domestic violence cases
-
చిన్న కుటుంబాల్లోనే కలహాలు ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: ‘వివాహ బంధంలో జంటల మధ్య కలహాలు ఎక్కువగా చిన్న కుటుంబాల్లోనే (న్యూక్లియర్ ఫ్యామిలీ)ఉంటున్నాయి. కుటుంబ కలహాలకు సంబంధించిన కేసుల్లో 70 శాతం చిన్న కుటుంబాల నుంచి వచ్చి నవే’అని మహిళా భద్రత విభాగం డీజీ శిఖాగోయల్ తెలిపారు. 42 శాతం సమస్యలు వివాహమైన మొదటి 0–5 సంవత్సరాల్లో సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.గృహహింస కేసుల పరిష్కారం, సయోధ్య పెంచడంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ) గణనీయమైన పురోగతిని సాధిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని 27 సీడీఈడబ్ల్యూ సెంటర్లలో మొత్తం 9 వేల కేసులు వచ్చాయన్నారు. కౌన్సెలింగ్ సెషన్ల ద్వారా 8,200 కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. సీడీఈడబ్ల్యూకు వచ్చిన కేసుల్లో సేకరించిన వివరాలను విశ్లేషించగా..గుర్తించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి ⇒ గృహహింస కేసులకు ప్రధాన కారణాలు మద్యపాన వ్యసనం (63.2 %), ఆర్థిక ఒత్తిడి (50%), అనుమానం (48 %), వివాహేతర సంబంధాలు (33% ). ⇒ పదేపదే గృహహింసకు గురవుతున్న మహిళలు 22 % మంది ఉంటున్నారు. ⇒ గృహహింస కేసులు నమోదవుతున్న కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి. కేసులు నమోదైన 50% కుటుంబాలు నెలకు రూ.11,000 నుంచి రూ. 30,000 మధ్య సంపాదన కలిగినవే. -
కాపురాల్లో మద్యం చిచ్చు
సాక్షి, హైదరాబాద్: పచ్చని కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. ‘çమద్యం మత్తు’ కారణంగా కుటుంబ కలహాలు పెరిగిపోతున్నాయి. గృహ హింసకు దారితీస్తున్నాయి. పోలీసు కేసులు, కోర్టు మెట్లెక్కే వరకు వెళ్తున్నాయి. గత కొన్నేళ్లుగా నమోదవుతున్న కేసులకు కారణాలను పరిశీలిస్తే.. మద్యం అలవాటు తీవ్రత స్పష్టమవుతోంది. ఇక మరికొందరు తమ జీవిత భాగస్వామి ప్రవర్తనపై అనుమానం పెంచుకుంటున్నారు. దీనితో మనస్పర్థలు ఏర్పడి సంసారం గందరగోళంలో పడిపోతోంది. అయితే గృహ హింస కేసులలో బాధితులకు బాసటగా నిలిచేందుకు తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం అందుబాటులోకి తెచ్చిన ‘సీడీఈడబ్ల్యూ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్)’ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు ఈ సమస్యను కొంత దారిలోకి తెస్తున్నాయి. 2023 ఫిబ్రవరి నుంచి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అందుబాటులోకి తెచ్చిన 27 సీడీఈడబ్ల్యూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లలో ఇప్పటివరకు 34,090 కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు హాజరైన 40 శాతం జంటలను తిరిగి కలిపారు.మూడు నుంచి నాలుగు సిట్టింగ్లుగృహ హింసకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులను పోలీసు అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని సీడీఈడబ్ల్యూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లకు అటాచ్ చేస్తున్నారు. ఈ సెంటర్లలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సిబ్బంది.. జంటలతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కలహాలకు ప్రధాన కారణాలను తెలుసుకుంటారు. భార్య, భర్త ఇద్దరినీ కలిపి, విడివిడిగా మాట్లాడటంతోపాటు అవసరం మేరకు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు. ఇలా మూడు, నాలుగు సార్లు కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహిస్తారు. భార్యాభర్తలకు కలిపి, అవసరమైతే కుటుంబంతోనూ కలిపి కౌన్సెలింగ్ చేస్తారు. కలహాలకు కారణమవుతున్న సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రోత్సహిస్తారు.పెళ్లయిన ఐదేళ్లలోపే..కుటుంబ కలహాల సమస్య యు వ జంటల్లోనే ఎక్కువగా ఉంటు న్నట్టు కేసులను బట్టి స్పష్టమవు తోంది. పోలీసు కేసులు, విడాకు ల వరకు వెళ్తున్న జంటల్లో.. పెళ్ల యి ఐదేళ్లు కూడా కానివారే 40% నికిపైగా ఉంటున్నారు. ఈ తర హా కేసులలో భార్యాభర్తల వయ సు 23 నుంచి 30 ఏళ్లలోపే ఉంటుండటం గమనార్హం.⇒ విడాకుల వరకు వెళ్లేందుకు దారితీస్తున్న అంశాలు⇒భాగస్వామి మద్యానికి బానిస కావడం 63%⇒డబ్బులు, కట్నం కోసం డిమాండ్ చేయడం 49%⇒భాగస్వామి ప్రవర్తనపై అనుమానం 47%గృహ హింసకు కారణమవుతున్న అంశాలివీ..⇒ వరకట్నం కోసం వేధింపులు ూ మద్యానికి బానిసకావడం⇒ వివాహేతర సంబంధాలు ూ అత్తమామల వేధింపులు⇒ జీవిత భాగస్వామిపై అనుమానం⇒ కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు కావడం -
పెళ్లంటేనే చైనా యువత వెన్నులో వణుకు.. ఎందుకంటే..?
వరుస గృహ హింస కేసులు తలెత్తుతున్న నేపథ్యంలో చైనాలో యువత పెళ్లంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇంతటి హింసాత్మక పెళ్లిళ్లు అవసరమా? అనే ప్రశ్నలు యువతలో తలెత్తుతున్నాయని చైనా మీడియాకి చెందిన ఓ నివేదిక వెల్లడించింది. ఇటీవల షాన్డాంగ్ ప్రావిన్స్‌లో భార్యను భర్త హింసాత్మకంగా చంపిన ఘటన సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది. షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఓ భర్త తన భార్యను అతి క్రూరంగా హత్య చేశాడు. కారుతో తన భార్యపై పలుమార్లు దాడి చేశాడు. బాధితురాలు బతికే ఉందని తెలుసుకుని.. మరలా కారును ఆమెపై నుంచి పోనిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వార్త చైనా అంతటా వ్యాపించింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. కుటుంబ కలహాలతోనే 37 ఏళ్ల భర్త తన 38 ఏళ్ల భార్యను కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు ముందు మరో రెండు గృహ హింస కేసులు చైనాలో దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ ఘటనల్లో నిందితులు ప్రదర్శించిన క్రూరత్వం సర్వత్రా ప్రజలను భీతికొల్పే స్థాయిలో ఉంది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి తన భార్య, మరదలిని కిరాతకంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఎన్నో ఏళ్లుగా గృహ హింస అనుభవిస్తున్న మహిళ.. విడాకులను కోరింది. ఈ క్రమంలో దాడి చేశాడు భర్త. చెంగ్డు ప్రావిన్స్‌లోనూ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. విడాకులను కోరిన భార్యపై భర్త దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలు ఎనిమిది రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. వారి రెండేళ్ల కాపురంలో భర్త తనపై 16 సార్లు దాడి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా బాధితురాలు తెలిపింది. ఈ ఘటనలు చైనా ప్రజలకు పెళ్లిపై ఎన్నో ప్రశ్నలను మిగిలిస్తున్నాయని చైనా మీడియా ప్రచురించింది. పెళ్లంటేనే యువత భయపడే పరిస్థితి ఎదురయ్యే ఘటనలు జరగుతున్నాయని వెల్లడించింది. ఇదీ చదవండి: పాకిస్తాన్లో జాక్‌మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో -
లాక్డౌన్ వేళ.. ఇంటింటా హింస.. ఇంతింతా కాదు!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ వేళ.. ఇంటింటా హింస మహిళలు భరించలేనంత! వేధింపులు, అత్యాచారాలు ఎక్కువయ్యాయి. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కొన్ని సత్ఫలితాలు ఇస్తుండగా, గృహిణులకు మాత్రం కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. లాక్డౌన్ వల్ల చాలామంది ఉపాధి కోల్పోయి ఇంటిపట్టునే ఉంటున్నారు. చిన్న తరహా వ్యాపారాలు మూతబడ్డాయి. మరోవైపు ఆర్థిక సమస్యలు కూడా వీరిని చుట్టుముట్టాయి. దీంతో కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి. చినికి చినికి గాలివానగా మారి పెద్ద గొడవలకు దారి తీస్తున్నాయి. ఫలితంగా బాధితులు ‘డయల్ 100’ను ఆశ్రయిస్తున్నారు. మహిళలపై మందుబాబుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. 13 రోజుల్లో 7,679 ఫిర్యాదులు మహిళలు, చిన్నారులపై వేధింపులకు సంబంధించి ఈ నెల 12 నుంచి 24వ తేదీ వరకు ‘డయల్ 100’కు 7,679 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో గృహిణులపై వేధింపులు, బాల్యవివాహాలు, బ్లాక్ మెయిలింగ్, వరకట్నం వేధింపులు, ఈవ్‌టీజింగ్ తదితరాలు ఉన్నాయి. లాక్డౌన్ అమలులో ఉన్నప్పటి నుంచి మొత్తం 7,679 కాల్స్‌లో 4,395 ఫిర్యాదులు గృహహింసకు సంబంధించినవే కావడం గమనార్హం. గతేడాది లాక్డౌన్ సమయంలో మద్యం అందుబాటులో లేకపోవడంతో చాలామంది ఇంట్లోనే పెళ్లాంపిల్లలతో సంతోషంగా గడిపారు. కానీ, ఈసారి ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అత్యవసరాల కొనుగోలుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అదే సమయంలో మద్యం కూడా దొరుకుతుండటం, అలా తెచ్చుకున్న మద్యాన్ని ఇంట్లోనే తాగడం, నిషాలో పాత విషయాలన్నీ బయటికి తీసి లొల్లులకు దిగడం గృహహింసకు దారి తీస్తోంది. కొందరు మహిళలు మౌనంగా భరిస్తుండగా, మరికొందరు సహనం నశించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. 2,752 వేధింపులు, 75 బాల్యవివాహాలు లాక్డౌన్ సమయంలో ఇంటి వద్ద ఉంటున్న మహిళలు, యువతులపై వక్రబుద్ధి గల పురుషుల వేధింపులు కూడా తీవ్రమయ్యాయి. వీటిపై ‘డయల్ 100’కు 2,752 ఫిర్యాదులు వచ్చాయి. కొందరు ప్రబుద్ధులు 44 మందిపై లైంగిక దాడికి యత్నించారని ఫిర్యాదులు వచ్చాయి. ఆన్లైన్లో, నేరుగా తమను బ్లాక్మెయిల్ చేస్తున్నారని 98 మంది యువతులు ఫిర్యాదులు చేశారు. ఇక వరకట్నం వేధింపులు 37, ఈవ్ టీజింగ్ 50, ఇతరత్రా మరో 222 ఫిర్యాదులు వచ్చాయి. ఆర్థిక స్థితి బాగాలేని కొన్ని కుటుంబాల్లో బాల్యవివాహాలు చేస్తున్నారు. వీటిపై 75 ఫిర్యాదులు వచ్చాయి. మొత్తానికి క్రితంసారి లాక్డౌన్ కంటే ఈసారి ఆడవారిపట్ల వేధింపులు అధికమయ్యాయని తెలుస్తోంది. -
భార్య ఫోన్ హ్యాక్ చేసిన భర్త.. భార్య ఏం చేసిందంటే..!
చైత్ర (పేరు మార్చడమైనది), వర్ధన్(పేరు మార్చడమైనది) ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పెళ్లై ఎనిమిదేళ్లు. ఇద్దరి జీతాలు నెలకు చెరో లక్ష రూపాయలకు పైనే. ఆరేళ్ల కూతురు. చింతల్లేని చిన్నకుటుంబం. అర్ధరాత్రి దాటింది. ల్యాప్‌ట్యాప్ మూసేసి బెడ్ మీద వాలింది చైత్ర. నోటిఫికేషన్ ఏదో వచ్చినట్టు ఫోన్లో ‘బీప్’ మని సౌండ్ వచ్చింది. ఫోన్ చేతిలోకి తీసుకుంది చైత్ర. మెసేజ్ చూడగానే పెదాల మీదకు యధాలాపంగా నవ్వు వచ్చింది. ఆ పక్కనే ఉన్న వర్ధన్ కూడా ఫోన్లోనే ఉన్నాడు. చైత్రను ఒకసారి చూసి, లైట్ ఆఫ్ చేసి, తన ఫోన్ పక్కన పెట్టి, పడుకున్నాడు. చైత్ర మరో అరగంట వరకు ఉండి తనూ పడుకుంది. ఏడాది క్రితం వరకు ఇద్దరూ ఆఫీసులకు వెళ్లేవారు. లాక్డౌన్ పుణ్యమా అని వర్క్‌ఫ్రమ్ హోమ్ కారణంగా ఇద్దరూ ఇంటినుంచే వర్క్ చేస్తున్నారు. ఓ రోజు చైత్ర ఇంటి నుంచి బయటకు వచ్చేసి, విడాకులు ఫైల్ చేసింది. ఇరువైపు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిపించుకునే స్థితి లేదు. ఇద్దరి ఒంటిమీద గాయాల తాలూకు మచ్చలు ఉన్నాయి. ఆరేళ్ల వారి కూతురు బిక్కుబిక్కుమంటూ తల్లితండ్రిని చూస్తూ ఉండిపోయింది. ఏమైందంటే.. భార్యాభర్త ఇద్దరూ ఇంటి దగ్గర ఉంటున్నారు. ఇంటి పనులు చేయడంలో వాటాలు వేసుకున్నారు. నువ్వంటే.. నువ్వంటూ .. ఇద్దరి ఇగోస్ దెబ్బతిన్నాయి. కొన్ని రోజుల వరకు భరించిన చైత్రకు వర్ధన్ అంటే అసహనం మొదలైంది. ఓ రోజు తన కొలీగ్ నుంచి ఓదార్పు మెసేజ్‌తో చైత్రకు పోగొట్టుకున్న పెన్నిధి దొరికినట్టయ్యింది. సాధారణంగా మొదలైన మెసేజ్.. రెగ్యులర్‌గా చాట్ చేయడం వరకు వెళ్లింది. భార్య అస్తమానం ఫోన్‌తో ఉండటం గమనించిన వర్ధన్ ఆమెకు తెలియకుండా ఆమె ఫోన్లో ఓ సాఫ్ట్‌వేర్‌ని ఇన్స్టాల్ చేశాడు. ఆమెకు వచ్చిన మెసేజ్‌లు, ఆమె వాడిన డేటా, రోజు మొత్తం ఎన్ని గంటలు ఫోన్లో ఉంటుందనే వివరాలన్నీ తను గమనించడం మొదలుపెట్టాడు. చైత్ర కూడా భర్త తనతో సరిగా లేకపోవడంతో చిన్న అనుమానం మొదలైంది. సాఫ్ట్వేర్ కావడంతో భర్త ఫోన్లో అతనికి తెలియకుండా అతని డేటాను తన ఫోన్లో చూసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకుంది. చిన్న డౌట్‌తో మొదలై ఒకరి ఫోన్లను ఇంకొకరు హ్యాక్ చేసుకునేంతవరకు వెళ్లారు. ఇద్దరిలోనూ ఒకరిపై ఒకరికి విపరీతమైన అనుమానం తలెత్తింది. ఫలితంగా గొడవలు. ఓ రోజు ఇద్దరూ కొట్టుకోవడంతో విషయం పోలీసు స్టేషన్‌కి వెళ్లింది. అటు నుంచి విడాకులకు దారితీసింది. స్మార్ట్‌గా.. విచ్ఛిన్నం అవుతున్న జీవితాలు సైబర్ సేఫ్టీ వింగ్ వారు ఒకరినొకరు చేసుకున్న ఫోన్ హ్యాకింగ్ గుర్తించి, అసలు విషయం తెలుసుకున్నారు. ‘ఒక ఇంటి కప్పు కింద ఉన్నవాళ్లైనా తమ వాళ్లను చేసే సాఫ్ట్ మోసం కూడా జీవితాలను చెల్లాచెదురు చేస్తుంది. కోవిడ్ వల్ల అందరూ ఇంట్లోనే ఉండే స్థితి. ఫలితంగా గృహహింస కేసులు 27 శాతం పెరిగాయి. అదే ఐటి కమ్యూనిటీలలో ఉన్నవారి కేసులయితే 28 శాతం ఉన్నాయి’ అంటూ వివరించారు సైబర్ సేఫ్టీ నిర్వాహకులు అనీల్ రాచమల్ల. స్మార్ట్‌గా ఉంటే సరిపోదు స్మార్ట్ ఫోన్ వాడకం పట్ల అవగాహన పెంచుకుంటే జీవితాలు దిద్దుకోవచ్చని చెబుతున్నారు. బానిసలవడమే అసలు కారణం స్మార్ట్ ఫోన్లో ఉండే సాఫ్ట్వేర్ వాడకంతో ఐటీ కమ్యూనిటీలో కొత్త ఆలోచనలు పెరుగుతున్నాయి. తమ భాగస్వాముల ఫొటోలు తీసి షేర్, ట్యాగ్ చేయడం చేస్తుంటారు. ఆన్లైన్ అవమానం అంటూ ఓ కొత్త తరానికి తెరతీస్తున్నారు. భర్త లేదా భార్య తనని పట్టించుకోవడం లేదని బాధపడుతూ బయటివారితో చాటింగ్ చేస్తూ ‘సో బ్యూటిఫుల్, గార్జియస్, అమేజింగ్’ అంటూ మెచ్చుకునే పదాలకు పొంగిపోతుంటారు కొందరు. స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ వల్లే డైవోర్స్ రేట్ పెరుగుతోందని మా నివేదికల్లో తేలింది. స్క్రీన్ టైమ్.. గ్రీన్ టైమ్ లెక్కింపు ఫోన్ స్క్రీన్ మీద ఎంతసేపు ఉంటున్నాం. పచ్చదనంలో ఎంతసేపు ఉంటున్నాం.. అనేది కూడా గ్రహించాలి. ఈ నిబంధన పెట్టుకోవడం వల్ల ఫోన్లో గడిపే సమయం తగ్గుతుంది. టెక్నాలజీని ఎలా వాడుకోవాలనే విషయాలపట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి. బంధాలు విచ్ఛిన్నం చేసుకునేంతగా, మన ప్రవర్తన–అలవాట్లు మారేంతగా స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నామా అనేది కూడా గ్రహింపులోకి తెచ్చుకోవాలి. స్మార్ట్ ఫోన్‌ని బెడ్రూమ్లోకి తీసుకెళ్లకూడదు. ఒక టైమ్ పరిధి దాటగానే నోటిఫికేషన్ని బ్లాక్ చేసుకోవాలి. ఇప్పుడున్న కాలంలో నిజం చెప్పినా ‘ఈజ్ ఇట్ ట్రూ’ అని అడుగుతుంటారు. ఒక అబద్ధంలో బతికేస్తున్నామనే విషయం సోషల్ మీడియా వల్ల మనకు అర్థమవుతూనే ఉంది. అందుకే, మన ప్రైవసీని కాపాడుకుంటూ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి. ఇంటర్నెట్ వాల్యూస్, డిజిటల్ వెల్నెస్ గురించి మరింత తెలుసుకోవడానికి సైబర్ టాక్‌ను సంప్రదించవచ్చు. – అనీల్ రాచమల్ల, ఎండ్ నౌ ఫౌండేషన్, సైబర్ సేఫ్టీ, హైదరాబాద్ -
‘గృహ హింస’ బాధితురాలికి ఊరట
న్యూఢిల్లీ: గృహ హింస ఎదుర్కొంటున్న మహిళలకు ఊరటనిచ్చే తీర్పును గురువారం సుప్రీంకోర్టు వెలువరించింది. బాధిత మహిళలకు భర్త తరఫు ఇంట్లో ఉండే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. గృహ హింస(డొమెస్టిక్ వయోలెన్స్– డీవీ) చట్టంలో బాధిత మహిళకు భర్త తరఫు ఉమ్మడి ఇంటికి సంబంధించిన హక్కు విషయంలో గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది. డీవీ చట్టం కింద ఆ ఇంటిపై ఆ మహిళకు కూడా హక్కు కల్పిస్తూ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సంబంధిత సివిల్ దావాలోనూ పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు సరైనది కాదని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ‘ఏ సమాజ అభివృద్ధి అయినా అక్కడి మహిళల హక్కులను రక్షించే, ప్రోత్సహించే సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొంది. డీవీ చట్టంలో ‘ఉమ్మడి గృహం(షేర్డ్ హౌజ్‌హోల్డ్)’ నిర్వచనం బాధిత మహిళకు నివాస హక్కు కల్పించే విధంగా విస్తృతార్థంలో ఉంటుందని, దానికి గత తీర్పులో పేర్కొన్న వివరణ సరిగా లేదని తోసిపుచ్చింది. ‘బాధిత మహిళ భర్తకు వాటా ఉన్న ఉమ్మడి కుటుంబం నివసించే ఇల్లు’ అనే అర్థంలో మాత్రమే ఉమ్మడి గృహం నిర్వచనాన్ని తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఉమ్మడి గృహం అంటే బాధిత మహిళ నివసిస్తున్న, లేదా గతంలో భర్తతో కలిసి నివసించిన సొంత లేదా అద్దె ఇల్లు అనే అర్థం కూడా ఉంటుందని పేర్కొంది. దీన్ని బట్టి బాధిత మహిళకు ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంటుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. డీవీ క్రిమినల్ కేసు విచారణలో సంబంధిత ఉమ్మడి గృహంలో బాధిత మహిళకు కూడా హక్కు ఉంటుందని పేర్కొంటూ ఇచ్చిన మధ్యంతర లేదా తుది ఉత్తర్వులను.. ఆ ఇంటి హక్కుకు సంబంధించిన సివిల్ దావాలోనూ పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. సాక్ష్యాధారాలను పరిశీలించి తీర్పు వెలువరించాలని సివిల్ కోర్టుకు సూచించింది. ఢిల్లీకి చెందిన 76 ఏళ్ల సతీశ్ చందర్ అహూజా వేసిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ప్రకటించింది. ఢిల్లీలోని స్వగృహం పూర్తిగా తనదేనని, దానిపై తన కుమారుడికి కానీ, కోడలుకు కానీ ఎలాంటి హక్కు లేదని పేర్కొంటూ అహూజా స్థానిక కోర్టులో దావా వేశారు. అదే సమయంలో ఆయన కుమారుడు తన భార్య నుంచి విడాకులు కోరుతూ మరో కేసు దాఖలు చేశారు. మరోవైపు, ఆయన కోడలు గృహ హింస చట్టం కింద భర్త, అత్తమామలపై కేసు పెట్టారు. అహూజా వేసిన కేసుని విచారించిన స్థానిక సివిల్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చి, ఆ ఇంటినుంచి కోడలు వెళ్లిపోవాలని ఆదేశించింది. దీనిపై ఆయన డిక్రీ తెచ్చుకున్నారు. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. స్థానిక క్రిమినల్ కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆమెను ఆ ఇంటినుంచి పంపివేయవద్దని తీర్పునిచ్చింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తాజా ఆదేశాలనిచ్చింది. గృహ హింస చట్టం చరిత్రాత్మకం ఈ సందర్భంగా 2005లో వచ్చిన గృహ హింస చట్టం మహిళల రక్షణకై వచ్చిన మైలురాయి వంటి చట్టమని సుప్రీంకోర్టు ప్రశంసించింది. మహిళలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొంది. ‘కూతురిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, భాగస్వామిగా, ఒంటరి మహిళగా.. జీవితాంతం స్త్రీ హింసను, వివక్షను, వేధింపులను భరిస్తూనే ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదులు అతి తక్కువగా వచ్చే హింస ఇదేనని, మెజారిటీ మహిళలు తప్పనిసరై మౌనంగా ఆ హింసను భరిస్తున్నారని వాపోయింది. ‘ఇళ్లల్లో హింసను భరించే మహిళలకు, ఆ హింసను ఎదిరించే చట్టపరమైన స్పష్టమైన మార్గాలు 2005 వరకు ఎక్కువగా లేవు. ఆ తరువాత వచ్చిన గృహ హింస చట్టం ఆ లోటు తీర్చింది’ అని పేర్కొంది. -
లాక్డౌన్లో గృహిణి సురక్షితం
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై గృహ హింస పెరిగితే.. మన రాష్ట్రంలో మాత్రం తగ్గింది. ఆ సమయంలో బాధితులు నేరుగా పోలీస్స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం పలు మార్గాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసే ఏర్పాట్లు చేసింది. అయినా ఇక్కడ గృహహింస కేసులు తక్కువగానే నమోదు కావడం విశేషం. లాక్డౌన్ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత బలపడటం వల్లే గృహహింస తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. ► రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లోకొచ్చిన మార్చి 22(జనతా కర్ఫ్యూ) నుంచి మే మూడో తేదీ వరకు పోలీస్ రికార్డులను పరిశీలిస్తే.. 2016లో 986 గృహ హింస కేసులు నమోదయ్యాయి. 2017లో 1,142 కేసులు, 2018లో 886 కేసులు, 2019లో 841, ఈ ఏడాది మాత్రం కేవలం 197 కేసులే నమోదయ్యాయి. ► గృహహింస బాధితులు లాక్డౌన్ కారణంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ హెల్ప్‌లైన్ సెంటర్ 181తో పాటు, అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ► ఏపీ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో 9701056808, 9603914511 వాట్సాప్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. డయల్ 100తో పాటు దిశ యాప్‌ను కూడా మహిళలు వినియోగించుకునే ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన గృహ హింస కేసులు ► మామూలు రోజుల కంటే లాక్డౌన్ సమయంలో బ్రిటన్‌లో ఐదు రెట్లు, ఫ్రాన్స్‌లో మూడు రెట్లు గృహ హింస కేసులు పెరిగాయి. అమెరికా, చైనాల్లోనూ ఇదే పరిస్థితి. ► ఇటలీ, స్పెయిన్ దేశాల్లో గృహహింస బాధితుల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. బాధిత మహిళలు తమ భాగస్వామికి దూరంగా ఉండేలా వారికి హోటల్ గదులు అద్దెకిస్తున్నారు. ► పలు దేశాల్లో భాగస్వాముల్లో ఇద్దరి ఉద్యోగాలూపోయి వాళ్లు ఒకే ఇంట్లో సమయమంతా గడపాల్సి వస్తే గృహహింస మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులంటున్నారు. బలపడిన కుటుంబ బంధాలే కారణం రాష్ట్రంలో కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. దీనికి తోడు లాక్డౌన్ కారణంగా అంతా ఇళ్లల్లోనే ఉండటంతో వారి మధ్య బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు మరింత బలపడ్డాయి. మద్యం తాగినప్పుడో, ఇతర దురలవాట్లు ఉంటేనో మహిళలను వేధిస్తుంటారు. లాక్డౌన్లో మద్యాన్ని నిషేధించడం కూడా గృహిణులపై హింస తగ్గుదలకు మరో కారణంగా చెప్పొచ్చు. అక్షరజ్ఞానం లేనివారు సైతం లాక్డౌన్ సమయంలో మహిళలను కొట్టడం, దౌర్జన్యం చేయడం దాదాపుగా తగ్గించారు. – డాక్టర్ వెంకట్రాముడు, మానసిక వైద్య నిపుణుడు, కడప వైద్యకళాశాల -
తగ్గిన గృహహింస
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో గృహహింస కేసులు గణనీయంగా తగ్గాయి. గతంలో రోజుకి గరిష్టంగా 550కిపైగా న మోదయ్యే కేసులు ఏకంగా 5 రె ట్లు పడిపోయి కనిష్టంగా 80–90 మధ్య నమోదవుతున్నాయి. లా క్‌డౌన్‌కు ముందు ప్రతీనెల 10 నుంచి 12 వేల వరకు గృహహింస కేసు లు నమోదయ్యేవి. లాక్డౌన్ అనంతరం ఈ సంఖ్య 3 వేలకు పడిపోయింది. వాస్తవానికి లాక్డౌన్ నేపథ్యంలో గృహహింస కేసులు పెరుగుతున్నాయని సో షల్ మీడియాలో ప్రచారం వెల్లువెత్తిం ది. అయితే ఇది వాస్తవం కాదని, పోలీ సు రికార్డులు చెబుతున్నాయి. ఉత్తరాది లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా, దక్షిణాదిన తగ్గాయని తెలుస్తోంది. గృహహింస వివాదాలపై డయల్ 100కు వ చ్చే కాల్స్‌లో గణనీయంగా తగ్గడమే ఇందుకు నిదర్శనం. గృహహింస కేసుల్లో ప్రధానంగా భర్తల కారణంగా వేధిం పులు ఎదుర్కొనే వారే అధికంగా ఉండేవారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొంచెం అత్తామామల జోక్యం కని పించేది. ఏదిఏమైనా లాక్‌డౌన్‌తో భార్యాపిల్లలతో రోజూ ఎక్కువసేపు గడుపుతుండటం వల్ల చాలావరకు కలహా ల కాపురాలు కూడా చక్కబ డుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక ప్రతీ ఇం ట్లోనూ గొడవలకు ప్రధాన కారణం తాగుడు. మద్యం పే ద, దిగువ మధ్య తరగతి కు టుంబాల్లో తీరని వ్యథలను మిగులుస్తోంది. ఈ విషయం లో తరచుగా దంపతులు పోట్లాడుకుని ఠాణా మెట్లెక్కేవారు. కానీ, ఇప్పుడు మ ద్యం అందుబాటులో లేకపోవడంతో కే సులు తగ్గాయని, ఇతరత్రా చికాకులు కూడా లేకపోవడంతో అంతా ప్రశాం తంగా ఉన్నారని పోలీసులంటున్నారు. మార్చి 24తర్వాత అనూహ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 23 వరకు 35 వేలకుపైగా గృహహింస కేసులు నమోదయ్యాయి. మార్చి 24వ తేదీ నుంచి కేసులు గణనీయంగా పడిపోయాయి. అప్పటివరకు రోజుకు సగటు సరాసరిగా 382 అంతకంటే అధికంగా కేసులు నమోదయ్యేవి. లాక్డౌన్ తర్వాత కేసులు ఏ రోజూ రెండు వందల అంకెను చేరుకోకపోవడం గమనార్హం. ఏప్రిల్‌లో చాలా రోజులు సగటున 80 – 90 కేసులు మాత్రమే నమోదవడం విశేషం. ఈ ఏడాది నెలల వారీగా నమోదైన గృహహింస కేసులు జనవరి: 11,461 ఫిబ్రవరి: 10,875 మార్చి: 10,414 ఏప్రిల్: 3,015 (ఏప్రిల్ 23 వరకు) మొత్తం: 35,765 -
గృహహింస: దిశ టీం 24 గంటలు పనిచేస్తుంది
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ కాలంలో గృహహింస ఎదుర్కొంటున్న మహిళలకు రక్షణకు ఏర్పాటు చేసిన వన్‌స్టాప్ సెంటర్లలో దిశ టీం 24 గంటలు పనిచేస్తుందని దిశ చట్టం ప్రత్యేకాధికారి దీపికా పాటిల్ తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వన్‌స్టాప్ సంటర్ల నుంచే బాధితులకు నిపుణులైన ఆరోగ్య, వైద్య, మానసిక, సాంఘిక, న్యాయ సహాయం అందుతుందన్నారు. 24 గంటలు పోలీసుల సంరక్షణ, వసతి సౌకర్యం అందుబాటులో ఉంచామన్నారు. (గృహహింస: మహిళలకు అండగా ఏపీ ప్రభుత్వం) రాష్ట్రంలోని 23 స్వధార్ గృహాల్లో బాధిత మహళలకు వసతి, రక్షణ కల్పిస్తామని, ఇందుకోసం ఉమెన్ హెల్స్‌లైన్ 181 రౌండ్ దీ క్తాక్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. లాక్డౌన్లో పోలీసు స్టేషన్లకు వెళ్లలేరని మహిళలను వేధిస్తే చర్యలు తప్పవని దీపికా హెచ్చిరించారు. మహిళా రక్షణ కోసం దిశ సిబ్బంది 24 పనిచేస్తున్నారని, బాధిత మహిళల తక్షణ సహాయం కోసం ప్రతీ జిల్లాలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశామని దీపికా పాటిల్ తెలిపారు. (గృహ హింసా.. ఫోన్ చేస్తే రక్షణ) జిల్లా పేరు డయల్ చేయాల్సిన నెంబరు శ్రీకాకుళం 9110793708 విశాఖపట్టణం 6281641040 పశ్చిమ గోదావరి 9701811846 గంటూరు 9963190234 పొట్టిశ్రీరాములు నెల్లూరు 9848653821 కర్నూలు 9701052497 అనంతపురం 8008053408 విజయనగరం 8501914624 తూర్పుగోదావరి 9603231497 కృష్ణ 9100079676 ప్రకాశం 9490333797 చిత్తూరు 9959776697 వై.యస్.ఆర్ . కడప 8897723899 -
గృహహింస: మహిళలకు అండగా ఏపీ ప్రభుత్వం
సాక్షి: విజయవాడ: లాక్డౌన్ సమయంలో గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. మహిళల రక్షణకు అన్ని జిల్లాల్లో వన్ స్టాప్ సెంటర్లను మంగళవారం ప్రారంభించింది. 13 జిల్లాలోని ఈ సెంటర్లు 24 గంటలు పనిచేస్తాయి. ఈ సెంటర్ల నుంచే బాధితులకు ఆరోగ్య, వైద్య, మానసిక, సాంఘిక, న్యాయ నిపుణుల నుంచి సహాయక చర్యలు అందుతాయని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రంలో 23 స్వధార్ గృహాల్లో బాధిత మహిళలకు పోలీస్ సంరక్షణ, వసతి సౌకర్యం కల్పించింది. అంతేగాక బాధిత మహిళలకు రౌండ్ ది క్లాక్ ఉమెన్ హెల్స్ లైన్ 181 అందుబాటులో ఉంటుంది. (చదవండి: కరోనా: వలంటీర్లకు రూ.50 లక్షల బీమా!) జిల్లాల్లో తక్షణ సహాయం కోసం కాల్ చేయాల్సిన నెంబర్లు జిల్లా పేరు ఫోన్ నెంబరు శ్రీకాకుళం 9110793708 విశాఖపట్టణం 6281641040 పశ్చిమ గోదావరి 9701811846 గంటూరు 9963190234 పొట్టిశ్రీరాములు నెల్లూరు 9848653821 కర్నూలు 9701052497 అనంతపురం 8008053408 విజయనగరం 8501914624 తూర్పుగోదావరి 9603231497 కృష్ణ 9100079676 ప్రకాశం 9490333797 చిత్తూరు 9959776697 వై.యస్.ఆర్ . కడప 8897723899 -
లాక్డౌన్ ఎంత పనిచేసింది?
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా బాధితులతో పాటు గృహహింస కేసులు పెరిగిపోతున్నాయి. మార్చి 24 దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి మహిళలపై గృహహింస ఎక్కువయినట్టు జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) వెల్లడించింది. లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న భర్తలు నిరాశతో తమ ప్రతాపాన్ని భార్యలపై చూపిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 23 నుంచి 30 వరకు 58 ఫిర్యాదులు అందినట్టు తెలిపింది. వీటిలో ఎక్కువగా ఉత్తర భారత్ నుంచి రాగా, పంజాబ్ నుంచి అధికంగా వచ్చాయని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ తెలిపారు. ‘గృహ హింస ఫిర్యాదులు సంఖ్య పెరిగింది. పని లేకుండా ఇంట్లో గడపాల్సి రావడంతో పురుషులు నిరాశకు గురవుతున్నారు. తమ నిరాశను మహిళలపై చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ పంజాబ్‌లో ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోంది. ఎందుకంటే పంజాబ్ నుంచి మాకు ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయ’ని రేఖా శర్మ వివరించారు. అయితే పంజాబ్ నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయనేది వెంటనే వెల్లడి కాలేదు. (పరిమళించిన మానవత్వం) ఫోన్లు కూడా చేస్తున్నారు తమకు అందిన 58 ఫిర్యాదులు ఈ-మెయిల్ వచ్చాయని రేఖా శర్మ చెప్పారు. మొత్తం ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో ఉండే అవకాశముందన్నారు. సమాజంలో దిగువ శ్రేణిలోని మహిళల నుంచి పోస్ట్ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు వచ్చినందున వాస్తవ సంఖ్య అధికంగానే ఉండొచ్చని చెప్పారు. గృహ హింస ఎదుర్కొంటున్న చాలా మంది మహిళలకు ఈ-మెయిల్ పంపించడం తెలియక పోస్ట్ ద్వారా ఫిర్యాదులు పంపిస్తున్నారని తెలిపారు. అయితే లాక్డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పోస్టు ద్వారా వచ్చే ఫిర్యాదులు కూడా తగ్గాయన్నారు. గృహహింస ఫిర్యాదులు తమకు కూడా ఎక్కువగా వస్తున్నాయని రాష్ట్రాల మహిళా కమిషన్లు తెలిపాయని చెప్పారు. గృహహింస ఎదుర్కొంటున్న మహిళలు.. పోలీసులను లేదా రాష్ట్ర మహిళా కమిషన్లను సంప్రదించాలని సూచించారు. బాధితురాళ్ల నుంచి పెద్ద సంఖ్యలో తమకు ఫోన్లు వస్తున్నాయని మహిళా సంఘాల నేతలు అంటున్నారు. కాగా, గృహ హింసకు సంబంధించి ఎన్సీడబ్ల్యూకు మార్చి 23 వరకు ఈ-మెయిల్ ద్వారా 291 ఫిర్యాదులు వచ్చాయి. ఫిబ్రవరిలో 302, జనవరిలో 270 ఫిర్యాదులు అందాయి. కాపాడమంటూ వేడుకున్న తండ్రి కూతురు, అల్లుడు బారి నుంచి తనను కాపాడాలంటూ రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతం నుంచి ఓ తండ్రి తమను అభ్యర్థించాడని రేఖా శర్మ వెల్లడించారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి అన్నం పెట్టకుండా తనను కూతురు వేధిస్తోందని ఆయన ‘పీటీఐ’కి తన గోడు వెల్లబోసుకున్నారు. ఆయన అల్లుడు టీచర్‌గా పనిచేస్తుండటం గమనార్హం. (కరోనా: తప్పిన పెనుముప్పు!) -
పెరుగుతున్న గృహహింస మరణాలు
-
గుజరాత్ లో పెరిగిన గృహహింస కేసులు
అహ్మదాబాద్: ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో గతేడాది గృహహింస కేసులు పెరిగాయి. అదేసమయంలో దోష నిర్థారణ శాతం తగ్గింది. 2013లో గుజరాత్ లో 7812 గృహహింస కేసులు నమోదయినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్ఆర్బీ) గణంకాలు వెల్లడించాయి. దోష నిర్థారణలో దేశంలో సగటు 16శాతంగా ఉండగా, గుజరాత్ లో కేవలం 2.30 శాతంగా ఉందని పేర్కొంది. గృహహింస కేసుల్లో గుజరాత్ దేశంలో ఏడో స్థానంలో ఉంది. దోష నిర్థారణలో 25వ స్థానంలో ఉంది. గుజరాత్ లో గృహహింస నిరోధక చట్టం 498-ఏ కింద నమోదైన కేసులు ఈ ఏడాది 17.3 శాతం పెరిగాయి. 2012లో గృహహింస నిరోధక చట్టం 6658 కేసులు నమోదయ్యాయి. మహిళలపై హింసకు సంబంధించి గతేడాది గుజరాత్ లో 12283 కేసులు పెట్టారు. వీటిలో 64 శాతం గృహ హింసకు సంబంధించినవి కావడం గమనార్హం.