భారత ఐస్ హాకీ జట్టు విజ్ఞప్తి
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మ్యాచ్ ఆడితే చాలు కనకవర్షం కురిసే క్రీడలున్న మన దేశంలో... ఒక టోర్నీలో పాల్గొనేందుకు జాతీయ జట్టు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తోంది. తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తోంది. వివరాల్లోకెళితే... భారత ఐస్ హాకీ జట్టు ఈ నెలాఖరులో కువైట్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్ (డివిజన్-1)కు అర్హత సాధించింది. అయితే ఆ టోర్నీలో పాల్గొనేందుకు అయ్యే మొత్తం జట్టు వద్ద లేదు. జట్టులో మొత్తం 26 మంది సభ్యులున్నారు. కనీస ఖర్చు రూ. 12 లక్షల వరకు అవుతుంది.
ఆటగాళ్లంతా ఒక్కొక్కరు రూ. 20 వేలు చొప్పున వేసుకోగా...మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్, మరికొందరు సన్నిహితులు సహకరించడంతో ఈ మొత్తం రూ. 5 లక్షలకు చేరింది. అయితే జట్టుకు ఇంకా రూ. 7 లక్షలు కావాలి. దాంతో ఆటగాళ్లు భారత ఐస్ హాకీ వెబ్‌సైట్ ద్వారా తమకు సహాయం అందించమని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి టోర్నీ ఆడాలన్న వారి కోరిక ఎలా తీరుతుందో చూడాలి.
డబ్బులివ్వండి...ఆడి వస్తాం!
Published Thu, Apr 9 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM
Advertisement
Advertisement