ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి అనిత
పెదగుమ్ములూరులో హోం మంత్రి అనిత చిందులు
తహసీల్దార్, ఇతర అధికారులు ఎందుకు రాలేదంటూ ఎంపీడీవోపై ఆగ్రహం
ఎస్.రాయవరం: గ్రామస్థాయిలో పింఛన్ల పంపిణీకి తాను వస్తుంటే మండలస్థాయి అధికారులు ఎందుకు హాజరుకాలేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె సోమవారం అనకాపల్లి జిల్లా పెదగుమ్ములూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబి్ధదారులకు పింఛను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వేదికపై ఉన్న అధికారులను చూసి మండలస్థాయి అధికారులు ఎవరు హాజరయ్యారని అడిగారు.
ముందుకొచి్చన ఎంపీడీవో సత్యనారాయణతో.. మండలంలో అధికారులు ఎక్కడ ఉన్నారు? హోం మంత్రి వస్తే తహసీల్దార్, ఇతర శాఖల అధికారులు రావాల్సిన అవసరం లేదా.. అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పింఛన్ల పంపిణీకి అధికారులు రావలసిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
అధికారుల తీరు మారలేదని, ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గ్రామంలోకి వస్తే అనేక సమస్యల్ని ప్రజలు తనకు చెప్పారని, ఆ ఫిర్యాదులను తాను ఆఫీస్‌కు పంపించుకోవాలా అని ఆమె ప్రశ్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి హుటాహుటిన మండల కార్యాలయం నుంచి వేదిక వద్దకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment