Asian Weightlifting Championships: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో తాష్కెంట్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు ఆమె దూరం కానుంది. అక్టోబర్‌లో జరిగిన హాంగ్జౌ ఆసియా క్రీడల సందర్భంగా మీరాబాయి తుంటికి గాయమైంది. దీంతో అప్పటి నుంచి ఆమె మరే టోర్నీ బరిలోనూ దిగలేకపోయింది.
ఇక ప్రపంచ మాజీ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన మీరాబాయి మార్చిలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. థాయ్‌లాండ్‌లో పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో భాగమైన ప్రపంచకప్ టోర్నీతో.. ఆమె పునరాగమనం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
వారియర్స్ ఘనవిజయం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో బెంగాల్ వారియర్స్ జట్టు మూడో విజయం నమోదు చేసింది. పట్నా పైరేట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 60–42తో గెలిచింది. వారియర్స్ తరఫున కెపె్టన్ మణీందర్ సింగ్ 15 పాయింట్లు, నితిన్ 14 పాయింట్లు స్కోరు చేశారు. ఈ గెలుపుతో వారియర్స్ జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్; బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment