పింఛన్ రాలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం | man sucide attempt at mpdo office in mahabubnagar | Sakshi
Sakshi News home page

పింఛన్ రాలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published Wed, Mar 25 2015 2:40 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

man sucide attempt at mpdo office in mahabubnagar

మహబూబ్‌నగర్ : పెన్షన్ రావట్లేదని మనస్థాపం చెందిన వికలాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బుధవారం జరిగింది. వివరాల్లోకెళ్తే.. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందిన మాదుగని రామకృష్ణ (38) రెండు సంవత్సరాల కిందట జరిగిన యాక్సిడెంట్‌లో తన కాళ్లు కోల్పోయాడు. అప్పటినుంచి బిజినేపల్లి లోని తన అత్తారింట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. రామకృష్ణ కాళ్లు పోగొట్టుకున్నప్పటి నుంచి ఆదుకోవాలని ప్రభుత్వానికి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నాడు. అయిన ఎలాంటి ప్రయోజనం కలగకపోవడంతో మనస్థాపం చెందిన ఆయన ఈ రోజు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతన్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా ఇతను గతంలో కూడా రెండు సార్లు సెల్‌ఫోన్ టవర్ ఎక్కి నిరసన తెలపడంతో పాటు, ఆత్మహత్యా యత్నాలు చేశాడు. రామకృష్ణకు భార్య పద్మతో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
(బిజినేపల్లి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement