దేవుడి వరమిచ్చినా..
హిందూపురం రూరల్ : దేవుడి వరమిచ్చినా..పూజారి వరమివ్వక పోవడం అంటే ఇదేనేమో..?.. వికలాంగుడైన చిన్నారి రామ్‌చరణ్‌కు ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసినా గ్రామకార్యదర్శి బాబ్జి నగదు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం వహించాడు. దీంతో మలుగూరుకు చెందిన వెంకటరమణ కుమారుడితో కలిసి గురువారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. పింఛన్ ఇచ్చే వరకు పోయేది లేదని ఎంపీడీఓ శ్రీలక్ష్మితో మొర పెట్టుకున్నాడు. వెంటనే ఆమె గ్రామ కార్యదర్శిని కార్యాలయానికి పిలిపించి అక్కడికక్కడే రూ.1,500 పంపిణీ చేయించారు. పింఛన్ల పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.