ఏసీబీ వలలో సర్వేయర్
ఏసీబీ వలలో సర్వేయర్
Published Thu, Jun 15 2017 1:37 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
గోపాలపురం: గోపాలపురం తహసీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న పి.జాగారాలపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. బుధవారం రాత్రి ఏసీడీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొవ్వూరుపాడుకి చెందిన బసవ మంగరాజుకు భార్యకు చెందిన ఆరెకరాల పొలం ఉంది. కొంత కాలంగా పక్క రైతులతో విభేదాలు ఉండటంతో తన పొలాన్ని సర్వే చేయాలంటూ సర్వేయర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీనిని సర్వేయర్ పి.జాగారాల రెండుసార్లు తిరస్కరించడంతో మరోసారి దరఖాస్తు చేసి రూ.585 చలానా తీశారు. సర్వేయర్ జాగారాల మాత్రం పొలం సర్వే చేయాలంటే రూ.20 వేలు కావాలని డిమాండ్ చేశారు. అంత నగదు ఇవ్వలేనంటే రూ.18 వేలకు ఒప్పుకున్నారు. మొదటి దఫాగా రూ.9 వేలు .. సర్వే జరిగిన రోజున మిగిలిన సొమ్ము పొలం వద్దే ఇవ్వాలని సర్వేయర్ జాగారాల చెప్పడంతో బాధిత రైతు మంగరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అ«ధికారులు వ్యూహం ప్రకారం గోపాలపురం మీ సేవ కేంద్రం వద్ద రైతు మంగరాజు నుంచి రూ.9 వేలు తీసుకుంటుండగా సర్వేయర్ జాగారాలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించారు. ఏసీబీ సీఐ వీజే విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement