MPDO Office
-
టీడీపీ నేత కుట్ర... దివ్యాంగుని పింఛను కోత
శ్రీరంగరాజపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పింఛను లబి్ధదారులపై కొరడా ఝుళిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఓ దివ్యాంగుడి పింఛన్‌ను టీడీపీ నాయకుడు రద్దు చేయించారు. దీంతో బాధితుడు గురువారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. శ్రీరంగరాజపురం మండలం, పద్మాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు హేమాద్రి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాధవనాయుడి ఇంటి వద్ద కూలి పనులు చేయడానికి నిరాకరించారు. దీంతో కక్ష పెంచుకున్న మాధవనాయుడు అధికారులపై ఒత్తిడి పెంచి హేమాద్రికి వస్తున్న వికలాంగ పింఛను తొలగించడమే కాకుండా దుర్భాషలాడి కుటుంబం అంతు చూస్తానని బెదిరించాడు. హేమాద్రికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ మొత్తం హేమాద్రికి వచ్చే పింఛన్‌పైనే ఆధారపడి జీవిస్తోంది. దీంతో బాధితుడు హేమాద్రి గురువారం శ్రీ రంగరాజపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు యతి్నస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అలాగే, మండలంలోని జీఎంఆర్ పురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఢిల్లీకి వస్తున్న వికలాంగ పింఛన్ కూడా తొలగించారని, తనకు కూడా పింఛన్‌ను పునరుద్ధరించకపోతే ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరించారు. -
రేయ్ ఇటురారా?
గూడూరు రూరల్: ‘ఒరేయ్.. ఇటు రారా. ఏందిరా ఇది.. ఇంత అవినీతి ఎప్పుడైనా జరిగిందా.. ఎందుకిలా చేస్తున్నార్రా.. ఒరేయ్ మీకు అర్థం కావడం లేదురా..’ ఇదీ మంగళవారం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జరిగిన సమాజిక బహిరంగ సభావేదికలో ఉపాధి సిబ్బందినుద్దేసించి పీడీ శ్రీనివాసప్రసాద్ అన్న మాటలు. తమ తోటి సిబ్బందితో మర్యాదగా మసులుకోవాల్సిన ఆయన ఏకవచనంతో పిలుస్తూ అవమానాలకు గురిచేస్తుండడంపై పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులమనే గౌరవం కూడా లేకుండా రారా..పోరా.. అని సంబోధించడం ఏంటని ప్రశి్నస్తున్నారు. ఎంతకాదన్నా తాముకూడా సహోద్యోగులమేకదా అని చెబుతున్నారు. ఎలాగంటే అలా మాట్లాడడం సరికాదని హితవు పలుకుతున్నారు. కాగా వివిధ గ్రామాలకు సంబంధించిన నలుగురు క్షేత్ర సహాయకులతోపాటు ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను తొలగిస్తున్నట్టు పీడీ పేర్కొన్నారు. వీరి నుంచి రూ.6.77 లక్షల రికవరీకి ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో మంగళపూరు, రామలింగాపురం, వెడిచెర్ల, కొండాగుంట గ్రామాల క్షేత్రసహాయకులు ఉన్నారని చెప్పారు. అలాగే విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించని ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏపీడీ వరప్రసాద్, ఏపీఓ పెంచలయ్య, పలువురు టెక్నికల్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పెన్షన్ అందక 90 ఏళ్ల వృద్ధురాలి ఆవేదన
-
నేనంటే లెక్కలేదా..?
ఎస్.రాయవరం: గ్రామస్థాయిలో పింఛన్ల పంపిణీకి తాను వస్తుంటే మండలస్థాయి అధికారులు ఎందుకు హాజరుకాలేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె సోమవారం అనకాపల్లి జిల్లా పెదగుమ్ములూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబి్ధదారులకు పింఛను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వేదికపై ఉన్న అధికారులను చూసి మండలస్థాయి అధికారులు ఎవరు హాజరయ్యారని అడిగారు.ముందుకొచి్చన ఎంపీడీవో సత్యనారాయణతో.. మండలంలో అధికారులు ఎక్కడ ఉన్నారు? హోం మంత్రి వస్తే తహసీల్దార్, ఇతర శాఖల అధికారులు రావాల్సిన అవసరం లేదా.. అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పింఛన్ల పంపిణీకి అధికారులు రావలసిన అవసరం లేదా అని ప్రశ్నించారు.అధికారుల తీరు మారలేదని, ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గ్రామంలోకి వస్తే అనేక సమస్యల్ని ప్రజలు తనకు చెప్పారని, ఆ ఫిర్యాదులను తాను ఆఫీస్‌కు పంపించుకోవాలా అని ఆమె ప్రశ్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి హుటాహుటిన మండల కార్యాలయం నుంచి వేదిక వద్దకు వచ్చారు. -
జీపీల నిధులు వెంటనే విడుదల చేయాలి
బషీరాబాద్: పంచాయతీలకు కేటాయించిన కేంద్రం, ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడంపై సర్పంచులు మండిపడుతున్నారు. పంచాయతీలకు హక్కుగా వచ్చిన కేంద్ర నిధులను ఇతర పథకాలకు వాడుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట అధికార బీఆర్ఎస్కు చెందిన దాదాపు 20 మంది సర్పంచులు ధర్నా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల (జీపీ) అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో ఎనిమిది నెలలుగా తమకు కేంద్ర నిధులు అందలేదని తెలిపారు. కాగా, గత వారంరోజుల్లో రెండు విడతలుగా కేంద్ర నిధులు జమయ్యాయని స్పష్టంచేశారు. కానీ జమైన నిధులను రాష్ట్రం ప్రభుత్వం ఖాళీ చేసిందని చెప్పారు. జీపీల కరెంటు బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలకు కేంద్రం నిధులు ఇస్తే.. వాటిని రాష్ట్రం ఎలా వాడుకుంటుందని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం ఆర్థిక సంఘం నిధులను పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, హరితహారం, అభివృద్ధి పనులకే వినియోగించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎనిమిది నెలలుగా ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేయలేదని, దీంతో ట్రాక్టర్లలో డీజిల్ పోయలేక, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. అప్పులు తెచ్చి పూర్తిచేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రావడం లేదని, నెలనెలా వడ్డీలు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆర్థిక సంఘం నిధులు జమచేయాలని, లేదంటే బీఆర్ఎస్కు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు అధికారులు మాత్రం పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ చేస్తామని సర్పంచులకు సర్ది చెబుతున్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సర్పంచులు ప్రియాంక, రవీందర్, భీమప్ప, శాంతిబాయి, విష్ణువర్ధన్‌రెడ్డి, దశరథ్, హన్మీబాయి, నారాయణ, దేవ్‌సింగ్, అనురాధ, గాయత్రి, వీరమణి, వెంకటయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
నాడు అటెండర్‌గా మంచి నీళ్లు, టీ ఇచ్చాడు.. నేడు ఎంపీపీగా..
సాక్షి, నెల్లూరు(పొదలకూరు): ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్‌గా మంచినీళ్లు, టీ మోసిన వ్యక్తి ఎంపీపీగా ఎన్నికయ్యారు. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ల వల్ల రోజు కూలీగా జీవనం సాగిస్తున్న వ్యక్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో సుబ్బరాయుడు తండ్రి ఆదెయ్య సుదీర్ఘకాలం అటెండర్‌గా పనిచేశారు. ఆదెయ్యకు ఆరోగ్యం దెబ్బతినడంతో తండ్రి స్థానంలో సుబ్బరాయుడు తాత్కాలికంగా ఆఫీసు సబార్డినేట్‌గా ఉద్యోగంచేసి అధికారుల మన్ననలు పొందారు. 2020 మార్చిలో మహ్మదాపురం గ్రామ పెద్దలు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడిగా సుబ్బరాయుడును ఏకగ్రీవం చేయించారు. విజయలక్ష్మి అకాల మృతితో.. ఎంపీటీసీ ఎన్నికల తర్వాత ఎంపీపీగా ఎన్నికైన ఆర్‌వైపాళెం ఎంపీటీసీ సభ్యురాలు నిమ్మళ్ల విజయలక్ష్మి అనారోగ్య కారణాల వల్ల మృతిచెందారు. దీంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం మండలాధ్యక్షుని ఎన్నికను ప్రత్యేకాధికారి శోభన్‌బాబు నిర్వహించారు. మహ్మదాపురం ఎస్టీ జనరల్ సెగ్మెంట్ ఎమ్పీటీసీ సభ్యుడు కందుకూరు సుబ్బరాయుడుకు వైఎస్సార్సీపీ నుంచి బీ–ఫాం అందింది. దుగ్గుంట ఎమ్పీటీసీ సభ్యుడు రామిరెడ్డి సుబ్బరాయుడును ఎంపీపీగా ప్రతిపాదించారు. మరో ఎమ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు బలపరిచారు. దీంతో సుబ్బరాయుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం ప్రత్యేకాధికారి సుబ్బరాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీడీఓ పీ.సుజాత, ఈఓపీఆర్డీ ఎం.నారాయణరెడ్డి, ఏఓ సుబ్రమణ్యం, వైస్ ఎంపీపీలు వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, సోమా అరుణ, జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ పాల్గొన్నారు. -
కార్యాలయమా.. పశువుల పాకా?
అనంతపురం, బ్రహ్మసముద్రం/కళ్యాణదుర్గం రూరల్: ‘‘ఇదేమన్నా కార్యాలయమా...? లేక పశువుల పాకా.. ఇంత అధ్వానంగా ఉన్నా పట్టిచుకోరా..? మీ కార్యాలయ ఆవరణే ఇలా ఉంచుకున్నారంటే.. మీరు ఏ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారో అర్థమవుతోంది’’ అంటూ ఎంపీ తలారి రంగయ్య బ్రహ్మసముద్రం ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గంలలో పర్యటించారు. తొలుతబ్రహ్మసముద్రం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల వెళ్లారు. ఎంపీడీఓ కార్యాలయ అధికారులు ఉదయం 10.30 గంటలు దాటినా విధులకు రాకపోవడంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ, ఇళ్ల పట్టాలు, రైతు భరోసా, రేషన్‌కార్డుల గురించి తహసీల్దార్ రమేష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనులపై ఆరా తీశారు. వేతనాలు చెల్లించాలని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికుల మాట్లాడారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన కళ్యాణదుర్గం ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎంపీడీఓ అందుబాటులో లేకపోవడంతో మండిపడ్డాడు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మూడు చోట్ల ఎంపీడీఓలు విధులకు గైరహాజరయ్యారని, ఇలా అయితే ప్రభుత్వ పథకాలు పేదలకు ఎలా అందుతాయని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు తిరిగి వస్తున్న కూలీలకు ఉపాధి హామీ పనులు విరివిగా కల్పించాలన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. -
లక్షల్లో అవినీతి... వందల్లో రికవరీ
సాక్షి, సోమశిల: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఏడాది కాలంపాటు జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి గ్రామీణ స్థాయిలో నిర్వహించిన సామాజిక తనిఖీ బృందం లక్షల్లో అవినీతిని వెలికితీస్తే చర్యలు చేపట్టాల్సిన అధికారులు మమ అంటూ వందల్లో రికవరీలు చూపుతూ తూతూ మంత్రంగా ప్రజావేదికను నిర్వహించారు. అధికారుల తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అనంతసాగరం మండలంలో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉపాధిహామీ పథకం కింద 3,686 అభివృద్ధి పనులను 24 పంచాయతీల్లో చేపట్టారు. ఇందుకు సంబంధించి రూ.1,00,5,38,311 నిధులు విడుదల చేశారు. పది రోజులుగా స్టేట్ ఉపాధిహామీ సామాజిక తనిఖీ మానిటరింగ్ అధికారి దుర్గమ్మ పర్యవేక్షణలో మండలంలోని అన్ని గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించి ఆయా గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి అవినీతిని వెలికితీశారు. అనంతసాగరంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీ ప్రజావేదికను సోమవారం ఏర్పాటు చేశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అడిషనల్ పీడీ నాసర్‌రెడ్డి పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ స్థాయిలో జరిగిన విచారణను ఆడిట్ బృందం వెల్లడించారు. సోమశిల నుంచి మొదలుపెట్టి అన్ని గ్రామాలకు రాత్రి వరకు కొనసాగుతున్నాయి. ఉపాధిహామి పథకం కింద జరిగిన అభివృద్ధి పనుల వివరాలను ఆయా పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేసేందుకు ఆయా పంచాయతీల్లో బోర్డుల నిమిత్తం నగదు మళ్లించాల్సి ఉండగా మండలం మొత్తానికి ఒకే వ్యక్తి ఖాతాలో దాదాపు రూ.4 లక్షలు అప్పటి ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్ మళ్లీంచడం ఏమిటంటూ మాజీ ఎంపీపీ కమతం శోభ అధికారులను ప్రశ్నించారు. రసాభాస ప్రజావేదికలో అమనిచిరువెళ్ల ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి అక్రమాలను తెలియచేసేందుకు అధిక సంఖ్యలో కూలీలు వచ్చి అధికారులకు వెల్లడించబోగా ఆయన వారించడంతో సభలో రసాభసా చోటు చేసుకుంది. కూలీలతో అసభ్యకరంగా మాట్లాడడంతోపాటు సొంత వాళ్లకు ఇష్టం వచ్చినంత కూలీలు వేస్తూ పనులకు రాకపోయినా వ్యాపారులు చేసుకునేవాళ్లకు కూడా ఉపాధి కూలీలుగా చిత్రీకరించడం, అవినీతిని ఆడిట్ బృందం వెల్లడి చేయగా అధికారులు అతనికి వంతు పాడడంతో ఒక్కసారి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్థుబాటు చేశారు. మాజీ సర్పంచ్ వనిపెంట రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కమతం శోభలు గ్రామంలో జరుగుతున్న అవినీతిని నిగ్గుతేల్చాలంటూ పట్టుబట్టారు. దీంతో ఏపీడీ నాసరయ్య మరో 10 రోజుల్లో గ్రామంలో ప్రజావేదిక నిర్వహించి అందరికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో సభ సద్దుమణిగింది. అనంతసాగరం పంచాయతీలో పలు అవినీతి ఆరోపణలతోపాటు ఇరువురు ప్రభుత్వ ఉద్యోగులకు గృహ నిర్మాణశాఖ ద్వారా పక్కా ఇళ్లు మంజూరు చేసి ఉపాధి నిధులు మంజూరు చేయడం పట్ల మాజీ ఎంపీపీ అధికారులను నిలదీశారు. దీంతోపాటు ఇంకుడుగుంతల నిర్మాణంలో కూడా ఉపాధి సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని, వాటిపై అధికారులు చర్యలు చేపట్టకపోవడం ఏమిటంటూ నిలదీశారు. శంకరనగరంలో లక్షలాది రూపాయల ఉపాధి, పంచాయతీరాజ్, ఐకేపీ, గృహ నిర్మాణశాఖ ద్వారా నిధులు మంజూరయ్యాయని వాటిలో లక్షల రూపాయల అవినీతి జరిగిందంటూ గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు పార్లపల్లి రవికుమార్‌రెడ్డి అధికారులకు తెలియచేశారు. ఆడిట్ బృందం గ్రామంలో చేపట్టిన నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఉపాధి సిబ్బందికి వత్తాసు పలుకుతున్నారని రవికుమార్‌రెడ్డి ధృజమెత్తారు. రాత్రి వరకు పలు గ్రామాల్లో జరిగిన ఆడిట్‌పై ప్రజావేదిక కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా డ్వామా విజిలెన్స్ అధికారి వెంకటేశ్వరరావు, ఏపిడి మృదుల ఆడిట్ బృందం కోనయ్య, లోకేష్, ఎంపీడీఓ మధుసూధన్, ఇతర మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
అవి ఓకే.. మరి ఇవి?
సాక్షి, వరంగల్: జిల్లా ప్రజా పరిషత్‌ల తుదిరూపుపై స్పష్టమైన మార్గదర్శకాలు అందకపోవడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఈనెల 7, 8వ తేదీల్లో ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికతో ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల అధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరడమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్ కా ర్యాలయాల ఏర్పాటు, సిబ్బంది, ఉద్యోగుల కేటాయింపు, మౌలిక వసతులపై మార్గదర్శకాలు అందకపోవడంతో అధికారులు సందిగ్దావస్థలో ఉన్నారు. గత ఐదునెలలుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్, లెక్కింపు, పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియలో జెడ్పీ అధికారులు తలమునకలై ఉన్నారు. ఇక కొత్త పాలకవర్గాలు వచ్చే నెల 5వ తేదీ కొలువు దీరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే, జిల్లా పరిషత్‌ల కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ముందుకు సాగాలంటే ప్రభుత్వం నుంచి సూచనలు, సలహాలతో కూడిన మార్గదర్శకాలు అందకపోవడంతో గందరగోళం నెలకొంది. ఉద్యోగుల విభజన, కేటాయింపే సమస్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2014 ఎన్నికల సమయంలో ఒకే జిల్లా పరిషత్, 50 మండల పరిషత్‌లు ఉండగా... జిల్లా పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఆరు జిల్లా ప్రజాపరిషత్‌లు, 71 మండల పరిషత్, జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లా పరిషత్‌లు, ఆ జెడ్పీల పరిధిలో 70 జెడ్పీటీసీ, 780 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆరు జిల్లా పరిషత్‌లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా పూర్తయింది. ఇక 67 మండల పరిషత్‌లకు ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు కూడా ఎన్నికయ్యారు. ఈ ప్రక్రియ మొత్తం సజావుగానే సాగినా జిల్లా పరిషత్ విభజనపై ఇప్పటికీ మార్గదర్శకాలు అందలేదు. కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు అవసరమైన కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనపై కసరత్తుతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తారా.. లేదా వర్క్ టు సర్వ్ కింద ఉన్న సిబ్బందినే ఆయా జిల్లాలకు కేటాయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. కాగా జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. ఆరు జిల్లాలకు నోడల్ జెడ్పీగా ఉన్న వరంగల్ జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగుల వివరాలు కేడర్ల వారీగా.. ఇప్పటి వరకు ఉన్న మౌలిక సదుపాయాలు, సామగ్రి వివరాలను రెండు నెలల క్రితమే ఉద్యోగులు కమిషనర్‌కు నివేదించారు. ప్రస్తుతం 74 మంది.. వరంగల్ జెడ్పీలో ప్రస్తుతం జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓతో పాటు 8 మంది సూపరింటెండెంట్లు, ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లు, 29 జూనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు టైపిస్టులు సహా రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, డ్రైవర్లు మొత్తం 74 మంది ఉన్నారు. కొత్తగా ఏర్పడే ఒక్కో జిల్లా పరిషత్‌కు కనీసం 19 మంది సిబ్బంది అవసరం. సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఇద్దరు సూపరింటెండెంట్లు, ముగ్గురు సీని యర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఆరుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఇలా మొత్తం ఒక్కో జెడ్పీలో ఎంత తక్కువ అనుకున్నా కనీసం 19 మంది అవసరం అవుతుందని అంచనా. ఈ లెక్కన ఆరు జిల్లాలకు కలిపి 114 మంది అవసరమవుతా రు. అదే విధంగా ఫర్నీచర్, కంప్యూటర్లు, ఫ్యాన్లు, జిరాక్సు యంత్రాలు తదితర సామగ్రి కూడా కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా పదోన్నతులు కల్పించి కొత్త జిల్లాలకు సిబ్బందిని బదిలీ చేస్తారా లేదా సర్వ్ టు రూల్ కింద ఆయా జిల్లాల కలెక్టర్లే సిబ్బందిని కేటాయిస్తారా అన్న అంశాలు జిల్లా పరిషత్ ఉద్యోగుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎంపీడీఓలు ఏరీ? ఉమ్మడి జిల్లాలో జిల్లాల పునర్విభజనతో పాటే కొత్త మండలాలు ఏర్పడగా వాటిలో ఎంపీడీఓ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో ఖిలా వరంగల్, కాజీపేట, ఐనవోలు, వేలేరు, దామెర, టేకుమట్ల, కన్నాయిగూడెం, పలిమెల, గంగారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్ద వంగర, తరిగొప్పుల, చిల్పూరు తదితర మండలాలు ఏర్పడగా ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మండలాల్లో కొత్త ఎంపీడీఓ కార్యాలయాల ఏర్పాటుతోపాటు ఉద్యోగులను విభజించి కేటాయించాల్సి ఉంది. ఒక్కో మండల పరిషత్‌కు కనీసం 9 మంది ఉద్యోగులను నియమిస్తే పాలన సాఫీగా కొనసాగుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఓ ఎంపీడీఓ, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్లు అవసరమని పేర్కొన్నారు. కాగా, కొత్త కార్యాలయాలు, సిబ్బంది కేటాయింపుల మార్గదర్శకాలు సైతం జెడ్పీకి ఇంకా రాలేదని అధికారిక సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ ఛైర్పర్సన్లతో పాలకవర్గాలు ఏర్పడగా.. వచ్చే జులై 5న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉంది. ఈలోగా కొత్త జిల్లా పరిషత్ కార్యాలయాలతో పాలన ప్రారంభిస్తారా లేదా.. అద్దె భవనాల్లోనా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను జెడ్పీకి కేటాయిస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా... జిల్లా పరిషత్‌లు 06 మండల పరిషత్‌లు (4 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికాలేదు) 71 ప్రస్తుతం వరంగల్ జెడ్పీలో ఉద్యోగులు 74 ఒక్కో కొత్త జెడ్పీకి కావాల్సిన ఉద్యోగులు 19 ఒక్కో ఎంపీడీఓ కార్యాలయానికి కావాల్సిన ఉద్యోగులు 9 -
అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ ఏర్పాటు
సాక్షి, అన్నపురెడ్డిపల్లి: ఉమ్మడి చండ్రుగొండ మండలం నుంచి విడిపోయిన అన్నపురెడ్డిపల్లి మండలంలో ఒక జెడ్పీటీసీ, ఆరు ఎంపీటీసీ స్థానాలతో మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) ఏర్పాటవుతుం ది. వీటికి రిజర్వేషన్లు కూడా ఖరార య్యా యి. 2016లో నూతన జిల్లాలతోపాటు నూతన మం డలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా, చండ్రుగొండ మండలం నుంచి అన్నపురెడ్డిపల్లి మండలం ఆవిర్భవించింది. అప్పుడు తహసీల్దార్, పోలీస్ స్టేషన్, వ్యవసాయాధికారి, ఐకేపీ కార్యాలయాలు మాత్రమే ఏర్పాట య్యాయి. ఎంపీడీఓ, ఎంపీపీ కార్యాలయాలు ఉమ్మడి చండ్రుగొండ మండల కేంద్రంగానే కొనసాగాయి. మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు త్వ రలో జరగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. తగ్గిన ఎంపీటీసీ స్థానం గతంలో అన్నపురెడ్డిపల్లి మండలంలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. మండల జనా భా ప్రాదిపదికన వీటిని కేటాయిచారు. మండలానికి ఆరు ఎంపీటీసీ స్థానాలను అధికారులు కేటాయించారు. గతంలో పెద్దిరెడ్డిగూడెం–1, పెద్దిరెడ్డిగూడెం–2 స్థానాలు ఉండేవి. తాజాగా, పెద్దిరెడ్డిగూడెం–2 ఎంపీటీసీ స్థానాన్ని అధికారులు రద్దు చేశారు. మండల మొత్తం జనాభా 21130 మంది. 2011 జనాభా లెక్కల ప్రకారంగా ప్రతి 3500 జనాభాకు ఒక ఎంపీటీసీ ఏర్పాటు చేయటంతో మండలంలో ఒక ఎంపీటీసీ స్థానం తగ్గింది. దీంతో, అన్నపురెడ్డిపల్లి మండలం ఆరు ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలతో మండల పరిషత్గా ఏర్పడనుంది. రిజర్వేషన్లు ఇలా.. ఈ మండల పరిషత్, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. అందుకే, మొత్తం స్థానాల్లో ఎసీకి సగం, జనరల్‌కు సగం కేటాయించారు. అన్నపురెడ్డిపల్లి–1(జనరల్), అన్నపురెడ్డిపల్లి–2(ఎస్టీ జనరల్), పెంట్లం –జనరల్(మహిళ), నర్సాపురం–ఎస్టీ(మహిళ),గుంపెన–జనరల్, పెద్దిరెడ్డిగూడెం–ఎస్టీ(మహిళ) కు రిజర్వయ్యాయి. మండల పరిషత్ ప్రెసిడెంట్(ఎంపీపీ)–ఎస్టీ (జనరల్), జెడ్పీటీసీ మెంబర్–జనరల్(మహిళ)కు కేటాయించారు. ఆ స్థానంపై అందరి దృష్టి మొత్తం ఆరు ఎంపీటీసీ స్థానాలకుగాను అన్నపురెడ్డిపల్లిలోనే రెండు ఉన్నాయి. అన్నపురెడ్డిపల్లి–2 ఎస్టీ జనరల్. ఇక్కడి నుంచి గెలుపొందిన వారికి ఎంపీపీ పీఠంపై కూర్చునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న చర్చ సాగుతోంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు కొందరు తీవ్రంగా ప్రయ త్నిస్తున్నారు. ఇక్కడి నుంచి తన సతీమణిని బరి లోకి దింపడం ద్వారా, ఎంపీపీ పీఠాన్ని చేజిక్కిం చుకునేందుకు ఉపాధ్యాయుడొకరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
జెడ్పీటీసీలు.. 21 ఎంపీటీసీలు: 258
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ పరిధి తగ్గింది. జిల్లాల పునర్విభజనతో జెడ్పీటీసీల సంఖ్యతోపాటు.. మండల ప్రాదేశిక స్థానాల సంఖ్యకు కూడా కోత పడింది. చాలా గ్రామాలు పురపాలనలో విలీనం కావడంతో ఎంపీటీసీల సంఖ్య తగ్గింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో జెడ్పీటీసీల సంఖ్య కూడా తగ్గిపోయింది. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 33 జిల్లా ప్రాదేశిక స్థానాలుండగా తాజాగా కేవలం రంగారెడ్డి జిల్లా వరకే చూస్తే ఈ సంఖ్య 21 పరిమితమైంది. ఎంపీటీసీల విషయానికి వస్తే.. పాత జిల్లాలో 753 ఉండగా ప్రస్తుతం మన జిల్లాలో 258 ఎంపీటీసీలు మిగిలాయి. ఒక్క కొత్త రంగారెడ్డి జిల్లాలోనే 116 ఎంపీటీసీలకు కత్తెర పడింది. రాజేంద్రనగర్, సరూర్‌నగర్ గ్రామీణ మండలాలు సంపూర్ణంగా పురపాలనలో విలీనం కావడంతో పాటు శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల, తుర్కయంజాల్, శంకర్పల్లిలు మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. వీటిలో పరిసర గ్రామాలు కలవడంతో మండల ప్రాదేశిక స్థానాలు కనుమరుగయ్యాయి. అదే సమయంలో పాలమూరు జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన ఆమనగల్లు కూడా పురపాలికగా మారడంతో సమీపంలోని కొన్ని గ్రామాల ఎంపీటీసీ స్థానాలు తగ్గిపోయాయి. ముసాయిదా రెడీ ప్రస్తుత జెడ్పీ పాలకవర్గ కాలపరిమితి జులై మొదటి వారంలో ముగియనుండగా.. ఆ లోగా నూతన జిల్లాల ప్రాతిపదికన మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కసరత్తు చేసిన పంచాయతీరాజ్ విభాగం కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో కూడిన ముసాయిదా జాబితాను సిద్ధం చేసింది. శేరిలింగంపల్లి, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, బాలాపూర్, హయత్‌నగర్, గండిపేట మండలాలు పట్టణ ప్రాంత ప్రాంతాలు కావడంతో వీటిని పంచాయతీరాజ్ విభాగం నుంచి తొలగించారు. ఇలా సరూర్‌నగర్, రాజేంద్రనగర్ మండలాల్లో 71 ఎంపీటీసీ స్థానాలు కనుమరుగు అయ్యాయి. ఇక కొన్ని గ్రామాలు నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. ఆమనగల్లు, శంకర్పల్లి, శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో పదుల సంఖ్యలో ఎంపీటీసీలు కలిసిపోయాయి. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ సమయంలో మహబూబ్‌నగర్ నుంచి జిల్లాలో కొన్ని ప్రాంతాలు విలీనమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో కొత్తగా కడ్తాల్, చౌదిరిగూడ, నందిగామ మండలాలుగా అవతరించాయి. ఈ మండలాల్లో నూతనంగా 28 ఎంపీటీసీ స్థానాలు తోడయ్యాయి. అలాగే ఫరూఖ్‌నగర్‌లో అదనంగా ఒక స్థానం పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముసాయిదా జాబితా ప్రకారం కొత్త రంగారెడ్డి జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 258కి తగ్గింది. 21 జెడ్పీటీసీ స్థానాలు ఎంపీటీసీ స్థానాల సంఖ్య కుదింపుకాగా జెడ్పీటీసీ స్థానాల్లో ఒకటి పెరిగింది. ప్రస్తుతం కొత్త జిల్లా ప్రకారం 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ముసాయిదా జాబితాను అనుసరించి ఈ సంఖ్య 21కు చేరుకుంది. పట్టణీకరణ కారణంగా సరూర్‌నగర్, రాజేంద్రనగర్ స్థానాలు గల్లంతుకాగా.. కడ్తాల్, నందిగామ, చౌదరిగూడ జెడ్పీటీసీ స్థానాలుగా అవతరించనున్నాయి. 3,500 జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానం కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ మండలాల ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రతి 3,500 జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిర్ధిష్ట జనాభా ఒక పంచాయతీలోనే ఉంటే.. ఆ గ్రామాన్ని ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో రెండు మూడు గ్రామాలను కలిపి ఒక ఎంపీటీసీ స్థానంగా విభజించారు. వీటిలో అధిక జనాభా ఉన్న గ్రామం పేరిటే ఎంపీటీసీ స్థానంగా నిర్ణయిస్తారు. 25న తుది జాబితా 258 ఎంపీటీసీ, 21జెడ్పీటీసీ స్థానాలతో కూడిన ముసాయిదా జాబితాను అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచి అభ్యంతరాలను అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఈనెల 22 వరకు ఉంది. అందిన అభ్యంతరాలను 23, 24 తేదీల్లో పరిష్కరించి 25వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేస్తారు. -
ఇదేనా స్వచ్ఛ భారత్?
కూడేరు : పారిశుద్ధ్యం పట్ల మండల అభివృద్ధి అధికారి , పంచాయతీ అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారు. దీంతో గ్రామాల్లో డ్రైనేజీలు శుభ్రతకు నోచుకోలేదు. మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీంతో దోమలు ప్రబలి ప్రజలు విష జ్వరాల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. కూడేరు మండలంలో 14 పంచాయతీలు, 28 గ్రామాలు ఉన్నాయి. మండల అభివృద్ధి కార్యాలయం (ఎంపీడీఓ) ఆవరణలోనే చెత్తా చెదారంతో కంపు కొడుతోందంటే అధికారులు పారిశుద్ధ్యం మెరుగునకు ఏ స్థాయిలో కృషి చేస్తున్నారో ఆర్థం చేసుకోవచ్చు. వీధుల్లో ఉన్న చెత్తను మూడు చక్రాల బండిలో తెచ్చి ఎంపీడీఓ కార్యాలయ గేటు ముందు పడేస్తున్నారు. అందులో స్థానికులు కొందరు మలమూత్ర విసర్జన చేయడంతో కంపు కొడుతోంది. ఈ కంపును దాటుకొని మండల ప్రజలు అంగన్వాడీ కేంద్రం, ఐకేపీ కార్యాలయం, హౌసింగ్ ఆఫీసర్, హార్టికల్చర్ కార్యాలయాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. గత్యంతరం లేక ప్రజలు ముక్కు మూసుకొని వెళుతున్న పరిస్థితి నెలకొంది. రోజు అధికారులు ఈ కంపును చూస్తు వెళుతున్నారే తప్ప శుభ్రం చేయిద్దామన్న ఆలోచన లేదని ప్రజలు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అంతా ఊపిరి పీల్చుకున్నారు
మద్దూరు : మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం ముంబాయికి వెళ్లే బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. నారాయణపేట నుంచి మద్దూరు మీదుగా ముంబాయికి వెళ్లే ఆర్టీసీ బస్సు మద్దూరు బస్టాండ్‌కు చేరింది. పాతబస్టాండ్ మీదుగా వెళ్లాల్సిన బస్సు పాతబస్టాండ్‌లోమిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు జరుగుతుండడంతో ఎంపీడీఓ కార్యాలయం మీదుగా వెళ్లడానికి బస్సుడ్రైవర్ బస్టాండ్‌లో సీసీ రోడ్డుపైకి బస్సును ఎక్కించే ప్రయత్నం చేశారు. సీసీ రోడ్డు వారం రోజుల క్రితమే వేయడంతో క్యూరింగ్ కోసం కట్టలు కట్టారు. దీంతో బస్సు అదుపుతప్పి బొల్తా పడబోయింది. బస్సు డ్రైవర్ ప్రయాణికులు గమనించడంతో బస్సును అపి అందులోని ప్రయాణికులను దింపేశారు. బస్సును సీసీ రోడ్డుపైకి తోశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
కారులోని రూ.5.36 లక్షలు అపహరణ
సాక్షి, తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని ఎమ్డీవో కార్యాలయం వద్ద చోరీ జరిగింది. జగ్గరగుంటపాలెం పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ కారులో బుధవారం ఎండీఓ కార్యాలయానికి వచ్చాడు. కారును కార్యాలయం ముందు పార్కు చేసి సంతకం పెట్టేందుకు లోపలికి వెళ్లాడు. తిరిగొచ్చేసరికి కారులో ఉన్న రూ.5.36 లక్షలు అపహరణకు గురయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
అంబేద్కర్ అశయాలను కొనసాగించాలి
పెండ్లిమర్రి: పేద, బడుగు, బహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అశయాలను కొనసాగించాలని ఎంపీడీవో మల్రెడ్డి, తహశీల్దార్ అంజనేయులు పేర్కొన్నారు. అంబేడ్కర్ 126వ జయంతి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. అనంతరం మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వెంకటన్న మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు.అలాగే పెండ్లిమర్రి వీరభద్రస్వామి దేవాళయంలో సమరసత సేవా పౌండేషన్ అధ్యక్షుడు రామలక్ష్మన్రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ రఘనాథ్‌రెడ్డి, ఏఎస్ఐ నాగన్న, వీఆర్వో ప్రసాద్, పంచాయితీ కార్యదర్శి బాస్కర్, బీజెపీ అసెంబ్లీ కన్వీనర్ బాలగురవయ్య, మండల మాల మహనాడు అధ్యక్షుడు రాజు, ఉపాధ్యాక్షుడు లారెన్స్ పాల్గొన్నారు. -
ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం
మండల సభలో ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నం మహబూబాబాద్ రూరల్: తమకు నిధులు కేటాయించడం లేదని ఆవేదనకు గురైన ఓ ఎంపీటీసీ సభ్యుడు మండల సర్వసభ్య సమావేశంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. మహబూబాబాద్ మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గోనె ఉమారాణి అధ్యక్షతన జరిగింది. సభ జరుగుతుండగా జంగిలిగొండ ఎంపీటీసీ సభ్యుడు బానోత్ బాలకృష్ణ ఒక్కసారిగా లేచి తమను పట్టించుకునే వారే లేరని, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారే నిధులు వినియోగించుకోండి అంటూ బాటిల్లోని పెట్రోల్ ఒంటిపై పోసుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు బాలకృష్ణ వద్ద నుంచి బాటిల్‌ను తీసుకుని అతడిని వారించి కూర్చోబెట్టారు. -
దేవుడి వరమిచ్చినా..
హిందూపురం రూరల్ : దేవుడి వరమిచ్చినా..పూజారి వరమివ్వక పోవడం అంటే ఇదేనేమో..?.. వికలాంగుడైన చిన్నారి రామ్‌చరణ్‌కు ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసినా గ్రామకార్యదర్శి బాబ్జి నగదు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం వహించాడు. దీంతో మలుగూరుకు చెందిన వెంకటరమణ కుమారుడితో కలిసి గురువారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. పింఛన్ ఇచ్చే వరకు పోయేది లేదని ఎంపీడీఓ శ్రీలక్ష్మితో మొర పెట్టుకున్నాడు. వెంటనే ఆమె గ్రామ కార్యదర్శిని కార్యాలయానికి పిలిపించి అక్కడికక్కడే రూ.1,500 పంపిణీ చేయించారు. పింఛన్ల పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. -
రుణమాఫీ అందకపొతే అసెంబ్లీ ముట్టడే
డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి పెద్దేముల్: ప్రతి రైతుకు రుణమాఫీ అందకపొతే అసెంబ్లీని ముట్టడిస్తామని డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరేష్‌మహరాజ్ అన్నారు. పెద్దేముల్ ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అంటూ మోసం చేస్తుందన్నారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు మండలాలకు చెందిన రైతులకు సుమారు రూ.13 కోట్ల పంట రుణాలు రావలసి ఉందన్నారు. ఈ విషయమై తాండూరు నియోజక వర్గంలో పెద్దఎత్తున ధర్నా కూడా చేశామని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ అంటూ రైతులను నిలువునా మోసం చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేవలం పెద్దేముల్ మండలంలోని హన్మాపూర్, ఇందూరు, గార్మీపూర్‌తోపాటు పలు గ్రామాల్లో సుమారు 1,600 మంది రైతులకు రూ.9 కోట్లపై పంట రుణమాఫీ రావలసి ఉందని వారు తెలిపారు. రుణమాఫీ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయకపొతే కలెక్టర్‌తోపాటు అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో పెద్దేముల్ రైతు సేవాసహకార సంఘం చైర్మన్ ధారాసింగ్, కాంగ్రెస్ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గోన్నారు. -
దుబాయ్‌లో ఉన్నా పింఛను..!
గోపాలపురం : అర్హత ఉన్న వారు పింఛను అందుకోవాలంటే సవాలక్ష నిబంధనలు. వేలిముద్రలు మాసేవరకూ మిషన్‌పై నొక్కిస్తారు.. కాళ్లరిగేలా తిప్పిస్తారు.. నువ్వే ఆ మనిషివని గ్యారేంటి ఏంటంటూ ఆకార్డు ఈ కార్డులు చూపించమంటారు.. కానీ, ఒకామె దుబాయ్ వెళ్లిపోయి నాలుగు నెలలైనా ఆమెకు పింఛను ఆగలేదు. మనిషి ఇక్కడ లేకపోయినా ఆమె పేరిట మూడు నెలల పింఛను పంపిణీ చేసేశారు. ఎలా, అంటే.... మాత్రం తెల్లమొఖాలు. ఈ విచిత్ర ఘటన మండలంలోని వాదాలకుంట గ్రామంలో చోటు చేసుకుంది. మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2015-16కు సంబంధించి బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో బహిరంగ విచారణ చేపట్టారు. ఈ విచారణలో పై విషయం వెలుగుచూసి అంతా అవాక్కయ్యారు. దీంతో ఆ పింఛను సొమ్ము రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఇది ఇలా ఉండగా ఉపాధి నిధులు రూ.23, 237 దుర్వినియోగమైనట్టు ప్రిసైడింగ్ అధికారి అప్పారావు వెల్లడించారు. -
రుణం కోసం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం
కంగ్టి: కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేయడంలో అన్యాయం చేశారంటూ ఓ వ్యక్తి శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలి పారు. బోర్గి గ్రామానికి చెందిన ఎం.శ్రీకాంత్ కార్పొరేషన్ రుణం కోసం బ్యాంకు అధికారులు కాన్సెంట్ ఇచ్చినా తమకు రుణం మంజూరు చేయకుండా ఎంపీడీఓ మధుసూదన్ అడ్డుకోవడంతోపాటు లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాంత్ తన బావ, బోర్గి సర్పంచ్ శశికళ భర్త సంజీవ్‌తో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని తాళం వేశారు. దాదాపు గంటపాటు నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆందోళనకారులను సముదాయించారు. -
ఉపాధి హామీ కూలీల ఆందోళన
ఆదిలాబాద్(దండేపల్లి): దండేపల్లి మండలం రెబ్బనపల్లికి చెందిన ఉపాధి హామీ కూలీలు సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటేందుకు తీసిన గుంతలకు సంబంధించి కూలీ డబ్బులు చెల్లించాలని కూలీలు ధర్నాచేశారు. పనులు చేసి 3 నెలలైనా బకాయిలు ఇంకా చెల్లించలేదని ఉపాధి హామీ సిబ్బందిని నిలదీశారు. -
ఎంపీడీవో కార్యాలయం వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆస్పరి (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా ఆస్పరి గ్రామ పంచాయతీలో ఇంతకు ముందు ఎస్సీలకు కేటాయించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రస్తుతం ఇతరులకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే... ఆస్పరి మేజర్ పంచాయతీలోని షాపింగ్ కాంప్లెక్‌ను ఎస్సీలకు కేటాయించేవారు. కాగా ఈసారి ఎస్సీలకు కాకుండా ఇతరులకు కేటాయించడంతో ఆగ్రహించిన మహానంది అనే యువకుడు సోమవారం మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే అతణ్ణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. -
బీడీ కార్మికుల ఆందోళన
కోనరావుపేట (కరీంనగర్ జిల్లా) : తమ సమస్యలను తీర్చాలని కోరుతూ బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన సోమవారం కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో జరిగింది. ఈ ఆందోళనలో భాగంగా బీడీ కార్మికులు మండలంలోని పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. -
ఖానాపూర్ లో బీడీ కార్మికుల ధర్నా
ఆదిలాబాద్(ఖానాపూర్): జీవన భృతి చెల్లాంచాలని కోరుతూ బీడీ కార్మికులు శనివారం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం కార్మికులందరికీ భృతి చెల్లించాలని సీఐటీయూసీ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని దిగ్భందించి ఆందోళనకు దిగారు. -
ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీడీ కార్మికుల ధర్నా
నర్వా : మహబూబ్‌నగర్ జిల్లా నర్వా మండలం లంకాల గ్రామానికి చెందిన సుమారు 200 మంది బీడీ కార్మికులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. ఆసరా ద్వారా తమకు జీవనభృతి కల్పించాలని ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముందు బీడీలు చుట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి లంకాల బాబుమియా ఆధ్వర్యంలో వీరు ఈ ధర్నా నిర్వహించారు. నర్వా ఎంపీడీవో రాఘవ ఈ నెల 25వ తేదీన గ్రామానికి వచ్చి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
'నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు'
తిరుపతి రూరల్: ప్రజావిజ్ఞప్తుల దినం సందర్భంగా సోమవారం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుపతి రూరల్ ఎమ్పీడీవో కార్యాలయాన్నిఆకస్మికంగా సందర్శించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి ప్రజలు కార్యాలయానికి వస్తే అధికారులు గైర్హాజరు కావడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
పింఛన్ రాలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మహబూబ్‌నగర్ : పెన్షన్ రావట్లేదని మనస్థాపం చెందిన వికలాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బుధవారం జరిగింది. వివరాల్లోకెళ్తే.. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందిన మాదుగని రామకృష్ణ (38) రెండు సంవత్సరాల కిందట జరిగిన యాక్సిడెంట్లో తన కాళ్లు కోల్పోయాడు. అప్పటినుంచి బిజినేపల్లి లోని తన అత్తారింట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. రామకృష్ణ కాళ్లు పోగొట్టుకున్నప్పటి నుంచి ఆదుకోవాలని ప్రభుత్వానికి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నాడు. అయిన ఎలాంటి ప్రయోజనం కలగకపోవడంతో మనస్థాపం చెందిన ఆయన ఈ రోజు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతన్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా ఇతను గతంలో కూడా రెండు సార్లు సెల్‌ఫోన్ టవర్ ఎక్కి నిరసన తెలపడంతో పాటు, ఆత్మహత్యా యత్నాలు చేశాడు. రామకృష్ణకు భార్య పద్మతో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. (బిజినేపల్లి) -
జనన, మరణ నమోదులో జిల్లా వెనుకంజ
అద్దంకి: జనన మరణ నమోదు విషయంలో జిల్లా వెనుకబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ గుంటూరు కార్యాలయ డిప్యూటీ డైరక్టరు కే శివశంకర్‌బాబు అన్నారు. గుంటూరు జిల్లాలో జనన మరణనమోదు ప్రక్రియ 90 శాతం పూర్తైదని చెప్పారు. ఇక్కడ మాత్రం రెండేళ్లుగా ఆగిపోయిందని తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏడు మండలాల స్థాయి పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్ ఎంలు, మునిసిపల్ సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. 2013కు సంతమాగులూరు, అద్దంకి మండలాల లె క్కలు మాత్రమే అందాయని తెలిపారు. జనన, మరణ వివరాలు నమోదు చేసి ఆ రికార్డులను ఉన్నతాధికారులకు పంపకుంటే ఉపయోగం లేదని చెప్పారు. దీనివల్ల భారీ తేడాలు వస్తాయన్నారు. భారత ప్రభుత్వ జనన, మరణ చట్టం- 1970 ప్రకారం నెలలోగా ఉచితంగా ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలన్నారు. కుదరకుంటే శాశ్వత చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలని చెప్పారు. ఇవి విదేశాల్లోనూ చెల్లుబాటవుతాయని చెప్పారు. ఎలాంటి సెక్షన్ ప్రకారం మంజూరు చేశారో ఆ సెక్షన్‌ను ఉదహరిస్తూ నోటీసు ఇవ్వాలని చెప్పారు. కొన్ని సార్లు ధ్రువీకరణ పత్రంపై ఆధారపడి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి, ఉన్నత ఉద్యోగాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గుర్తు చేశారు. జనన , మరణ నమోదు ఫైలును ప్రతి నెలా ఐదో తేదీ లోగా సంబంధిత అధికారులకు పంపాలని సూచించారు. జీఓ నంబరు 161 ఉంది.. 2000 జనవరి ఒకటో తేదీకి ముందు జరిగిన జనన, మరణ నమోదు రిజిస్టరు కార్యాలయంలో నమోదై.. బిడ్డ పేరును 15 సంవత్సరాల వయసు వచ్చే లోపుగా నమోదు చేయించుకోని వారు.. తిరిగి నమోదు చేసుకొనేలా జీఓ నంబరు 161 ద్వారా అవకాశం కల్పించామని డీడీ శివశంకరు బాబు తెలిపారు. జిల్లా స్టాటిటికల్ అధికారి శ్రీధర్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో టీ వెంకటేశ్వర్లు, ఎంపీహెచ్‌ఈవో ఏ నాగేశ్వరరావు, అద్దంకి, పంగులూరు, సంతమాగులూరు, మార్టూరు, యద్దనపూడి, బల్లికురవ, కొరిశపాడు, జే పంగులూరు మండలాల సిబ్బంది పాల్గొన్నారు. -
పింఛన్ మంజూరు కాలేదని..మనస్తాపంతో వృద్ధుడి బలవన్మరణం
పెద్ద అడిశర్లపల్లి మండలం గుడిపల్లిలో ఘటన పింఛన్ కోసం ఆ వృద్ధ దంపతులు కాళ్లరిగేలా తిరిగారు.. కనిపిం చిన వారినల్లా ప్రాథేయపడ్డారు.. అయినా ఫలితం శూన్యం.. అధికారుల ఈసడింపులూ చవిచూశారు..అయినా ప్రయత్నం మానలేదు..గురువారం కూడా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ కనిపించిన వారందరినీ అడిగారు.. ఇక ఫలితం లేదనుకున్నాడో.. బతకడం వ్యర్ధమనుకున్నాడో.. తెలియదుకానీ ఇంటికెళ్లి ఉరిపోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.. -పెద్ద అడిశర్లపల్లి పింఛన్ మంజూరు కాలేదనే బెంగతో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్ద అడిశర్లపల్లి మండలం గుడిపల్లిలో శుక్రవారం వెలుగుచూసింది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పడాల పెద్దులమ్మ వికలాంగురాలు. వైకల్యం శాతం తక్కువగా ఉందన్న కారణంతో ఆసరా పింఛన్ ఇవ్వలేదు. ఆమె భర్త పడాల రాములు(70)కు కూడా పింఛన్ మంజూరు కాలేదు. ఇద్దరు దంపతులు పింఛన్ కోసం ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. గురువారం కార్యాలయానికి వచ్చిన రాములు కనిపించిన వారినల్లా పింఛన్ కొరకు ప్రాథేయపడ్డాడు.సరైన సమాధానం చెప్పేవారు లేకపోవడంతో సాయంత్రం గ్రామానికి చేరుకుని కనిపించిన వారితో తనకు పింఛన్ రాని విషయాన్ని ఆవేదనగా వెళ్లగక్కాడు. చీకటి పడుతుండగా ఇంటికి చేరుకుని తలుపునకు వస్త్రంతో ఉరేవేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతిచెందాడు. గురువారం రాములు ఎంపీడీఓ వి.సరస్వతిని కలిసి పింఛన్ గురించి అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని గుడిపల్లి ఎంపీటీసీ వి.చంద్రారెడ్డి ఆరోపించారు. ‘‘రాములుకు తక్కువ వయస్సు ఉండడంతోనే పింఛన్ మంజూరు కాలేదని, ఏ సంఘటన జరిగినా పింఛన్ కారణంగా చెప్పడం సరికాదని’’ ఎంపీడీఓ సరస్వతి అన్నారు. రాములు దరఖాస్తును పరిశీలిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని ఆమె పేర్కొన్నారు. -
అర్హులకు పింఛన్లు ఇవ్వాలె..
తానూర్: ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలంలో అర్హులకు పింఛన్లు ఇవ్వాలని మండల ఎంపీడీఓ క్రాంతిని ఎల్వీ గ్రామస్తులు నిలదీశారు. మండలాధికారి దిష్టిబొమ్మను కూడా రోడ్డుపై దహనం చేశారు. పింఛన్లు ఇచ్చేదాకా అక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తమకు పింఛన్లు రావటం లేదని మొరపెట్టుకున్నారు. ఇప్పటికైనా అధికారులు అర్హులకు పింఛన్లు వచ్చే విధంగా చూడాలని కోరారు. అర్హులకు తప్పనిసరిగా పింఛన్లు ఇస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. -
ఆ వృద్ధుడు ఇప్పుడు చనిపోయాడు!
