
సాక్షి,విశాఖపట్నం:కేరళ మద్యం వ్యాపారులకు టీడీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. నూతన మద్యం పాలసీలో భాగంగా విశాఖపట్నంలో లాటరీ ద్వారా ఇటీవల 9 మద్యం షాపులను కేరళ మద్యం వ్యాపారులు దక్కించుకున్నారు. కేరళ,టీడీపీ నేతల మద్యం షాపులు పక్కపక్కనే ఏర్పాటయ్యాయి. దీంతో ఆ షాపులతో తమ మద్యం షాపులకు నష్టం వస్తుందని టీడీపీ నేతలు ఆగ్రహించారు.
విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న కేరళ వ్యాపారుల షాపులను మూసివేయాలని హెచ్చరించారు. షాపులను మూసివేయాలంటూ ఎక్సైజ్ అధికారుల ద్వారా ఒత్తిడి చేశారు.వేరే ప్రాంతంలో షాపులు పెట్టుకోవాలని కేరళ వ్యాపారులకు ఎక్సైజ్ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.
కేరళ వ్యాపారులకు అద్దెకు ఇచ్చిన భవన యజమానులను కూడా టీడీపీ నేతలు బెదిరించారు.భవనాలు వెనక్కి తీసుకోకపోతే కూలగొట్టిస్తామని బెదిరిస్తామనే వరకు టీడీపీ నేతలు వెళ్లినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఇసుక,మద్యంలో కూటమి నేతల అవినీతి: కాకాణి
Comments
Please login to add a commentAdd a comment