కొమ్మాది(భీమిలి): విశాఖపట్నం నగరంలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న మెగాస్టార్ 154వ సినిమా (ప్రచారంలో వాల్తేరు వీరయ్య) షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆయన నగరానికి చేరుకున్నారు.
ఫిషింగ్ హార్బర్ వద్ద మంగళవారం ఆయనతో పాటు హీరో రవితేజపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. బుధవారం కూడా ఈ ప్రాంతంలో సినిమా చిత్రీకరణ ఉంటుందని సినీ వర్గాల సమాచారం. హీరోలను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు.
కాగా, చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. (క్లిక్: అలా అయితే నాకు మరో 20 ఏళ్లు పట్టేది.. అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment