gopalapuram
-
ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు
-
చంద్రబాబుకు భారీ షాక్.. బూతులు తిట్టిన టీడీపీ నేతలు
-
గోపాలపురం మండలాల్లో పెద్దపులి సంచారం
-
గోపాలపురం ఏసీపీ సుధీర్ బాబు సస్పెండ్
-
తూర్పుగోదావరి: టీడీపీ మూడు ముక్కలు.. భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ముద్దిపాటి వర్సెస్ మళ్లపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య ముసలం పుట్టింది. నియోజకవర్గం ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజును మార్చాలంటూ కార్ ర్యాలీ చేపట్టారు. 500 కార్లతో గోపాలపురం నుంచి అమరావతికి టీడీపీ నాయకులు బయలుదేరారు. చంద్రబాబు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీని మూడు ముక్కలు చేశారంటున్న నేతలు.. ఒంటెద్దు పోకడలతో మద్దిపాటి వ్యవహరిస్తున్నారంటూ మండి పడుతున్నారు. మద్దిపాటిని అభ్యర్థిగా ప్రకటిస్తే రెబల్ అభ్యర్థిని బరిలోకి దింపుతామని నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు -
మద్దిపాటి వర్సెస్ ముళ్ళపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరావు వర్గాల మధ్య ముసలం
-
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో వర్గ విభేదాలు
-
నేడు 32వ రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర
-
గోపాలపురం టీడీపీలో ఏం జరుగుతోంది ?
-
సికింద్రాబాద్ గోపాలపురంలో అంజిరెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు
-
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో టీడీపీ వర్గాల ఘర్షణ
-
పొలిటికల్ కారిడార్ : గోపాలపురం టీడీపీలో అసమ్మతి సెగలు
-
గోపాలపురం ఎమ్మెల్యేపై దాడి.. స్పందించిన హోంమంత్రి
సాక్షి, విశాఖపట్నం: ఎండాడలో ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను హోం మంత్రి తానేటి వనిత శనివారం సందర్శించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసమే దిశ యాప్, దిశ చట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చారని హోంమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 24 లక్షల మందికి పైగా దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. చదువుకొనే ప్రతి విద్యార్థిని దిశా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: AP: ఏలూరు కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత మహిళలపై దాడులను సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరన్నారు. ఇటీవల మహిళలపై దాడులు చేయడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. వారే దాడులు చేసి వారే తిరిగి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. విశాఖ నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన టీడీపీ నేత పై కేసు నమోదు చేశామన్నారు... జి.కొత్తపల్లి ఘటనపై స్పందిస్తూ.. ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జరిగిన దాడిపై ఆమె స్పందిస్తూ.. ఎమ్మెల్యేపై జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నానన్నారు. ఇప్పటికే తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని.. దాడి ఎందుకు జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేపై దాడి జరిగిందన్నారు. -
AP: ఏలూరు కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, ఏలూరు: ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో వైఎస్ఆర్సీపీ నేత దారుణ హత్యకు గురికాగా, పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌పై ప్రత్యర్థి వర్గం దాడికి యత్నించింది. జి. కొత్తపల్లి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్‌పై కొందరు దుండగులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. అనంతరం సంఘటనా స్థలానికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ చేరుకోగా, ప్రత్యర్థి వర్గం ఎమ్మెల్యేపై ఒక్కసారిగా దాడికి యత్నించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేను రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. దీంతో వలయంగా ఏర్పడి.. ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత కారణాలా? ఆస్తి వివాదాలా? లేదంటే రాజకీయ వైరంతోనే గంజి ప్రసాద్‌ను హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. -
Hyderabad Kidnap Case: చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం
-
మూడేళ్ల చిన్నారి కిడ్నాప్.. తెలిసిన వ్యక్తి పనే.. 9 గంటల్లోనే..
సాక్షి, రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): ఇంటి ఎదుట ఆడుకుంటున్న మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులను పోలీసులు తొమ్మిది గంటల్లోనే పట్టుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. రెజిమెంటల్ బజార్లో నివసించే శ్రీనివాస్, ఉమా దంపతులకు తరుణ్ (6), కీర్తన (3) ఉన్నారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కీర్తనకు అన్నం పెట్టేందుకు తల్లి ఉమా కిచెన్‌లోకి వెళ్లగా చిన్నారి మొదటి అంతస్తు నుంచి కిందకు వచ్చింది. 10 నిమిషాలకు తల్లి వచ్చి చూసేసరికి పాప కనిపించ లేదు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసిన దర్యాప్తు చేశారు. శ్రీనివాస్ ఇంటికి కొద్ది దూరంలో ఇద్దరు యువకులు తచ్చాడినట్లు స్థానికులు తెలిపారు. ఓ మహిళ వీరిని ప్రశ్నించగా... సాయి కోసం వచ్చామని చెప్పడంతో పాటు అక్కడ కొందరు ఆ పేరున్న వాళ్లు ఉండటంతో తెలిసిన వారై ఉండవచ్చని ఆమె భావించింది. కాసేపటికి చిన్నారిని యాక్టివా వాహనంపై తమ మధ్య కూర్చోబెట్టుకుని వెళ్లడాన్ని గుర్తించిన ఎల్లోరా అనే వృద్ధురాలు పోలీసులకు తెలిపింది. వాళ్లు చిన్నారితో మాట్లాడుకుంటూ తీసుకుని వెళ్లినట్లు చెప్పింది. చదవండి: న్యూఇయర్ వేడుకలు.. గ్రాము కొకైన్ ధర.. బంగారం కంటే 3 రెట్లు ఎక్కువ దీంతో తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని భావించారు. రంగంలోకి దిగిన ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్, గోపాలపురం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ముందుకు వెళ్లి గాలింపు చేపట్టారు. రాత్రి 10 గంటలకు జీడిమెట్లలో నిందితుల ఆచూకీ గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సూత్రధారి బాలిక కుటుంబానికి పరిచయస్తుడు. పాపకు మామ వరసైన వ్యక్తే కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, మరో ఇద్దరు కిడ్నాప్ చేశారని, ఇంకొకరు బాలికను దాచిపెట్టడానికి సహకరించారని తేల్చారు. వ్యక్తిగత కారణాలతోనే బాలికను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: ఆన్లైన్లో పరిచయం.. నీ కష్టాలు తీరుస్తా.. వ్యక్తిగత ఫొటోలు, రూ.5 వేలు పంపు.. -
మందలించాడని అన్నను హత్య చేసిన తమ్ముడు
సాక్షి, పశ్చిమగోదావరి : గోపాలపురం మండలం కరగ పాడులో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ముల మధ్య చిన్నపాటి వివాదం హత్యకు దారి తీసింది. కరక పాడు గ్రామానికి చెందిన మద్దాల సుధీర్, సతీష్ అన్నదమ్ములు. ఈ క్రమంలో తమ్ముడు సతీష్ చెడు వ్యసనాలకు బానిసై పని చేసిన సొమ్మును ఇంటి దగ్గర ఇవ్వడం లేదని ఇటీవల అన్న సుధీర్ మందలించాడు. దీంతో అన్నపై కోపం పెంచుకున్న తమ్ముడు సతీష్ ఆదివారం రాత్రి తన స్నేహితుడైన దుర్గాప్రసాద్ సహాయంతో అన్న గొంతుకు ఉరివేసి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు గోపాలపురం ఎస్సై సుబ్రహ్మణ్యం తెలియజేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘ఈ నీరు పిల్లలు తాగాలా?’.
సాక్షి, దేవరపల్లి(పశ్చిమగోదావరి) : ‘ఇది మంచినీరా..? ఇవి పిల్లలు తాగాలా?’ అంటూ గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు హాస్టల్ అధికారులపై మండిపడ్డారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం సాంఘిక సంక్షేమశాఖ బాలుర ప్రత్యేక వసతి గృహాన్ని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 గంటల వరకు వసతి గృహాన్ని పరిశీలించి నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న గదులు, పురుగులు, మట్టి, నాచుతో నిండి మూతలేని మంచినీటి ట్యాంకును పరిశీలించిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగులు పట్టిన మంచినీటిని విద్యార్థులకు ఎందుకు సరఫరా చేస్తున్నారని సిబ్బందిని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నిలదీశారు. చుట్టూ క్వారీలు ఉండడం వల్ల దుమ్ము నీటి తొట్టెలో పడుతుందని, తొట్టెకు మూత లేకపోవడం వల్ల కలుషితమవుతుందని విద్యార్థులు ఎమ్మెల్యేకు వివరించారు. పురుగులు, అన్నం మెతుకులు గల మంచినీటిని సరఫరా చేస్తున్నారని, ఈ నీటితోనే వంటలు చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. అడిగితే సిబ్బంది బూతులు తిడుతున్నారని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. వసతిగృహంలో పనిచేస్తున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తి దుర్భాషలాడుతూ చిత్రహింసలు పెడుతున్నట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ దీపాలు సరిగా వెలగడం లేదని, మంచినీరులేక ఇబ్బంది పడుతున్నట్టు విద్యార్థులు వివరించారు. ఫ్యాన్లు లేక ఉక్కపోతలో ఉంటున్నట్టు తెలిపారు. డైనింగ్ హాల్ లేక కింద కూర్చుని భోజనం చేస్తున్నట్టు విద్యార్థులు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు వివరించారు. ప్రతీరోజు పప్పు అన్నం తినలేకపోతున్నామని. 50 మంది విద్యార్థులకు రెండున్నర లీటర్ల పెరుగు వేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్న భోజనంతో పెరుగు వేయడం లేదన్నారు. పరిసరాలు శుభ్రంగాలేక చదవలేకపోతున్నట్టు విద్యార్థులు ఎమ్మెల్యే వెంకట్రావుకు వివరించారు. విద్యుత్ తీగలు వేలాడుతున్నా పట్టించుకోవడం లేదని, రాత్రి సమయంలో కరెంట్ సరిగా ఉండడంలేదని విద్యార్థులు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థులకు తక్షణం మినరల్ వాటర్ సరఫరా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మినరల్ వాటర్ సరఫరా చేయకుండా పురుగులు పట్టిని మంచినీటిని సరఫరా చేస్తున్నారని సంక్షమాధికారి సత్యనారాయణను ఫోన్లో ప్రశ్నించారు. ఇంటి వద్ద మీ పిల్లలకు ఇలాంటి మంచినీరు ఇస్తారా? అని ఆయన నిలదీశారు. విద్యార్థుల సమస్యలను జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళతానని ఆయన తెలిపారు. వసతిగృహాల సంక్షేమాధికారులు స్థానికంగా ఉండాలన్నారు.. వసతిగృహాల సంక్షేమాధికారులు స్థానికంగా ఉండకపోవడం వల్ల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. గౌరీపట్నం వసతిగృహం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదువుకుంటున్న వసతిగృహాలు ఈ విధంగా ఉండడం దారుణమని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని అన్ని వసతిగృహాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, విద్యార్థులపై సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వసతిగృహాల్లో మినరల్ వాటర్ వినియోగించాలని ఆయన అన్నారు. గౌరీపట్నం వసతి గృహం సంక్షేమాధికారి ఇన్చార్జ్గా వ్యవహరించడం వల్ల అందుబాటులో లేరు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గుత్తికొండ అచ్యుతరావు, పార్టీ నాయకులు కొటారు వెంకటసుబ్బారావు. ఆండ్రు సత్తిరాజు, కుండా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
దారుణం: భార్య, అత్తపై కత్తితో దాడి
సాక్షి, పశ్చిమ గోదావరి: గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి భార్య, అత్తను అతికిరాతకంగా నరికి చంపాడు. వివరాల ప్రకారం దొండపూడి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మితో గంగోలు పంచాయతీ పరిధిలోని రాంపాలెం గ్రామానికి చెందిన కుమ్మర కాంతారావుకు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. కాంతారావు వ్యవసాయ కూలి. ఏడాది కాలంగా భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. నాలుగు నెలల క్రితం భర్త కాంతారావు తప్పతాగి ఇంటికి వచ్చి తరచూ కొట్టడం చేస్తుండటంతో విసుగు చెందిన లక్ష్మి భర్త కాంతారావును పిల్లలను వదిలి పుట్టింటికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం జామాయిల్ తోటలో కర్రలు నరకడానికి వెళ్లి పనులు ముగించుకుని మద్యం మత్తులో అత్తగారింటికి వచ్చాడు. వచ్చిన వెంటనే భార్యను పిలిచి గొడవ పడతున్నాడు. దీంతో అత్త కప్పల పుష్పవతి (55) అడ్డుతగలడంతో తనతో తీసుకువచ్చిన కత్తితో తల, మెడపైన నరకడంతో అత్త కుప్పకూలిపోయింది. వెంటనే భార్య లక్ష్మి(32)ని కత్తితో విచక్షణా రహితంగా నరకడంతో వీరిద్దరూ రక్తపు మడుగులోపడి అక్కడికక్కడే మృతిచెందారు. దీనిని గమనించిన బావమరిది కప్పల మంగారావు కాంతారావును పట్టుకోవడానికి ప్రయత్నించగా అతని చేతిపై కత్తితో నరికాడు. కాంతారావును స్థానికులు పట్టుకుని దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. భార్యపై అనుమానంతోనే కాంతారావు ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. -
పచ్చ నేతల దాష్టీకం
సాక్షి, ద్వారకాతిరుమల : కుల అహంకారంతో కొందరు టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. ఓ పక్క వారికి ఓటమి భయం వెంటాడుతుండగా మరో పక్క వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దీంతో తమకు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిపై టీడీపీ కార్యకర్తలు ఒక పథకం ప్రకారం దాడులకు దిగుతున్నారు. దళితుల ఓట్లు ఎలాగో తమకు పడవని తెలుసుకున్న టీడీపీ నేతలు వారిని నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. గ్రామాల్లో కుల చిచ్చు పెడుతున్నారు. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలో బుధవారం రాత్రి జరిగిన ఘటన ఇందుకు దర్పణంగా నిలుస్తోంది. ప్రజాదరణ చూసి ఓర్వలేక తలారి కారు ధ్వంసం టీడీపీకి కంచుకోటగా ఉన్న గోపాలపురం నియోజకవర్గానికి బీటలు వారాయి. వైఎస్సార్ సీపీ ఫ్యాన్ గాలి ఇక్కడ విపరీతంగా వీస్తోంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం గ్రామాల్లోకి వెళుతున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావును ప్రజలు అడుగడుగునా నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు టీడీపీలో కీలకంగా ఉన్న నేతలు సైతం వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఇవన్నీ చూస్తూ సహించలేని ఒక సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు ఎం.నాగులపల్లిలో తలారి ప్రచారాన్ని అడ్డుకున్నారు. న్యూస్ కవరేజ్ కోసం అక్కడకొచ్చిన ‘సాక్షి’ దినపత్రిక, మీడియా విలేకరులపై దౌర్జన్యం చేశారు. తలారి కారును ధ్వంసం చేశారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఎం.నాగులపల్లి, మారంపల్లి, సూర్యచంద్రరావు పేట, తిరుమలంపాలెం, పంగిడిగూడెం, తిమ్మాపురం, భీమడోలు తదితర పంచాయతీలకు చెందిన చంద్రబాబు సామాజికవర్గ పచ్చ నేతలు ఈ దాష్టికంలో పాల్గొన్నారు. సభ్యత, సంస్కారాలను మరచి తలారిని నోటికి రాని బూతులు తిడుతూ రోడ్డుపై రెచ్చిపోయారు. మా గ్రామానికి రావద్దంటూ వైఎస్సార్ సీపీ నేతలను బెదిరించారు. చివరకు పోలీస్ ఉన్నతాధికారుల చొరవతో వివాదం సద్దుమణిగింది. గత చరిత్ర హీనం ఎం.నాగులపల్లిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోవడం కొత్తేమి కాదని పలువురు అంటున్నారు. 2006 ఆగస్టు నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఓట్లు లెక్కింపు సమయంలో కొందరు టీడీపీ నేతలు విధ్వంసాలను సృష్టించారు. ఆ సమయంలో అక్కడున్న పోలీసులను కొట్టడంతో పాటు, ఒక ఎన్నికల అధికారి కారును తిరగబెట్టి, నిప్పంటించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పోలీసులు 40 మంది టీడీపీ నాయకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కొద్ది రోజుల తరువాత కొన్ని సెక్షన్లను తొలగించి, ఆ కేసును దొమ్మీ కేసుగా మార్చినట్టు చెబుతున్నారు. ఇప్పటికీ ఆ 40 మందిపై బైండోవర్ కేసులున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇందిలోని కొందరు నేతలు నాలుగేళ్ల క్రితం గుళ్లపాడు గ్రామంలో, ఎస్సీలపై కోళ్ల దొంగతనం మోపీ వారిని తల్లకిందులుగా వేలాడదీసి కొట్టారు. దీనిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తోంది. ఇలాంటి నేతలు తలారిపై విషం కక్కడం టీడీపీ పరువును మరింత దిగజార్చింది. ఎమ్మెల్యే ముప్పిడికి చుక్కెదురు గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ వడ్లపూడి ఈశ్వర భానువరప్రసాద్, ఎం.