
జింజు (దక్షిణ కొరియా): మహిళల ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన బింద్యారాణి దేవి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన 55 కేజీల విభాగం పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన ఆమె రజతపతకాన్ని సొంతం చేసుకుంది.
గత ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో కూడా రజతం నెగ్గిన మణిపూర్ లిఫ్టర్ బింద్యా ఈ పోరులో క్లీన్ అండ్ జర్క్, స్నాచ్‌లలో కలిపి మొత్తం 194 కేజీల (83 కేజీలు + 111 కేజీ) బరువెత్తింది. చెన్ గ్వాన్ లింగ్ (చైనీస్ తైపీ –204 కేజీలు) స్వర్ణం గెలుచుకోగా, వో తి క్యూ ను (వియత్నాం – 192 కేజీలు) కాంస్యం గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment