
సాక్షి, తాడేపల్లి: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదారత చాటుకున్నారు. వారికి కనీవినీ ఎరుగని రీతిలో సహాయం ప్రకటించారు సీఎం జగన్. బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారుల జీవితాలను నిలబెట్టేలా సహాయం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదస్తలికి మంత్రి అప్పలరాజు, జిల్లా కలెక్టర్‌ను పంపి మత్స్యకారులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ‘ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం మత్స్యకారుల జీవితాలకే పెద్ద దెబ్బ. వారి జీవితాను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. మత్స్యకారుల జీవితాలను తిరిగి నిలబెట్టేలా సాయం ఉండాలి. బోట్లకు బీమా లేదనో.. మరో సాంకేతిక కారణాలను చూపి మత్స్యకారుల జీవితాలను గాలికి వదిలేయడం సరికాదు. కష్టకాలంలో ఉన్న మత్స్యకారులకు పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రమాద సమయాల్లో ఇబ్బంది లేకుండా ఇన్సురెన్స్ చేయించుకునేలా అధికారులు తగిన తోడ్పాటు అందించాలి. జరిగిన ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలను వెలికితీయాలి.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment