venkatramana
-
ఏసీబీకి చిక్కిన సూగూరు వీఆర్వో
పెబ్బేరు: మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం సూగూరు వీఆర్వో వెంకటరమరణ రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సూగూరుకి చెందిన రైతులు ఆడెం ఆంజనేయులు, ఆడెం భాగ్యమ్మ, ఆడెం మద్దిలేటి, ఆడెం బాల్రాంలకు 2ఎకరాల 19గుంటల భూమి ఉంది. భాగ పరిష్కారాల అనంతరం వేర్వేరుగా వారి పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడు డాక్యుమెంట్ల జిరాక్స్‌లతో తమ పొలాలకు ఆర్వోఆర్, పాసుబుక్కులు ఇవ్వాలని జూలై 14న తహసీల్దార్ కార్యాలయంలో ఆంజనేయులు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీఆర్వో వెంకటరమణ ఈ పని చేసేందుకు రూ.10వేలు డిమాండ్ చేశాడు. ఆంజనేయులు రూ.6 వేలు ఇస్తానని ఒప్పుకుని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారు రైతుకు డబ్బులిచ్చి అతని వద్దకు పంపారు. వీఆర్వో వెంకటరమణ రైతు వద్ద నగదు తీసుకుని పంపించాడు. కార్యాలయం బయట ఉన్న ఏసీబీ డీఎస్పీ క్రిష్ణయ్యగౌడ్, ఇన్స్పెక్టర్లు లింగస్వామి, ప్రవీణ్‌లు వెంటనే కార్యాలయంలోకి వెళ్లి వీఆర్వో తీసుకున్న డబ్బులను పరిశీలించారు. నోట్లకు, అతని చేతులు, ప్యాంట్ జేబుకు పింక్ కలర్ ఉండటాన్ని గుర్తించారు. విచారణ చేసి వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు.దాడుల్లో ఏసీబీ సిబ్బంది 10మంది ఉన్నారు. -
దేవుడి వరమిచ్చినా..
హిందూపురం రూరల్ : దేవుడి వరమిచ్చినా..పూజారి వరమివ్వక పోవడం అంటే ఇదేనేమో..?.. వికలాంగుడైన చిన్నారి రామ్‌చరణ్‌కు ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసినా గ్రామకార్యదర్శి బాబ్జి నగదు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం వహించాడు. దీంతో మలుగూరుకు చెందిన వెంకటరమణ కుమారుడితో కలిసి గురువారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. పింఛన్ ఇచ్చే వరకు పోయేది లేదని ఎంపీడీఓ శ్రీలక్ష్మితో మొర పెట్టుకున్నాడు. వెంటనే ఆమె గ్రామ కార్యదర్శిని కార్యాలయానికి పిలిపించి అక్కడికక్కడే రూ.1,500 పంపిణీ చేయించారు. పింఛన్ల పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. -
‘స్పోర్ట్స్‌మీట్’ అదిరిపోవాలి !
• అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొనేలా చూడాలి • ప్రాక్టికల్స్ తరగతులు ‘మమ’ అనిపిస్తే చర్యలు • ఇంటర్ విద్య ఆర్జేటీ వెంకటరమణ అనంతపురం ఎడ్యుకేషన్ : జూనియర్ కళాశాలల విద్యార్థులకు నిర్వహించే ‘స్పోర్ట్స్‌మీట్’ నిర్వహణ అదిరిపోవాలని ఇంటర్ విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ (కడప) వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఒకేషనల్ జూనియర్ కళాశాలలో అనంతపురం జిల్లా జూనియర్ కళాశాలల అథ్లెటిక్ అసోసియేషన్ (ఏడీజేసీఏఏ) సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్జేడీ మాట్లాడుతూ స్పోర్ట్స్‌మీట్‌లో అన్ని యాజమాన్యాలు భాగస్వాములు కావాలని కోరారు. క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు అంటూ పిల్లలపై మానసిక ఒత్తిడి పెంచుతున్నారన్నారు. క్రీడల ద్వారా పిల్లల్లో మానసిక ప్రశాంతతో పాటు శారీరక అభివద్ధి పెరుగుతుందన్నారు. ఈసారి ప్రాక్టికల్స్ జంబ్లింగ్‌లోనే ఉంటాయని ఇప్పటి నుంచే దష్టి సారించి ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాలని సూచించారు. అలా కాకుండా చివరల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రాక్టికల్ తరగతులు ‘మమ’ అనిపిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. తరచూ అన్ని కళాశాలలు తనిఖీలుల చేస్తామని, విద్యార్థులతో మాట్లాడుతామని, రికార్డులు పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడైనా ల్యాబ్ పరికరాలు తక్కువ ఉంటే తమ దష్టికి తేవాలన్నారు. ఆర్ఐఓ వెంకటేశులు మాట్లాడుతూ ‘స్పోర్ట్స్‌మీట్’ నిర్వహణలో గతేడాది పడిన ఇబ్బందులు ఈసారి తలెత్తకూడదన్నారు. అందరూ ఛాలెంజ్‌గా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కొరవడిన చిత్తశుద్ధి విద్యార్థుల క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నా క్షేత్రస్థాయిలో నిర్వహణ తూతూమంత్రంగా ఉంటోందనడానికి హాజరైన ప్రిన్సిపాళ్లు, పీడీలే నిదర్శనం. జిల్లాలో అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలలు 221 దాకా ఉన్నాయి. సమావేశం ఉంటుందని ఆర్ఐఓ అందరికీ సమాచారం పంపారు. పత్రికల ద్వారా కూడా మెసేజ్ పంపారు. అయినా కేవలం 50 శాతం మంది ప్రిన్సిపాళ్లు, పీడీలు హాజరయ్యారు. క్రీడల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. అధిక ప్రాధాన్యత కలిగిన సమావేశానికి ఇంత తక్కువ మంది హాజరుకావడం బాధాకరమని ఆర్జేడీ వెంకటరమణ వాపోయారు. సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజారాం, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, అధ్యక్షులు సురేష్, ఏడీజేసీఏఏ కార్యదర్శి ఎ. నాగార్జునప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో లైన్మెన్ మృతి
ధర్మవరం అర్బన్ : విద్యుదాఘాతంతో జూనియర్ లైన్మెన్ మృతి చెందిన ఘటన పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. స్థానిక ట్రాన్స్‌కో కార్యాలయంలో జూనియర్ లైన్మెన్గా వెంకటరమణ (35) కాయగూరల మార్కెట్ వీధిలో ఉన్న భక్త మార్కెండేయ స్వామి ఆలయ సమీపంలో ఉన్న విద్యు™Œ స్తంభం ఎక్కి విధులు నిర్వర్తిస్తున్నారు. ఉన్నట్టుండి స్తంభంపైన విద్యుత్ తీగల నుంచి విద్యుత్ ప్రసరించడంతో షాక్‌కు గురై కిందపడ్డాడు. తోటి ఉద్యోగులు గమనించి వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మెయిన్‌లైన్‌పై విద్యుత్ ప్రసార ం నిలిపి వేసిన ఇళ్లలో ఉండే ఇన్వర్టర్ల కారణంగా విద్యుత్ షాకు తగిలి ఉంటుందని విద్యుత్ ఉద్యోగులు చెప్తున్నారు. మృతుడికి భార్య ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏడీ వెంకట రమేష్ మృతుడి కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
విశాఖ జిల్లా చోడవరంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భారీ లోడ్‌తో దేవరపల్లి వైపు వెళ్తోన్న ఇసుక లారీ, మోటార్ సైకిల్‌ను వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు నేమాల వెంకటరమణ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. -
పులి దెబ్బ...
అచ్చంపేట, న్యూస్‌లైన్: శ్రీశైలం-నాగార్జునసాగర్ రాజీవ్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పెద్దపులుల మనుగడ ప్రశ్నార్ధకంగా మా రిందని పలువు రు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అమ్రాబాద్ మండలం నల్లమల ప్రాంతంలోని చెంచుకుర్వ వద్ద ఓ పెద్దపు లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం వెలుగులోకి రావడంతో అటవీ అధికారులు గురువారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. పులుల గణన ప్రారంభమైన ఈ తరుణంలోనే పెద్దపులి మృత్యువాత పడడం అటవీ సిబ్బందిని అదరగొట్టింది. అటవీ అధికారులు ఫీల్డ్ డెరైక్టర్ రా హుల్పాండే, డీఎఫ్ఓ వెంకటరమణ, సం ఘటన ప్రాంతాన్ని సందర్శించి మృతికి కారణాలు , అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అది గత నాలుగు రోజుల కింద ట మృతి చెంది ఉండవచ్చునని దాని తల భాగం, ముందు కాళ్లు కుళ్లి పోయాయని దాని వయస్సు సుమారు 8ఏళ్లుంటుందని అంచనావేస్తున్నారు. పులి వెనుక భాగంలోని రెండు కాళ్ళు మినహాయిస్తే శరీర భాగాల్లో ఎక్కడా గాయాలు లేవు. అది వి షయప్రయోగం వల్లగానీ, అనారోగ్యంతో కానీ మృతిచెంది ఉండవచ్చని భా విస్తున్నారు. మృతి చెందిన తర్వాత ఆ దా రి గుండా వెళ్లిన వారు గోళ్ల కోసం కాళ్ళను నరికి ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించాక విషయం తెలుస్తుందని అన్నారు. సంఘటన వద్దకు వెళ్లిన వారిలో ఏసీఎఫ్ కిష్టగౌడ్, ఎఫ్ఆర్వో లక్ష్మణ్, సిబ్బంది ఉన్నారు. పోస్టుమార్టం నివేదిక అందాకే స్పష్టత... పులి కళేబరానికి ఫారెస్టు శాఖ(ఢిల్లీ)కి చెం దిన ఇమ్రాన్ ,హెద్రాబాద్ జూపార్క్ డా క్టర్ శ్రీనివాస్, స్థానిక వైధ్యాధికారులు పెద్దపులికి శవపరీక్ష జరిపారు. శాంపిల్స్‌ను సీసీఎంఈ, జూపార్క్, బీబీఆర్ఐకి చెందిన మూడు ల్యాబ్‌లకు పంపారు. నివేదిక వచ్చాకన దాని మృతిపై స్పష్టత వ స్తుందని అటవీశాఖ ఫీల్డ్ డెరైక్టర్ రాహుల్‌పాండే విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. బాధ్యులపై వేటు రిజర్వు ఫారెస్టులో పెద్దపులి మృతిచెంది నాలుగురోజులైనా సమాచారం తెలుసుకోడంలో విఫలమైన సిబ్బందిపై వేటు పడింది. ఇందుకు సంబంధించిన బీఎఫ్ఓ, ముగ్గురు ట్రాకర్స్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎఫ్డీ తెలిపారు. సమావేశంలో డీఎఫ్ఓ వెంకటరమణ తదితరులు ఉన్నారు. -
రక్తమోడిన రహదారులు
మైదుకూరు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఓ విద్యార్థి మరణించగా, మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మైదుకూరు బైపాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపాళెం గ్రామానికి చెందిన చల్లా గంగమ్మ, వెంకటరమణ దంపతుల కుమారుడు ఆంజినేయులు(12) దుర్మరణం చెందాడు. ఇడ్లీ తెచ్చేందుకు సైకిల్‌పై మైదుకూరుకు వెళ్లి తిరుగు ప్రయాణమైన విద్యార్థి మార్గమధ్యంలో బైపాస్ రోడ్డులోకి రాగానే వెనుక వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో తల పగిలి మెదడు భాగం పూర్తిగా బయటకు వచ్చేసింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని చూసి వారు బోరున విలపించారు. వెంకటరమణ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. అయితే ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అకాల మృత్యువాతపడటంతో వారు గుండెలవిసేలా రోదించారు. మైదుకూరు అర్బన్ సీఐ బి.వెంకటశివారెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు. లారీ ఢీకొని ముగ్గురికి గాయాలు ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో జరిగిన మరో ప్రమాదంలో ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్‌కు చెందిన బాలయేసు(19), ఆంధ్రకేసరి రోడ్డుకు చెందిన చిన్న(17), రామేశ్వరానికి చెందిన చంద్రశేఖర్(38) తీవ్రంగా గాయపడ్డారు. వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్న వీరు ముగ్గురూ ప్రతి రోజూ ఆటోలో ప్యూరిఫైడ్ వాటర్‌ను తీసుకొని ఇంటింటికి సరఫరా చేసేవారు. ఈ క్రమంలో ఆదివారం కూడా వారు ఆటోలో బయలుదేరారు. బైపాస్ రోడ్డులోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఔట్‌పోస్టు పోలీసులు తె లిపారు.