నాగులపల్లికి చెందిన పలువురు నేతలతో కలిసి ప్రచారం నిమిత్తం గురువారం మత్తేవారిగూడెంకు వెళ్లారు. అయితే అక్కడ ఎస్సీలు వారిని అడ్డుకున్నారు. ఎం.నాగులపల్లిలో దళితులను అవమానించినందుకు ముందు క్షమాపణ చెప్పాలంటూ వారిని నిలదీశారు. దీంతో టీడీపీ నేతలకు, ఎస్సీలకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో పోలీసుల ఇరువర్గాలను బుజ్జగించారు. దీంతో టీడీపీ నేతలు తమ ప్రచారాన్ని విరమించుకుని అక్కడి నుంచి వెనుతిరిగారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగనివ్వరు టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నేతలను ఎన్నికల ప్రచారం కూడా చేసుకోనివ్వడం లేదు. వారు ప్రవర్తిస్తున్న తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. దళిత ఎమ్మెల్యే అభ్యర్థి అని కూడా చూడకుండా, తలారిని వైఎస్సార్ సీపీ నేతలను నిర్భందించి నోటికొచ్చినట్లు దూషించారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ నేతలు పోలింగ్‌ను ప్రశాంతంగా జరగనిస్తారన్న నమ్మకం మాకు లేదు. 2014లో ఇదే మండలంలోని మారంపల్లిలో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలపై గొడవకు దిగారు. ఈసారి పారా మిలటరీ సిబ్బందిని, ప్రత్యేక బలగాలను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి. లేకపోతే పచ్చ నేతలు రెగ్గింగులు చేయడానికి కూడా వెనుకాడరు. – పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు బెదిరింపులకు భయపడేది లేదు టీడీపీ వారు నన్ను బెదిరించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని స్వాగతిస్తానే గానీ భయపడను. అడుగడుగునా వైఎస్సార్ సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీపై తిరగబడుతున్నారు. దీన్ని చూసి సహించలేని తెలుగు తమ్ముళ్లు నన్ను అవమానించాలని, నాపై బురదచిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారు నన్నేమీ చేయలేరు. ఎం.నాగులపల్లిలో టీడీపీ నేతలు చేసిన గొడవ ఆ పార్టీ పరువు ప్రతిష్టలను మరింత బజారుకీడ్చింది. వైఎస్సార్ సీపీ శ్రేణులు టీడీపీ ప్రచారాలను ఎక్కడా అడ్డుకోవద్దు. ఎందుకంటే ప్రజలే వారికి బుద్ధి చెబుతారు. – తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి -
ఇంటికొచ్చిన టీడీపీ నేతలను నిలదీయండి : వైఎస్ షర్మిల
సాక్షి, పశ్చిమ గోదావరి : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని చంద్రబాబు ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపి ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అంటున్నాడని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. గారడీ బాబుకు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అయిదేళ్లు అధికారంలో ఉండి అధ్వాన పాలన అందించిన చంద్రబాబును ‘నిను నమ్మం బాబు’ అని సాగనంపాలని పిలుపునిచ్చారు. ‘కేజీ నుంచి పీజీ విద్య, ఆడపిల్ల పుడితే రూ.25 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు ఇస్తామన్న బాబు సర్కారు మాట తప్పింది. టీడీపీకి ఓటు వేయాలని మీ ఇంటికొచ్చిన తెలుగుదేశం నాయకులను అడగండి. హామీలను అమలు చేయకుండా బాకీ పడిన సొమ్ము సంగతి తేల్చండని నిలదీయండి’ అని ప్రజలను కోరారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల గురువారం పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... పొత్తుల్లేకుండా వచ్చే ధైర్యం ఉందా.. ‘చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్, జనసేనతో కలిసి వస్తున్నారు. ఏ పొత్తు లేకుండా చంద్రబాబు ఇంతవరకు ఎన్నికలకే రాలేదు. 11వతేది ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు. గిట్టుబాటు ధరకై 3 వేల కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ ఆస్పత్రులను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళలకు ఆర్థికసాయంగా రూ.75వేలు ఇస్తాం. మీ సేవ చేసే అవకాశం జగనన్నకు ఇవ్వండి. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి వెంకట్రావు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా మార్గాని భరత్‌ను గెలిపించండి. జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అని వైఎస్ షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఇంటికొచ్చిన టీడీపీ నేతలను నిలదీయండి
-
ప్రచారంలో ఉద్దేశపూర్వకంగా బైక్ అడ్డుపెట్టి..
సాక్షి, ద్వారకాతిరుమల : ఓటమి భయంతో టీడీపీ నేతలు బరితెగించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుకు పెరుగుతున్న జనాభిమానాన్ని చూసి ఓర్వలేక ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించారు. న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన సాక్షి మీడియాపై సైతం టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. ద్వారకాతిరుమల మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం నుంచి వైఎస్సార్ సీపీ నేతలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తలారి వెంకట్రావుకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది చూసి ఓర్వలేక.. వైఎస్సార్సీపీ ప్రచారాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ఎం.నాగులపల్లిలో బుధవారం సాయంత్రం తలారిని అడ్డుకున్నారు. ఉద్దేశపూర్వకంగా బైక్ అడ్డుపెట్టి.. తలారి ప్రచార రథం ఎం.నాగులపల్లికి చేరగానే టీడీపీ నేతలు ఒక బైక్‌ను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్త బైక్‌కు ఉన్న జెండా కర్ర, టీడీపీ నేత బైక్‌కు తగిలింది. దీంతో టీడీపీ నేత ఇష్టానుసారం బూతులు తిడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడిచేశాడు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా తలారి వాహనాన్ని అడ్డుకున్నారు. ఒక దళిత ఎమ్మెల్యే అభ్యర్థి అని కూడా చూడకుండా తలారిని ఇష్టానుసారం దూషించారు. తలారిని నిర్బంధించి ఆయన కారును సైతం ధ్వంసం చేశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను, అక్కడకు చేరుకున్న ప్రజలను, మీడియా వారిని భయబ్రాంతులకు గురిచేసేలా టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పలువురు డీఎస్పీలు, సీఐలను సంఘటనా స్థలానికి పంపించారు. వారి ఆధ్వర్యంలో భీమడోలు సీఐ సీహెచ్ కొండలరావు, స్థానిక పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేశారు. నిర్భంధంలో ఉన్న తలారిని, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను విడిపించారు. అంతకుముందు న్యూస్ కవరేజ్ నిమిత్తం అక్కడకు వెళ్లిన సాక్షి దినపత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా విలేకర్లపై కూడా టీడీపీ శ్రేణులు దౌర్జన్యం చేయడంతో పాటు దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా గ్రామంలో ప్రత్యేక దళాలను మోహరించారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం గోపాలపురం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోగా, ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ప్రచారానికి వెళుతున్న ముప్పిడిని ప్రజలు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతో తలారి ప్రచారాన్ని అడ్డుకోవాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. తలారి ప్రచారాన్ని కూడా ప్రజలు అడ్డుకుంటున్నారని చూపే ఎత్తుగడతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. -
నారీమణులు.. రాజకీయ దివ్వెలు
సాక్షి, తాడేపల్లిగూడెం : ఎన్నికల సంగ్రామంలో జిల్లాకు చెందిన మహిళలు నారీశక్తిని చాటిచెప్పారు. నరసాపురం నియోజకవర్గంలో 1981 ఉప ఎన్నికల్లో పరకాల కాళికాంబ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సా«ధించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో ఆచంట రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి మోచర్ల జోహార్‌వతి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం పొందారు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పీతల సుజాత పోటీచేసి విజయం పొందారు. భీమవరం నుంచి 1995లో భూపతిరాజు కస్తూరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. ఉండి నుంచి 1970 ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కె.ఆండాళ్లమ్మ పోటీ చేసి విజయం సాధించారు. పెనుగొండ నియోజకవర్గం నుంచి 1983,1985లో టీడీపీ తరఫున ప్రత్తి మణెమ్మ పోటీచేసి విజయం పొందారు. అత్తిలి నియోజకవర్గం నుంచి 1955లో చోడగం అమ్మనరాజా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయబావుటా ఎగురవేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన డాక్టర్ కోసూరి కనకలక్ష్మి ఓడిపోయారు. 1983 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఈలి వరలక్ష్మి విజయం పొందగా, 1985లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆమె తిరిగి 1987 ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించగా, 1989లో పోటీ చేసి పరాజయం చెందారు. దెందులూరు నుంచి 1985లో కాంగ్రెస్ తరçఫున ఎం.పద్మావతి పోటీ చేసి ఓటమి చెందారు. 1991 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మాగంటి వరలక్ష్మీదేవి విజయం పొందారు. ఏలూరు నుంచి 1994లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆమెకు పరాజయం ఎదురైంది. గోపాలపురం నియోజకవర్గం నుంచి 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ ఐ తరఫున పోటీ చేసి దాసరి సరోజనిదేవి గెలుపొందారు. 1983లో తిరిగి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆమె పరాజయం పాలయ్యారు. 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన నంబూరి ఝాన్సీరాణి విజయం సాధించలేదు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మద్దాల సునీత ఓటమిపాలై.. 2004లో విజయం సాధించారు. 2009లో తానేటి వనిత టీడీపీ తరపున పోటీచేసి గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా పీతల సుజాత చింతలపూడిలో గెలుపొందారు. -
ఎమ్మెల్యే ముప్పిడికి నిరసన సెగ
ద్వారకాతిరుమల: ‘ఐదేళ్ల పాలనలో మా సమస్యలు తీర్చలేకపోయారు.. ఎప్పుడడిగినా అదిగో.. ఇదిగో అంటూ కాలం వెళ్లబుచ్చారు. ఇప్పుడు ఓట్లు వేయమంటే ఎలా వేస్తాం.. మేమడిగిన పని పూర్తిచేస్తేనే ఓట్లు వేస్తాం’ అని గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు కొందరు గ్రామస్తులు. ద్వారకాతిరుమల మండలంలోని పలు గామాల్లో టీడీపీ అభ్యర్థి ముప్పిడి పార్టీ నేతలతో కలిసి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ప్రజాదరణ కరువైంది. పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రచార రథాన్ని అడ్డగించి తమ సమస్యల సంగతి ఏం చేశారంటూ నిలదీశారు. ఇలా అడుగడుగునా ప్రజల నిలదీతలతో ప్రచారం సాగింది. కొన్ని గ్రామాల్లో కార్యకర్తలు లేక ప్రచారం వెలవెలబోయింది. స్థానికుల పట్టుతో ఎస్సీ కాలనీ సందర్శన రామానుజాపురం ఎస్సీ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ముప్పిడిని కోరుతున్నారు. ఇప్పటి వరకు స్తంభాలు వేయలేదు. దీంతో ఆ ప్రాంతంలో ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ ప్రచార రథాన్ని స్థానికులు అడ్డుకున్నారు. తమ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదని, ఇప్పుడు ఓట్లు కోసం ఎలా వచ్చారని నిలదీశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని, ఏ పని చేయడానికీ వీల్లేదని ముప్పిడి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ దుస్థితిని కళ్లారా చూడాల్సిందేనని స్థానికులు పట్టుబట్టడంతో ఆయన ఎస్సీ కాలనీకి వెళ్లారు. అక్కడి నుంచి విద్యుత్ శాఖ డీఈతో ఫోన్లో మాట్లాడారు. తాను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇక్కడి ప్రజలు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, కరెంటు ఇవ్వమని అడుగుతుంటే అదిగో చేస్తాం.. ఇదిగో చేస్తాం అన్నాముగానీ చేయలేదని చెప్పారు. స్తంభాలువేసి, కరెంటు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటని డీఈని ప్రశ్నించారు. మీరు ఎప్పటికల్లా పని పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. దీనికి డీఈ సమాధానమిస్తూ పది, పదిహేను రోజుల్లోగా పని పూర్తి చేస్తానని అన్నారు. ఇదంతా విన్న పలువురు తెలుగు తమ్ముళ్లు ఎన్నికల కోడ్ ఉండగా పనులు చేయడం కుదరదన్న ఎమ్మెల్యే, ఈ సమయంలో పనులు ఎలా చేయిస్తారని చెవులు కొరుకున్నారు. బురద నీళ్లు తాగుతున్నాం గొడుగుపేట వెళ్లిన ముప్పిడిని స్థానిక రామాలయం వద్ద గ్రామస్తులు నిలదీశారు. ఐదేళ్ల పాలనలో తమ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులేంటో చూపాలని ప్రశ్నించారు. ఇప్పటికీ తాము బురద నీటినే తాగాల్సివస్తోందని ధ్వజమెత్తారు. ఎస్సీ కాలనీలో ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చారో చెప్పాలని నిలదీశారు. దీంతో వారు నెమ్మదిగా జారుకున్నారు.