
న్యూఢిల్లీ: గృహ హింస కేసులను అత్యంత సున్నితంగా పరిశీలించాలని సుప్రీంకోర్టు (Supreme Court) అభిప్రాయపడింది. ఈ కేసుల్లో నిర్దిష్ట నేరారో పణలు లేకుండా నిందితుడి కుటుంబ సభ్యులను లాగడం తగదని పేర్కొంది.
వివాహ సంబంధ కేసుల్లో భావోద్వేగాల పాలు ఎక్కువ. ఇలాంటి సమయాల్లో ఫిర్యాదుదారుని పక్షాన నిలబడని, మౌన సాక్షులుగా ఉండే కుటుంబసభ్యులను ఇరికించే ధోరణు లుంటాయని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పేర్కొంది.
నిందితుడి కుటుంబస భ్యులపై విచారణను నిలిపివేస్తూ తీర్పు వెలు వరించింది. గృహ హింస కేసులో ఒక మహిళ తన అత్తింటి వారిపై చేసిన ఆరోప ణలను కొ ట్టివేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. వారు సుప్రీంను ఆశ్రయించారు.
ఇదీ చదవండి: గౌనును బట్టి గౌరవం లభించదు
Comments
Please login to add a commentAdd a comment