భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుపై హాలివుడ్ స్టార్.. థోర్(క్రిస్ ఎమ్స్‌వర్త్) ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవలే కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయి ప్రదర్శనను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. మార్వెల్ కామిక్స్‌లో థోర్ పాత్ర చేతిలో ఉండే సుత్తి చాలా బరువు ఉంటుంది. ఆ సుత్తిని అతను తప్ప ఎవరూ ఎత్తలేరు. అందుకే చాను సాధించిన విజయాన్ని కీర్తిస్తూ..'' ఎంత బరువైనా ఎత్తేస్తుంది.. థోర్ ఇక నీ సుత్తిని వదిలేయాల్సిన సమయం వచ్చేసింది.'' అన్నట్టుగా క్రిస్ హెమ్స్‌ను ట్యాగ్ చేశాడు సదరు అభిమాని.
అభిమాని చేసిన ట్వీట్‌పై హెమ్స్‌వర్త్ స్పందించాడు. ''ఇక నేను సుత్తిని వదిలి వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఆమె నా సుత్తిని కూడా అవలీలగా ఎత్తేస్తుందేమో. అయినా అందుకు ఆమె అర్హురాలే. కంగ్రాట్స్.. సికోమ్.. నువ్వొక లెజెండ్'' అంటూ కామెంట్ చేశాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చానూ కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం ఒడిసి పట్టింది.
గత శనివారం 49 కేజీల విభాగంలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్‌లో మీరాబాయి చాను స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి పతకం అందుకుంది. కాగా స్నాచ్ విభాగంలో 90 కేజీల బరువు ఎత్తాలని టార్గెట్‌గా పెట్టుకుంది మీరాబాయి చాను. కానీ స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది.
She is worthy! Congrats, Saikhom, you legend.
— Chris Hemsworth (@chrishemsworth) August 4, 2022
చదవండి: Commonwealth Games 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు
Lifting 201kg never felt easy but thanks to the love and wishes of billions back home, every challenge is just an attempt away. 🇮🇳#WeAreTeamIndia #TeamIndia pic.twitter.com/GnyaftZkpv
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 30, 2022
Comments
Please login to add a commentAdd a comment