం. -
సేప ఎటుపోనాదో..!
విశాఖపట్నం: విశాఖ తీరంలో చేపలకు కరువొచ్చిపడింది. గతంలో ఎన్నడూ లేనంతంగా అత్యంత దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. సముద్రం పూర్తిగా వట్టిపోయింది. గులివిందలు, కవ్వళ్లు, కానాఖడతలు వంటి గుండ (చిన్నచిన్న) చేపలు తప్ప ఏమీ దొరకడంలేదు. అదీ కూడా చాలా తక్కువ మోతాదులో చిక్కుతున్నాయి. రెండున్నర లక్షల రూపాయల ఖర్చు చేసి నెల రోజుల పాటు వేట సాగిస్తే కనీసం రూ. 50 వేల విలువైన చేపలు కూడా దొరకడంలేదు. దీంతో విశాఖ ఫిషింగ్ హార్బర్లో అర్ధంతరంగా చేపల వేటను నిలిపేశారు. ఫిషింగ్ హార్బర్లో 750 మరబోట్లు, 1500 మోటారు బోట్లు ఉంటే అందులో ఈ ఆదివారం మూడు మరబోట్లు మాత్రమే చేపలవేట వెళ్లాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సముద్రంలో ఇంత దారుణంగా మత్స్యసంపద ఎప్పుడూ పడిపోలేదని మత్స్యకారులు చెబుతున్నారు. 2011లో ఇటువంటి పరిస్థితులు ఎదురైనా మరీ ఇంత దారుణంగా లేదంటున్నారు. చేపలు గుడ్లు పెట్టే సమయమైన ఏప్రిల్ 15 నుంచి 47 రోజుల పాటూ చేపలవేటకు విరామం ప్రకటించినా ఎందుకు మత్స్యసంపద వృద్ధి చెందలేదో? అర్థంగాక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. మర పడవల సంఘాలకు చెందిన ప్రతినిధులతో పాటూ మేధావులకు కూడా ఈ పరిస్థితి అంతుబట్టడం లేదు. మత్స్యశాఖ అధికారులకు కూడా పరిస్థితిని వివరించారు. నష్టాలు తట్టుకోలేక 30 బోట్లను అమ్మేశారు. మరో 50 బోట్ల వరకు అమ్మకానికి సిద్ధంగా ఉండడం బోటు యజమానుల దయనీయ స్థితికి అద్దం పడుతోంది. గుడిబండగా మారిన డీజీల్ ధర : ఫిషింగ్ హార్బర్లో చేపలవేట సాగించే మర, మోటారు బోట్లన్నీ లాంగ్‌లైన్ తరహాలో వేట సాగించేవే. అంటే బోటు ప్రయాణంలో ఉండగానే వేట సాగిస్తారు. దీంతో వీరికి డీజిల్ ఎక్కువ అవసరం పడుతోంది. 15 నుంచి 20 రోజుల పాటు వేట సాగించాలంటే 3 వేల నుంచి 4 వేల లీటర్ల డీజిల్ ఉండాలి. ప్రస్తుతం లీటరు డీజిల్ రూ. 63 ఉంది. ఈ లెక్కన 3 వేల లీటర్లకు రూ. లక్షా 89 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. గోరుచుట్టుపై రోకలిపోటులా ఐసు ధరలు కూడా శరాఘాతంగా తయారయ్యాయి. బోటు వేటకెళ్లాలంటే 20 నుంచి 30 టన్నుల ఐసు పడుతుంది. టన్ను ఐసు రూ.1200 నుంచి రూ.1250 వరకు ఉంది. 36 వేలు ఐస్కే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక బియ్యం, నిత్యావసర వస్తువులు, తాగునీరు, మరమ్మతులు, వలలు ఇవన్నీ కలుపుకుంటే రూ. రెండున్నర లక్షలకు పైబడి ఉంటే గాని వేటకు వెళ్లలేని పరిస్థితి. టూనా, కోనెం, టైగర్ రొయ్యల జాడే లేదు టూనా, కోనెం, వంజరాలు, వైట్, బ్రౌన్ పాంప్లేంట్, టైగర్ రొయ్యలకు విదేశీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సింగపూర్, జపాన్, మలేషియా దేశాల్లో ఇవి మంచి ధర పలుకుతాయి. ఇవి వలకు చిక్కాయంటే మత్స్యకారుడుకి సిరులు పండినట్లే. కానీ ఈ సీజన్లో వీటి జాడ మచ్చుకైనా కానరావడంలేదు. -
పర్యాటక పరుగులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుంది. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు నవ్య శోభతో కళకళలాడనున్నాయి. విశాలమైన తీరప్రాం తం, సహజసిద్ధమైన ప్రకృతి అందాలతోపాటు ఆధ్యాత్మిక ప్రాంతాలకు ఆలవాలమైన శ్రీకాకుళం జిల్లాను పర్యాటక రంగంలో పరుగులు తీయించేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్త ప్రతి పాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్యాటక రంగానికి రూ.4.50 కోట్లు విడుదల కావడంతో రెట్టిం చిన ఉత్సాహంతో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొత్త కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టుల పనులు ప్రారంభించగా రానున్న రోజుల్లో మరిన్ని పనులకు శ్రీకారం చుడతారని చెబుతున్నారు. పలు గ్రోత్ సెం టర్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖాన్ ఈనెల 26 నుంచి మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తుండటంతో ఆమెకు సమర్పించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. గ్రోత్ సెంటర్ల వివరాలు * పొన్నాడ కొండ-బ్రిడ్జి ప్రాంతంలో రూ.2 కోట్ల అంచనాతో విశాఖలోని కైలాసగిరి తరహాలో మినీ కైలాసగిరి ఏర్పాటు కానుంది. * భావనపాడులో ఫిషింగ్ హార్బర్, మినీ పార్కు, స్పీడ్ బోట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. * గుళ్ల సీతారాంపురంలో 16వ శతాబ్దానికి చెందిన రామాలయంలో విద్యుత్ ధగధగలు, తోటలు, కల్యాణ మండప నిర్మాణానికి రూ.50 లక్షలతో పనులు ప్రారంభం కానున్నాయి. * సరుబుజ్జిలి మండలం దంతపురి ప్రాంతాన్ని బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం నుంచి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనాతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. * జిల్లాకే తలమానికంగా ఉన్న అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస వంటి దైవ క్షేత్రాలతోపాటు శాలిహుండం, కళింగపట్నం, తేలి నీలాపురం, బారువ బీచ్ వంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధు లు కావాలని ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. జరుగుతున్న పనులివే.. * శ్రీకాకులం ఆర్అండ్బీ అతిథిగృహం సమీపంలో ఉన్న డచ్హౌస్ను రూ.50 లక్షలతో మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. పనులు ఇప్పటికే ప్రారంభం కాగా మూడు నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. * అరసవల్లి రోడ్డులోని ఇందిరా విజ్ఞాన్ భవన్ సమీపంలో రూ.13 కోట్ల ఖర్చుతో బడ్జెట్ హోటల్ రానుంది. ఇప్పటికే రూ.6 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. * కళింగపట్నం బీచ్‌లో రూ.17 కోట్లతో బీచ్ రిసార్ట్స్‌తో పాటు శిల్పారామం కూడా ప్రారంభం కానున్నాయి. * అరసవల్లిలో రూ.16 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టగా శ్రీకూర్మంలో రూ.35 లక్షలతో, శ్రీముఖలింగంలో రూ.18 లక్షలతో, రావివలస మల్లిఖార్జునస్వామి ఆలయంలో రూ.1.12లక్షలతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాం తాల్లో గదులు, ఇతరత్రా వసతుల కల్పనకు తొలి దశలో రూ.50 లక్షలతో టెండర్లు పిలవనున్నారు. * మడ్డువలస జలాశయంలో బోట్ షికారుకు రూ.60 లక్షలతో టెం డర్లు పిలవనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు ఇప్పటికే తమ శాఖ కు రూ.4.57 కోట్లు జమ అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ బుద్ధిస్ట్ సర్క్యూట్ శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు బౌద్ధారామాలను అనుసంధానం చేస్తూ త్వరలో అంతర్జాతీయ బుద్ధిస్ట్ సర్క్యూట్’ను తీర్చిదిద్దనున్నారు. ఇది పూర్తిస్థాయిలో తయారైతే చైనా తదితర దేశాలకు చెందిన బౌద్ధ మతస్తులు తరచూ ఇక్కడకూ వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా ఆదాయం కూడా వస్తుందని అధికారులు చెబుతున్నారు. శాలిహుండం, నగరాలపేట, దంతపురి ప్రాం తాల్లో ఇప్పటికే ప్రముఖ బౌద్ధమతస్తుడు శాంతన్సేథ్ పర్యటించి ఓ ప్రణాళిక సిద్ధం చేశారని, త్వరలో దానిని కూడా విడుదల చేస్తామని చెబుతున్నారు.