రాష్ట్రంలో ఎనిమిదిచోట్ల మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు | YS Jagan Mohan Reddy Review Meeting About Shipping Harbours | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు మరింత ఊతం

Published Fri, May 1 2020 7:11 AM | Last Updated on Fri, May 1 2020 7:14 AM

YS Jagan Mohan Reddy Review Meeting About Shipping Harbours - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు సముద్ర ఉత్పత్తులకు మరింత విలువ జోడించడమే లక్ష్యంగా భారీ ఎత్తున మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. రాష్ట్రానికి చెందిన మత్స్యకారులెవరూ ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకూడదన్న ప్రధాన లక్ష్యంతో రాష్ట్రంలో ఎనిమిదిచోట్ల ఈ మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు, ఒకచోట ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఇందుకు సుమారు రూ.3 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ విషయమై సీఎం తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, సం బంధిత అధికారులతో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో నిర్ణయాలు ఇలా..

వీటి నిర్మాణాన్ని రెండున్నర నుంచి మూడేళ్లలో పూర్తిచేయాలి.  ఈ ఎనిమిది చోట్లా చేపల వేటకు చక్కటి మౌలిక సదుపాయాలు కలి్పంచాలి. 
శ్రీకాకుళం జిల్లాలో రెండుచోట్ల, విశాఖపట్టణం, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఏర్పాటుచేయాలి.  
శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెంలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్, ఇదే జిల్లా మంచినీళ్లపేటలో ఫిష్‌ల్యాండింగ్‌ కేంద్రాన్ని, అలాగే.. విశాఖ జిల్లా పూడిమడక, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, పశి్చమ గోదావరి జిల్లా నర్సాపురం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కూడా మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లను నిర్వహించాలి.

ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహక బకాయిల చెల్లింపు
4 2014–15 నుంచి పెండింగులో ఉన్న ఎంఎస్‌ఎంఈల ప్రోత్సాహకాల బకాయిలు రూ.905 కోట్లు పూర్తిగా చెల్లిస్తారు. ఈ బకాయిలను మే నెలలో సగం, జూన్‌ నెలలో మిగతా సగం చెల్లిస్తారు. 4 2014–15 నుంచి 2018–19 వరకు గత ప్రభుత్వ హయాంలో ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వాల్సిన మొత్తం రూ.828 కోట్లతో (2014–15లో రూ.43 కోట్లు, 2015–16లో రూ.70 కోట్లు, 2016–17లో రూ.195 కోట్లు, 2017–18లో రూ.207 కోట్లు, 2018–19లో రూ.313 కోట్లు) పాటు 2019–20లో (అప్‌లోడ్‌ చేసిన వివరాల ప్రకారం) రూ.77 కోట్లు.. మొత్తం రూ.905 కోట్లు చెల్లించాలని నిర్ణయం.

తక్కువ వడ్డీతో వర్కింగ్‌ కేపిటల్‌
ఎంఎస్‌ఎంఈలు తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవడానికి వీలుగా, ఆర్థిక వనరుల సమీకరణలో తోడ్పాటు.
ఇందులో భాగంగా ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇస్తూ సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. రూ.200 కోట్లు సమకూర్చుకుని, ఆ మొత్తాన్ని వర్కింగ్‌ కేపిటల్‌గా ఎంఎస్‌ఎంఈలకు అందించాలి. తక్కువ వడ్డీతో ఈ వర్కింగ్‌ కేపిటల్‌ సమకూర్చాలి. 

టీడీపీ హయాంలో మొక్కుబడిగా..  
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం మూడు ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేశారని.. పైగా, వీటికి కేవలం రూ.40కోట్లు మాత్రమే ఖర్చుచేశారని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు సమావేశానంతరం మీడియాకు తెలిపారు. కానీ, ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని సర్కారు మాత్రం మత్స్యకారులకు పెద్దపీట వేసి 8 మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు, ఒక ఫిష్‌ల్యాండింగ్‌ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో మత్స్యకారుల జీవితాల్లో పెనుమార్పులు వస్తాయని.. భవిష్యత్తులో వలసలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. తద్వారా రాష్ట్రంలో చేపల వేట పెరగడమే కాకుండా మత్స్యకారులకు ఆదాయం పెరిగేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. కాగా, మే 6న చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని 1,15,000 కుటుంబాలకు ఇస్తున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement