దుబాయ్‌లో ఉన్నా పింఛను..! | woman lived in dubai but pension draw in AP | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో ఉన్నా పింఛను..!

Published Thu, Jun 16 2016 8:18 AM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

అర్హత ఉన్న వారు పింఛను అందుకోవాలంటే సవాలక్ష నిబంధనలు.

గోపాలపురం :  అర్హత ఉన్న వారు పింఛను అందుకోవాలంటే సవాలక్ష నిబంధనలు. వేలిముద్రలు మాసేవరకూ మిషన్‌పై నొక్కిస్తారు.. కాళ్లరిగేలా తిప్పిస్తారు.. నువ్వే ఆ మనిషివని గ్యారేంటి ఏంటంటూ ఆకార్డు ఈ కార్డులు చూపించమంటారు.. కానీ, ఒకామె దుబాయ్ వెళ్లిపోయి నాలుగు నెలలైనా ఆమెకు పింఛను ఆగలేదు. మనిషి ఇక్కడ లేకపోయినా ఆమె పేరిట మూడు నెలల పింఛను పంపిణీ చేసేశారు. ఎలా, అంటే.... మాత్రం తెల్లమొఖాలు.

ఈ విచిత్ర ఘటన మండలంలోని వాదాలకుంట గ్రామంలో చోటు చేసుకుంది. మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2015-16కు సంబంధించి బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో బహిరంగ విచారణ చేపట్టారు. ఈ విచారణలో పై విషయం వెలుగుచూసి అంతా అవాక్కయ్యారు. దీంతో ఆ పింఛను సొమ్ము రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఇది ఇలా ఉండగా ఉపాధి నిధులు రూ.23, 237 దుర్వినియోగమైనట్టు ప్రిసైడింగ్ అధికారి అప్పారావు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement