అహ్మదాబాద్: ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో గతేడాది గృహహింస కేసులు పెరిగాయి. అదేసమయంలో దోష నిర్థారణ శాతం తగ్గింది. 2013లో గుజరాత్ లో 7812 గృహహింస కేసులు నమోదయినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్ఆర్బీ) గణంకాలు వెల్లడించాయి. దోష నిర్థారణలో దేశంలో సగటు 16శాతంగా ఉండగా, గుజరాత్ లో కేవలం 2.30 శాతంగా ఉందని పేర్కొంది.
గృహహింస కేసుల్లో గుజరాత్ దేశంలో ఏడో స్థానంలో ఉంది. దోష నిర్థారణలో 25వ స్థానంలో ఉంది. గుజరాత్ లో గృహహింస నిరోధక చట్టం 498-ఏ కింద నమోదైన కేసులు ఈ ఏడాది 17.3 శాతం పెరిగాయి. 2012లో గృహహింస నిరోధక చట్టం 6658 కేసులు నమోదయ్యాయి. మహిళలపై హింసకు సంబంధించి గతేడాది గుజరాత్ లో 12283 కేసులు పెట్టారు. వీటిలో 64 శాతం గృహ హింసకు సంబంధించినవి కావడం గమనార్హం.
గుజరాత్ లో పెరిగిన గృహహింస కేసులు
Published Mon, Jul 7 2014 11:49 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement