
సాక్షి: విజయవాడ: లాక్‌డౌన్ సమయంలో గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. మహిళల రక్షణకు అన్ని జిల్లాల్లో వన్ స్టాప్ సెంటర్లను మంగళవారం ప్రారంభించింది. 13 జిల్లాలోని ఈ సెంటర్లు 24 గంటలు పనిచేస్తాయి. ఈ సెంటర్ల నుంచే బాధితులకు ఆరోగ్య, వైద్య, మానసిక, సాంఘిక, న్యాయ నిపుణుల నుంచి సహాయక చర్యలు అందుతాయని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రంలో 23 స్వధార్ గృహాల్లో బాధిత మహిళలకు పోలీస్ సంరక్షణ, వసతి సౌకర్యం కల్పించింది. అంతేగాక బాధిత మహిళలకు రౌండ్ ది క్లాక్ ఉమెన్ హెల్స్ లైన్ 181 అందుబాటులో ఉంటుంది.
(చదవండి: కరోనా: వలంటీర్లకు రూ.50 లక్షల బీమా!)
జిల్లాల్లో తక్షణ సహాయం కోసం కాల్ చేయాల్సిన నెంబర్లు
జిల్లా పేరు | ఫోన్ నెంబరు |
శ్రీకాకుళం | 9110793708 |
విశాఖపట్టణం | 6281641040 |
పశ్చిమ గోదావరి | 9701811846 |
గంటూరు | 9963190234 |
పొట్టిశ్రీరాములు నెల్లూరు | 9848653821 |
కర్నూలు | 9701052497 |
అనంతపురం | 8008053408 |
విజయనగరం | 8501914624 |
తూర్పుగోదావరి | 9603231497 |
కృష్ణ | 9100079676 |
ప్రకాశం | 9490333797 |
చిత్తూరు | 9959776697 |
వై.యస్.ఆర్ . కడప | 8897723899 |
Comments
Please login to add a commentAdd a comment