తుని: బతికుండగానే ఆ వృద్ధుడిని అధికారులు కాగితాలపై చంపేశారు. ఫలితంగా అప్పటివరకూ ప్రతి నెలా అందుతున్న రూ.200 వృద్ధాప్య పింఛను నిలిచిపోయింది. దీనిపై బెంగటిల్లిన ఆ వృద్ధుడు.. తాను బతికే ఉన్నానంటూ పింఛను కోసం ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ మూడు నెలలుగా కాళ్లరిగేలా తిరిగాడు. చివరకు పెంచిన పింఛను అందకుండానే అతడి గుండె ఆగిపోయింది. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం డి.పోలవరానికి చెందిన తోట సూర్యనారాయణ(69) అనే వృద్ధుడి విషాదాంతమిది. ఆయనకు చాలాకాలంగా రూ.200 వృద్ధాప్య పింఛను వస్తోంది. బాబు సీఎం అయ్యాక, వృద్ధాప్య పింఛనును రూ.1000 చేస్తామని ప్రకటించడం తెలిసిందే. పింఛను అర్హతలను నిర్ణయించేందుకు వేసిన కమిటీ, సూర్యనారాయణ చనిపోయినట్టు నివేదిక ఇచ్చింది. దాంతో అప్పటిదాకా వస్తున్న రూ.200 పింఛను కూడా ఆగింది. తాను బతికే ఉన్నానని ఆయన అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఆ బెంగతోనే ఆయన మంగళవారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
నర్సరీలను చంటి పిల్లల్లా కాపాడాలి
డ్వామా పీడీ ఎన్.సునందారాణి అడ్డాకుల: హరితహారం కోసం మొక్కలు పెంచే నర్సరీలను ఉపాధిహామీ ఏపీఓలు, వనకాపరులు చంటి పిల్లల్లా కాపాడాలని డ్వామా పీడీ ఎన్.సునందరాణి సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున మొక్కల పెంపకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. స్థానిక ఎంపీడీఓ కా ర్యాలయంలో శుక్రవారం ఆమె ఉపాధి సిబ్బం దితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 160 నర్సరీలను ఏర్పాటుచేసి 1.60కోట్ల మొక్కలను పెంచడ మే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలి పారు. ఇందుకోసం ఇప్పటివరకు 145 నర్సరీలకు అనుమతి లభించిందని, మరో 15 నర్సరీలకు మంజూరు రావాల్సి ఉందన్నారు. జిల్లాకు నిర్ధేశించిన లక్ష్యాన్ని జనవరి 15 నాటికి పూర్తిచేయాలని సూచించారు. నర్సరీల్లో మొక్కలు చనిపోతే ఉపాధి అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. నర్సరీలకు వచ్చే కూలీలకు సకాలంలో డబ్బులు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘సాక్షి’ కథనానికి స్పందన ‘సాక్షి’లో శుక్రవారం వచ్చిన ‘మరుగున పడుతున్న బిల్లులు’ అనే శీర్షికన వచ్చిన కథనంపై ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమీక్షలో డ్వామా పీడీ సునందరాణి సమీక్షించారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం నాబార్డు నుంచి రావాల్సిన వాటా నిధులు ఆలస్యమవడంతోనే బిల్లుల చెల్లింపులో ఆలస్యమైందన్నారు. నిధులు వచ్చినందున వెంటనే బిల్లులు చెల్లించాలని ఏపీఓ గట్టయ్యను ఆదేశించారు. -
‘ఆసరా’పై మళ్లీ సర్వే చేయాలి
యాచారం:ఆసరాకు సంబంధించి మళ్లీ రీసర్వే చేసి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తు బుధవారం చింతుల్ల గ్రామస్తులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామంలో అర్హులైన లబ్ధిదారులు 500 మంది వరకు ఉండగా ప్రస్తుతం కేవలం 279 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు అయ్యాయన్నారు. పింఛన్లు కోల్పోయి అనేక మంది పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో 50 మందికి పైగా లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.అంజయ్య, సీఐటీయూ మండల కార్యదర్శి బ్రహ్మయ్య మాట్లాడుతూ... గ్రామంలో రీ సర్వే చేసి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని అన్నారు. ఎంపీపీ రమావత్ జ్యోతి నాయక్ లబ్ధిదారుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. మళ్లీ రీ సర్వే చేయించి అర్వులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఎంపీడీఓ ఉష దృష్టికి ఎంపీపీ తీసుకెళ్లారు. దీంతో శాంతించిన వారు ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో చింతుల్ల సీపీఎం నాయకులు విజయ కుమార్, నర్సింహ, వెంటకయ్య తదితరులు పాల్గొన్నారు. పింఛన్ల కోసం ఆందోళన పెద్దేముల్: పింఛన్ల పంచాయతీ ఆగడం లేదు. రోజూ ఏదో గ్రామం నుంచి తమకు పింఛన్ రావడం లేదంటూ ప్రజలు కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. బుధవారం మండల పరిధిలోని బుద్దారం, పెద్దేముల్ తదితర గ్రామాలకు చెందిన పలువరు వృద్ధులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి బైఠాయించారు. మూడు రోజుల నుంచి తిరుగుతున్నా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామంటూ ఈఓపీఆర్డీ సుహాసిని, పంచాయతీ కార్యదర్శులు విశ్వనాథం, అమృతలతో వాగ్వాదానికి దిగారు. అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చూస్తామంటూ అధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి వెనుదిరిగారు. -
వేలి ముద్రల పెన్షన్ మాకొద్దు
కోడుమూరు : వేలి ముద్రలు తీసుకోక.. పెన్షన్ అందక రోజుల తరబడి ఆఫీసుల దగ్గర కూర్చోని విసుగుచెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సోమవారం ఎంపీడీవో కార్యాలయాన్ని చుట్టూ ముట్టారు. ఆగ్రహంతో ఒక్కసారిగా కార్యాలయంలోకి చొరబడ్డారు.పెన్షన్‌దారులకు మద్దతుగా సీపీఐ మండల కార్యదర్శి క్రిష్ణ, ఏఐఎస్ఎఫ్ నేతలు శ్రీరాములుగౌడ్, శివశంకర్, వైఎస్సార్సీపీ నేతలు ఎల్లప్ప, బీమలింగన్న గౌడ్, రామకృష్ణారెడ్డి వచ్చి అధికారులను బయటకు పంపి కార్యాలయానికి తాళం వేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దాదాపు నాలుగు గంటల సేపు ధర్నా చేస్తూ అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నాళ్లు ఈ అవస్థలు పెడతారు తిండి నీళ్లు మానుకొని తిరుగుతున్నా కనికరంలేదా.. రోజుకో నిబంధన పెట్టి చంపుతారా.. ఈ వయసులో మాకిన్ని కష్టాలు పెడతారా అని వృద్ధులు అధికారులపై నిప్పులు చెరిగారు. వేలిముద్రలతో తీసుకునే పెన్షన్ మాకొద్దు పాత పద్ధతిలోనే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేలిముద్రలు తీసుకోవడం లేదని పెన్షన్లను తీసేస్తారా అంటూ పెన్షన్‌దారులు ప్రశ్నించారు. వందలాది మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రోడ్డుమీద కూర్చొని ఆందోళన చేశారు. ముసలి వయసులో వేళ్లు అరిగిపోయి, ముద్రలు తీసుకోవడం లేదు. దీనికి మేం బలి కావాలా అని వృద్ధులు ఎంపీడీవో సువర్ణలతను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పెన్షన్‌దారులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేవిధంగా చూస్తానని హమీ ఇచ్చారు. వేలిముద్రలు తీసుకోక పెన్షన్ల్ రానివారందరూ ఆఫీస్ దగ్గరకు రావాల్సిన అవసరంలేదు. ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ అయిపోయిన తర్వాత మిగతా వారికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. సీఐ జోక్యంతో సద్దుమణిగిన సమస్య పెన్షన్‌దారుల ఉద్యమం ఉధృతంగా మారడంతో సీఐ డేగల ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని పెన్షన్‌దారులతో మాట్లాడారు. సమస్య ఎక్కడ ఉందో ఆ కార్యాలయం దగ్గర ఆందోళన చేయండి. రోడ్డుపై కూర్చొని ఆందోళన చే పట్టడం సరైనా చర్య కాదు. మీకు న్యాయం జరిగే వరకు సహకరిస్తానని హమీ ఇచ్చి ఆందోళనను విరమింపచేశారు. అనంతరం పెన్షన్ పంపిణీ దారులు, ఎంపీడీవో సువర్ణలత, ప్రత్యేకాధికారి సుధాక ర్తో చర్చించి పెన్షన్‌దారులకు న్యాయం జరిగే విధంగా అధికారులతో హామీ ఇప్పించారు. నిలిచిపోయిన పెన్షన్ల పంపిణీ సెంటర్లో సర్వర్ డౌన్ కావడంతో పెన్షన్ల పంపిణీ నిలిచిపోయింది. మధ్యాహ్నం వరకు 10 పెన్షన్లు కూడా పంపిణీ కాలేదు. దీంతో మహిళలు ఆగ్రహం చెంది ఆందోళన చేపట్టారు. -
అమ్మమ్మ తోడుగా..
తిమ్మాపూర్ : ఎంపీడీవో కార్యాలయం సమీపంలో మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన బారె చంద్రమణికి ఎల్ఎండీ రిజర్వాయర్ శివారులోనే అంత్యక్రియలు నిర్వహించారు. తమ ఆర్థిక స్థితి బాగాలేనందున, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లలేమని కుటుంబసభ్యులు చెప్పడంతో వారి సమక్షంలో రామకృష్ణకాలనీ సర్పంచ్ సారయ్య, గ్రామస్తుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. రెండు రోజులపాటు గ్రామస్తుల సంరక్షణలోనే ఉన్న పిల్లలు అమ్మమ్మ చెంతకు చేరారు. కొంతకాలంగా రామకృష్ణకాలనీలో ఉంటున్న బారె చంద్రమణి, పొరండ్లకు చెందిన నీలం భాస్కర్ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి చంద్రమణి మరణించిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచి ఆమె తల్లిగారి ఊరైన కాటారం మండలం దామెరకుంటకు పోలీ సులు సమాచారంమందించారు. చంద్రమణికి ఏడేళ్లలోపు కుమార్తె, కుమారుడు ఉండగా రామకృష్ణాకాలనీ గ్రామస్తులే ఆలనాపాలనా చూశారు. మృతురా లి తల్లి మధునమ్మ, కుటుంబసభ్యులు బుధవారం రాత్రి కరీంనగర్ చేరుకోగా ఆమె ఫిర్యాదు మేరకు గురువారం ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని దామెరకుంటకు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. తమ ఆర్థికస్థితి బాగాలేదని చెప్పడంతో రామకృష్ణాకాలనీ సర్పంచ్ కిన్నెర సారయ్యతోపాటు గ్రామస్తులు కలి సి ఎల్ఎండీ శివారు లో ఖననం చేశారు. అప్పటి దాకా గ్రామస్తుల సంరక్షణలోనే ఉన్న మృతురాలి పిల్లలు మనోహర్(5), రమ్య(7)ను అంత్యక్రియల సమయంలో అక్కడికి తీసుకురాగా అమ్మమ్మను, మామయ్యను చూసి పిల్లలు విలపించారు. పిల్లల పరిస్థితి చూసి కుటుంబసభ్యులు, గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. అంత్యక్రియల అనంతరం పిల్లలిద్దరూ అమ్మమ్మతో వెళ్లిపోయారు. జీవితంపై విరక్తిచెంది... భాస్కర్ ఇంట్లో గొడవల కారణంగా అతనితోపాటు తన కూతురు చంద్రమణి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మధునమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంద్రమణికి 2007 లో పోచమల్లుతో వివాహం కాగా ఇద్దరు పిల్లలు జన్మించారు. గొడవల కారణంగా నాలుగేళ్ల క్రితం భార్యాభర్తలు విడిపోయారు. అప్పటినుంచి పిల్లలిద్దరినీ చంద్రమణి తీసుకుని పొరండ్లకు వచ్చి కూలీ పని చేసుకుంటోందని ఫిర్యాదులో పేర్కొంది. పొరండ్లకే చెందిన నీలం భాస్కర్‌తో కలిసి రెండేళ్ల నుంచి రామకృష్ణకాలనీలో ఉంటోందని, ఇదే సమయంలో భాస్కర్ ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు తెలియడంతో జీవితంపై విరక్తి ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని, తన కూతురు చికిత్స పొందుతూ మరణించిందని మధునమ్మ తన ఫిర్యాదులో పేర్కొంది. -
‘ఆసరా’ ఆగమాగం
సాక్షి, ఖమ్మం: జిల్లాలో పింఛన్ల (ఆసరా) పంపిణీ తొలిరోజు ఆందోళనలు మిన్నంటాయి. అర్హులైన తమ పేర్లు జాబితాలో లేవని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకొని నిరసన తెలిపారు. బుధవారం ఖమ్మంరూరల్ మండలం పెద్దతండాలో కలెక్టర్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ కూడా లబ్ధిదారులు జాబితాలో తమ పేర్లు లేవని ఆయనకు మొర పెట్టుకున్నారు. గతంలో జాబితాలో పేరుండి పింఛన్ అందుకున్న వేలాది మంది లబ్ధిదారుల ఆశలు అడియాశలయ్యాయి. వారనుకున్నట్టే జరిగింది. రెండు నెలలుగా పింఛన్ జాబితాలో తమపేరు ఉంటుందో.. లేదోనని ఎదురుచూశారు. చివరకు జాబితాలో పేర్లు లేకపోవడంతో ఆందోళనతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కూసుమంచి మండలం గంగబండ తండాకు చెందిన 50 మంది లబ్ధిదారులు తమ పేర్లు జాబితాలో లేవని మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేశారు. అర్హులకు పింఛన్లు రాలేదని తిరుమలాయపాలెం మండలం కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో వరంగల్- ఖమ్మం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెద్దతండాలో కలెక్టర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కాగా కొంతమంది లబ్ధిదారులు తమకు పింఛన్ రాలేదని మొరపెట్టుకున్నారు. పునర్విచారణ చేసి అర్హులైన వారిని గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాబితా తారుమారు.. రఘునాథపాలెం మండలంలో అసరా పథకం గందరగోళంగా మారింది. మండలంలోని కొన్ని గ్రామ పంచాయతీలకు చెందిన ఆసరా లబ్ధిదారులు తమ పంచాయతీ జాబితాకు బదులు పక్క పంచాయతీల్లో నమోదు అయ్యాయి. ఇలా చింతగుర్తి, మల్లేపల్లి, కోయచెలక, రేగులచెలక పంచాయతీల పరిధిలో ఇలాంటి అస్తవ్యస్తతే నెలకొంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో అర్హులకు ఫించన్ మంజూరు కాలేదని మున్సిపల్ కౌన్సిలర్లు ఆందోళన నిర్వహించారు. 17, 18 వార్డుల కౌన్సిలర్లు దుంపల అనురాధ, దుంపల సరోజలు అర్హులకు ఫించన్లు మంజూరు చేయని పక్షంలో తమ పదవులకు రాజీనామా చేస్తామని కమిషనర్‌ను హెచ్చరించారు. పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల పంచాయతీ కేంద్రాల వద్దకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు చేరుకున్నారు. కార్యాలయం తెరవకముందే వారు వ్యయప్రయాసలతో అక్కడకు చేరుకున్నారు. కార్యాలయాలకు వచ్చిన అధికారినల్లా ‘నా పింఛన్ వచ్చిందా? సారూ..’ అని ప్రశ్నించారు. ‘ఇంకా రాలేదు.. ఇప్పుడే ఎందుకు వచ్చారంటూ’ అధికారుల చీదరింపులతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సత్తుపల్లి నియోజకవర్గంలో పింఛన్ల జాబితా సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పింఛన్లు అందని అర్హులతో వేంసూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కొణిజర్ల మండలంలో పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడంతో వారంతా తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. చిన్నగోపతికి చెందిన 60 మంది అర్హులకు పించన్లు రాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమే ఇప్పించాం.. ఖమ్మం నగరంతో పాటు కొత్తగూడెం, సత్తుపల్లి పట్టణాల్లో పింఛన్ జాబితాలు ప్రకటించడంతో ‘మీమే మీకు పింఛన్ ఇప్పిస్తున్నామని’ చోటామోటా నాయకులు గల్లీలో ప్రచారం చేశారు. పలువురు అర్హులు తమపేర్లు జాబితాలో ఎందుకు లేవని వారిని నిలదీయడంతో వారికి సమాధానం చెప్పలేక జారుకున్నారు. ఖమ్మం నగరంలో పంపింగ్ వెల్ రోడ్డు, గాంధీచౌక్, రాపర్తినగర్, ఇందిరాగనర్ ప్రాంతాల్లో ఇలా అర్హులు నేతలను నిలదీశారు. దరఖాస్తు సమయంలో రాజకీయం చేసిన పార్టీలు ఇప్పుడు అర్హులు తమకు పింఛన్ రాలేదని నిలదీస్తుండడంతో మొఖం చాటేస్తుండడం గమనార్హం. ఇక కొన్ని మండలాల్లో ఇంకా పింఛన్ జాబితాలు విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. -
ఆంధ్రా అధికారుల అడ్డగింత
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాల్లో ఉద్యోగుల వివరాలు సేకరించేందుకు బుధవారం భద్రాచలం వచ్చిన తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారులను ఇక్కడి ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విలీన మండలాల్లో పాలనపై పట్టుసాధించేందుకు ఉద్యోగుల వివరాలు సేకరించాలనే ఏపీ ప్రభుత్వ ఆదేశం మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఆయా మండలాల్లోని ఉద్యోగుల జీతభత్యాల వివరాలు పంపించాలని డీడీవోలకు సూచించారు. ఈ క్రమంలో నెల్లిపాక మండల ఉపాధ్యాయుల వివరాల సేకరణకు అక్కడి అధికారులు వచ్చారు. విషయం తెలుసుకున్న ముంపు ఉద్యోగ సంఘ నాయకులు అక్కడికి చేరుకొని ఆంధ్ర అధికారులను అడ్డుకున్నారు. ఉద్యోగుల ఆప్షన్ల విషయం తేల్చకుండా వివరాల సేకరణకు ఎలా వస్తారని వారితో వాగ్వాదానికి దిగారు. ఆప్షన్ల మేరకు విలీన మండలాల్లో ఉన్న ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని, ఆ తరువాతనే ఆంధ్ర అధికారులు ముంపు మండలాల్లో పర్యటించాలని కొద్దిసేపు ఘెరావ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన సద్దుమణిగేలా చూశారు. కాగా, ఉద్యోగుల నిరసనల మధ్య వివరాలు సేకరించకుండానే అధికారులు వెనుదిరిగారు. -
ప్రభుత్వ భూమిలో ‘ప్రైవేటు' పట్టా
ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. సర్కారు స్థలమైతే ఏకంగా పట్టాలనే సృష్టిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు రోజుకో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. వీటిని తలదన్నే రీతిలో తాజాగా సోమవారం మంథనిలో ఓ భూబాగోతం బయటపడింది. ఖాళీ స్థలంతో పాటు ఆర్డీవో వసతిగృహం, రెండు ప్రభుత్వ కార్యాలయాలున్న స్థలాన్ని పట్టా, రిజిస్ట్రేషన్ చేసుకుని దానిని మరో ముగ్గురికి అమ్మినట్టు రిజిస్ట్రేయడంతో పాటు దానిని ఆన్లైన్లో నమోదు చేసిన తీరు అధికారులనే నివ్వెరపర్చింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు కూపీ లాగుతున్నారు. మంథని : మంథని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట 108 సర్వే నంబరులో 36 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో సుమారు 18 గుంటల్లో ఆర్డీవో వసతిగృహం, మరో రెండు కార్యాలయాల పక్కా భవనాలు నిర్మించారు. మిగిలిన 18 గుంటల్లో నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘానికి కేటాయించారు. ఈ సంఘానికి కేటాయించిన భూమిలో ఇటీవల ప్లాట్లు చేస్తుండడంతో అనుమానం వచ్చిన ఉద్యోగులు సంబంధిత అధికారులను సంప్రదించారు. అధికారులు దీనిపై ఆరా తీయగా.. ఈ 36 గుంటల భూమి ముస్కె రాజు అనే వ్యక్తి పేరిట పట్టా అయిన విషయం బయటపడింది. సదరు పాసు పుస్తకాలు ఆన్‌లైన్‌లోనూ నమోదయ్యాయి. మరింత లోతుగా ఆరా తీస్తే.. ఈ భూమిని మరో ముగ్గురికి విక్రయించడంతో పాటు వారి పేరిట రిజిస్ట్రేషన్ అయిన విషయం వెలుగుచూసింది. ఈ ప్రాంతంలో గుంట స్థలానికి రూ.6-8 లక్షల ధర పలుకుతోంది. అంటే ఈ భూమి విలువ సుమారు 3కోట్లు. ఎలా జరిగింది..? ఫోర్జరీ సంతకాలతో పాసుపుస్తకాలను సృష్టించడం ఈ మధ్యకాలంలో పెద్ద కష్టమేమీ కాకపోయినా ఆన్లైన్ నమోదు మాత్రం అంత ఆషామాషీ కాదు. రైతు తన పేరును ఆన్లైన్లో నమోదు చేయాలని తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే.. వీఆర్వో ధ్రువీకరించిన అనంతరం తహశీల్దార్ తన డిజిటల్ సంతకం ద్వారా నమోదు చేస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా గతంలో తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్లు మంథని ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఈ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది. విచారణ వేగవంతం ప్రభుత్వ స్థలం ఓ ప్రైవేటు వ్యక్తి పేరిట పట్టా, రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. సబ్‌రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందో వివరాలు సేకరించి అక్కడ సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరి పాత్ర ఉందనే కోణంలో అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ప్రభుత్వ వెబ్సైట్లో అక్రమంగా పాస్‌బుక్‌లు నమోదు చేయడాన్ని సైబర్ నేరంగా భావించి ఆ దిశగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే పట్టా, రిజిస్ట్రేషన్ రద్దు చేయించి సదరు బాధ్యులపై చర్యలకు కఠిన చర్యలకు సిద్ధమైనట్టు తెలిసింది. పాస్‌బుక్ ఆధారంగానే రిజిస్ట్రేషన్ పట్టాదారు పాస్‌బుక్, ఆన్లైన్ నమోదు రికార్డుల ఆధారంగానే మేం రిజిస్ట్రేషన్ చేశాం. భూమి వివరణలో పట్టా ఉండడమే కాకుండా పట్టాదారు, అనుభవదారు ఖాతాలో యజమాని పేరు నమోదైంది. అన్ని ఆధారాలున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయకపోతే తమను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇందులో మాత తప్పేమీ లేదు. - మురళీకృష్ణ, సబ్ రిస్ట్రార్, మంథని పూర్తిగా ప్రభుత్వ భూమే.. మంథని ఎంపీడీవో కార్యాలయం ఎదుట 108 సర్వే నంబర్లో ఉన్న 36 గుంటల భూమి ప్రభుత్వానిదే. ఈ భూమి అక్రమంగా పట్టా కావడం అయి, పాస్‌బుక్ జారీ కావడం, ఆన్‌లోన్‌లో నమోదవడం, రిజిస్ట్రేషన్ చేయడంపై వివచాణ జరుపుతున్నాం. దీనికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం. - జల్ల సత్తయ్య, తహశీల్దార్, మంథని -
ఇదేమి న్యాయం..!
గాలివీడు: మాకు సెంటు భూమి కూడా లేదు.. ఐదెకరాలు ఉందని పింఛన్ రద్దు చేశారు.. ఇదేమి న్యాయం.. అధికారులు అక్రమాలకు పాల్పడి మా పింఛన్లను తీసివేశారు. అంటూ పింఛనర్లు శనివారం ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా ఎంపీడీఓను కార్యాలయంలోనే నిర్బంధించి తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న లక్కిరెడ్డిపల్లె సీఐ వినయ్‌కుమార్‌రెడ్డి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పినా వినిపించు కోలేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంపీడీఓ కార్యాలయానికి వేసిన తాళం తీయలేదు. ఎంపీడీఓ మినహా మిగిలిన అధికారులు కార్యాలయం బయటనే జన్మభూమి కార్యక్రమానికి వెళ్లడం కోసం వేచి ఉన్నారు. వీరు వ్యాన్లు, సుమోలలో వెళుతుండగా వారి వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. మళ్లీ రీ వెరిఫికేషన్ చేసి 10లోగా సమస్యను పరిష్కరిస్తామని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
మహిళా సంఘాల పనితీరు భేష్
- విదేశీ ప్రతినిధుల కితాబు - జిల్లా అధికారులతో కలిసి వెల్టూర్ గ్రామ సందర్శన సదాశివపేట: వివిధ దేశాల ప్రతినిధులతో పాటు సెర్ప్, డీఆర్డీఏ, ఐకేపీ జిల్లా అధికారులు గురువారం మండల పరిధిలోని వెల్టూర్ గ్రామాన్ని సందర్శించారు. స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరును పరిశీలించిన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని పలు సంఘాల సభ్యులతో మాట్లాడి సంఘం రికార్డులు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో 54 సంఘాలు ఉన్నాయని, ప్రతి సంఘం ఆర్థికాభివృద్ధికి బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లింపుల వివరాలను స్థానిక సిబ్బంది, సమాఖ్య లీడర్లు వీరికి వివరించారు. బ్యాంకుల ద్వార 47 సంఘాలకుగాను రూ.1,78,5500 బ్యాంకు రుణాలతోపాటు, శ్రీనిధి బ్యాంకు ద్వారా 29 స్వయం సంఘాల గ్రూపుల్లోని 135 మందికి రూ.15,65,440 బ్యాంకు రుణాలు ఇచ్చారని తెలిపారు. వీటితో తాము పాడిగేదెలు, మేకలు, గొర్రెల పెంపకం, కూరగాయలను పండించడం, అమ్మడం, కిరాణ దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం తదితరాలకు వినియోగించామన్నారు. అనంతరం ఎంపీపీ కార్యాలయం ఆవరణలో ఐకేపీ మండల సమాఖ్య సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అస్ట్రేలియా నుంచి స్నేహాల్‌సోహేల్, ఇరాన్ ప్రతినిధి ఫతేమహ అబ్కారి, కేన్యా నుంచి వెన్నా మొకారి ఓంవారి, మాడగాస్కర్ నుంచి రకోటమాలాల మిరియా రబియారిసో, షేశేల్లీస్ నుంచి బెట్టి మరియాసోపా, టంజానియా నుంచి ప్రోన్సికో ఎలాయాస్, తైలాండ్ నుంచి డమరోగో జయంతోలతో పాటు రాషఫకేశ్వర్‌లతో మండల ఐకేపీ ఎపీఎం వెంకట్ పాల్గొన్నారు. -
స్థానికంగానే ఉండాలి
మెదక్ రూరల్: వసతి గృహాల వార్డెన్లంతా స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు విద్యార్థుల బాగోగులు చూడాలని మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గంలోని వసతి గృహాల వార్డెన్లు, అధికారులతో సలహాసంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, కస్తూర్బా, మోడల్ స్కూళ్లతో పోల్చుకుంటే వసతిగృహాల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావటం లేదన్నారు. సరైన పర్యవేక్షణ, మెరుగైన బోధన, నాణ్యమైన భోజనం అందించిన రోజునే వసతి గృహాల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందన్నారు. వసతిగృహాల్లో చేరే వారంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, వారికి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన బాధ్యత వార్డెన్లపైనే ఉందన్నారు. అందువల్ల వార్డెన్లంతా స్థానికంగా ఉంటూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రానున్న రోజుల్లో తాను కూడా వసతిగృహాల్లో రాత్రిబస చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా వసతిగృహాలను సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులుంటేనే..వసతి గృహాల మనుగడ తగిన సంఖ్యలో విద్యార్థులుంటేనే వసతి గృహాల మనుగడ సాగిస్తాయన్న సత్యాన్ని వార్డెన్లంతా గుర్తించాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బీసీ వసతిగృహాల్లో విద్యార్థులు చేరకపోవడంతో సీట్లు ఖాళీగా ఉన్నాయని మెదక్ బీసీడబ్ల్యూఓ రాంరెడ్డి డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకురాగా, ఆమె పై విధంగా స్పందించారు. వసతి గృహాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మెనూ ప్రకారం భోజనం పెడితే విద్యార్థులు ఎందుకు రారని ఆమె ప్రశ్నించారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా సమష్టిగా కృషి చేసి వసతి గృహాల్లోని సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు నియోజకవర్గంలోని వసతి గృహాల్లోని సమస్యలను ఆయా మండలాల వసతి గృహాల అధికారులు డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆమె పురాతన భవనాల మరమ్మత్తులకోసం నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. అలాగే అవసరమైన చోట నూతన భవనాలను నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్‌లతో పాటు నియోజకవర్గంలోని మెదక్, పాపన్నపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట జెడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు నాలుగు మండలాల వసతిగృహ అధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దారులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు వసతిగృహ అధికారులు డిప్యూటీ స్పీకర్‌కు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా..
పత్తికొండ అర్బన్: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. అంతరిక్షంలోకి వెళ్లొస్తున్నా.. ఇప్పటికీ పలువురు పతుల చాటునే మిగిలిపోతున్నారు. ప్రజాతీర్పును గౌరవించాల్సిన భర్తలు.. వారిని వంటింటికే పరిమితం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పటికీ పలువురు మహిళా నేతల స్థానంలో భర్తలు పెత్తనం చెలాయిస్తుండటంతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పరిపాలనపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లకు అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి అధిక శాతం మహిళా సర్పంచ్ల స్థానంలో భర్తలు, కుటుంబ సభ్యులు హాజరు కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. కోతిరాళ్ల శిరీష, హోసూరు వాకిట శారద, మండగిరి రసూల్‌బీ, పులికొండ రంగమ్మ, చిన్నహుల్తి హుల్తెమ్మ స్థానంలో వారి సంబంధీకులు హాజరయ్యారు. మహిళలు వంటింటి పరిమితమనే భావన ఎప్పటికి తొలగిపోతుందో.. వారిలో చైతన్యం ఎప్పుడొస్తుందో.. వేచి చూడాల్సిందే. -
కొవ్వూరు ‘సాక్షి’ విలేకరిపై ఎమ్మెల్యే రామారావు దాడి
ఏలూరు, న్యూస్‌లైన్ : కొవ్వూరు మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ వివరాలు సేకరించేందుకు సోమవారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన సాక్షి విలేకరి జీవీవీ సత్యనారాయణపై ఎమ్మెల్యే టీవీ రామారావు దాడిచేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఆరికిరేవుల ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకునేందుకు అంగీకరించారని స్థానిక నాయకులు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువచ్చారు. నిర్ధేశిత గడువు ముగిసినందున నామినేషన్ల ఉపసంహరణకు అనుమతించే అవకాశం లేదని ఎన్నికల అధికారి యు.వసంత్‌కుమార్ నాయకులతో స్పష్టం చేశారు. ఇదిలావుండగా సాయంత్రం 6 గంటల సమయంలో ఎమ్మెల్యే టీవీ రామారావు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ల ఉప సంహరణకు అనుమతించాలని ఎన్నికల అధికారిని కోరారు. ఆ సమయంలో ఎంపీడీవో పి.వసంతమాధురి నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం లేదని చెప్పిన తరువాత కూడా ఏకగ్రీవం చేసుకుంటామని అడగడం సరికాదని ఎమ్మెల్యేకు సూచించారు. ఈ అంశంపై ఏమీ మాట్లాడనవసరం లేదని దయచేసి మా పనులకు ఇబ్బంది కలిగించవద్దని ఎమ్మెల్యేను ఎంపీడీవో కోరారు. ఎన్నికల అధికారిని రహస్యంగా మాట్లాడి ఒప్పించే ప్రయత్నంలో భాగంగా మీతో మాట్లాడాలి పక్క గదిలోకి రమ్మని ఎమ్మెల్యే ఎన్నికల అధికారిని కోరి బయటకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో బయటకు వచ్చిన ఎన్నికల అధికారిని ఫొటో తీసేందుకు సాక్షి విలేకరి ప్రయత్నిస్తుండగా ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే రామారావు విలేకరిపై దాడికి పాల్పడ్డారు. మా పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఫొటోలు తీస్తావా అంటూ దుర్భాషలాడి పిడిగుద్దులు గుద్దారు. నిన్ను, నీ పేపర్‌ను పెట్రోల్ పోసి తగలబెడతానంటూ ఆగ్రహంతో చిందులు వేశారు. తరచూ తనపై వ్యతిరేక వార్తలు రాస్తున్నారంటూ దుర్భాషలాడుతూ రాయడానికి వీల్లేని బూతులను ప్రయోగించారు. కేకలు వేస్తున్న ఎమ్మెల్యేను ఎంపీడీవో, ఎన్నికల అధికారి దయచేసి బయటకు వెళ్లాలని కోరారు. ఎమ్మెల్యేను బయటకు పంపి కార్యాలయం బయట ద్వారం తలుపులు మూసివేశారు. ఆ సమయంలో కోపోద్రేకుడైన ఎమ్మెల్యే నా కొడకా బయటకు రారా నిన్ను చంపేస్తానంటూ సాక్షి విలేకరిపై చిందులు వేశారు. అనంతరం వెనుక గుమ్మం వద్ద నిలబడి ఫోన్ మాట్లాడుతున్న సాక్షి విలేకరి వద్దకు వచ్చి బయటకు రా నా కొడకా చంపుతానంటూ కేకలు వేశారు. దీంతో భయం వేసిన విలేకరి కార్యాలయంలోకి పరుగు పెట్టారు. భయంతో తనపై జరిగిన దాడి విషయాన్ని ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ సీఐ ఎన్.చిరంజీవి సిబ్బందితో ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సుమారు గంట పాటు తలదాచుకున్న సాక్షి విలేకరిని పోలీసులు బయటకు తీసుకువచ్చారు. అధికారుల సమక్షంలోనే ప్రభుత్వ కార్యాలయంలో ఎమ్మెల్యే రామారావు ఓ ప్రత్రిక విలేకరిపై విచక్షణ కోల్పోయి దాడికి తెగబడడంతో అక్కడున్న కార్యాలయ సిబ్బంది, అధికారులు, పలువురు నాయకులు నిర్ఘాంతపోయారు. దీనిపై విలేకరి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవ్వూరు ప్రెస్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా) ప్రతినిధులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని విలేకరిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే రామారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘ అధ్యక్షుడు దుద్దుపూడి రామచంద్రరావు (రాము), ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. విలేకరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే టీవీ రామారావుపై 341, 323, 506 క్లాజ్-2 కింద కేసులు నమోదు చేసినట్టు సీఐ ఎన్.చిరంజీవి తెలిపారు.