మైదుకూరు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఓ విద్యార్థి మరణించగా, మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మైదుకూరు బైపాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపాళెం గ్రామానికి చెందిన చల్లా గంగమ్మ, వెంకటరమణ దంపతుల కుమారుడు ఆంజినేయులు(12) దుర్మరణం చెందాడు. ఇడ్లీ తెచ్చేందుకు సైకిల్‌పై మైదుకూరుకు వెళ్లి తిరుగు ప్రయాణమైన విద్యార్థి మార్గమధ్యంలో బైపాస్ రోడ్డులోకి రాగానే వెనుక వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో తల పగిలి మెదడు భాగం పూర్తిగా బయటకు వచ్చేసింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని చూసి వారు బోరున విలపించారు.
వెంకటరమణ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. అయితే ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అకాల మృత్యువాతపడటంతో వారు గుండెలవిసేలా రోదించారు. మైదుకూరు అర్బన్ సీఐ బి.వెంకటశివారెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు.
లారీ ఢీకొని ముగ్గురికి గాయాలు
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో జరిగిన మరో ప్రమాదంలో ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్‌కు చెందిన బాలయేసు(19), ఆంధ్రకేసరి రోడ్డుకు చెందిన చిన్న(17), రామేశ్వరానికి చెందిన చంద్రశేఖర్(38) తీవ్రంగా గాయపడ్డారు. వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్న వీరు ముగ్గురూ ప్రతి రోజూ ఆటోలో ప్యూరిఫైడ్ వాటర్‌ను తీసుకొని ఇంటింటికి సరఫరా చేసేవారు. ఈ క్రమంలో ఆదివారం కూడా వారు ఆటోలో బయలుదేరారు. బైపాస్ రోడ్డులోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఔట్‌పోస్టు పోలీసులు తె లిపారు.
రక్తమోడిన రహదారులు
Published Mon, Jan 6 2014 3:04 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement