
విశాఖ: మూడు రోజుల క్రితం అనిల్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ పై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. నగరంలోని ఆక్సిజన్ టవర్ లో డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన అనిల్ అనే యువకుడిపై ప్రసాద్ అనే వ్యక్తి దారుణంగా దాడి చేశాడు. అయితే ఈ అవమానం భరించలేక అనిల్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కథనాలు రావడంతో డెలివరీ బాయ్స్ సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఆ యువకుడి అండగా నిలబడింది. ప్రస్తుతం క్షేమంగా ఉన్న ఆ యువకుడు ‘సాక్షి’ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించాడు.
‘ అన్నా అనీ పిలిచినందుకు ప్రసాద్ అనే వ్యక్తి నాపై దాడి చేశాడు. సార్ అని పిలవాలి అంటూ విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. డ్యూటీలో జాయిన్ మొదట రోజు మొదటి ఆర్డర్ ఆక్సిజన్ టవర్ లో వచ్చింది. నాకు అడ్రస్ తెలియక వెతుక్కొని వెళ్లాను. ఆక్సిజన్ టవర్ లో ఉన్న 29 ఫ్లోర్ కి వెళ్లి ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ ఒక యువతి తీసుకున్నారు. లిఫ్ట్ వద్దకి వచ్చి ప్రసాద్ అనే వ్యక్తి నా పై దాడికి యత్నించిన్నారు
లిఫ్ట్ వద్దకి వచ్చిన ప్రసాద్.. మెట్లపై పరుగెత్తించి దాడి చేశాడు. నా బట్టలు విప్పించి కర్రతో కొట్టారు. నాతో బలవంతంగా రెండు లేటర్లు రాయించారు. నా తప్పు ఉంది అని చెప్పి లెటర్ రాయించారు. నాకు తగిన న్యాయం కావాలి. ప్రసాద్ నన్ను ఎవరు ఎం చెయ్యలేరు అని చెప్పి దాడి చేశారు’ అని పేర్కొన్నాడు బాధితుడు అనిల్
నిందితుడికి ఏప్రిల్ 7 వరకూ రిమాండ్
ఈ దాడిలో నిందితుడిగా ఉన్న ప్రసాద్ కు రిమాండ్ విధించారు. ఏప్రిల్ 7 వ తేదీ వరకూ రిమాండ్ విధించింది కోర్టు. దాంతో నిందితుడు ప్రసాద్ ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment